Breaking

Wednesday, June 17, 2026

krishnaprabodhaha

 कृष्णाप्रबोधः इति पाठ्यभागस्य सारांशं सङ्क्षेपेण लिखत।

                                    (अथवा)

कृष्णया धर्मजं प्रति प्रोक्तानि कर्तव्यबोधकवाक्यानि लिखत।

कविपरिचयः - कृष्णाप्रबोधः इति प्रस्तुत पाठ्यभागः महाकविना भारविना विरचित किरातार्जुनीयस्य महाकाव्यस्यादिमसर्गात् स्वीकृतः।

कविपरिचयः - कृष्णाप्रबोधः అను ప్రస్తుత పాఠ్యభాగం మహాకవి భారవిచేత రచింపబడిన కిరాతార్జునీయమ్ అను మహాకావ్యంలోని ప్రధమసర్గ నుండి స్వీకరించబడినది.

 पाठ्यभागपरिचयः - జూదంలో ఓడిన ధర్మరాజు భార్య సోదరులతో ద్వైతవనంలో నివశిస్తుండెను. ధర్మరాజుచేత నియమింపబడిన ఒక వనేచరుడు దుర్యోధనుని పరిపాలనా  విధానమును ధర్మరాజుకి తెలియచేసెను. ఆ విషయాలను తెలుసుకున్న ద్రౌపదీ తక్షణ కర్తవ్యమును ధర్మరాజుకి బోధించుటయే ఈ పాఠ్యభాగంలో వివరింపబడినది.  

वनेचरस्य वचनानि -  వనేచరుడు ధర్మరాజుని కలిసి దుర్యోధనుని పరిపాలనను గురించి చెబుతూ ప్రభువు మేలును కోరె సేవకుడు అసత్యాన్ని, అప్రియమైన వచనాలను చెప్పలేడు. కావున మీచే నియమించబడిన నేను మీకు ప్రియం కాకపోయినప్పటికి సత్యాన్నే చెప్తాను. లోకంలో హితకరమైన, మనోహరమైన మాటలు దొరుకుట కష్టం.

                                        हितं मनोहारि च दुर्लभं वचः।

                            రాజు హితాన్ని కోరని మంత్రి, మంత్రి మంచి మాటలను నమ్మని రాజు ఎక్కడ ఉంటారో, ఆ రాజ్యప్రజలకు కష్టాలు తప్పవు. కావున రాజు, మంత్రులు ప్రజలకు అనుకూలంగా ఉన్న చోట సంపదలు సిద్ధించును. రాజా! దుర్యోధనుని విషయంలో ఇతరుల మాటలను స్వీకరించి చెప్పే నా మాటలు మీకు కర్తవ్యాన్ని తెలుపును అని పలుకగా రాజు అతనికి ఇచ్చిన బహుమానం తీసుకొని వెళ్ళిపోయెను. ఇక ధర్మరాజు తిరిగి వచ్చి భీముని సమక్షంలో ఈ వృత్తాంతాన్ని వివరించగా ద్రౌపది కోపంతో ఈవిధంగా పలికెను.

                                द्रौपदी युधिष्ठिरमुद्दिश्य सद्यः प्रत्युद्यमः कार्यः इति प्रबोधयति।

कृष्णाप्रबोधः - భర్త మాటలు విని ద్రౌపదీ కోపంతో శత్రువుల ఉన్నతిని విని అనుచుకోలేని బాధలో మీకు చెప్పేటట్లు చేస్తున్నాయి. తేజస్సులో ఇంద్ర సమానులైన మీ వంశపు రాజులు, మీరు పరిపాలించిన ఈ రాజ్యమును రాజా నీవే మదించిన ఏనుగు తొండంతో పూలమాలను విసిరినట్టు స్వయంకృతాపరాధముతో విడిచితివి. 

                                       मतङ्गजेन स्रगिवापवर्जिता      

                                    ధూర్తుల విషయంలో ధూర్తత్వంతో ప్రవర్తించకపోతే దుఃఖాన్ని పొందుతాడు. కవచం ధరించనివాడి శరీరాన్ని బాణాలు చంపినట్లుగా శత్రువులు భీభత్సం సృష్టిస్తారు. అభిమానులు, గౌరవం ఉండి కూడా అనుకూలవతి అయిన భార్యను వదిలినట్టు వంశానుగతంగా  వచ్చిన రాజ్యలక్ష్మిని నీవు తప్ప మరెవరూ వదులుకోడు. मनोरमामात्मवधूमिव श्रियम्  కోపాన్ని సమయానుకూలంగా ప్రదర్శించువానిని అందరూ ఇష్టపడతారు. శత్రువులు కూడా భయపడతారు.

पाण्डवानां दुःस्थितिः -   ఎర్ర చందనం అలదుకొనె భీముడు ఇప్పుడు దుమ్ము, ధూళితో కాలినడకతో కొండగృహల్లో తిరుగుతున్నాడు. ఉత్తరం వైపున్న కురుదేశాలను జయించి విశేషమైన సంపదలను ఇచ్చిన అర్జునుడు నారవస్త్రాలను ధరిస్తున్నాడు. అడవిలో నేల పై నిద్రించడంతో కవలలైన నకుల సహదేవుల శరీరం కఠినమయ్యెను. ఇవన్ని చూసి కూడా నీకు బాధ కలగటం లేదా? विलोकयन्नुत्सहसे न वाधितुम्। ఈ దుఃస్థితి నాకు మనస్సును బద్ధలు చేస్తున్నవి. रुजन्ति चेतः प्रसभं ममाधयः। అయినా మంగళగీతాలతో మేల్కొనె నీవు ఇప్పుడు నక్కల కూతలతో మేల్కొంటున్నావు మరి ఈ వ్యత్యాసాన్ని నీవు గుర్తిస్తున్నావా! जहसि निद्रामशिवैःशिवारुतैः।

                                        ఓ ధర్మరాజా! శాంతిని విడిచి పరాక్రమాన్ని పొంది శత్రుసంహారం చేయుము. ఓర్పుతో ఉండటం వలన రాజులు ఫలితాన్ని పొందలేరు. शमेन सिद्धिं मुनयो न भूभृतः।  కపటంతో అపకారం చేసే శత్రువు విషయంలో సమయపాలన మంచిదికాదు. పరాక్రమవంతుల్లో మొదట నిలిచి కపటోపాయముతోనైనా విజయం సాధించుము. 

उपसंहारः - ప్రాతః కాలమున చీకటిని చీల్చుకొని ఉదయించు సూర్యుని వలె శత్రువులను ఓడించి రాజ్యసంపద పొందుము అని ద్రౌపదీ ధర్మరాజుకు బోధించెను. 

                                            दिनकृतमिव लक्ष्मीस्त्वां समभ्येतु भूयः। 

No comments: