Breaking

Tuesday, June 23, 2026

viswamitra charitam

 शतानन्देनोक्तं विश्वामित्रचरितम् समालिखत।

                        (अथवा)

चम्पूरामायणोक्तां विश्वामित्रगाथां विवृणुत।

कविपरिचयः - विश्वामित्रचरितम् इति प्रस्तुत सारांशः भोजेन विरचित चम्पूरामायणे बालकाण्डात् स्वीकृतः।

पाठ्यभाग विषयः - इह अहल्या-गौतममहर्षिदम्पत्योः सुतः शतान्दः अधीतवेद-वेदाङ्गः जनकमहाराजस्य आस्थाने पुरोहितपदमलङ्कृत्य स्वकर्तव्यं साधु निर्वहति। पाठ्यभागेस्मिन् शातानन्दः रामलक्ष्मणौ आचार्यवर्यस्य कुशिकनन्दनस्य विश्वामित्रस्य ब्रह्मर्षित्वसाधनं विवृणोति।

कविपरिचयः - విశ్వామిత్రచరితమ్ అను ప్రస్తుత సారాంశం భోజునిచేత రచింపబడిన చంపూరామాయణంలోని బాలకాండనుండి స్వీకరించబడినది.

पाठ्यभागपरिचयः - అహల్యాగౌతముల కుమారుడైన శతానందుడు జనకమహారాజు సభలో పురోహితునిగా తన కార్యములు శ్రద్ధతో నిర్వహిస్తుండెను. ఒకనాడు శతానందుడు రామలక్ష్మణులకు వారి గురువైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షిత్వం ఎట్లు పొందెనో ఈ విధంగా వివరించెను.

विश्वामित्रः आश्रम गमनम् -  రామా! కుశిక నందనుడైన విశ్వామిత్రుడు రాజ్యపాలన చేస్తుండగా ఒకసారి తన సైన్యంతో వసిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళెను. అప్పుడు వసిష్ఠుడు కామధేనువు అనుగ్రహంతో వచ్చిన వారందరికి గొప్ప ఆతిధ్యమును అందించెను. ఆ ఆతిధ్యానికి ఆశ్చర్యపోయిన విశ్వామిత్రుడు వశిష్టుడిని అడుగగా ఇదంతా కామధేనువు ప్రభావం చేత సాధ్యమైనదని చెప్తాడు. निरवधि सुरभेः प्रभावादित्यवेद्य అప్పుడు కామధేనువును ఇవ్వమని విశ్వామిత్రుడు కొరగా వశిష్టుడు తిరస్కరించడంతో బలవంతంగానైనా తీసుకొని వెళ్ళడానికి యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. కామధేనువు సృష్టించిన సైన్యం ధాటికి విశ్వామిత్రుని సైన్యం నిలువలేకపోయెను. ఆ సమయంలో విశ్వామిత్రుడు తన దివ్యాస్త్రాలను విడువగా వశిష్టుడు తన బ్రహ్మదండంతో అడ్డుకుంటాడు. అప్పుడు విశ్వామితుడు క్షత్రియ తేజస్సు కంటే బ్రహ్మ తేజస్సు గొప్పదని భావిస్తాడు. బ్రాహ్మణత్వం కోసం దక్షిణ దిక్కు యందు తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండెను.

    क्षात्रात्तेजसः परं ब्राह्ममेव महो महीय इति निश्चित्य तत्सिद्धये दक्षिणस्यां दिशि तीव्रतरं तपश्चकार।

त्रिशङ्कोः स्वर्गप्रेषणम् - సూర్యవంశానికి చెందిన త్రిశంకు అను రాజు తన శరీరంతో స్వర్గాన్ని పొందాలని కోరగా వశిశ్టుడు తిరస్కరించడం, వశిష్టుని కుమారులు త్రిశంకుని చండాలునిగా మారమని శపించారు. वसिष्ठस्य पुत्रैः महोदयादिभिः निर्बन्दकुपितैः दत्त चणडालभावः  तमेन शरणमभजत। అలా చండాలునిగా మారి విశ్వామిత్రుని చేరి తన కోరికను తెలియజేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు తన తపశ్శక్తిని ఉపయోగించి స్వర్గలోకానికి పంపగా స్వర్గానికి దగ్గరగా వచ్చిన త్రిశంకుని ఇంద్రుడు క్రిందకి నెట్టివేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుని కోసం మరొక స్వర్గాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేయగా దేవతలందరూ ప్రార్ధించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.    आरोपयामास दिवं त्रिशङ्कुम्

पश्चिम दिशि तपः - దక్షిణ దిక్కున తపస్సుకి భంగం కలగడంతో పడమర దిక్కున పుష్కర ప్రాంతంలో తపస్సుకి సిద్ధపడెను. అదే సమయంలో అంబరీషుని యజ్ఞపశువుగా విడువబడిన ఋచీకుని కుమారుడు శునశ్శేపుడు తనని రక్షించమని విశ్వామిత్రుడిని శరణుకోరాడు. అప్పుడు విశ్వామిత్రుడు తన కుమారులను ఆదేశించగా వారు దానికి అంగీకరించకపోవడంతో వశిష్టుని కుమారుల వలె కుక్కమాంసం తినేవారిగా మారమని శపించాడు. విశ్వామిత్రుడు శునశ్శేవునికి రెండు మంత్రాలను ఉపదేశించి పారాయణ చేయమని చెప్తాడు. అలా చేస్తూ ఉండగా ఇంద్రుడు మరియు విష్ణువు శునశ్శేపుడిని రక్షించారు.

        गाथाद्वयप्रीताभ्याम् इन्द्रोपेन्द्राभ्याम् अम्बरीषं, शुनश्शेपं च परिपूर्णमनोरथौ कारयामास।

उत्तरदिशि तपः - ఆ విధంగా శునశ్శేపుని రక్షించి ఉత్తర దిక్కున తపస్సుకి సిద్దపడెను. ఇంద్రుడు పంపిన మేనక వలన విశ్వామిత్రునికి చాలాకాలం తపోభంగం కలగటంతో కౌశకీనది ఒడ్డున కొండపై తపస్సు చేస్తూ ఉండెను. మరలా ఇంద్రుడు రంభను పంపగా విశ్వామిత్రుడు రంభను శపించి అక్కడి నుండి తూర్పు దిక్కుకు బయలుదేరెను.

                                    जम्भारिप्रहितां रम्भां "शैली भव" इति शपितवान्

ब्रह्मर्षित्व प्राप्तिः - అలా తూర్పు దిక్కుకి వచ్చి విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తుండటంతో భయపడుతున్న దేవతలకు మేలు చేయడానికి బ్రహ్మ ప్రత్యక్ష్యమై నీవు ఇంద్రియాలను జయించుట వలన బ్రహ్మర్షివి అయ్యావని పలికెను. వశిష్టుడు విశ్వామిత్రునికి ఉపనయనం చేసి బ్రహ్మర్షి పలికెను.

                            जितेन्द्रियत्वाद् ब्रह्मर्षिरसि; वसिष्ठोप्येव व्याहरतु भवन्तम् इत्यभाषत।

उपसंहारः - ఈ విధంగా విశ్వామిత్రుడు ఆ రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజు ఉదయాన్నే రామలక్ష్మణులతో  కలసి మిథిలా నగరానికి బయలుదేరెను.


No comments: