సంచలనం ఏడవ వారానికి సంబంధించిన కథను చదవాలనుకుంటే ఈ క్రింది లింకును నొక్కండి.
http://www.manakathalu.in/2020/12/blog-post_25.html
రెండో రోజు సాయంత్రానికి ప్రజలందరికీ ఇవ్వవలసిన డబ్బులు లెక్కగట్టి ఆ గ్రామంలో నారాయణకు సంబంధించిన స్థలాలు, నాలుగు ఎకరాల పొలాన్ని అమ్మకానికి పెట్టి మిగిలిన డబ్బులను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీతో పిల్లల చదువులకి ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ లోపు ఆ వూరి పెద్దలను సమావేశపరిచి పాల డైరీని మరెవరికైనా అప్పచెప్పడం కన్నా మన ఊరిలోని వాళ్ళకి అమ్మి వేయడమే మంచిదని నిర్ణయించుకుంటారు. దానికి ఊరిలో కోటీశ్వరుడైన కాంతారావు సరైనవాడు అని పెద్దలు చెప్పగా దానికి అతను కూడా అంగీకరించడంతో పత్రాలను కూడా సిద్ధం చేసి రెండు రోజులలో ఆ డైరీని కాంతరావుకి అప్పగించి వచ్చిన డబ్బుని లావణ్య పేరు మీద బ్యాంకులో వేస్తారు. స్థలాలు, పొలము అమ్మగా వచ్చిన డబ్బుని అనిరుద్ పేరు మీద బ్యాంకులో వేస్తారు.
ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి విజయ, నారాయణల మరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేయగా దొంగలు చేసిన పనేనని, ప్రమాదవశాత్తు మరణించారని చెబుతారు. అయితే ఈ ప్రమాదంలో పోయిన ధనము, బంగారము దొంగలను పట్టుకున్న తరువాత తిరిగి అందజేస్తామని తెలియజేస్తారు. నిజాన్ని బయట పెట్టడానికి సరైన ఆధారాలు లేక విఫలుడై, తిరుగు ముఖం పడతాడు. సెలవులు తక్కువగా ఉండటంతో ఏమి చేయలేక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి ఈసారి సెలవులలో వచ్చినప్పుడు కనుక్కోవాలని నిర్ణయించుకుంటాడు.
మిగతా కార్యక్రమాలను తొమ్మిది రోజులలో పూర్తిచేసుకుని చివరగా ఊరికి వెళ్లబోయే ముందు రోజు కానిస్టేబుల్ రమ్మని పిలిచి ఆ కేసును స్వీకరించిన యస్.ఐ ఎవరు? దాని వెనుక ఉన్న రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అందజేయమని చెప్తాడు. (వచ్చేవారం కొనసాగుతుంది).
శరత్, హరి మాటలు విని సంతోషపడినా ఒక్కరోజులో 20 లక్షలు తనైనా ఎక్కడి నుంచి తీసుకువస్తాడు అనే సంకోచంతో తన ఆలోచనలు తను చేస్తున్న సమయంలో చరణ్ ఫ్లాట్ లకి వచ్చిన అడ్వాన్స్ డబ్బులు 7 లక్షలు తీసుకొని వచ్చి ఇస్తాడు. శరత్ లెక్కలు వేసుకుంటూ హరి 15, కీర్తీ వాళ్ళ అమ్మగారు 5, అడ్వాన్సులు 7, మొత్తం కలిపినా కూడా 27 లక్షలే ఇంకా 10 లక్షలు ఎలా తీసుకురావాలి? ఎవరిని అడగాలి? అంటూ ఉంటాడు.
చరణ్ ఒక 3 లక్షలు ఇస్తానని, మన ఫ్లాట్ ఇంటీరియర్ పనులకు, సామాన్లకు అడ్వాన్స్ లు ఇవ్వడం వలన ఇంతకన్నా లేవని చెప్తాడు. పర్వాలేదని చెప్పి శరత్, చరణ్ కి సర్దిచెప్తూ ఉండగానే ఫోన్ కీర్తీ దగ్గరినుంచి ఇంకా ఆలస్యమవుతుందా? అని అడిగి త్వరగా ఇంటికి వస్తే మాట్లాడాలని చెబుతుంది.ఆ మాటలకు ఎప్పుడూ త్వరగా రమ్మని చెప్పని కీర్తీ ఇప్పుడు ఎందుకు రమ్మందని అనుకుంటూ ఆలస్యం చేయకుండా బయలుదేరుతాడు.
కాని దారి మధ్యలో ఇంటికి దగ్గరలో కారు ఆగిపోయినా తొందరగా వెళ్లాలని వేగంగా నడిస్తూ ఇంటిని చేరుతాడు. అక్కడికి వెళ్ళేసరికి కీర్తీ తల్లిదండ్రులు, పెద్దలు, బంధువులు అందరూ కూర్చొని పంపకాలు గురించి మాట్లాడటం విని సంతోషపడినా రేపటికి ఆస్తి లేదా డబ్బు రాదు అని బాధ. అందరూ మాట్లాడి ఒక వారంలో కీర్తి కి రావలసిన ఆస్తి ఇస్తామని చెప్తారు. కాని కీర్తి మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఒక వారం ఆపుతారు ఇష్టమేనా అని ప్రశ్నించడంతో బంధువులు అది సాధ్యపడదని చెప్పడంతో దానికి కీర్తి నాకు కూడా ఆస్తి రేపు సాయంత్రానికి కావాలి అని గట్టిగా తేల్చి చెబుతోంది. దాంతో చేసేది లేక పెద్దలు కూడా కీర్తి మాటలకు ఒప్పుకుంటారు.
హరి, సర్పంచ్ లు ఇద్దరు ఇంటికి వచ్చాక సర్పంచ్ తన ఇంట్లో చూస్తే ఐదు లక్షలే ఉన్నాయని హరితో చెప్పగా ఎలాగైనా సరే ఇంకో ఐదు లక్షలు సర్దమని హరి ప్రాదేయపడుతాడు. సర్పంచ్ మీద నమ్మకం లేక లక్ష్మికి డబ్బు కావాలని చెబితే లక్ష్మి తన తండ్రిని, బంధువులను అడుగగా వారందరి దగ్గర ఏడు లక్షల వరకు రేపు ఉదయానికి సర్దుబాటు అవుతాయని చెబుతుంది. మిగతా వాటికోసం దగ్గర ఉన్న బంగారం బ్యాంకు లో పెట్టడం లేదా మిత్రులను అడగాలని నిర్ణయించుకుని అడగుతాడు. కానీ వారు రేపటికి అంటే కష్టం అని చెప్పగానే ఇచ్చిన మాట కాపాడుకోలేనేమో అని భయపడుతుంటాడు. రాత్రంతా తనకి తెల్సిన మిత్రులకు, బంధువులందరికి ఫోన్లు చేసినా అందరూ రేపటికి పదో, ఇరవయ్యో అయితే ఇవ్వగలను కానీ లక్షలంటే కష్టమని రెండు రోజుల్లో అయితే ఇస్తామని చెప్తారు.
ఉదయాన్నే సర్పంచ్ ఇంటికి వెళ్లసరికి సర్పంచ్ గారి భార్య రాత్రి అర్జెంటు పని ఉందని అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లారని చెప్తారు. ఎప్పుడు వస్తాడనే విషయం తెలియదు అని చెబుతోంది. మొత్తం లెక్కెట్టుకోగా తన దగ్గర ఉన్న 3 లక్షలు, తన బంధువులు ఇచ్చినవి 7 లక్షలు, మొత్తం 10లక్షలు, బ్యాంకులో బంగారం పెట్టినా లక్షా లేదా లక్షా 50 వేల కన్నా ఎక్కువ రాదు అని భయపడుతూ ఇంటికి వెళ్లేసరికి సర్పంచ్ ఫోన్ చేశాడని 11 గంటలకి శరత్ వాళ్ళ ఆఫీస్ కాడికి వస్తే 10 లక్షలు అందిస్తానని చెప్పారు అని లక్ష్మీ చెబుతుంది.
లక్ష్మి తీసుకొని హరి రిజిస్ట్రేషన్ కోసం శరత్ వాళ్ళ ఆఫీసుకు వెళ్తాడు. శరత్, చరణ్ లు హరి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ సర్పంచ్ కూడా నేరుగా డబ్బులు తీసుకొని శరత్ వల్ల ఆఫీస్ కి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైనా తను ఇస్తానని 10 లక్షలను హరి కి అందజేస్తాడు. హరి20 లక్షలు ఇచ్చి తన మాట నిలబెట్టుకుంటాడు. శరత్ హరితో పరిచయం లేకపోయినా నన్ను నమ్మి ఇంత ధనం అడక్కుండానే ఇచ్చావు నీలాంటి మిత్రుడు నాకు దొరకడం నిజంగా అదృష్టం అని చెబుతూ దీనికి సహకరించిన నీ భార్య కూడా గొప్ప గుణవంతురాలు. అని పొగుడుతూ ఉండే లోపే సర్పంచ్ కూడా ఇటువంటి మిత్రుడు నాకు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తాడు.
కానీ హరి వారి మాటలను లెక్కచేయక మనకి మనం సహాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారు అని ప్రశ్నిస్తాడు? శరత్ లక్ష్మీ, హరి చేసిన సహాయానికి ఇంటికి తీసుకొని వెళ్లి తన భార్యకు పరిచయం చేయడానికి ఇంటికి తీసుకుని వెళ్తాడు. పెద్దలందరిని పిలిచి తను ఇవ్వవలసిన 37 లక్షల రూపాయలను తన బంధువులకు కీర్తి తో ఇప్పించే సి అగ్రిమెంట్ పత్రాలను స్వీకరిస్తాడు. లక్ష్మి హరి గొప్పతనాన్ని కీర్తికి, కీర్తి తల్లిదండ్రులకు వివరించి ఈరోజు ఒక గొప్ప మిత్రుని పొందానని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు.
సాయంత్రానికి కీర్తి కి రావలసిన ఆస్తులను పంచగా 4 సెంట్ల స్థలం, 10 లక్షల ధనము వస్తాయి. కీర్తి శరత్ లకు కూడా సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలని నిర్ణయించుకుంటారు. దానికోసం రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి శరత్, చరణ్ లు ఇంటి పని మీదే ఉంటారు. హరికి ఇవ్వవలసిన ధనాన్ని కూడా ఒక వారంలోనే శరత్ ఇచ్చేస్తాడు. హరి కూడా బ్యాంకులో లోను కు అప్లై చేసి వచ్చిన డబ్బు మొత్తంతో అప్పు తీర్చేస్తాడు.(ఇంకా ఉంది)
మిగతా విషయాలను వచ్చే శనివారం www.manakathalu.in లో చదవండి.
మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
1 comment:
Baagundi
Post a Comment