1. शूद्रक - वीरवरकथासारं विशदयत।
अथवा
2. वेतालेनोक्त वीरवरकथां विवृणुत।
कविपरिचयः - शूद्रक - वीरवरकथा इत्ययं पाठ्यभागः जम्भालदत्तेन विरचित वेतालपञ्चविंशत्यां चतुर्थवेतालकथाप्रबन्धात् सङ्गृहीतः।
కవిపరిచయః - శూద్రకవీరవరకథ అను పాఠ్యభాగం జంబాలదత్తునిచే రచించబడిన వేతాళపంచవింశతిలోని చతుర్థవేతాల కథాప్రబంధం నుండి స్వీకరించబడినది. కవి 16వ శతాబ్దానికి చెందినవాడని పండితుల అభిప్రాయము.
पूर्वकथा - విక్రమాదిత్యుడు కాపాలికుని ఆజ్ఞతో బేతాళసిద్ధిని పొందుటకు బేతాళున్ని తన భుజంపై వేసుకొని వస్తున్నప్పుడు శవములోని బేతాళుడు రాజు యొక్క మౌనాన్ని భగ్నం చేయుటకు ఓ రాజా! నీవు నన్నుతీసుకువెళ్ళదలచినచో నీకు ఒక కథ చెప్పెదను. అందులో ఉన్న సందేహమును అడిగెదను. నీవు సమాధానము చెప్పినచో గొప్ప స్ధానము పొందెదవు అని కథను ప్రారంభించెను.
शूद्रक सभायां वीरवरः - పూర్వము మంచిగుణములు కలిగిన శూద్రకుడు అను రాజు ఉండెను. ఒకనాడు రాజు మంత్రులతో ఉండగా వీరవరుడు అను పేరు గల రాజకుమారుడు అక్కడికి వచ్చి ద్వారపాలకునితో నేను శూద్రకుని కీర్తిని విని ఉద్యోగం కోసమని భార్యాబిడ్డలతో వచ్చానని చెప్పగా ఆ ద్వారపాలకుడు రాజు ఆదేశంతో లోపలికి పంపెను.
వీరవరుడు రాజుతో ఓ రాజా! నేను వీరవరడను పేరు గల క్షత్రియడను. ఉద్యోగముని ఆశించి నీ వద్దకు వచ్చితిని. నా సేవ మీకు ప్రయోజనం ఉన్నచో నాకు వేతనము ఇవ్వుము అని పలికెను. దానికి రాజు నీకు ఎంత జీతము కావలెను అని ప్రశ్నించెను. किं जीवनं कर्तव्यं तद्वद దానికి వీరవరుడు 1500 బంగారు నాణేములు కావలెను అని పలికెను. ఇక్కడ అనేక మంది గుణవంతులైన సేవకులు ఉన్నారు. వారెవరికి ఇంత వేతనం లేదని పలుకగా వీరవరుడు రాజుని అభినందించి వెనుదిరిగెను. वीरवरः राजानमभिनन्द्य चलितः।
అప్పుడు మంత్రులు రాజుతో ఓ రాజా! ఇతనికి 4 రోజులు వేతనము ఇచ్చి అతని సామర్థ్యమును తెలుసుకొనుము అని పలికెను. రాజు మంత్రుల మాటను అనుసరించి వీరవరుడుని పిలిపించి అడిగిన వేతనము ఇచ్చి పనిలో నియమించెను. అయితే వీరవరుడు సగభాగము బ్రాహ్మణులకు, మిగతా సగభాగంలోని సగాన్ని పేదవారికి, మిగిలిన ధనాన్ని కుటుంబం యొక్క విలాసానికి ఖర్చు చేయుచున్నాడు. ఈ విధంగా సేవ చేయుచున్నాడు.
रात्रौ एका स्त्री - ఒకనాడు రాత్రియందు దక్షిణ దిక్కు నుండి ఒక స్త్రీ ఆక్రందనను రాజు విని వెంటనే వీరవరునితో ఎవరు ఏడ్చుచున్నారో పరిశీలించమని ఆజ్ఞాపించెను. तां निश्चित्य मां ज्ञापय వీరవరుడు ఆ ఏడుపు శబ్దమును పరిశీలించుటకు వెళుతుండగా రాజు రహస్యంగా అతనిని అనుసరించెను. అడవిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న ఒక స్త్రీని చూసి అమ్మా! నీవెవరు? ఎందుకు ఏడుస్తున్నావు? అని ప్రశ్నించెను. किमर्थमेकाकिनी रोदिषी।
అది విని కుమారా! నేను శూద్రకుని యొక్క రాజ్యలక్ష్మిని. రేపు ఉదయాన్నే రాజు నశించును. కావున ఇక నేను ఎక్కడికి వెళ్ళగలనని ఏడుస్తున్నానని పలికెను. అమ్మా! నీవు చిరస్థాయిగా ఇక్కడే ఉండుటకు, రాజు చిరంజీవిగా ఉండుటకు ఏదైనా ఉపాయం చెప్పమని కోరెను. అప్పుడు ఆ స్త్రీ 32 శుభలక్షణాలు కల్గిన పుత్రున్ని తల్లి, సోదరి అంగీకారంతో కాత్యాయనిదేవికి బలిచ్చినట్లయితే రాజుకి శుభం జరుగుతుందని పలికి అంతర్ధానమయ్యెను. రాజు ఇదంతా విని వీరవరున్ని అనుసరించెను.
शक्तिवरोः बलिः - వీరవరుడు ఇంటికి వెళ్ళి తన భార్య, పిల్లల అనుమతితో కాత్యాయనిదేవికి తన కుమారుడైన శక్తివరుడిని బలి ఇచ్చి, వీరవరుడు కూడా రాజుకు జయము కలుగు గాక అని పలుకుతూ శిరస్సు ఖండించుకొనెను. అది చూసి మిక్కిలి బాధతో భార్య మరియు కుమార్తె రాజు శ్రేయస్సు కొరకు ప్రాణత్యాగం చేసిరి. వీరవరుని పరివారము యొక్క ప్రాణత్యాగమునకు చలించిన రాజు తను కూడా ఖడ్గముతో శిరస్సుని ఖండించుటకు సిద్దపడగా ఆకాశవాణి రాజా! ఆత్మబలి చేసుకోవద్దు. కాత్యాయని ప్రసన్నురాలైనది అని పలికెను. అప్పుడు రాజు అమ్మా! వీరవరుడు లేని రాజ్యములో నేనుండలేను. కావున నాపై అనుగ్రహము ఉన్నచో వీరవరుని కుటుంబమును బ్రతికించుము అని వేడ్కొని తను రాజమందిరమునక వెళ్ళిపోయెను.
वीरवरो सपरिवारं जावतु।
వీరవరుని కుటుంబమంతా తిరిగి ప్రాణాలను పొంది రాజద్వారం వద్ద నిలబడెను. రాజు సభలో వీరవరుని కుటుంబం యొక్క గొప్పతనాన్ని తెలియచేసి శేఖర దేశమునకు రాజుని చేసెను. शूद्रकः वीरवरं शेखरदेशस्य राजानं कृतवान्।
उपसंहारः - బేతాళుడు విక్రమీర్కునితో రాజా! శూద్రక వీరవరులలో ఎవరుసత్త్వగుణాన్ని కలగి ఉన్నారు అని ప్రశ్నించెను. విక్రమార్కుడు బేతాళ! రాజకార్యమునందు ప్రాణత్యాగము చేయుట సేవకుని ధర్మము. కానీ శూద్రకుడు సేవకుని గూర్చి ప్రాణత్యాగానికి సిద్దపడెను. కావున శూద్రకుడే సత్త్వగుణం కలవాడు అని చెప్పగా బేతాళుడు అక్కడి నుంచి మాయమై చింతచెట్టుకు చేరెను.
प्रभुकार्ये प्राणत्यागं सेवक धर्मः।
No comments:
Post a Comment