జనాలకి దెయ్యాలు అంటే భయం. కానీ హర్రర్ మూవీస్ మాత్రం చూస్తాం. కానీ నిజంగా దెయ్యాలు ఉన్నాయా? అంటే ఉన్నాయని కొందరు చెబుతుంటారు. నిజంగా చెప్పు? ఎవరైనా చూసారా? అని గట్టిగా ప్రశ్నిస్తే మాత్రం వారు చూసారు, వీరు చూసారు అని అంటారు. కానీ ఎవ్వరూ సరైన ఆధారాలు చూపించలేరు.
ఒక పల్లెటూరుకి దగ్గరలో ఉన్న పొలాల్లో ఒక నాలుగైదు కుటుంబాలు నివాసం ఏర్పరచుకొని నివసిస్తుంటారు. అక్కడ ఉన్న కుటుంబాల్లో రామయ్య, లక్ష్మమ్మ వారికి ఒక 7సం!! వయస్సు కలిగిన శంకర్ అనే కొడుకు ఉన్నాడు. మిగతా కుటుంబాలకి సంబంధించిన పిల్లలు కొంచెం పెద్దవారు, వారందరు ధనవంతులు కావడంతో పట్టణాల్లో బంధువుల దగ్గర లేదా హాస్టల్లో ఉండి చదువుతుంటారు. అక్కడ ఉండే వారందరూ శంకర్ ని ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. ఎప్పుడు రాత్రిపూట అన్నం తిని వెళ్లి తాత దగ్గర తాత చెప్పే కథలు వింటూ నిద్రపోయేవాడు. కానీ అందరూ చెప్పే మాటల్లో ఒక విషయం ఖచ్చితంగా ఉండేది. అదేమంటే వచ్చే దారిలో చింత చెట్టు ఉంది కదా! చీకటి పడిన తరువాత దాని దరిదాపుల్లోకి కూడా వెళ్ళవద్దు అని చెప్పేవారు. ఎందుకని ప్రశ్నిస్తే అక్కడ దెయ్యాలున్నాయని చెప్పేవారు.
ఆ మాటలు విని తన మనసులో నిజంగా దెయ్యాలు ఉన్నాయా? అని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండేవాడు. అలా ప్రతిరోజు బడికి సైకిల్ మీద వెళ్లి వస్తూ ఆ చింతచెట్టుని చూసుకుంటూ కొన్ని సంవత్సరాలు గడిపేస్తాడు. ఒకసారి దసరాకి పాఠశాలలకు సెలవలు ఇవ్వడంతో ఇళ్లకు వచ్చిన పక్కింటి పిల్లలు వారు చూసిన హర్రర్ సినిమా గురించి వివరిస్తూ చాలా బాగుందని చెప్పడం వలన శంకర్ కూడా చూడాలని నిర్ణయించుకున్నాడు. పట్టణానికి పంపించరు. కాబట్టి ప్రక్క గ్రామంలో ఉన్న సినిమా హాల్ కు వస్తే కచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నాడు.
ఆ తరువాత కొన్ని రోజులకి పక్క ఊర్లోని సినిమా హాలులో ఆ సినిమా ఆడుతుందని తెలుయడంతో ఎలాగైనా సరే వెళ్లాలి నిర్ణయించుకుని ఇంట్లో చెప్పడంతో వారు తిరస్కరిస్తారు. ఎప్పుడు తాత దగ్గర పడుకునే శంకర్ రెండు మూడు రోజుల తరువాత రాత్రిపూట అందరూ నిద్రించిన తర్వాత ఇంట్లో పడుకుంటానని తాతకి చెప్పి సినిమా చూడాలనే బలమైన కోరికతో శబ్దం చేయకుండా సైకిల్ తీసుకుని అక్కడి నుండి ఒంటరిగా వెళ్ళిపోతాడు.
సినిమా టికెట్ తీసుకొని ఎవరైనా చూస్తే మళ్లీ పెద్దలకు చెబుతారనే భయంతో థియేటర్లో కూడా ఒక మూల కూర్చుని సినిమా చూస్తాడు. సినిమా పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి మంచు బాగా పడుతున్న వేళ గ్రామ సరిహద్దు దాటి పొలాల్లోకి వెళ్తున్న సమయంలో కొంచెం కొంచెంగా నక్కల అరుపులు వినపడుతూ ఉండటంతో భయపడుతూ రోడ్డుకు అటు ఇటు చూసుకుంటు సైకిల్ తొక్కేటువంటి సమయంలో రోడ్డు ప్రక్కనే చెట్ల మధ్య కదలికలు, శబ్దం వినపడటంతో అది ఏమిటో తెలుసుకోలేక ఇంకొంచెం వేగంగా తొక్కడం ప్రారంభించాడు. అయితే సైకిల్ టైర్ కూడా పంచర్ కావడంతో ఇంకా గుండెల్లో భయం పెరగడం, తన గుండె చప్పుడే తనకు గట్టిగా వినపడటం, అందులోనూ పెద్దలు చెప్పే చింతచెట్టు దగ్గరకు వచ్చేసరికి కొంచెం దూరంలో పొలం మధ్యలో నుంచి ఒక దీపం నడుస్తున్నట్లుగా ఉండడంతో దెయ్యమే అని నిర్ణయించుకుని సైకిల్ ని నెట్టుకొని వెళ్లలేక భయంతో పక్కన పడేసి వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు.
ఆ దెయ్యం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నంలో ఆ పక్కనే ఉన్న ఒక చిన్న గట్టు పక్కన దాక్కున్నాడు. తనలో తను "నేను ఎంత వేగంగా వచ్చానో నా వెనుక ఆ దీపం కూడా అంతే వేగంతో నన్ను వెంబడిస్తుంది". అనుకుంటూ ఉండగానే ఒకే ఆలోచన నేను వెళ్ళేటప్పుడు లేనటువంటి భయం ఇప్పుడు ఎందుకు వచ్చింది. నేను వెళ్లేటప్పుడు సినిమా ప్రారంభమవుతుంది ఎలాగైనా మొదటి నుంచి చూడాలనే తాపత్రయం తప్ప మరొక ఆలోచన లేదు. ఇప్పుడు దూరంగా ఏదో కనపడుతుందని వినపడుతుంది అని భయపడుతూ నడుస్తున్నాడు కాబట్టి భయం వల్లే అది దెయ్యం అని అనుకున్నాను కానీ నేను కూడా తర్వాత అర్థమైంది ఏమంటే పొలాన్ని కాపలా కాసేటువంటి వ్యక్తే దీపాన్ని (లాందరును) పట్టుకొని నడుస్తున్నాడు. నన్ను దాటి వెళ్ళిన తరువాత గానీ అర్ధం కాలేదు నా మనసులో ఆ వ్యక్తి శరీరం కనబడలేదు కేవలం లాందరు మాత్రమే కనబడింది.
అప్పుడు దెయ్యాలు లేవు కేవలం భయము మాత్రమే. మానవుడు ఒంటరిగా ఉన్నప్పుడు వినపడే శబ్దాలను దెయ్యాలను కొని భయపడతాడు అదే సమయంలో తనకు తోడుగా మరొక వ్యక్తి ఉంటే భయపడడు అంటే భయం లేదని అంటే ఇప్పటి వరకు నా మనసులో ఉన్నది భయం మాత్రమే. దీన్నే మన సైంటిస్టులు ఏం చెప్తారంటే మనిషి సైకలాజికల్ వీక్ అయినప్పుడు ప్రవర్తించే విధానాన్ని దెయ్యాల అంటారని చెబుతారు.
ఒక మనిషి ఎదగాలంటే ముందు కావలసనది ధైర్యం. భయపడుతూ ఏ పని ప్రారంభించినా అది నాశనమే. అభివృద్ధి ఉండదు కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి విజయం సాధించండి.
మీరు ఆర్టికల్స్, కథల గురించి లేదా మహాభారతం, రామాయణం వంటి కథలు గురించి చదవాలనుకుంటే గూగుల్ లో www.manakathalu.in అని వెతకండి.
3 comments:
Super sir
మనిషి భయమే అపోహలకు కారణమని బాగా చెప్పారు
సంక్షిప్తం సందేశం
Post a Comment