Breaking

Tuesday, January 5, 2021

పాండురాజుకి ఉన్న శాపం ఏమిటి?

       


        

 ధృతరాష్ట్రుడిని రాజుగా విదురుని మంత్రిగా చేసి పాండురాజు శత్రువులను ఎదుర్కోవాలని నిర్ణయించుకుని వీరుడు అన్న వాన్ని లెక్కచేయక చతురంగబలాలను వెంట వేసుకొని బయలుదేరాడు. అతని సైన్యాలు బరువుకి ఆదిశేషుడి పడగల మీద ఉన్న మనుషులు కూడా చెదిరినట్లు అయ్యాయి. మదపు టేనుగుల మీద ఎగురుతున్న జెండాల గాలికి మేఘాలు కూడా తొలగిపోయాయి. పాండురాజు కూడా తూర్పు- పడమర, ఉత్తరం - దక్షిణం, అన్ని దిక్కుల రాజులను జయించాడు. ఎన్నో వేల ఏనుగుల మీద బంగారం, రత్నాలు, వజ్రాలు హస్తినాపురానికి వచ్చాయి. కౌరవులు అంటే రాజులందరూ భయపడ్డారు.

             రాజుగా ఉన్న దృతరాష్ట్రుడు తమ్ముడు తెచ్చిన ధనంతో 100 అశ్వమేధాలు చేపించాడు. యోగ్యత వల్ల విద్వాంసులని, అనుకూల్యత వల్ల స్నేహితులని, దయతో దీనులని, అభయమిచ్చి ప్రజల్ని సంతోషపెట్టేవాడు. అంతేకాక రకరకాల వేడుకల్లో పాల్గొనేవాడు. అన్నిటికన్నా వేట అంటే పాండురాజుకు చాలా ఇష్టం. అయితే ఈసారి వేటకి కుంతీ, మాద్రీ లను తీసుకొని హిమాలయాలలోని దక్షిణ లోయవైపు విహారానికి బయలుదేరాడు. పాండురాజు  భార్యలతో క్రీడిస్తూ, అడవి మృగాలను వేటాడుతూ విసుగు, విరామం లేకుండా కాలక్షేపం చేస్తున్నాడు. వారికి కావలసినవన్నీ హస్తినాపురం నుంచి అందుతున్నాయి. 

       ఒకరోజు ఎంత తిరిగినా జంతువులు కనబడక పోవడంతో అలసిపోయిన పాండురాజు ఒట్టిచేత్తో తిరిగి వెళ్లడం కంటే వేటగాడికి మరో అవమానం లేదు. అని భావించి తిరగగా చివరికి జత కడుతూ పారవశ్యంలో మునిగిన లేళ్ళ జంట కనపడటంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఐదుబాణాలను వేసి ఆ రెండింటిని పడగొట్టాడు. బాణం తగిలి తీవ్రమైన బాధతో, మనుష్య వాక్కుతో మేము ఋషి దంపతులము కిందముడు అనే తపోదీక్షితుడిని. మానవ రూపంలో ఈ పని చేయడానికి సిగ్గుపడి లేళ్ల సంభోగం చూసి కుతూహలంతో ఈ రూపం ధరించాము. అయినా నువ్వు రాజవంశంలో జన్మించిన రాజువి ఎన్నో రాజనీతిశాస్త్రాలు చదివి ఉన్నావు. పరిగెత్తలేని వాటిని, సంభోగంలో ఉన్న వాటిని, ప్రసవంలో ఉన్న వాటిని, రోగంతో ఉన్నవాటిని కొట్టకూడదు అని తెలియదా? జంతువులను వేటాడే వృత్తే ప్రధానంగా ఉన్నవాళ్లు కూడా ఈ స్థితిలో ఉన్న వాటిని వేటాడరు కదా! అని ప్రశ్నించెను. భరతుడు మొదలైనటువంటి రాజులు పుట్టిన వంశంలో పుట్టావు ఈ మాత్రం తెలుసుకో లేక పోయావా!.

                నమ్మించి చంపకూడదు, మోసం చేసి చంపకూడదు. అంతేకానీ వేటకు వచ్చి మృగాన్ని చూసి వదిలి పెట్టడం ఎట్లా?. శత్రువునైనా వదిలిపెడతారు కానీ, కంటికి కనబడ్డ జంతువులను వదిలిపెట్టడు కదా! క్షత్రియుడు. అని వాదించిన సమయంలో అటు నుంచి ఇటువైపుకు బాణములు గుచ్చుకొని తీవ్రమైన వేదనతో ఉన్న కిందముడు ప్రాణుల అన్నిటికీ సహజమైనది, ఇష్టమైనది సంభోగము. అటువంటి సంభోగ సుఖంలో ఉన్న మమ్మలను నీ బాణాలతో ఈ స్థితికి తీసుకువచ్చావు. అందుచేత నీవు కూడా నీ భార్యతో సంగమించినప్పుడు నీవు మరణిస్తావు. నీతో పాటే నీ భార్య కూడా మరణించును అని శపిస్తాడు. 

                 పాండురాజు కిందముడి శాపానికి తలదించుకుని సిగ్గు పడిన వాడై అలా దుఃఖంతో ఏమిచేయాలో తెలియక ధనుర్బాణాలను కింద పడివేసి నిల్చుండిపోయాడు. తన తండ్రి గురించి ఆలోచిస్తూ తండ్రి కూడా కామకలాపాలు జరిపి శరీరం శుష్కించి మరణించాడు. అప్పుడు వేదవ్యాసుడే లేకపోతే మా వంశం నిర్వీర్యం అయ్యేది. ఎన్ని విజయాలు సాధించినా ఈ శాపం వలన సంతానం లేని వాడిగా ఈ వంశానికి అపకీర్తిని తెచ్చి పెట్టిన వాడినేమో! అని దుఃఖిస్తూ ధనుర్భాణాలు విడిచి మునివృత్తిని అవలంబించి అహింసే ప్రధాన వృత్తిగా మార్చుకుని ఈ అడవిలో చెట్లకు కాసిన పండ్లను ఆహారంగా స్వీకరిస్తూ, దొరకని రోజున పస్తులు ఉంటూ జీవితాన్ని కొనసాగించాలని, నిర్మలమైన ఆకాశం వైపుగా చూస్తూ ఎండ, వాన, చలి దేనినైనా భరించగల శక్తి నాకు ఉందని భావించి సూర్యుడు అస్తమించడం వలన తిరుగుముఖం పట్టాడు. 

                  తన భార్యలకు జరిగిన విషయాన్ని, శాపాన్ని తెలియజేసి వారిని హస్తినాపురానికి వెళ్లిపొమ్మని తన తల్లికి, సోదరులకు, పిన తండ్రికి పాండురాజు ఆ అడవుల్లోనే మిగతా జీవితాన్ని కొనసాగిస్తానని చెప్పమనెను. ఆ మాటలకు కుంతీ, మాద్రీ ఇద్దరు మిమ్మలను వదిలి వెళ్లలేమని మీతోనే ఉంటామని, మమ్మల్ని విడిచి వెళితే ఇక్కడే ప్రాణాలను వదిలేస్తామని తెలియజేస్తారు. అలా ఇద్దరూ కాళ్ల మీద పడి మునివృత్తే స్వీకరించాలని అనుకుంటే ఇక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని అందరం కలిసి ఉండాలని ప్రార్థస్తారు. ఆ విధంగా కిందముడి చేత శపించబడి హిమాలయాల్లోని దక్షిణ లోయల్లో ఆశ్రమాన్ని నిర్మించుకుని తన ఇద్దరు భార్యలతో నార వస్త్రాలు ధరిస్తూ, చెట్ల నుండి రాలిన కాయలను స్వీకరిస్తూ వాన ప్రస్థానాన్ని కొనసాగిస్తాడు.

                      ఇక్కడ వివరించిన విషయము మహాభారతంలోనిది. కానీ అందరికీ అర్థం అవ్వాలని ఆధునిక కాలానికి సంబంధించిన భాషలో వివరించబడినది. మహాభారతానికి సంబంధించిన కొంత మంది ముఖ్యమైన వ్యక్తుల వివరాలను, లేదా ఆర్టికల్స్ ను ఒక్కొక్కటిగా www.manakathalu.in  అనే బ్లాగ్ లో మీరు చూడవచ్చు.

1. మిత్రులకు మనవి మీ విలువైన సలహాలు, సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

2. ఇక్కడ ఉన్న విషయాన్ని వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు పంపవచ్చు. 


4 comments:

Anonymous said...

Super alaane sakuni,pandavulu kowravula gurinchi koodaa pettandi sir

Srinivas said...

Mahabharatam lovi pedtamu antunnnaaru Slokas kooda pettandi

Anonymous said...

Sir meeru pettevi maaku degree lo cheppanivi maaku teliyanivi thanks sir

Anonymous said...

సార్ నేను మీ మీ పాత విద్యార్థిని, నా పేరు రాజేష్ తిరుపతిలో లో ఎస్ వి డిఫెన్స్ లో చదువుతున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మీరు చెప్పే కథలు వింటున్నాను. కథలు చదువుతున్నాను. థాంక్యూ సార్