మానవుని జీవితంలో యవ్వన దశకు ఉన్న ప్రాధాన్యత మరి ఏ వయసుకు లేదు. ఎందుకంటే యవ్వనం అంటే 13 నుంచి 19 వరకు మధ్య కాలాన్ని ఇంగ్లీష్ లో teenage అంటారు. teenagers most dangerous in the life. అనే వాక్యం ఈ కలికాలంలో నానుడిగా మారింది. కొన్ని ఉదాహరణలు తీసుకుంటే ఇది వాస్తవమే చెప్పాలి. ఎందుకంటే ఆ వయసులో పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే మిగతా జీవితం వ్యర్థమవుతుంది. అందుకే అదే వాక్యాన్ని "Teenage is most important in the life" ఇలా కూడా చెబుతారు. 13 - 19 ఈ మధ్యకాలంలో పిల్లల యొక్క శరీరంలో శారీరకంగానూ, మానసికంగానూ ఎదుగుదల ఏర్పడుతుంది. ఆ వయసులో జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోతే ఎలా ఉంటుంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ.
ఒక గ్రామంలో రాంబాబు, లక్ష్మీ అనే దంపతులు ఉండేవారు. వారు చిన్న హోటల్ పెట్టుకొని కుటుంబాన్ని గడుపుకునే వారు. పెళ్లయిన చాలా సంవత్సరాల తరువాత కొడుకు పుట్టడం, కొడుకుతో పాటుగా వారి వ్యాపారం కూడా అభివృద్ధి చెందడంతో తల్లిదండ్రులిద్దరూ బాగా గారాబంగా పెంచసాగారు. మంచి పేరు కలిగిన పాఠశాల, కళాశాలల్లో చదివించారు. వారి కుమారుడైన రాజా కూడా బాగా చదువుకున్నాడు. చదువుల కోసం తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో తల్లిదండ్రులు ఇష్టం లేకపోయినా కొడుకు యొక్క అభివృద్ధే లక్ష్యం అని చెప్పి తప్పని పరిస్థితుల్లో ఒప్పుకొన్నారు.
రాజా గొప్ప డాక్టర్ గా ఎదిగాడు. వారి ఊరికి దగ్గరలో ఉన్న ఒక ధనవంతుడు రాజా గురించి తెలుసుకొని తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తాడు. మళ్లీ తిరిగివచ్చి పల్లెటూర్లో హాస్పిటల్ కట్టడం కన్నా సిటీలోనే కట్టుకోవడం మేలని అనుకొని కట్నంగా వచ్చిన డబ్బుని ఉపయోగించి హాస్పటల్ నిర్మిస్తాడు. తక్కువ సమయంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. తల్లిదండ్రులు మాత్రం హోటల్ నడుపుతూనే ఉంటారు.
ఒకరోజు తల్లికి ఆరోగ్యం బాగోలేక కాకపోవడంతో రాజా ఇంటికి వచ్చి తన తల్లితో హోటల్ పని ఆపేయమని ఎన్నిసార్లు చెప్పినా మానుకోకపోవడంతో తల్లిదండ్రులిద్దరిని తీసుకొని వెళ్ళి తన దగ్గరే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. కొన్ని రోజులు గడిచేసరికి కోడలు, అత్తమామలు ఇక్కడే ఉంటారనే ఆలోచనతో ఎలాగైనా పంపించేయాలని అత్తమామల తప్పు లేకపోయినా కోపంగా మాట్లాడటం ప్రారంభిస్తుంది. ఆ విషయం అర్థమైన రాంబాబు, లక్ష్మిలు ఇద్దరూ అక్కడినుంచి ఊరికి వెళ్లిపోతారు. జరిగిన విషయం కొడుకుకి చెప్పకపోవడంతో జన గర్వంతో, కోపంతో రాజా, తల్లిదండ్రులు మళ్ళీ హోటల్ నడపడానికి వెళ్తున్నారని డబ్బే కావాలనుకుంటే ఈ ఐదు లక్షల రూపాయలు తీసుకొని సంతోషంగా ఉండమని తల్లికి చెప్తాడు. ఆ డబ్బు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు.
కొన్ని నెలల తర్వాత రాజా భార్య కావ్య గర్భవతి అని తెలుసుకొని కావ్య తల్లి లేకపోవడం వలన లక్ష్మీయే కోడల్ని కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటూ కాలు కింద పెట్టకుండా బిడ్డకు జన్మనిచ్చిన సంవత్సరం వరకు చిన్న పసిపాపలా చూసుకోవడం చూసి కావ్య మనసులో అత్తామామల మీద ఇష్టం పెరిగి అత్తమామల్ని తల్లిదండ్రులుగా భావించింది. మనవడి మొదటి పుట్టిన రోజుకు రాంబాబు, లక్ష్మీ లు తన కుమారుడు ఇచ్చిన ఐదు లక్షలకు మరో 5 లక్షల ను కలిపి ఒక స్థలాన్ని కొని మనవడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి కోడలు చేతిలో పెట్టడంతో మొదట తను ఆలోచించిన తీరుకి అత్తకు క్షమాపణ చెప్పి ఇచ్చినటువంటి బహుమతిని మొదట తిరస్కరిస్తుంది. అయితే ఒక షరతు కూడా పెడుతుంది అదేమంటే ఇక నుంచి అందరూ కలిసి ఉండేలా మీరు అంగీకరిస్తేనే దీనిని స్వీకరిస్తారనని చెబుతుంది.
అప్పటివరకు ముందు జరిగిన విషయాలు తెలయని రాజా తల్లిదండ్రులు డబ్బు తీసుకొని వెళ్లడంతో వారికి ధనమే ముఖ్యమని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ డబ్బు తిరిగి రెట్టింపుగా ఇవ్వడంతో నిస్వార్థపరులైన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి వారితోనే ఉండమని ప్రాధేయపడతాడు. కొన్ని సంవత్సరాలకి రాంబాబు తండ్రి మరణించిన తర్వాత చూపు మందగించిన తల్లికి రోజు రోజుకి శారీరకంగా బలం తగ్గడం వలన దగ్గు పెరగడంతో, రాజా, కావ్య లిద్దరూ కొడుకైనా శ్రీను ను వారి నాయనమ్మ దగ్గరికి పంపించేవారు కాదు. ఒకరోజు అర్థరాత్రిపూట నడిచే బలం లేక, గ్లాసుని పట్టుకునే బలం లేక పదే పదే గ్లాసు కింద పడటంతో శబ్దానికి లేచి వచ్చి తల్లిని కోపడతాడు.
తల్లి తన కొడుకుని ఒకే ఒక కోరిక కోరుతుంది. ఆ రోజు రాత్రికి అక్కడే తన పక్కనే నిద్రించమని చెబుతోంది. దానికి రాజా కూడా సరేనని అక్కడే పడుకుంటాడు కానీ పదే పదే తల్లి దాహంగా ఉందని చెప్పడంతో చిరాకుపడతాడు. అంతేకాక మంచం మొత్తం నీటితో తడవడంతో రాజా తల్లిని కోపగించుకుంటాడు. అయితే తల్లి కోపగించుకోకుండా రాజా నీవు పుట్టినప్పటి నుంచి కొన్ని సంవత్సరాలపాటు మలమూత్రాలతో ఇలాగే తడిపేసినా భరించాను అని చెప్పడంతో ఒక్కక్షణం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని తన కోపాన్ని, బాధని పక్కనపెట్టి తల్లి పాదాల మీద పడి నమస్కరించాడు. తల్లి రుణం తీర్చుకోలేనిది అని ఇక తప్పు చేయనని మాటిచ్చాడు. అప్పటినుండి తన కోపాన్ని వదిలేశాడు.
ధనగర్వము, కోపము, అహంకారం ఇవి రాకుండా పిల్లలను కాపాడుకుంటే పిల్లల భవిష్యత్తు అనుబంధాలతో అందరితో కలిసి మెలిసి ఉండేలా చేస్తుంది.
No comments:
Post a Comment