సంచలనం 8వ వారానికి సంబంధించిన కథను చదవాలనుకుంటే ఈ క్రింది లింకును నొక్కండి.
https://www.manakathalu.in/2021/01/8.html
అనిల్ తిరిగి వెళ్ళిన కొన్ని రోజులకి వారి ఊరి దగ్గర నుంచి కానిస్టేబుల్ ఫోన్ చేసి అక్కడ ఎటువంటి ఆధారాలు దొరకకపోవడం వలన పోలీసులు కేసు కొట్టేశారు అని ఆ కేసును రామ్మోహన్ అనే ఎస్సై దర్యాప్తు చేశాడని అక్కడ ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో ఫైలును మూసివేశారని తెలియజేస్తాడు. వారి కన్నా ముందుగా నేను ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సున్నితంగా పరిశీలించగా నాకు ఒక ఆధారం దొరికిందని కానీ దానిని కనిపెట్టడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పి వివరిస్తాడు. పిల్లల గురించి అడగగా అనిల్ పిల్లలు ఇప్పుడే కోలుకుంటున్నారని వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని సాధ్యమైనంత త్వరగా ఆ రహస్యం వెనుక ఉన్న వ్యక్తులను కనుక్కోమని చెప్తాడు.
అనిల్ కానిస్టేబుల్ తో మాట్లాడుతూ ఉండగా ఆ విషయాలను శరణ్య విని అనిల్ ని నిజం చెప్పమని అడుగుతుంది. ఈరోజు కాకపోయినా రేపైనా జరిగిన విషయం చెప్పాలి లేదా నాకేదైనా అయితే ఆ విషయం ఒక యాక్సిడెంట్ గానే మిగిలిపోతుంది అని భావించి జరిగిన విషయాన్ని క్లుప్తంగా వివరిస్తాడు. ఆ మాటలు విని స్పృహ తప్పిపడిపోతుంది. అనిల్, శరణ్యను స్పృహ నుండి తేరుకున్న తరువాత అందుకే ఇటువంటి విషయాలు దాచి ఉంచాను అని చెప్తాడు. అంత మంచి అన్నయ్యకు ఇలా జరగటం అన్యాయం. ఎవరికి హాని తలపెట్టని వ్యక్తికి ఇలా చేసిన హంతకులను పట్టుకోవాలంటూ, వదిలి పెట్టకూడదంటూ, ఏడుస్తూ ఉండగా అనిల్ ఓదార్చతూ ఏ రక్తసంబంధంలేని నీకు అంత బాధ కలిగితే, నాతో కలిసి పెరిగిన ఇన్నాళ్ల మా స్నేహంలో అందరూ మమ్మలను గొప్ప మిత్రులుగా, ఒకే తల్లి బిడ్డలుగా చూశారు. ఆ కోపం నాకు ఎలా ఉంటుందో అర్థం చేసుకో అని నెమ్మదిగా వివరిస్తాడు.
ఎంత తొందరపడినా ఇది సమయం కాదు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు ఆ హంతకుడిని అంతమొందించడమే నా లక్ష్యం అని, పిల్లలకు ఈ విషయాన్ని తెలియకుండా పెంచాలి. నా మిత్రుని చంపిన వాడిని నిద్రాహారాలు లేకుండా హింసించి, బ్రతికుండగానే చావు ఎలా ఉంటుందో చూపిస్తా ? ఒక చెడ్డవాడు బ్రతికినా పర్వాలేదు కానీ ఒక మంచివాడు మరణిస్తే మాత్రం అది దేశానికి నష్టం కాబట్టి విజయ,నారాయణల మరణానికి కారణమయిన వారిని మాత్రం బ్రతకనివ్వనని శరణ్యకు మాటిస్తాడు.
అంతలో మళ్ళీ ఫోన్ మోగుతుంది ఈసారి కాంతారావు అనిల్ కుటుంబ యోగక్షేమాలను తెలుసుకొని, నారాయణ విషయాన్ని తలుచుకుని బాధపడుతూ, పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని, పాల డైరీ బాగా నడుస్తుందని, తనకు అమ్మినందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. మీకు ఏ అవసరమైనా ఎప్పుడైనా, నాతో అవసరమైతే ఒక్క ఫోన్ చేయమని చెప్తాడు. శరణ్య, నారాయణను చంపవలసిన అవసరం ఎవరికి ఉందని అనిల్ ని నిలదీస్తుంది. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగామంటున్నారు కదా! మరి నారాయణకి శత్రువులు ఎవరు ఉన్నారు? అసలా రోజు బ్యాంకుకి వెళ్తున్నామని ఎవరెవరితో చెప్పారు? ఎవరిని కలిశారు వీటిని కనుక్కుంటే ఆ హంతకుడు ఎవరో తెలుస్తుంది కదా!
కొన్ని రోజులలోనే చరణ్ సహాయంతో శరత్ అపార్ట్మెంట్లోని పనులను పూర్తి చేసుకుని చరణ్, శరత్, హరి మూడు కుటుంబాలు ఒకే సమయంలో గృహప్రవేశం చేస్తారు. ఈ మొత్తానికి కారకుడు శరత్ కారణమేమంటే సహాయంగా ఉండేందుకు వారి భాగస్వామ్యం ఇవ్వడం, ధన సహాయం చేసినందుకు హరిని మిత్రుడు గా భావించడం. హరి సర్పంచ్, ప్రిన్సిపల్, పెద్దలు అందరూ రావడం చూసి శరత్ ఆశ్చర్యానికి గురి అవుతాడు. అందరూ బంధువులు కాకపోయినా ఒక వ్యక్తిని అంతగా ఇష్టపడటానికి కారణం అతని మంచితనం ఏమోనని అనుకుంటాడు. ఎంతో బంధువులు ఉన్న మేము మాత్రం చిన్న కుటుంబంగానే మిగిలిపోయాము. ఇదంతా నా వల్లే జరిగిందేమో అని మనసులో బాధపడుతూ ఉంటాడు. ఏదేమైనా ఇప్పటికి తన వారెవరు? పరాయి వారెవరు? అనే విషయం కీర్తికి కూడా అర్థమయ్యే ఉంటుంది.
మిత్రులు బంధువులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ మూడు కుటుంబాలు కూర్చుని ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటూ ఉన్న సమయంలో శరత్ చరణ్ హరి లతో ఎప్పటికీ మన మూడు కుటుంబాలు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అని చెప్పిన మాటలకు ఒక్కరోజు పరిచయంతోనే ఇంతగా ఆదరిస్తారని అనుకోలేదని హరి పలుకగా, దానికి సమాధానంగా చరణ్, శరత్ కష్టంలో ఉన్నాడని తెలిసి నా ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చాను. అంతే బంధువులందరికీ కాదని నన్ను తన వ్యాపారంలో భాగస్వామిని చేశాడు. ఇటువంటి మిత్రులు నాకు దొరకడం దేవుడిచ్చిన వరం అనే చెప్తాడు. లక్ష్మీ మనిషికి డబ్బు, అహంకారం ఈ రెండు బంధాలను దూరం చేస్తాయి ఆ రెండింటినీ పక్కన పెడితే మనమందరం ఎల్లప్పుడు ఇలాగే ఉండొచ్చు అని సమాధానం ఇస్తుంది.
అంతలోనే కీర్తి వాంతులు చేసుకోవడంతో జనాలు భయపడుతూ ఉండగా భయపడవలసిన పనిలేదని, కీర్తీ ప్రెగ్నెంట్ అని, ఇంట్లో చేరిన మొదటి రోజే మంచి శుభవార్త తెలియజేసిందని లక్ష్మి చెప్పగా అందరూ సంతోషిస్తారు.
ఇక తర్వాత ఏమి జరుగుతుంది అనేటువంటి విషయం వచ్చే వారం మీ www.manakathalu.in లో చూడండి.
1 comment:
Super sir
Post a Comment