Breaking

Thursday, July 29, 2021

BHOJASYA AUDARYAM

                     भोजस्य औदार्यम् अधिकृत्य लिखत ।

                                        (अथवा)

                    भोजमहाराजस्य यशः कीदृशमिति लिखत ।

कविपरिचयः :-

                "भोजस्य औदार्यम्"  इति पाठ्यभागः बल्लाल कविना विरचित "भोजप्रबन्धात्" स्वीकृतः । कवेरस्य बल्लालसेनः, वल्लभदेवश्चेत्यादि नामान्तराणि विद्यन्ते । सोऽयं बल्लालः भोजनरेन्द्रस्य आस्थानसभां समलञ्चकरोति विमर्शकाः मन्वते ।

                          లేదా

కవిపరిచయము :-

                "भोजस्य औदार्यम्" అను పాఠ్యభాగం బల్లాల కవిచేత రచింపబడిన "భోజప్రబందం" అను కావ్యము నుండి స్వీకరింపబడినది. బల్లాలకవికి బల్లాలసేనుడు, వల్లభదేవుడు అను పేర్లు కూడా ఉన్నవి. అంతేకాకుండా ఈ కవి భోజరాజు యొక్క ఆస్థానంలో ఉన్నాడని విమర్శకుల అభిప్రాయం.

प्रस्तुतकथा :-

                తండ్రియైన ముంజుడు తపోవనానికి వెళ్ళిన తరువాత భోజుడు బుద్ధిసాగరున్ని ప్రధానమంత్రిగా చేసుకొని రాజ్యపరిపాలన చేయుచుండెను.

            ततो मुञ्जे  तपोवनं याते बुध्दिसागरं मुख्यामात्यं विधाय स्वराज्यं बुभुजे भोजराजनं नृपतिः 

                ఒకరోజు భోజుడు ఉద్యానవనమునందు  విహరించుచుండగా ధారానగరవాసి  ఒక బ్రాహ్మణుడు రాజును చూసి కళ్ళుమూసుకొని నడవటం చూసి ఆబ్రాహ్మణున్ని పిలిచి నన్ను చూసి ఆశీర్వదించకపోగా కళ్లు మూసుకోవడానికి గల కారణము ఏమి అని అడిగేను. द्विज त्वं मां दृष्ट्वा न स्वस्तीति जल्पसि । तत्र को हेतुः ?  బ్రాహ్మణుడు రాజుతో నీవు బ్రాహ్మణులకు హాని చేయవు కానీ నీకు ఔదార్యగుణం లేదు. అంతేగాక ఉదయాన్నే లోభి ముఖము  చూస్తే రాబోవు లాభము కూడా రాకుండును అందుకే కళ్ళు మూసుకున్నాను. "प्रातरेव कृपणमुखावलोकनात् परतोेपि लाभहानिः स्यात् "

ब्राह्मणेन हितोपदेशः :-

                వృద్ధుడైన నా తండ్రి కాశీకి వెళుతూ చెప్పిన మాటలను అనుసరించుచున్నాను అని చెప్పి రాజుతో మహారాజా కర్ణుడు, దథీచి, శిబి, విక్రమార్కుడు మొదలగు రాజులందరూ ఇప్పటికీ గొప్పగా కీర్తంపబడుచున్నారు. परलोकमलङ्कृतवन्तः क्षितिपतयः कर्ण - दधीचि - शिबि - विक्रमप्रमुखाः మానవులు మరణించినను కీర్తి అనే దేహంతో చిరకాలము జీవించును. అంతేకాక మరణము పండితునికైనా, మూర్ఖనికైనా తప్పదు. మృత్యవు విషయంలో ఈశ్వరునికైనా, దరిద్రునికైనా సమానమే. 

                   "ईश्वरे च दरिद्रे च मृत्योः सर्वत्र तुल्यता"

                    రాజు బ్రహ్మణుని మాటలకు ఆనందించి లక్ష నాణెములు బహుమతిగా ఇచ్చి  లోకములో ప్రియంగా మాట్లాడేవారు సులభంగా కనిపిస్తారు. కాని ప్రియముకాని హితమును పలుకువాడు, వినువాడు దొరకడు. "अप्रियस्य च पथ्यस्य वक्ता श्रोता च दुर्लभः" ఆ తర్వాత బ్రాహ్మణుని పేరు అడుగగా  భూమిపై "గోవింద" అని వ్రాసెను.  గోవిందునికి విద్యాధికారి పదవినిచ్చి కవులను, పండితులను తీసుకురమ్మని ఆదేశించి "ఈ లోకంలో ఏ పండితుడు దుఃఖించరాదు" అని పలికెను.

भोजस्य औदार्यम् :-

                       ఆతర్వాత కొద్దిరోజులకే రాజు పండితుడు, మహాదాత అని ప్రసిద్ధి పోందెను. భోజుని దానగుణం తెలిసి కళింగ దేశము నుండి ఒక కవి వచ్చాడు. అతడు నెల రోజులు వేచియున్నా రాజు దర్శనం కలుగలేదు. ఒకనాడు మహారాజు వేటకు కోటబయటకు రాగా రాజుని చూచి భోజమహారాజు ని చూడగానే శత్రువుల ఆయుధము జారును. కవుల కష్టలు తీరును, స్త్రీల కోకముడిజారును. शत्रोः शस्त्रं कवेः कष्टं नीविबन्धो मृगीदृशाम् । అని పలుకగా రాజు అతనిని మెచ్చి ఒక లక్ష ధనమును ఇచ్చెను.

                     రాజు వేటయందునిమగ్నమై ఉండగా ఒక పుళింద పుత్రుడియొక్క పాట  విని  సంతోషించి అతనికి ఐదులక్షల ధనాన్ని ఇచ్చెను. తరువాత సభలో కళింగకవి రాజు చేతిలో ఉన్న పద్మమును ఉద్దేశించి ఓ పద్మమా నీ గుణములు  ఉత్తమమైనవి. కానీ నీకు ప్రకాశము నీయజాలవు. ఎందుకంటే లక్ష్మికి నిలయమైన నీకోశములు తుమ్మెదలచే అనుభవింపబడుచున్నవి. "यल्लक्ष्मीवसतेस्तव मधुपैरुपभुञ्ज्यते कोशः" అని పలుకగా కవి అభిప్రాయాన్ని గ్రహించిన రాజు అతనితో రాజు కళలను గౌరవిస్తాడు కానీ కులాన్ని కాదు అని ఆకవికి మరియొక లక్ష ఇచ్చాడు.


गोविन्दस्य असूय :-

                    భోజమహారాజు ఏందరికో దానధర్మాలు చేస్తుండగా ఒక పండితుడు మహారాజుని ఉద్దేశించి మీ వద్దకు ఏవరు వచ్చినా పూర్ణమనస్కులై వెళ్ళెదరు అని పలుకగా రాజు ఒక లక్ష ఇచ్చెను. అంతటితో గోవిందపండితుడు కోపగించుకొనెను. అది గ్రహించిన రాజు గోవిందుడిని పదవి నుంచి తొలగించి మూర్ఖుడైన బ్రాహ్మణుడు నా రాజ్యమునందు ఉండతగడు. పండితుడు కుమ్మరియైనను నా రాజ్యమునందు ఉండదగును.

           "कुम्भकारोपि यो विद्वान् स तिष्ठतु पुरे मम"

                            ఆ తర్వాత శంకరకవి రాజుకీర్తిని ఉద్దేశించి పద్యకావ్యంలో తెలుపగా రాజు శంకరకవికి పన్నెండులక్షలు బహుమానంగా  ఇవ్వడం చూసి అక్కడి మిగతా కవులు ఆశ్చర్యమును పొందెను. 

            ఆ తర్వాత కూడా రాజూ అనికమంది కవులకు ధనమును బహుమానంగా ఇచ్చి తన దానశీలతను చాటుకొనెను.

        "विद्वत्प्रियः भेजः दानवित्तेश्वरः इति प्रथमागात्"

                     సీమంతుడు, కలమకవి, కాళిదాసు, జానుదగ్నకవి, శుకదేవుడు వంటి ఎంతోమంది కవులు వారి వారి పాండిత్యాన్ని ప్రదర్శించి భోజుని అమూల్యమైన కానుకలునిచ్చి పోషించెను. ఇలా దాదాపు 500వందల మంది కవులకు పైగా దానధర్మాలను చేసి గొప్పకీర్తిని పొందారు.

                

 భోజస్య ఔదార్యం సారాంశం వీడియో

  


 junior inter total sanskrit syllabus link:

htts://www.youtube.com/playlist?list=PLiOV0508aWZtkhXJLKkphfcWJUNZP61MU


భోజప్రభంధం గురించి మరికొన్నివిశేషాలు:

 భోజప్రభంధం అను గ్రంథం భోజుని చరిత్ర ఆధారంగా 15-16 శతాబ్దాల కాలంలో బల్లాలకవి చేత రచించబడినది. దీనిలో మొదటిభాగము నందు భోజునిచరిత్ర రెండవభాగమున భోజుని సద్గుణములు వర్ణింపబడినవి.

సీమంతుడు, కలమకవి, కాళిదాసు, జానుదగ్నకవి, శుకదేవుడు వంటి ఎంతోమంది కవులు వారి వారి పాండిత్యాన్ని ప్రదర్శించి భోజుని అమూల్యమైన కానుకలునిచ్చి పోషించెను. ఇలా దాదాపు 500వందల మంది కవులకు పైగా దానధర్మాలను చేసి గొప్పకీర్తిని పొందారు. 

    

1 comment:

Unknown said...

I want swedasya pushpani lesson essay