Breaking

Monday, July 12, 2021

MAYAVATUHU

    "मायावटुः" इति पाठ्यभागस्य सारांशं संक्षेपेण लिखत । 

                        (अथवा)

   "मायावटुः" सम्भाषणकौशलं संक्षेपेण वर्णयति ।

कविपरिचयः :-

                    "मायावटुः" इति प्रस्तुतः पाठ्यभागः महाकविः कालिदासेन विरचित "कुमारसम्भवम्" इति महाकाव्ये पञ्चमसर्गात् स्वीकृतः ।

कालिदास महाकवेः काव्यानि :-

काव्यानि :- रघुवंशः - कुमारसम्भवम् । ऋतुसंहारः - मेघदूतम् । 

मालविकाग्निमित्रम् - विक्रमोर्वशीयम् - अभिज्ञानशाकुन्तलम्  इति।

        "मायावटुः" అను ప్రస్తుత పాఠ్యభాగం మహాకవి కాళిదాసుచేత రచింపబడిన "కుమారసంభవం" అను మహాకావ్యంలోని ఐదవసర్గనుండి స్వీకరించబడినది.

కాళిదాస మహాకవి యొక్క రచనలు :-

   రఘువంశం, కుమారసంభవం అను రెండు మహాకావ్యాలు, ఋతుసంహారం, మేఘదూతం అను రెండు లఘు కావ్యాలు. అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం అను మూడు నాటకాలు కాళిదాసు రచించెను.


प्रस्तुतः विषयः :-

               पार्वती परमशिवं पतिंवरासती घोरतरं तपस्तेपे । तपोवने तपमाचरन्तीं पार्वतीं परीक्षितुं वटुरूपं धृत्वा शङ्करः तत्राजगाम । मायावटुः पार्वतीं कुशलप्रश्नान् पृष्ट्वा शिवनिन्दां कर्तुम् आरब्धवान् ।

मायावटुः प्रवेशः :-

          పార్వతీదేవి తపస్సు చేస్తున్న ఆశ్రమానికి జింక చర్మాన్ని ధరించి, మోదుగకర్రను చేతపట్టి, గొప్ప వాక్చాతుర్యం మరియు తేజస్సు కలిగిన బ్రహ్మచారి వచ్చెను. अजिनाषाढाधरः, प्रगल्भवाक्, ब्रह्ममयेन तेजसा वटुः" पार्वत्याः तपोवनं प्रविवेश। పార్వతీ ఆబ్రహ్మచారికి ఆతిధ్యమును ఇచ్చెను. అప్పుడు బ్రహ్మచారి నిర్మలమైన దృష్టితో పార్వతిని చూసి కుశలప్రశ్నలు అడిగెను.

मायावटोः वचनानि :-

          ఓ పార్వతీ! నీ హోమాది కార్యములకు కావాల్సిన సమిథలు, దర్భలు లభించుచున్నవా! ఇక్కడి నీరు స్నానమునకు యోగ్యముగానున్నదా! ఎందుకంటే ధర్మమును ఆచరించుటకు శరీరం మొదటి సాధనము కదా!. "हे पार्वती! अत्र तपः कर्तुं सर्वं सम्यक् अस्ति किम्? स्नानार्थमपि उत्तम जलमस्ति वा? यतः शरीरमाद्यं खलु धर्मसाधनम्" ఏడు మాటలతో స్నేహం కుదురును అని పెద్దలు చెప్పారు. "मनीषिभिस्साप्तपदीनमुच्यते" నన్ను అన్యునిగా  భావింపకుము.

             రహస్యము కానిచో సమాధానము చెప్పుము. హిరణ్యగర్భుని వంశంలో పుట్టిన నీవు సౌందర్యరాశివి, ఐశ్వర్యము కలదానివి, నవయౌవ్వనవతివి అయిన నీవు తపస్సు చేత కోరదగినవది ఏమి? कुले प्रसूतिः प्रथमस्य वेधसः त्रिलोकसौन्दर्यमिवोदितं वपुः। నీవు తపస్సు చేసి స్వర్గమును కోరుకొనుట వృథా. ఎందుకనగా నీ తండ్రి ప్రదేశములే దేవభూములు. "यदि स्वर्गम् इच्छति तव पितुः प्रदेशाः एव देवभूमयः भवति" కావున వరునిగూర్చి తపస్సుచేస్తుంటే ఇకచాలు. ఏందుకనగా "రత్నము స్వీకరించువాని కోరకు వేదకదు". అటులనే నిన్నుకోరుకొను వరుడే వేతుకుచూ వచ్చి నిన్ను వరించును. "न रत्नमन्विष्यति मृग्यते हि तत्" నీవు కోరుతున్న వరుడేవరో తెలుసుకోవాలని ఉన్నది అని  అడుగగా పార్వతీ సిగ్గుచేత తన చెలిని చూడగా ఆ చెలి బ్రహ్మచారితో ఈవిధంగా పలికేను.

सख्याः वचनानि :-

                విద్వాంసుడా! "అభిమానవతియైన పార్వతీ ఐశ్వర్యవంతులేన ఇంద్రాది దిక్పాలకులను కాదని  పినాకపాణిని పతిగా పొందగోరుచున్నది" అని పలికేను. इयं हैमावती इन्द्रादि दिक पालकान् तिरस्कृत्य अरूपहार्यं शिवं पतिमाप्तुमिच्छति। బ్రహ్మచారి ఆమాటలు విని  పార్వతిని వాస్తవమా?పరిహాసమా? అని  అడుగగా పార్వతీ నిజమే అని పలికేను.

ब्रह्मचारिणा शिवनिन्दा :-

                పార్వతీ మాటలువిని  వటువు ఓయి పార్వతీ! అమంగళకరుడైన శివున్ని పొందటం సమంజసం కాదు. ఎందుకనగా వివాహానంతరం ఏనుగు పై ఊరేగే నీవు ముసలి ఎద్దుపై ఎక్కుటను చూసి జనులందరూ పరిహసించేదరు. ఆ శివుడు విరూపాక్షుడు, పుట్టుకతెలియనివాడు. శరీరమంతా భస్మాన్ని ధరించేవాడు అని పలికేను. అప్పుడు పార్వతీ కోపంతో  మూర్ఖులు మహాత్ములచరిత్ర  తెలియక దూషించేదరు అని పలికి శివున్ని వర్ణించెను.

पार्वत्या वर्णितं शिवतत्वम् :-

       విద్వాంసుడా! ఆశివుడు దరిద్రుడయినను సకలసంపదలకు కారకుడు. స్మశానవాసి అయినను ముల్లోకాలకు ప్రభువు. ఐరావతమును ఎక్కితిరుగు ఇంద్రుడు కూడా ఎద్దు ఎక్కే శివుని పాదాలపై పడి నమస్కరించును. శివుని పుట్టుక గురించి నీలాంటి అల్పులకు ఎలా తెలుస్తుంది అనిపలికి ఏదో చెప్పబోతున్న బ్రహ్మచారిని ఉద్దేశించి మహాత్ములను నిందించువారే కాక వినువారుకూడా పాపమును పొందేదరు అంటూ అక్కడి నుండి కదిలెను.

शिवस्य अनुग्रहः :-

             పార్వతీ కదలగా వటువు నిజరూపమును పొంది "ఓ పార్వతీ! నీవు నీ గొప్ప తపముచే నన్ను నీ దాసుడిని చేసుకుంటివి" అని పలుకగా పార్వతీ తపముచే పొందిన కష్టమునకు ఫలము దక్కెనని సంతోషించెను. కష్టము తర్వాత కలుగు ఫలితము నూతనోత్తేజమును నింపును కదా! "क्लेषः फलेन हि पुनर्नवतां विधत्ते"  

Ap junior inter sanskrit total syllabus:

మీకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సంస్కృత పాఠ్యభాగాలకు సంబంధించిన వీడియోలు ఈ లింక్ లో ఉన్నాయి.

https://www.youtube.com/playlist?list=PLiOV0508aWZtkhXJLKkphfcWJUNZP61MU


 Mayavatuhu story for ap jr.inter sanskrit:



కాళిదాస మహాకవి రచనల గురించి మీరు తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు

కాళిదాస మహాకవి యొక్క కాలం :

            సరస్వతీ దేవి యొక్క విలాసము అని సహృదయములచే స్తుతింపబడిన మహాకవి కాళిదాసు కావ్య నిర్మాణము నందు మార్గదర్శకములైన ఉత్తమ ప్రతిభా గుణములతో కవులందరికి గురువై ప్రకాశించుచున్నాడు. ఇతడు తన లోకోత్తరమైన రచనా చాతుర్యము వలన సరస్వతీ దేవియొక్క విలాసమే కాళిదాసు అని ప్రసిద్ధి చెందినాడు. తరువాతి  కాలమునందలి సంస్కృత కవుల యందు ఈ కవి యొక్క ప్రభావము స్పష్టముగా  కనబడుచున్నది.

                    ఈయన జన్మస్థానము, జీవించిన ప్రదేశము కూడ ఉజ్జయిని అని చరిత్రకారుల అభిప్రాయము. మేఘదూత కావ్యమునందలి ఉజ్జయినీ ప్రాంత వర్ణనము ఈయనకు పుట్టిన ప్రదేశమునందు ఉన్న ప్రేమను తెలియజేయుచున్నది. కాళిదాసు యొక్క కాలము ఇప్పటికీ చర్చనీయాంశమే. కాని చాలామంది విద్వంసులు కాళిదాసు యొక్క కాలము క్రీ.శ ఒకటవ శతాబ్దియని నిర్ధారించుచున్నారు.

కాళిదాసు రచనలు :-

మహాకావ్యములు

1.రఘువంశము  సూర్యవంశరాజులైన రఘువు మొదలగు రాజుల యొక్క ఉదాత్త చరిత్రలు               వర్ణింపబడినవి.

2. కుమారసంభవము  ఇందులో శివపార్వతులయొక్క దివ్య ప్రణయమునకు ఫలమైన , లోక  కళ్యణదాయకమైన కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతము మనోరంజకముగా వర్ణింపబడినవి.

లఘుకావ్యములు

1. ఋతుసంహారము  ఇందు వసంతము మొదలగు ఋతువులు వర్ణింపబడినవి.

2. మేఘదూతము   పరిమాణంలో చిన్నదైనప్పటికీ ఈ కావ్యం ప్రపంచసాహిత్యంలో గొప్పకీర్తిని సంపాదించింది. శాపము వలన భూమి మీదకు వచ్చిన ఒక యక్షుడు  అలకానగరములోనున్న తన ప్రయురాలికి మేఘము ద్వారా సందేశమును పంపుట ఇందులోని ప్రధాన వృత్తాంతము. 

రూపకములు

1. మాలవికాగ్నిమిత్రము  ఇందు మాళవిక కథానాయిక. అగ్నిమిత్రుడను రాజు నాయకుడు. వీరిద్దరి  ప్రణయ వృత్తాంతము ఈ నాటకమునంచు మనోహరముగా వర్ణించబడినది.

2. విక్రమోర్వశీయము  చక్రవర్తియైన విక్రమార్కుడు అప్సరసయైన ఊర్వశి వీరిద్దరి ప్రేమ వృత్తాంతము  ఇందు వర్ణింపయడినది.

3. అభిజ్ఞానశాకుంతలము  శకుంతల, దుష్యంతుల వృత్తాంతము అత్యంత మనోహరమైన  నాటకముగా వ్రాయబడినది. ఇది కాళిదాసు రచించిన గ్రంథములన్నింటిలోను ఉత్తమమైన రచనగా పండితులచే ప్రశంసించబడుచున్నది.



7 comments:

Anonymous said...

your teaching is very nice sir we are from allen career institute

Unknown said...

Sir your teaching is very nice iam your narayana clg student

Unknown said...

Thank you for teaching us sir, your teaching style is excellent
Thank you

Unknown said...

Excellent teaching sir
From Ur teaching i learned so much
Keep going on this track for other
Who want to learn Sanskrit
The best platform to learn Sanskrit
Is from your channel sir
Thanks u

Karthik said...

Sir can u give us important questions video in youtube.ur teaching is very nice sir

Anonymous said...

Thank you for teaching sir and,
your style and teaching skills are very nice sir,

Anonymous said...

If the essay is in english language is some better for people who are weak in telugu language