Breaking

Wednesday, January 18, 2023

KAPINJALOPADESAHA

1. पुण्डरीकमुध्दिस्य  कपिञ्जलः किम् उपदिदेश ?

    పుండరీకునికి కపింజలుడు ఏమని ఉపదేశించెను?

                        (अथवा)

2. कामावेशात्  निवर्तयितुं पुण्डरीकं प्रति कपिञ्जलः किमुवाच ?

    కామావేశము నుండి మరల్చుటకు పుండరీకునికి కపింజలుడు ఏమని చెప్పెను?

कविपरिचयः - कपिञ्जलोपदेशः इति पाठ्यभागः बाणभट्टेण विरचित कादम्बरी इति ग्रन्थात् स्वीकृतः । गद्य काव्यानि बहूनि सन्ति। तेषु बाणभट्टविरचितं कादम्बरीकाव्यं श्रेष्ठतमं भवति । कादम्बरी रसज्ञानाम् आहारोSपि  न रोचते इति विद्वांसः कादम्बरी बहुधा प्रशशसुः । अयं बाणभट्टः सप्तमशताब्द्यां  श्रीहर्षचक्रवर्तिनः आस्थाने आसीत् । अनेन श्रीहर्षस्य जीवितमाधारीकृत्य  हर्षचरितं च रचितम् । 

కవిపరిచయం :- కపింజలోపదేశః అను ప్రస్తుత పాఠ్యభాగము బాణభట్టునిచే రచింపబడిన కాదంబరీ కావ్యము నుండి గ్రహించబడినది. సంస్కృత వాజ్ఞ్మయమునందు  గద్యకావ్యములకు ప్రముఖ స్థానము కలదు. వాటిలో బాణభట్టుచే రచించబడిన కాదంబరీ కావ్యము చాలా శ్రేష్ఠమైనది. బాణభట్టు ఏడవ శతాబ్దంలో శ్రీహర్షుని ఆస్థానంలో ఉండేవారు. ఇతడు శ్రీహర్షుని యొక్క జీవితమును ఆధారముగా చేసుకొని  శ్రీహర్షచరితం ను రచించెను.

पूर्वकथा :- హేమకూటమునందు హంసుడు అనే ఒక గంధర్వరాజు ఉండెను. అతడు గౌరీ అను ఒక అప్సరసను వివాహము చేసుకొనెను. వారికి మహాశ్వేత అను పేరు గల కుమార్తె కలిగెను. ఆ మహాశ్వేత బాల్యమునుండి సంతోషంతో గడిపి యౌవ్వన దశలోకి ప్రవేశించెను.

प्रस्तुतकथा :- మహాశ్వేత అను గంధర్వకన్యను చూసి ఆమె యందు ఆసక్తుడైన పుండరీకుని మంచిమార్గంలోకి నడిపించుటకు కపింజలుడు అను మిత్రుడు ఈవిధంగా ఉపదేశించెను. कदाचित् महाश्वेता नामक गन्धर्वकन्यायाम् अनुरक्तं पुण्डरीकं परिवर्तयितुं तस्य मित्रं कपिञ्जलः सन्मार्गं प्रति एवम् उपदिशति। 

पुण्डरीकस्य अनुरक्तः :- ఒకనాడు మహాశ్వేత అచ్ఛోద సరస్సు వద్దకు వెళ్ళెను. అక్కడ అపూర్వ పరిమళమునకు ఆకర్షితురాలయ్యెను.  ఆ పరిమళము ఎక్కడ  నుండి వచ్చుచన్నదో  ఆమె వెతుకుచుండగా స్నానార్ధము అక్కడికి వచ్చిన ఒక యువకుడైన మునికుమారున్ని చూచెను. అతని చెవి యందున్న ఒక పూలగుత్తిని చూసి ఆ పరిమళం మునికుమారుని చెవియందు ధరించిన పూలనుండి  అని గ్రహించెను.  అదే సమయంలో పుండరీకుడు  మహా సౌందర్యవతి అయిన మహాశ్వేతను  చూసి ఆమె యందు అనురక్తుడయ్యెను. सरः समीपे पुण्डरीकः महासौन्दर्यवतीं गन्धर्वकन्यां महाश्वेताम् अपश्यत् ।

        అదే సమయంలో అతని మిత్రుడైన కపింజలుడను మరొక మునికుమారుడు పూజ కొరకు పూలను కోసుకొని తెచ్చెను. తపోజపాది నియమాలయందు  మనస్సు లగ్నము చెయలేక,  మహాశ్వేతయందు మనస్సు ఉంచిన తన మిత్రుడైన పుండరీకున్ని చూసి కపింజలుడు పుండరీకున్ని మంచిమార్గనకు తీసుకువచ్చుటకు ఈ విధంగా ఉపదేశించెను. तपोजपादि नियमेषु असंलग्नः पुण्डरीकं सन्मार्गे प्रवर्तयितुं कपिञ्जलः एवम् उपदिदेश।

कपिञ्जलस्य उपदेशः :-  ఓ పుండరీకా! ఇది నీకు సరైన మార్గము కాదు. సజ్జనులు ధైర్యమే ధనముగా కలవారు కదా! धैर्यधना हि साधवः నీ ఇంద్రియనిగ్రహము ఎక్కడకు పొయినది? तव इन्द्रियजयः कुतः गतः?  నీ ధైర్యము నీ ప్రశాంతత ఎక్కడకు పోయినది? వంశానుగతంగా వచ్చిన నీ బ్రహ్మచర్యం ఎక్కడికి పోయినది? कुलक्रमागतः ब्रह्मचर्यं क्व गतम्? నీ గురూపదేశములెమైనవి? गुरूपदेशः कुत्र गतः? నీ విద్యా, వైరాగ్య బుద్దులెక్కడికి పోయాయి? तव वैराग्य बुध्दिः क्व गता? నీకు సుఖములయందు  అనురక్తి ఎందుకు? నీకు గల తపస్సుయందు ఆసక్తి  ఎక్కడ? నీలోని ప్రజ్ఞ నిష్పలము, तव प्रज्ञा निष्पला जाता। ధర్మశాస్త్ర అభ్యాసము  నిరర్థకము. धर्मशास्त्राभ्यासः निरर्थकः जातः।

        నీ వంటి ఉత్తముడు కూడా రాగములయందు  ఆసక్తుడై ప్రమాదమునందు పడుచున్నాడు. నీ చేతి నుండి జారిపడిన జపమాలను కూడా నీవు గుర్తింపలేకున్నావు? అయ్యో ఎంత అచేతనుడిగా ఉన్నావు? అని కపింజలుడు పలికెను. अहो! विगत चेतनतेवम् ।

पुण्डरीकस्य आसक्तिः :-  అప్పుడు పుండరీకుడు తన మనస్సు మహాశ్వేత యొక్క సౌందర్యమునకు ఆకర్షితమయ్యెను అని పలికి అయినా మిత్రమా నా వృత్తాంతమంతా  తెలిసి కూడా ఎందుకు నన్ను అడుగుచున్నావు? నన్నేమి అడిగినా ప్రయోజనము లేదని తెలిపెను. कपिञ्जलस्य उपदेशं शृत्वा पुण्डरीकः सखे! विदित वृत्तान्तोपि किमेवं मां पृच्छसि।

कपिञ्जलस्य प्रयत्नः  :- మిత్రమా పుండరీకా! అంతయు నాకు తెలిసినప్పటికి అడుగుచున్నాను. ఇది నీకు గురువులచే ఉపదేశించబడినదా? లేక ధర్మశాస్త్రములందు చదవబడినదా? ఏదైన వ్రత రహస్యమా? లేక మోక్షప్రాప్తికి సాధనమా? మనస్సునందు  రాకూడని విషయాలు మరలా మరలా ఆలోచించుచున్నావు. దుష్టుడైన మన్మథుని చేష్టలకు నీవు నవ్వులపాలు అవుతున్నావని తెలుసుకోలేక ఉన్నావు, మూర్ఖులు మాత్రమే మన్మథునిచే బాధింపబడతారు. मूढः एव मदनेन आयास्सयते।

ధర్మబుద్ధితో విషపు మొక్కలను పెంచినట్లు, తామర పూలదండ వలె ఖడ్గమాలను ధరించినట్లు, నల్ల త్రాచుని ధూపముగా భావించినట్లు, అగ్నిని రత్నము అని తాకినట్లు, ఏనుగు యొక్క దంతమును తామర తూడులేని దారము అనుకున్నట్లు మూర్ఖులు క్లిష్టమైన విషయ వాంఛలయందు ఆసక్తులగుచున్నారు. ధైర్యము చేసి మన్మథున్ని గెంటివేయుము. ఈ విధముగా మన్మథ తాపమునకు గురియైన మిత్రుడైన పుండరీకునికి విద్యాభ్యాసమునకు ప్రోత్సహిస్తూ, సన్మార్గము వైపు మరలించుచూ కపింజలుడు ఉపదేశము చేసెను.

 

1 comment:

Anonymous said...

We need swedhasya pusphani