ఒకరోజు సూర్య అనే కుర్రాడు తన ఇంటి బజారులోనే నడుచుకుంటూ వెళ్తున్న ఒక అమ్మాయిని చూసాడు. ప్రతిరోజు ఆ అమ్మాయి తన ఇంటి ముందుగా ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి రావడం గమనించాడు. కొన్ని రోజులు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్తూ ఆ అమ్మాయిని అనుసరిస్తూ ఉండేవాడు. ఆ కుర్రాడిని గమనించి అమ్మాయి ఆకతాయి వాడు అనుకొని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంది. అయితే రోజూ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ, కళ్ళు చెదిరే సోయగం, ప్రతి క్షణం పసిపాపలా ఆణిముత్యాలను వెదజల్లుతున్న ఆ దరహాసం, వాటిని తలుచకుంటూ ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలనే కోరికతో ధైర్యం చేసి ఒకరోజు తనకి ఎదురుగా వెళ్ళి తన మనస్సులోని మాటను చెప్పాలని రాత్రంతా బాగా ఆలోచించి సినిమాలో మాదిరిగా మనసులోని భావాలను పేపరు పై రాసుకొని బాగా చదువుకొని ఆ అమ్మాయి ఒకటే ఉన్నప్పుడు మాట్లాడాలని బయలుదేరాడు.
తన ఎదురుగా వెళ్తున్న ఆ అమ్మాయిని నీ పేరు ఏమిటి? అని సాధారణంగా అడిగాడు. కానీ ఆ అమ్మాయి వినపడనట్లుగా వెళ్ళిపోతుంటే ఏమి చేయాలో తెలియక వెనుక నుంచి కొంచెం వేగంగా నడక సాగిస్తూ ఆమె ముందుకు వెళ్ళి నిలుచున్నాడు. ఆ అమ్మాయి ఒక్కసారిగా ఉలిక్కిపడి అలా నిల్చునిపొయింది. ఒక నిమిషం పాటు ఏమి జరిగుతుందో అర్థమవలేదు. కానీ ఎదురుగా ఉన్న ఆ కుర్రాడ్ని చూడగానే తనతో మాట్లాడటం కోసం వచ్చాడనే విషయం అర్థమై గట్టిగా ఊపిరి పీల్చుకొని ధైర్యంగా నిలబడింది.
ఇక మనవాడు భయపడుతూ వణికిపోతున్న శరీరంతో, తడబడుతున్న పెదాలతో న న్ న్నా నా పేరు సూర్య. మ మర్ మరి మీ పేరు ఏమిటి? అని అడుగగా ఆ అమ్మాయి గుండె నిబ్బరంతో నా పేరు కావ్య ఏదో ఒకే బజార్లో ఉండేవాళ్ళం కదా! అని పేరు చెప్పాను కానీ ఇంకెప్పుడు నాతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దు అంటూ ముందుకు సాగిపోయింది. ఏదో మాట్లాడాలి, ఎంతో చెప్పాలని అనుకున్నా చెప్పలేకపోయినా, మాట్లాడటానికి ధైర్యం చాలకపోయినా, మొదటిసారిగా పేరు తెలుసుకున్నందుకు కొంచెం సంతోషంతో ఇంటికి చెరాడు. సూర్య తల్లి (లక్ష్మి) ఒక లెటర్ పట్టుకొని సూర్య కోసం ఎదురు చూస్తూ ఉంది.
సూర్యని చూసి ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లావు. మీ ఫ్రెండ్స్ అందరూ పొలము, వ్యాపారమని చేసుకుంటూ ఉంటే నువ్వు బజార్లు తిరుగుతున్నావు. కొంచమైన బుద్ధుందా! అంటూ స్వీట్ తెచ్చి నోట్లో పెడుతూ నీ కోరిక ఈరోజుతో నెరవేరింది నిన్ను మించిన అదృష్టవంతుడు లేడు అని చెప్పి లెటర్, ఒక ఐదు వేలు డబ్బులు ఇచ్చి పార్టీ చేసుకోమని వెళ్ళిపోయింది. ఆ లెటర్ చూడగానే నేవీ ఉద్యోగానికి సంబంధించిన కాల్ లెటర్. వారం రోజుల్లో చేరమని ఉంది. అది చూసి ఎగిరి గంతేసి, పరిగెత్తుకుంటూ వెళ్లి కావ్యకి చెప్పాలనుకున్నాడు. కానీ ముందు మనసులో మాట చెప్పి తర్వాత ఉద్యోగం గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
తల్లి ఇచ్చిన డబ్బుతో బంగారం షాపుకు వెళ్లి ఒక వెండి ఉంగరాన్ని తీసుకొని కావ్య పని చేస్తున్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అటెండర్‌తో కావ్యని కలవాలి అని చెప్పాడు. అటెండర్ వెంటనే మేడం కార్యక్రమంలో ఉన్నారు. ఇంకో పది నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుంది అని చెప్పి అక్కడినుంచి వెళ్తూ ఉండగా కావ్య ఒక ప్రోగ్రాం మేనేజర్ అని తెలుసుకుంటాడు.
కావ్య ప్రోగ్రాం పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి ఎవరో వచ్చారని వెయిటింగ్ రూములో మీ కోసం వెయిట్ చేస్తున్నారని అటెండర్ చెప్పిన మాట విని వెయిటింగ్ రూమ్ కి వెళ్తుంది సూర్య వెయిటింగ్ రూములో కూర్చుని ఏం చెప్పాలా! ఎలా చెప్పాలా! అని సతమతమవుతూ ఉంటాడు. అక్కడ సూర్యాని చూసి కావ్య ఆశ్చర్యపోయి ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? అని ప్రశ్నిస్తోంది. టెన్షన్లో జేబులో ఉన్న ఉంగరాన్ని బయటకు తీసి నేను నిన్ను ఇష్టపడుతున్నాను నీకు ఇష్టమైతే వివాహం చేసుకుంటాను అంటూ తన దగ్గర ఉన్న ఉంగరాన్ని కావ్య చేతిలో పెట్టి ఇష్టమైతే మన బజార్లో ఉన్న శివాలయానికి సాయంత్రం 6 గంటలకు రండి. వస్తే మరొక శుభవార్త కూడా చెబుతాను అంటూ బయలుదేరి వెళ్ళిపోతాడు.
ప్రతిక్షణం ఎన్నో యుగాలుగా గడుస్తున్నాయి. సాయంత్రం గుడికి వస్తుందో, రాదో! వచ్చినా ఏమి చెబుతుందో! అని ఆలోచించుకుంటూ ఎలాగైతేనేమి సాయంత్రం ఐదు గంటలకి గుడికి వెళ్ళి తను ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కావ్య సూర్యతో నా మనసులో మాట తెలుసుకునే ముందు నీకు ఒక నిజం చెప్పాలి అది విని నీవు అంగీకరించినప్పుడు నేను ఆలోచిస్తాను. అని మా నాన్న ఒక హంతకుడు. ఇప్పుడు కూడా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. నా జీతం మీదే నా కుటుంబం ఆధారపడి ఉంది. ఇప్పటివరకూ నాలుగైదు సంబంధాలు వచ్చాయి అందరూ నా తండ్రి గురించి తెలుసుకుని తిరిగి వెళ్ళిపోయారు. ఇది నీకు అంగీకారమైతే నీవు ఒప్పుకుంటే వచ్చి మా అమ్మతో మన వివాహం గురించి మాట్లాడు అని ఉంగరము అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. సూర్య ఆమెను ఆపి నాక్కూడా ఒక వారమే అవకాశం ఉంది. నాకు నేవిలో ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఈవిషయం సాధ్యమైనంత త్వరగా ఇంట్లో పెద్దలకు తెలియచెప్పి ఒప్పిస్తానంటూ సమాధానం ఇస్తాడు.
సూర్య వచ్చేసరికి తల్లి తండ్రితో కొడుకు ఉద్యోగం గురించి చెబుతూ ఉంటుంది. మనకి చెప్పకుండా 20 సంవత్సరాల వయస్సుకే ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడా! తల్లిదండ్రులుగా మనకు ఇంతకన్నా ఏమి కావాలి? సూర్య తన తండ్రికి తన ప్రేమ విషయాన్ని చెప్తాడు. అయితే ఇప్పుడే ఉద్యోగం సంపాదించుకున్నావు ఇటువంటి ప్రేమ దోమ అంటూ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఆమె తండ్రి ఒక హంతకుడు అని జనాలకు తెలిస్తే మన పరువు పోతుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఆపేసి బుద్ధిగా ఉద్యోగం చేసుకోమని మందలిస్తాడు. ఎంత చెప్పినా తండ్రి అంగీకరించకపోవడంతో తను ఏమి చేయలేక రెండు రోజుల తర్వాత మళ్ళీ కావ్యను కలిసి నా ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత వచ్చి నేను నిన్ను వివాహం చేసుకుంటాను.
ప్రశాంతంగా మాట్లాడటానికి కూడా సమయం లేని విధంగా రోజులు గడుస్తున్నాయి. శారీరకంగా పెరిగిన దూరం మానసికంగా (ప్రేమ) దగ్గర చేస్తుందనేది కావ్య నమ్మకం. ప్రతిక్షణం కావ్య జ్ఞాపకాలతో పగటి కలలను కంటూ గడుపుతున్న సూర్యకి ఆ మూడు నెలల కాలం మరో జన్మ ఎత్తినట్లుగా, కొత్త జీవితానికి నాంది పలుకుతున్నానన్న ఆనందంలో ఎంతో కష్టమైన ఆ ట్రైనింగ్ కాలాన్ని కూడా పూర్తి చేసుకొని సంతోషంతో తిరిగి వచ్చాడు. రైల్వే స్టేషన్ నుండే కావ్యను ఇంటికి తీసుకొని వెళ్తాడు.
తల్లిదండ్రులిద్దరూ సూర్య, కావ్యలకు హారతి పట్టడంతో అసలు ఏమి జరిగింది అనేది మనసులో సందేహం. లక్ష్మి కావ్యని తీసుకుని లోపలకి వెళ్లడంతో తన మనసులో ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు అన్నట్లుగా ఉంది. అయితే తండ్రి పక్కన కూర్చుని మీ వివాహం వచ్చే శుక్రవారం అని చెప్పడంతో ఒక పక్క ఆనందము మరోపక్క ఆశ్చర్యం! ఇది నిజమా! కలా? అనే సందేహంలో ఉండగా కావ్య అందరికీ కాఫీలు ఇస్తూ, ఈ విషయం మీకు చెప్పవద్దని మీ నాన్నగారు నా దగ్గర మాట తీసుకున్నారు. అందుకే మీకు చెప్పలేదు. క్షమించండి. అంటూ కాఫి ఇస్తుంది. రెడీ అయితే అందరం కలిసి బట్టలకు వెళ్దాం. అంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్లింది.
అవకాశం దొరికితే ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉత్సాహంతో ఉన్న సూర్య, కావ్యని షాపింగ్ కి వెళ్తూ తన మనసులో ఉన్న ప్రశ్నలన్నీ ఆపకుండా అడగడంతో నీవు ట్రైనింగ్ కి వెళ్ళిన తర్వాత ఒక నెల రోజులకు మీ అమ్మగారు మా ఇంటికి వచ్చి నాకు కాబోయే కోడలివి నీవే. ఎవరు ఎన్ని చెప్పినా నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం అంటూ మీ ఇంటికి తీసుకుని వెళ్ళింది. నా కొడుక్కి ఈ కావ్యే భార్య. దీనికి వ్యతిరేకిస్తే నా శవాన్ని చూస్తావ్ అంటూ నీ మీద ఉన్న పిచ్చి ప్రేమను వ్యక్తపరిచింది. మీ నాన్నగారు కూడా అప్పటివరకు పరువు గురించి ఆలోచించాడు. మీ అమ్మ మాటలకు తన అభిప్రాయం మార్చుకొని నన్ను తన కూతురిలా చూసుకుంటానంటూ మాట ఇచ్చాడు. మీ నాన్నగారు ఆ ఒకే ఒక్కమాటతో గొప్పవాడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు అని కావ్య చెప్పడంతో సూర్య సంతోషాలకు హద్దులు లేకపోవడంతో ఆరు రోజులు ఆరు సెకండ్ల లా గడిచిపోయింది. కోరుకున్న జీవితాన్ని పొందిన సూర్య, తన కుటుంబంతో కలసి ఉన్న కాలమంతా సంతోషంగా గడుపుతాడు. తనకి ముంబైలో పోస్టింగ్ రావడం వల్ల అక్కడికి తన కుటుంబాన్ని మారుస్తాడు.
4 comments:
Super master
Super
All the very best 💟
sir really i like a story this story touch my heart sir
this is your student YASWANTH SAI BBA 2022 from SSBN
sir really i like a story this story touch my heart sir
this is your student YASWANTH SAI BBA 2022 from SSBN
Post a Comment