అందరూ చెబుతూ ఉంటే ఏదో అనుకున్నా కానీ సముద్రపు ఒడ్డున రాత్రి పూట చుక్కల మధ్యలో నిండు చంద్రుడిని చూస్తుంటే ఏమి మజా! అందులోను ఇలా మిత్రులతో కూర్చొని పార్టీ చేసుకుంటూ చంద్రుడిని చూస్తుంటే మామ! జీవితం ఇక ఇక్కడే ఆగిపోతే బాగుండు అనిపిస్తుందిరా మామ! అరె బ్రహ్మం నీ ఫీలింగ్ ఏంది రా?
సముద్రాన్ని చూస్తుందే మొదటిసారి అందులోనూ పౌర్ణమి రోజున సముద్రాన్ని చూస్తుంటే కల కంటున్నానేమో..... ఒక అందమైన అమ్మాయి సముద్రం లోపలికి నడుచుకుంటూ........ ఒరే బ్రహ్మంగా నీకు మందు ఎక్కువ అయ్యింది రోయ్.
లేదురా మను, నిజంగానే అక్కడ ఎవరో అమ్మాయి కూడా మనలాగే సముద్రపు చంద్రుడిని చూడటానికి వచ్చింది మను. ప్రక్కన ఎవరైనా ఉన్నారా? అమ్మాయి ఒక్కర్తే ఇక్కడెందుకు ఉంటుంది రా? నువ్వే చూడు మను. అంటు కొంచెం తల ప్రక్కకు తిప్పుతూ రే....... ఆ పిల్ల ఎవరో చావడానికొచ్చిందిరోయ్. పద పద పరిగెత్తు ఆ పిల్లను కాపాడుదాం పద.
ఏయ్ అమ్మాయ్, ఏయ్ లోపలకి పోతే చస్తావ్ ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్న ఇద్దరిని చూస్తూ వారి మాటలు పట్టించుకోకుండా ఇంకా వేగంగా అడుగులు వేస్తూ అలలను దాటుకుంటూ వెళ్తుంది. బ్రహ్మం పరిగెత్తుతూ అరె మను చావడానికి కూడా పెళ్ళికూతురు లాగా రెడీ అవ్వాలా రా? రేయ్ వెధవ నాయాలా ముందు ఆ పిల్లను ఆపు. నేను పరిగెత్తలేను, కాపాడలేను, నువ్వే కాపాడుకో పో బ్రహ్మం ఆగిపోయాడు.
తెల్లని చీర ధరించిన ఆ అమ్మాయిని చూడగానే నేలకు జాలువారిన నెలవంక లా, నెమలి వంటి కన్నులు కలిగి, సన్నని నడుముతో నా కలలకు ఓ రాకుమారి లా ప్రాణం పోసింది అన్నట్టుగానే ఉంది అనుకుంటూ అలా చూస్తూ ఆమెని చేతుల్లో పట్టుకొని చూస్తూ ఒడ్డుకు చేరాడు. అప్పటికే అలల తాకిడికి నీటిని మింగి సృహ కోల్పోయిన ఆమెని ఆ పొట్టపై నొక్కుతూ మిగిలిన నీటిని కక్కించాడు. లేచిన ఆ అమ్మాయి నన్ను ఎందుకు రక్షించావంటూ మళ్లీ సముద్రంలోకి వెళ్ళిపోతున్న ఆమెను చెంప మీద ఒకటి పీకి కూర్చోబెట్టాడు.
ఏడుస్తూ కూర్చున్న ఆమెను నీవెవరు? ఎందుకు చనిపోవాలి అనుకున్నావు? అని అడుగుతూ ఉండగానే నా పేరు శరణ్య నేను హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నాను. నన్ను సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నానంటూ నరేష్ అనే వ్యక్తి వెంటపడుతూ ఉన్నాడు. నేను అతనిని కాదని తల్లిదండ్రులు చూసిన వివాహం చేసుకుంటున్నానని నకిలీ ఫోటోలను చూపిస్తూ, నా గురించి చెడుగా పెళ్ళికొడుకుకు చెప్పి వివాహాన్ని ఆపించి తల్లిదండ్రులకు, నాకు పరువు తీసేసాడు. బంధువుల మధ్య పరువు పోయాక ఇంకా ఎందుకు బ్రతికి ఉండాలి? బ్రతికి ఏమి సాధించాలి?
ఆమె మాట్లాడుతున్నంత సేపు చెవులు మాటలు వింటున్న మనస్సు మాత్రం ఆమె అందాన్ని చూస్తూ పక్కన ఏం జరుగుతుందో తెలియక లోకాన్ని మర్చిపోతున్న మనుతో బ్రహ్మం క్షణంలో పోయే ప్రాణాన్ని ఐతే కాపాడావు కానీ కొన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న పరువు ఎలా తెచ్చిస్తావు అని ప్రశ్నించగా మను ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు.
మను శరణ్యతో మొదటి చూపులోనే నిన్ను ఇష్టపడ్డాను. మేము హైదరాబాద్ లోనే ఉంటాము. మిత్రుడి వివాహం కోసం ఇక్కడకు వచ్చాము. నాకు సొంత కారు ఉంది. నేను అనాధ, నాకు ఎవ్వరూ లేరు. నాకు బ్రహ్మం ఒక్కడే. బ్రహ్మం కూడా సాఫ్ట్వేర్. నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పగానే మొదట తిరస్కరించింది. ఏదేమైనా ఆత్మహత్య పిరికితనం. చనిపోతే పోయిన పరువు తిరిగి వస్తుందా! రాదు కదా! బ్రతికి సాధించి చూపించాలి. మనుషులు కష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకుంటే భూమి మీద ఎవ్వరూ బ్రతికుండరు అని చెప్పి శరణ్యను కారులో ఇంటి దగ్గర వదిలి పెట్టి ఎప్పుడైనా చనిపోవాలంటే నాకూ ఫోన్ చెయ్. నేను కూడా జీవితంలో ఓడిపోయాను. ఇద్దరం కలిసి చనిపోదాము. అని వచ్చేస్తాడు. తను కూడా ఇంట్లో వారితో మాట్లాడి ఉదయాన్నే హైదరాబాద్ వచ్చేస్తుంది. మనుకి ఫోన్ చెయ్యాలని ఉన్నా సిగ్గుతోనో లేక ఏమనుకుంటాడో అనే ఫీలింగ్ తో ఫోన్ చేయ్యడానికి మనస్సు అంగీకరించలేదు. ఒక రోజు శరణ్య మనుకి ఈరోజు ఖచ్చితంగా ఫోన్ చేయ్యాలని నిర్ణయించుకొని ఆఫీసు నుంచి తొందరగా బయటికి వస్తూ ఉంటుంది. అది గమనించిన నరేష్ వెంటపడటంతో హడావుడిగా బస్సు ఎక్కేస్తుంది. తప్పించుకొని రూముకి వచ్చి చూసుకుంటే ఫోన్ కనపడదు. బస్సులోనే తొందరపాటులో పోగొట్టుకున్నానని గుర్తించి ఫొన్ చేస్తే స్విచాఫ్ వస్తుండటంతో, పోలీస్ స్టేషన్లో, బస్ స్టేషన్లో టికెట్ చూపించి జరిగిన విషయాన్ని చెబుతోంది. మంచిగా సంతోషంగా మను కి ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుంటే ఇలా జరిగింది ఏమిటి అని తలుచుకుంటూ ఏమి చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటుంది.
అలా రెండు నెలల తర్వాత ఒకసారి శరణ్య తన ఫ్రెండ్స్ అందరూ రెస్టారెంట్లో డిన్నర్ పార్టీకి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేస్తారు. వచ్చిన డ్రైవర్ని చూసి కొంచెం అనుమానం గా మను ఏమో అని అనుకుంటూ ఉంటుంది కారణం అతని మాట. కానీ గడ్డం పెంచుకుని చీకటిలో ఉండటం వల్ల దూరం నుంచి గుర్తించలేక పోతుంది. కారు ఎక్కుతూ మనుని చూసి ఆశ్చర్యపోతుంది. మను శరణ్య ని చూడకపోవడంతో ఫ్రెండ్స్ అందరితో కారు ఎక్కిన శరణ్య మనుతో ఏం డ్రైవర్ బాబు రౌడీలా గడ్డం పెంచుకున్నావు? లవ్ ఫెయిల్యూర్ రా? అని ప్రశ్నించగా మను అవునన్నట్లుగా ఒక చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు. అమ్మాయి ఎలా ఉంటుంది? అని ప్రశ్నిస్తూ ఉండగానే నేను మొదటి చూపులోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను ఆ అమ్మాయినే వివాహం చేసుకోవాలని అనుకున్నాను. కానీ అది జరగని పని. అని చెబుతూ అద్దం లో నుంచి వెనుక ఉన్న శరణ్యను అని చూస్తాడు. ఆనందంతో కారు పక్కన ఆపాలని అనుకుంటాడు కానీ అందరి ముందు మాట్లాడటం మంచిది కాదని రెస్టారెంట్ దగ్గరికి తీసుకు పోయి వదిలిపెడతాడు. శరణ్య తన ఫ్రెండ్స్ ని లోపలకు పంపించేస్తుంది.
నీ గురించి ఆలోచించి నిన్ను కలవాలని నీతో మాట్లాడాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నా ఫోను పోవడం వలన నిన్ను కలవలేక పోయాను అంటూ మనుని కౌగిలించుకొని పెళ్లి చేసుకుంటావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం జీవితాంతం నీలాంటి వాడు నాతో ఉంటే సంతోషంగా ఉంటుంది అని చెబుతోంది. "కలగా మిగులుతుందని అనుకున్న రాకుమారి కలయిక నేటికి నిజమాయే". అంటూ తన అంగీకారాన్ని కూడా తెలియజేస్తాడు. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకొని సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తారు.
1 comment:
Super keep it up
Post a Comment