Breaking

Sunday, November 30, 2025

ప్రతిశ్రుతిః

 1. प्रतिश्रुतिः इति पाठ्यभागस्य सारांशं लिखत।

                            अथवा

2. दीक्षितोक्तदिशा विवेकानन्दस्य उद्बोधकवाक्यानि विवृणुत।

कविपरिचयः - अयं प्रतिश्रुतिः इति पाठ्यभागः डा. दिवि नरसिंह दीक्षितेन विरचित वसन्ततिलका इति कवितासङ्कलन ग्रन्थात् सङ्गृहीतः।

కవిపరిచయము - प्रतिश्रुतिः అను పాఠ్యభాగము డా. దివి నరసింహ దీక్షితులు గారిచే రచించబడిన వసంతతిలకా అను కవితాసంకలన గ్రంథం నుండి స్వీకరించబడినది.

                                            స్వామి వివేకానందునిచే భోధించబడిన వాక్యాలను స్వీకరించి వారి సందేశమును యువకులకు  ప్రతిజ్ఞ రూపంలో వ్రాయబడినది. ఈ గీతము మాత్రా ఛందస్సులో వ్రాయబడినది. ప్రతిశృతి అను పదమునకు ప్రతిజ్ఞ అని అర్థము.

                                           प्रतिश्रुतिः नाम प्रतिज्ञा इत्यर्थः।

పాఠ్యభాగ సారాంశము - అందరము కలిసి ప్రగతి కోసము వివేకనందుని మార్గములో ప్రయణించుదాము. సువిశాల భారతదేశములో శాంతిని పెంచుటకై, మంచి జీవన అభివృద్ధికై, గొప్ప భావాలను పెంచుటకై, స్వరాష్ట్ర భక్తి కొరకు, స్వధర్మమునందు ఆసక్తి పెంచుటకై అందరము కలిసి వ్యర్ధమైన వినోదంలో మోహాన్ని విడిచి స్వీయ లక్ష్యమునందు శ్రద్ధ వహించి, సత్యమును పలుకుతూ గొప్ప ఆలోచనలు కలిగినవారిగా ప్రయణించుదాము.

                                            भवाम नित्यं वदाम सत्यम्।

                        ధృఢమైన మనస్సు, స్థిరమైన బుద్ధి, ధైర్యము కలిగిన వారై ఎల్లప్పుడూ సమాజానికి హితము చేయు సత్పురుషుల మార్గంలో ముందుకు సాగుదాము.

                                            सतां हि सुपथे समाजहितदे।

                        ఎల్లప్పుడూ స్వభావంలో సముద్రునితో సమానంగా, పరాక్రమంలో సింహం వలె, మహోద్యమంలో సూర్యునితో సమానంగా కాంతివంతులుగా వివేకపూర్ణులుగా ఉందాము.

                                            विवेकपूर्णाः भवाम नित्यम्।

                        శ్రామికులవలె పనులయందు ధైర్యము కలిగి, ఆసక్తిని కనబరిచి మన భాగ్యచక్రమును మనమే వ్రాసుకుందాం. ధనము, కీర్తి మరియు అధికారముల యందు కోరిక మంచిది కాదు. మంచి నడవడికతో చెడు కార్యాలను నాశనము చేయవచ్చు. 

                                            समापयाम दुष्करकार्यम्।

                            మనలోని హీనభావం, చేతగాని తనమును విడిచి నిస్వార్ధమైన బుద్ధితో, సుఖదుఃఖములయందు, ఆటపాటలయందు, రోజువారి జీవనం నందు ధీరులై నీతితో సాగుదాం. నిర్మలమైన మనస్సుతో ఆలోచనలు కలిగి చరాచర ప్రాణుల శ్రేయస్సును కోరకొనెదము.

                                            चराचराणां श्रेयस्कामाः।

                            వివేకముతో, మేరు పర్వతము వంటి ధీరత్వము కలిగి. నిబద్ధతతో, సముద్రపునీటిని పుక్కిటబట్టిన హనుమంతుడు, అగస్త్యుల వలె ఫలితము ఆశించక, స్వార్ధము విడిచి ప్రగతి పధమునందు పయనించెదము. ప్రపంచహితము కొరకు గొప్పవారి యందు విధేయతతో, పనియందు శ్రద్ధతో,  మంచి లక్ష్యాలను ఎన్నుకోని,  కలలో, మేల్కోలుపులో కూడా లోకకళ్యాణం కొరకు ఉద్యమించెదము. స్వార్థమును విడిచి, గొప్పవారిని సేవిస్తూ నవసమాజమును సృష్టించిదాని అభివృద్ధి కొరకు జయించు స్వభావాన్ని కలిగి ఉండెదము.

                                   विजेतृशोभां वहाम सततम्।

              ప్రగతి కొసమే అందరము వివేకానందును మార్గమును అనుసరించెదము.

No comments: