Breaking

Sunday, July 13, 2025

దయావాన్ రాక్షసః

 1.दयावान् राक्षसः इति पाठ्यभागस्य सारांशं लिखत।

                            अथवा

2. दयारामस्य दयागुणं परोपकारं च विवृणुत।

कविपरिचयः - दयावान् राक्षसः इत्ययं पाठ्यभागः आचार्य हर्षदेवमाधवेन विरचित बुभुक्षितः काकः इति कथासङ्कलनात् स्वीकृतः।

కవిపరిచయముః - दयावान् राक्षसः అను పాఠ్యభాగము ఆచార్య హర్షదేవ మాధవునిచేత రచించబడిన बुभुक्षितः काकः అను కథాసంకలనము నుండి స్వీకరించబడినది.

प्रस्तुतसारांशः - ఉజ్జయిని అను నగరమునకు దగ్గరలో విశాలమైన వనము ఉండెను. ఆ అడవి యందు విశాలమైన మర్రిచెట్ఠు ఉండెను. ఆ మర్రిచెట్టు తొర్రలయందు అనేక పక్షులు నివశిస్తూ ఉండెను. ఒకనాడు ఒక రాక్షసుడు నివసించడానికి అక్కడికి వచ్చెను. ఆ రాక్షసున్ని చూసి పక్షులన్ని ఆక్రోశంతో ఓయి రాక్షసా ! నీ పేరేమి? ఎక్కడి నుండి వచ్చావు? మేము ఇక్కడే నివాసముంటున్నాము.  మమ్ములను పీడించవద్దు. నీవు మరో ప్రదేశానికి వెళ్ళమని పలికెను.

                                      अस्मान् मा पीडया। त्वं गच्छ अन्यत्र।

                                రాక్షసుుడు ఆ పక్షులతో ఓ మిత్రులారా! ఓ బంధువులారా! నా పేరు దయారామ నన్ను చూసి భయపడవద్దు. నేను మిమ్మలను పీడించను అని పలికెను. ఆ మాటలకు పక్షులన్ని నవ్వి ఏమేమి నీ పేరు దయారాముడా! రాక్షసులకు దయ లేదు కదా! నీవు నిజం చెప్పు. నీ పేరేమి?

                                    राक्षसेषु दया न भवति। त्वं सत्यं वद। किं तव नाम।

                                అప్పుడు రాక్షసుడు అవును నిజమే. నా పేరు దయారాముడే. నేను ప్రాణులను చంపను.  జీవహింస చేయను. పరోపకారమే చేస్తాను. రోజుకు రెండుపూటలా పండ్లను మాత్రమే తిని, నీటిని మాత్రమే తాగుతాను అని పలికెను. పక్షులన్ని ఏమి నీవు సత్యమే చెబుతున్నావా? హింస చేయవా? నీవు మమ్ములను చంపవా? అని అడుగగా అవును నిజమే చెబుతున్నాను. మీరు ఆహారం కోసం వెళ్ళినప్పుడు మీ పిల్లలను కాపాడుతాను అని చెప్పెను.

                                    युष्माकं शावकान् अहं रक्षयिष्यामि।

                                    పక్షులు దయారామునితో నీవు ఎంత చెప్పినా మాకు నమ్మశక్యంగా లేదు. నీవు ఎక్కడి నుండి వచ్చావు? రాక్షసుడివైన నీవు సజ్జనుడిగా ఎలా అయ్యావో చెప్పమని ప్రశ్నించెను.

 दयारामस्य वृत्तान्तः - పూర్వము నేను దయలేని క్రూరుడిగా ప్రాణులన్నింటిని భయపెడుతూ హింసించే వాడిని. ఒకరోజు సుమతి అను ఋషిని తినడానికి వెంబడించగా అతను నాపై కమండలంలోని నీటిని చల్లెను. నేను రాయి వలె స్థిరంగా ఉండిపోతిని ఋషిని వేడుకొనగా నన్ను క్షమించి హింసను విడిచి అందరికి మేలు చేస్తూ, రామనామం జపిస్తూ ఉండమని నాకు దయారామ అని పిలిచెను. అప్పటి నుండి దయారాముడిగా జీవనం సాగిస్తూ ఉన్నానని పలికెను.

                                    దయారాముని మాటలు విని పక్షులన్ని నమస్కరించెను. దయారాముడు పక్షులతో మీరు ఆలోచించకుండా ఆహారం కోసం నిశ్చయంగా వెళ్ళవచ్చు. నేను మీ పిల్లలను రక్షిస్తాను అని మాట ఇచ్చి అక్కడే నివశిస్తూ పక్షులను రక్షించుచుండెను.

दयारामस्य दया हृदयः -  ఒకరోజు ఒక వేటగాడు( శాకునికుడు) పక్షులను చంపుటకు వచ్చెను. ఆ వేటగాడిని చూసి భయపడినవై పక్షులన్ని దయారాముడిని వేడుకొనగా అభయమిచ్చి చెట్టు పైకి ఎక్కిన ఆ వేటగాడిని చెట్టుపై నుండి క్రిందికి పడవేసి పక్షులను కాపాడెను. మరికొన్ని రోజులకి కిరాతకుడు నుండి జంతువులను రక్షించెను. ఆషాఢమాసమునందు వర్షాలు కురవక చెరువులు ఎండిపోయి ఆహారం దొరకక బాధపడతున్న సమయంలో  దూరంగా ఉన్నమేఘాలను తెచ్చివర్షం కురుపించడంతో దయారాముడు పూజనీయుడయ్యెను.

                                               दयारामः सर्वेषां प्रियः अभवत्।

 కట్టెలు కొట్టే వారి నుంచి చెట్లను,పెద్దపులి నుండి జంతువులను రక్షించెను. 

                            ఒకసారి సప్తదశశృంగుడు అను 17 కొమ్ములు, 9 తలలు కలిగిన ఒక రాక్షసుడు మరి కొంతమంది రాక్షసులతో వచ్చి దయారామునితో నీవు బ్రతికుండవలెనంటే ఇక్కడి నుండి వెళ్ళిపొమ్మని, ఇక్కడి జంతువులు నా ఆహారమని పలికెను. దయారాముడు కోపంతో ఇక్కడి పశుపక్షాదులు తన మిత్రులని వాటిని చంపాలంటే నాతో యుద్ధము చేయమని అని పలికెను.

                                            सर्व प्रथमं मया सह युद्धं  कुरु।

వారిరువురి మధ్య జరిగిన యుద్ధంలో రాక్షసుడు మరణించడం, దయారాముడు తీవ్రమైన రక్తగాయాలతో పడిపోయెను.

शिवस्यानुग्हः - సమస్త ప్రాణులు దయారాముని చుట్టూ చేరి ఏడుస్తూ ఈశ్వరున్ని ప్రార్థించెను. శివుడు ప్రత్యక్షమై పుత్రా! దయారామా నీవు చేసిన మంచి పనులకు దైవత్వము ప్రసాదించుచున్నాను అని పలికి నాతో స్వర్గానికి రమ్మని కోరెను. దయారాముడు ఈ వనమునందలి పక్షులు, ప్రాణులు నాకు బంధువులు. వీటిని విడిచిపెట్టి రాలేను అని పలుకగా శివుడు సంతోషించి భూమి మీదనే ఉండుటకు వరమును ప్రసాదించెను. పశుపక్షాదులు దయారామున్ని ప్రార్థించెను. అప్పటినుండి దయారాముడు ఆ వనమున నివశిస్తూ వనమును, ప్రాణులను రక్షించుచండెను.

                            वने किञ्चिदपि सङ्कटं  न आगच्छत्।

No comments: