పూర్వం దక్షిణ భారతదేశంలో ఋష్యమూక పర్వతానికి దగ్గరగా ఉన్న ఒక గురుకులంలో దక్షిణ అనే గురువు ఉండేవాడు. అతడు అస్త్ర శస్త్ర విద్యతో పాటుగా మర్మకళను కూడా నేర్పించడంలో నైపుణ్యం కలవాడు. ప్రతిరోజు తన శిష్యులను సూర్యోదయానికి ముందే నదీ స్నానానికి తీసుకుని వెళ్లి సూర్య నమస్కారాలు పూర్తిచేసుకొని వచ్చిన తర్వాత వేద విద్యా పఠణం, దైవారాధన పూర్తయిన తర్వాత, అస్త్ర శస్త్ర విద్యలను, ఆ తర్వాత తన శిష్యులకు కథని చెప్పి నీటిని తెలియజస్తూ ఉండేవాడు. ఇది ఆ గురువు యొక్క దినచర్య.
అయితే దక్షుడు అక్కడ ఉన్న శిష్యులు కొంతమంది విద్యాభ్యాసం పూర్తి చేసుకున వెళ్లే సమయంలో మంచి మిత్రులు అయిన రుద్రసేనుడు, నందుడితో పాటుగా మరికొందరు శిష్యులను పిలిచి ఇప్పటివరకు మీరు కేవలం తెలివితేటలను మాత్రమే పొందారు. కానీ ఇప్పుడు మీ తెలివితేటలను ఆచరణలో పెట్టవలసిన సమయం ఆసన్నమైంది. మీరు క్షణంలో తీసుకునే ఆలోచన మీ రాజ్య ప్రజల సుఖసంతోషాలకు లేదా బానిసత్వానికి కారణం అవుతాయి అని వివరిస్తాడు. రుద్ర సేనుని కి తోడుగా నందున్ని పంపుతాడు. దానికి కారణం ధనం మీద ఆశ లేక పోవడం, మంచి తెలివిగలవాడు, ఇంకా చెప్పాలంటే రుద్రునితో నందునికి ఉన్న స్నేహం ఇవన్నీ కారణాలు.
శాంత స్వభావుడు అయిన రుద్రసేనుడు రాజ్యానికి రాజు అయిన తరువాత నందుడిని మంత్రి గా చేసుకుని రాజ్యాన్ని పరిపాలిస్తూ రుణం అంటే మరణం అని భావించి సాధ్యమైనంతవరకు స్నేహభావంతో ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. తన తెలివితేటలను ఉపయోగించి సామంత రాజ్యాలను ఏర్పాటు చేసుకుంటాడు. కొన్నాళ్లు మంచిగానే ఉన్నా ఆ తర్వాత సామంత రాజులందరూ మంచితనాన్ని చేతగాని తనంగా భావించి రుద్ర శీను డి రాజ్యాన్ని జయించాలని కోరుకుంటారు. కానీ రుద్రసేనున్ని ప్రత్యక్షంగా జయించడం కష్టం కావున అందరు యుద్ధం చేయాలి అనుకుంటారు.
దానికోసం రుద్ర సేనుని రాజకోట విషయాలను, రహస్యాలను తెలుసుకోవాలని సామంత రాజులు గూఢచారికి ధనం ఆశగా చూపించి వారి వశం చేసుకుంటారు. ఆ తరువాత సైన్యాలను సొరంగ మార్గాల ద్వారా రాత్రిపూట రాజ కోటలోకి ప్రవేశింపచేస్తారు. సామంత రాజుల ఆలోచనలు ముందే రహస్య గూడచారి ద్వారా తెలుసుకొన్న నందుడు రాజుని రక్షించుకోవడం కోసం మారువేషాలు ధరించి రాజమందిరం నుంచి బయటపడతారు. తిరిగి విద్య నేర్పిన గురువు దగ్గరికి చేరుకుంటారు. జరిగిన విషయాలను తెలుసుకున్న గురువు తాను చెప్పిన మాటలు రుద్రుడు గ్రహించిన విధానాన్ని తెలుసుకుని సంతోషపడతాడు. కానీ తాను యుద్ధం చేయవద్దు అని చెప్పలేదు అని చెప్తాడు. నీవు రాజ్యాన్ని విడిచిన తర్వాత నీ రాజ్య ప్రజలు కష్టాలకు లోనవుతారు. నీచమైన దారుణాలకు కూడా వెనుకాడరు అని గురువు తెలియచేస్తాడు.
నందుడు మాత్రం బాధతో ఉన్న రుద్రసేనుని ఓదార్చుతూ ఇప్పటివరకు మీ పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇకపై కూడా అలా ఉండాలంటే తిరిగి రాజ్యాన్ని చేయించాలి మన దగ్గర సైన్యం లేదు కానీ మన చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలను సైన్యం గా చేసుకొని జయించాలి అని చెబుతాడు. అయితే గురువుని వశీకరణ అనే విద్యను నేర్పించమని నందుడు ప్రాధేయపడతాడు.
ఆ తర్వాత ముగ్గురు కలిసి, ఉన్న సైన్యాన్ని మూడు విధాలుగా విభజించి త్రిపథ అనే పద్ధతి ద్వారా దక్షుడు తన సైన్యాన్ని రాజ కోటలోకి వెనకనుంచి ప్రవేశించాలని ప్రయత్నిస్తారు. సెక్స్ నందుడు సొరంగ మార్గాల ద్వారా రాచ కోటలోకి ప్రవేశిస్తాడు. ఇక తన సైన్యంతో ఎదురుగా పోరాడటం ప్రారంభిస్తాడు. గురువు సామంత రాజుల కదలికలను ఎప్పటికప్పుడు పావురాల ద్వారా సందేశాన్ని పంపిస్తూ సైన్యాన్ని ముందుకు నడిపిస్తూ కేవలం మూడు నెలల కాలంలో తను పోగొట్టుకున్న అతి విశాలమైన సామ్రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవడంలో సహాయపడతాడు.
ఆ తరువాత గురువు ఇద్దరు శిష్యులతో పెద్దలు చెప్పిన మాటల్లోని భావాలను ఎవరికి నచ్చినట్లుగా వారు వారికి అనుగుణంగా మార్చుకోవడం వలన అనర్థలు ఏర్పడతాయని తెలియజేసి యుద్ధం వలన రాజులకు నష్టమే తప్ప లాభం తక్కువ అని తెలియ చేసి వారిద్దరికీ పక్క రాజ్యాల కుమార్తెలను ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఆ తరువాత నిరంతరాయంగా మూడు సంవత్సరాల పాటు యుద్ధం చేసి శత్రువులు లేనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటారు.
యుద్ధం చేయాలి కానీ ప్రతిసారి యుద్ధం చేస్తే అది ప్రాణాలకు ముప్పు. యుద్ధం కేవలం రాజ్య ప్రజల సుఖ సంతోషాలకోసం మాత్రమే చేయగలిగేవాడు నిజమైన రాజుగా గ్రంథాల్లో చెప్పబడింది. అందుకే అర్థశాస్త్రంలో ప్రజల సుఖాన్ని తన సుఖం గా భావించే వాడే రాజు అని చెప్పబడింది.
1. మిత్రులకు ఒక విన్నపం. క్రింద వచ్చిన గంట గుర్తు నొక్కితే నా బ్లాగు నుండి వచ్చే ప్రతి ఆర్టికల్ గాని, కథ గాని నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది.
2. ఈ కథ గాని లేదా ఆర్టికల్ గాని క్రింద ఉన్న వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా మిత్రులకు పంపవచ్చు.
3. నా బ్లాగ్ లోని మంచిచెడులను కామెంట్ రూపంలో తెలియజేయగలరు.
No comments:
Post a Comment