Breaking

Tuesday, September 22, 2020

ప్రయాణం ఎందరి జీవితాలనో మారుస్తుంది

     


                 సినిమాల్లో తొలిచూపులోనే ప్రేమించాను అంటారు. నిజంగా జరుగుతుందో లేదు తెలియదు కానీ కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అవును నిజమే అనిపిస్తాయి దానికి ఉదాహరణ ఈ ప్రయాణం

                               రాజశేఖర్ (30) తన తల్లితోపాటు హైదరాబాదులో నివాసముంటున్నాడు అతను రుద్ర యాడ్ ఏజెన్సీలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తూ తక్కువ కాలంలోనే మంచి పేరును, సొంత ఇంటిని సంపాదించుకున్నాడు. రాజశేఖర్ యొక్క మేనేజర్ మల్లికార్జున్ (34) ఇద్దరు రెండు సంవత్సరాల వ్యవధిలో ఉద్యోగాన్ని ప్రారంభించి హైదరాబాదులోని తమ సంస్థ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రను పోషించారు. రాజశేఖర్ సరైన బడ్జెట్ని, యాడ్ని రూపొందించడానికి కావలసిన సమయాన్ని లెక్కించగలడు. ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన యాడ్ హైదరాబాద్ కార్యాలయానికి వచ్చిందని డైరెక్టర్లు తెలుసుకుని ప్రధాన కార్యాలయం  ముంబాయికి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లను విందుకు ఆహ్వానిస్తారు. 

         ఇద్దరూ ముంబై వెళ్లి కార్యాలయంలోని డైరెక్టర్ల సమక్షంలో విందుని స్వీకరించి వారి హోటల్ గదికి తిరిగివస్తారు. అయితే మల్లికార్జున్ కోరిక మేరకు తర్వాత రెండు రోజులు ఆఫీసుకి సెలవు కావడంతో అక్కడి నుండి గోవా వెళ్లి సోమవారం ఉదయానికి హైదరాబాద్ చేరుకోవాలని అనుకుంటారు. దానికోసం ముంబై నుంచి గోవాకి క్రూజర్లో వెళ్లడానికి టిక్కెట్లు సిద్దం చేసి రాజశేఖర్ కి ఆశ్చర్యాన్ని కలుగచేస్తాడు. 

                 ఇద్దరు క్రూజర్లో ప్రయాణం చేయడం మొదటిసారి. అందులోనూ రాజశేఖర్ ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఆనందంతో ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి. తన లగేజీని గదిలో పెట్టి పైన ఉన్న ఓపెన్ టాప్ లోకి వెళ్లి సూర్యాస్తమయాన్ని చూస్తూ అలాగే కూర్చొని  తాను జీవితంలో సాధించాలి అనుకున్నవి, సాధించినవి, సాధించలేక పోయినవి తలుచుకుంటూ ఉండిపోయాడు. అంతలో మల్లికార్జున్ సంతోషంతో  సాఫ్ట్ డ్రింక్ ఇచ్చి ఇప్పటివరకు మన బ్రాంచ్ విజయానికి నీవే కారణం అని, ఇకనుంచి నీవే నా ప్రధానమిత్రుడివి అని తెలియజేస్తాడు. దానికి సమాధానంగా అది మీ గొప్పతనం, ఇప్పటివరకు ఎప్పుడూ పొందని ఆనందాన్ని మీరు నాకు కలగచేశారు.ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్తాడు. అతని మాటల్లో సంతోషం ఉన్నా, ఏదో తెలియని బాధ కనబడుతుంది దానికి కారణం ఏమి అని అడుగుతాడు మల్లికార్జున్.

                                  వారిది మాచర్ల ప్రక్కన ఒక చిన్న పల్లెటూరు అని చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో, తల్లి కూలి పనిచేసి చదివించడంతో ఎం.బీ.ఏ పూర్తి చేశానని, కావున తల్లి సంతోషంగా ఉండాలని కోరుకుని, ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకున్నాను అని చెప్తాడు. మల్లికార్జున్ వివరణ కోరగా ఎంబీఏలో చేరడానికి హైదరాబాద్ కి బస్సులో వస్తుండగా చిరునవ్వుల చిన్నారిని ఆడిస్తూ కళ్ళతోనే కాంతులను ప్రసరిస్తూ, చిరునవ్వుతో నవరత్నాలను వెదజల్లుతున్న అందాలరాశిని మొదటిసారిగా చూశాను. కానీ అదృష్టం కొద్దీ అందాలరాశి కూడా తన కాలేజీలోనే ఎంబీఏ చేయడానికి రావడం, ర్యాగింగ్ సమయంలో తన పేరు కావ్య అని తెలిసింది. ఒకే కాలేజ్, ఒకేవైపు ప్రయాణం కావడంతో సంవత్సరకాలంలో పరిచయం పెరిగింది. తను ధనవంతుల అమ్మాయి అయినప్పటికీ ఎటువంటి అహంకారం లేకుండా నాతో జీవితాన్ని పంచుకోవాలని అనుకుంది కానీ నేను నా మనసులో ప్రేమ ఉన్నా బయటికి చెప్పలేక ఇద్దరి మధ్య ధన వ్యత్యాసాన్ని చూపించి మరిచిపొమ్మని కోరాను. అప్పటినుండి ఇప్పటివరకు తను ఎలా ఉంది? ఎక్కడ ఉంది కూడా తెలియదు ఫోన్ నెంబర్లను మార్చింది అటువంటి గొప్ప మనోభావాలు కలిగిన స్త్రీని వదులుకొని ధన సంపాదనే లక్ష్యంగా బ్రతికాను గెలిచాను, కానీ తన విషయంలో ఓడిపోయాను అని రాజశేఖర్ చెప్తాడు. అలా రాజశేఖర్ స్మృతులను వింటూ ఆ రెండు రోజుల కాలాన్ని సంతోషంగాా గడిపి హైదరాబాద్ చేరుకున్నార

                  మల్లికార్జున్ తన మిత్రునికి వివాహం చేస్తే గతాన్ని మరిచి సంతోషంగా ఉంటాడని నిర్ణయించుకుని ఒకరోజు పెళ్లిచూపులకి తీసుకొని వెళ్తాడు. ఇష్టం లేకపోయినా మిత్రుడి కోసం వచ్చిన రాజశేఖర్ పెళ్లి కుమార్తెను చూడకపోవడంతో పెళ్లి కుమార్తె మాట్లాడాలి అని చెప్పి గదిలోకి వెళ్తుంది. గది లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న మల్లికార్జున్ ఫోటో చూసి  తన మిత్రుని ఇంటికి వచ్చాను అని మరి అక్కడ ఉన్నా పెళ్లి కుమార్తె ఎవరు అని చూస్తే  తనను ప్రేమించిన కావ్య అనే విషయం తెలుసుకుంటాడు.

                     అంతలో మల్లికార్జున్ తన భుజం తడుతూ ఇప్పటివరకు నా చెల్లెలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పింది కానీ ప్రేమించానని మాట చెప్పలేదు అదృష్టం వలన నీ మాటల ద్వారా నా చెల్లెలు మనసులోని ప్రేమను తెలుసుకున్నాను అని చెప్పి వారిద్దరికీ వివాహం చేస్తాడు. 

            ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలను పంచుకోవడం వలన జీవితం మలుపు తిరిగింది.

1. మిత్రులందరికీ ఒక విన్నపం. క్రింద వచ్చే గంట గుర్తు ను నొక్కడం వలన నా బ్లాగ్ నుండి వచ్చే ఆర్టికల్ గాని, కథ గాని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.

2. ఈ ఆర్టికల్ప్ ను వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వార మీ మిత్రులకు పంపవచ్చు.

3. ఈ బ్లాగ్ లోని మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

1 comment:

Unknown said...

Manasu manchidi prayanam manchidi jivitham abdutham maro janama antu untey nanuumanavuni La pattinchu swami okey jivitham naku saripoledu Mari jivathani eoutdanthaga chakkaga ala ala konasagisthupothanu 🙏