Breaking

Saturday, January 30, 2021

సంచలనం 10వ వారం

                   సంచలనం 9వ వారానికి సంబంధించిన కథను చదవాలనుకుంటే ఈ క్రింది లింకును నొక్కండి.

https://www.manakathalu.in/2021/01/9.html


                    అనిల్ రెండు, మూడు రోజులు తన భార్య శరణ్య చెప్పిన మాటలు బాగా ఆలోచించి నిజమే నారాయణ పట్టణానికి వెళ్తున్నట్టుగా ఎవరికి చెప్పాడు?  అనే విషయం కనుక్కోమని కానిస్టేబుల్ కి ఫోన్ చేసేలోపే ఇంకొక ఆలోచన అసలు ఆ రోజు ఎవరిని కలిశాడు. ఇవి తెలుసుకోవాలంటే కానిస్టేబుల్ వల్ల అవుతుందా! కాదా! నేనే స్వయంగా అక్కడికి వెళ్తే ఆ విషయాలను సాధ్యమైనంత త్వరగా తెలుసుకుంటాను కదా! మరి తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఆలోచించి తన భార్యకు చెప్పగా ముందు విషయం కనుక్కోండి. తర్వాత మీరు వెళ్ళండి లేదంటే మీ సెలవులు వృధా అవుతాయి. మళ్ళీ సెలవులు కావాలన్నా దొరకవు అని చెప్పగా ఇష్టం లేకపోయినా అనిల్ కానిస్టేబుల్ కి ఫోన్ చేస్తాడు.

       ఫోన్ లో అనిల్ అని తెలియగానే కానిస్టేబుల్ నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నాకు దొరికిన ఆధారం  ఒక చిన్న బంగారపు గుండి కానీ అది  కేవలం ధనవంతులు మాత్రమే వారి చొక్కాకు ధరించగలరు. అంటే ఎవరో ధనవంతులు కావాలనే కాపు కాసి ఈ హత్య చేశారు. అని చెప్పగానే  నా మిత్రుడు, మిత్రుడి భార్య వాళ్లు మరణ సమయంలో అనుభవించిన బాధ ఈ క్షణం బ్రతికి ఉండి నేను అనుభవిస్తున్నాను. అని చెబుతూ ఇంకా ఏమైనా ఆధారాలు దొరికాయా? అని అడుగగా ఇంకేమీ ఆధారాలు దొరకలేదని కానీ సాధ్యమైనంత త్వరగా ఈ హత్య వెనుక ఉన్న రహస్యాలను మీకు తెలియచేస్తాను అతని సహాయంతో ఎదిగిన నేను మీకు త్వరలో శుభవార్త తెలియచేస్తానని కానిస్టేబుల్ చెబుతాడు. దానికి సమాధానంగా ఆధారాలు ఇంకా  ఏమైనా దొరుకుతాయేమో త్వరగా శోధించు  అని మనసులో అనుకున్న విషయాలను చెప్పి నేను నా మిత్రున్ని చంపిన ఆ రాక్షసుణ్ణి నా చేతితో నేనే అంతం చేయాలని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

                  అనిల్ మనస్సు ఆధీనంలో లేక పదే పదే మిత్రుడి మరణం గురించి ఆలోచిస్తూ, మద్యాన్ని సేవిస్తూ బాధ తట్టుకోలేక తనలో తాను కుమిలిపోతూ, పనిచేయలేక  రాత్రంతా నిద్రలో పెద్ద పెద్దగా తన మిత్రుడి పేరుని పలుకుతుంటే భార్య వచ్చి అనిల్ ని నిద్ర లేపి ఏమైంది నీకు నిన్ను చూసి పిల్లలు భయపడతారు అని భార్య మందలిస్తుంది.  ఏదేమైనా సరే సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి నేను మన ఊరు వెళ్లాలని చెబుతాడు. సరే నీకు నచ్చింది చేయమని భార్య సలహా ఇస్తుంది. కానీ నేను సెలవు పెట్టుకుని ఊరికి వెళ్లినట్లు ఎవరికీ తెలియకూడదు. 

                      ఆ మాటలు విన్న తర్వాత శరణ్య తన భర్తతో నీవు మన ఊరిలో వాళ్లకి, కానిస్టేబుల్ కి, ఎవ్వరికి  తెలియకుండా వారికి దగ్గరలో ఉండేలా జాగ్రత్తపడాలి. ఎందుకంటే విజయ,నారాయణల మరణం వెనుక ఎవరున్నారో తెలియదు. పోలీసులు మూసేసిన కేసును కేవలం ఒకే ఒక్క ఆధారంతో నీవు హంతకుడిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు. కాబట్టి దీనివల్ల ప్రమాదం ఎవరికి జరుగుతుందేమో చెప్పలేము అంతేకాక ఎవరినీ కూడా నమ్మలేము కావున ముందుగా నీవు పట్నంలో ఎప్పుడూ కలిసే మిత్రులు కాకుండా మరేవరి దగ్గరైనా ప్రత్యేకమైన ఇల్లు తీసుకొని నీవు ఒక్కడివే ఉండు అని చెప్తుంది. అన్ని విని తన భార్య మంచితనాన్ని, తెలివిని  మనస్సులో పోగుడుకుంటూ, తనకి సహాయం చే‌సే మిత్రులు ఎవరున్నారని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటాడు.

      మరుసటిరోజు ఉదయం ఆఫీసుకి వెళ్లి సెలవు అడుగగా తన పై ఆఫీసర్ సెలవులు ఎక్కువగా పెడుతున్నావు ఇప్పటికే సెలవులు అయిపోయాయి. సెలవులు లేవు అని నిక్కచ్చిగా చెప్పడంతో ఏమి చెయ్యాలి? ఎలా వెళ్ళాలి ? మన ఊరి దగ్గర ఎవరు సహాయం చేస్తారు? ఈ విధమైన ఆలోచనలతోనే బుర్ర వేడెక్కిపోతుంది. మరోపక్క తనమీద తనకే అసహ్యము. ఒక్కో క్షణం యుగం కన్నా దారుణంగా తిరుగుతుంది. నా సమస్యలకు పరిష్కారం చెప్పేదెవరు? హంతకుడిని పట్టుకునేది ఎప్పుడు?  నాకు ఇది సాధ్యపడుతుందా? ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగానే తనతో పాటు పనిచేసే ఉద్యోగి అనిల్ ని పలకరించినా పలుకక పోవడంతో, అనిల్ భుజం మీద చెయ్యి వెయ్యగానే ఉలిక్కిపడటంతో ఏమి ఆలోచిస్తున్నావు? ఎప్పుడు ఇంత తీవ్రమైన పరధ్యానంలో ఉండటం నేను చూడలేదు. ఈ రోజు ఏమైంది?   అని ప్రశ్నిస్తాడు.     

                    తనతో పనిచేసే వాడే అయిన ఎప్పుడు సొంత విషయాలు ఎక్కడ ప్రస్తావించని అనిల్ చెప్పాలా? వద్దా? చెబితే అందరికీ తెలిసిపోతుందేమో అనుకుంటూ కొన్ని నిమిషాలపాటు మౌనంగానే ఉండిపోతాడు. అంతలో మీ అమ్మగారు స్వర్గీయులు అయ్యారని విన్నాను. అందువల్ల నీవు ఇలా ఉన్నావేమో? తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు. కానీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిన వారిని గురించి ఆలోచించుకుంటూ, గతాన్ని గుర్తు చేసుకుంటూ నువ్వు బాధ పడుతూ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం సరికాదు కదా! ఒకసారి ఆలోచించుకో మని చెప్పి, ఏమైనా అవసరమైతే నేను సహాయపడగలను. నేను మీ ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో  ఉన్న  మా మామయ్య గారి ఇంట్లో చదువుకున్నాను. ఈ విషయం నీకు ఇంతకముందు కూడా చెప్పాను  కాబట్టి ఊర్లో సమస్య అయినా ఇక్కడి సమస్యే అయినా నాకు చేతనైన సహాయం చేయగలను అనే గట్టి నమ్మకం నాకుంది. ఆ మాట వినగానే ప్రాణం లేచి వచ్చింది కానీ చెప్పలేక నవ్వుతూ అక్కడి నుండి ఇంటికి బయలు దేరుతాడు.(వచ్చేవారం మళ్ళీ కలుద్దాం).


 

No comments: