Breaking

Saturday, February 13, 2021

సంచలనం 11వ వారం

                                      సంచలనం 10వ వారం కథను చదవాలనుకుంటే ఈ క్రింది లింకును నొక్కండి.

https://www.manakathalu.in/2021/01/10.html


              ఆఫీసులో సెలవులు లేవని నిక్కచ్చిగా చెప్పిన విషయాన్ని, తనతో పనిచేసే ఉద్యోగి రవి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఇంటికి బయలుదేరగా వెనుకనుంచి కారు హరన్ కొడుతున్నా పట్టించుకోక రోడ్డు దాటబోతాడు. అంతలో పక్కనుంచి ఎవరో లాగేసరికి ఏమైందో తెలియక బిత్తర మొహంతో అటు ఇటు చూడగా రవి మళ్ళీ అదే ప్రశ్న. ఏమైంది నీకు? ఏమి ఆలోచిస్తున్నావు? నాకు చెప్పమని గట్టిగా అడిగే సరికి నీళ్లు నిమురుతూ ముందుకు అడుగులు వేసాడు. ఇలా కాదని రవి అనీల్ ని  తన ఇంటికి తీసుకెళ్ళి భార్యని పరిచయం చేస్తూ ఒక ప్రమాదంలో తన భార్య కాలు విరిగిందని, దానికి బాధ పడటం లేదని ప్రాణాలు దక్కినందుకు సంతోషపడుతున్నాను అని చెప్తాడు. 

                  రవి అనీల్ తో కష్టాలు ఎప్పుడూ ఉండవు. కష్టం వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కున్న వాడే సంతోషాన్ని పొందగలడు. ఈ భూమి మీద కష్టం లేని మనిషి లేడు. అయినా కష్టాలు వచ్చినప్పుడు మనిషికి మనిషి సహాయం చేసుకోవాలని అందుకే దేవుడు స్నేహితులని ఇచ్చాడని చెబుతూ ఉండగానే అనీల్ తన మిత్రుడైన విజయ,నారాయణల మంచితనం గురించి, మరణం గురించి ఎవరో కావాలని చేశారని కానీ పోలీసులు ఆ కేేేసుని క్లోజ్ చేశారు అని అనీల్ చెప్పగా రవి వెంటనే మీకు ఎవరి మీదైైనా అనుమానం ఉందా? అని ప్రశ్నించగా ఎవరి మీద అనుమానం లేదని సమాధానం ఇస్తాడు.  ఎవరికి అతను హాని తలపెట్టేవాడు కాదు. అతను డబ్బులు తీసుకురావడానికి పట్నానికి వెళ్లిన విషయం కూడా ఎవరికీ తెలియదు. మరి ఎలా జరిగిందనేది అర్థం కావడం లేదు. అంతేకాక మాకు అక్కడ ఒక బంగారపు గుండి దొరికింది. అంటే ఎవరో ధనవంతులు కావాలనే చేశారని నా అనుమానం.

             రవి ఆ ఊరిలో ఉన్న పెద్ద మనుషుల గురించి, నారాయణ చనిపోయిన తరువాత జరిగిన విషయాల గురించి ప్రశ్నించగా ఊర్లో పెద్దలందరూ చెప్పగా పాల డైరీని కాంతారావుకి అమ్మేసామని,  కాంతారావుకు ఎందుకు అమ్మాలి ఆ డైరీని కొనే సామర్థ్యం మరెవరికి లేదా? అతను ఏమి చేస్తుంటాడు? అని ప్రశ్నిస్తాడు. ఆ డైరీని కొనడానికి చాలామంది ముందుకు వచ్చారు. కానీ పెద్దమనుషుల అభిప్రాయం మేరకు, అంతేకాక కాంతారావు అధిక ధనం ఇవ్వడానికి ముందుకు రావడంతో అతనికి అమ్మడం జరిగిందని, అతను ఊరిలో పెద్ద భూస్వామి, ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ, పురుగు మందుల వ్యాపారం చేస్తూ ఉంటాడు అని  వివరించగానే కాంతారావుకు చొక్కాకు బంగారు గుండి ధరించే అలవాటు ఉందా? అని ప్రశ్నిస్తాడు. కాంతారావుకు హత్య చేయాల్సిన అవసరం లేదు. బంగారపు గుండి ధరించడం నేను గమనించలేదు అని చెప్తాడు. సరే నాక్కూడా కొంచెం సమయం ఇవ్వు. దాని గురించి ఆలోచిస్తాను నువ్వు ముందు ఆలోచించడం, బాధపడటం మానేసి ధైర్యంగా ఉండమని చెప్పి అనీల్ ని వాళ్ల ఇంటి దగ్గర దిగబెట్టి వస్తాడు.

                     ఇంటికి వచ్చిన తర్వాత రవి తన మేనమామకు ఫోన్ చేసి కాంతారావు గురించి కనుక్కోగా కాంతారావుకి చిన్నప్పటి నుంచి ధనం మీద ఆశ కలిగినవాడే. వారిది మన ఊరే కానీ తండ్రి చనిపోయిన తర్వాత కృష్ణపట్టణానికి వెళ్లి చిన్న పురుగుమందుల కొట్లో పని చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత పురుగు మందులషాపు యజమాని కూతురుని ప్రేమించి  వివాహం చేసుకొని ఆ అమ్మాయికి పిల్లలు పుట్టకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మొదటి భార్య పిల్లలు పుట్టలేదని బావిలోకి దూకి చనిపోయిందని చెప్పారు. కానీ వాస్తవానికి కాంతారావు చంపించాడని జనాలందరికీ తెలుసు. అతనికి ఎదురు తిరిగినా, వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినా ఎవరికీ ఉపయోగం లేదని పోయిన ప్రాణం తిరిగిరాదని దానివల్ల కష్టాలే తప్ప లాభంలేదని వదిలేశారు. ఇప్పుడు కాంతారావు అనుభవించే ఆస్తి మొత్తం కూడా మొదటి భార్యదే. అయినా ఇదంతా ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఇప్పటి వాళ్ళకి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు.  అతని గురించి నీకు ఏమి పని? ఎందుకు అడుగుతున్నావు? అని అడుగగా నేను మరో వారం రోజుల్లో ఇంటికి వస్తాను వచ్చిన తరువాత వివరంగా మాట్లాడతాను అని ఫోన్ పెట్టేస్తాడు

                     హరికి కూడా బదిలీ రావడంతో పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ను కలిసి వారితో మాట్లాడి వారు కూడా వెళ్ళవద్దని చెప్పినా పిల్లల చదువుకి పట్టణంలో అయితే బాగుంటుందని చెప్పి ఇప్పటివరకు సహకరించినందుకు  ధన్యవాదాలు తెలియచేసి సర్పంచ్ ఇంటికి వెళ్లి ఇవ్వవలసిన డబ్బును ఇచ్చి అడగగానే లేదనకుండా ఒక్కరోజులో 10 లక్షలు ఇవ్వడం గొప్ప విషయం. కేవలం నా మీద నమ్మకం తోనే ఇంత ధనాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీకు ఋణపడి ఉంటాను అని పలుకగా నేను నిన్ను నా సోదరుడుగా భావించాను. నీలాంటి ప్రతిభావంతుడు మా గ్రామానికి దొరికిన అదృష్టం ఎవరూ చేయలేని పని ఒక ఉపాధ్యాయుడు చేయగలడు అని చేసి చూపించావు. మీకు ఏ సహాయం కావాలన్నా నేను ఉన్నాను. నీవు మా ఊర్లోనే, మా పాఠశాలలోనే ఉంటే మా గ్రామానికి పేరుప్రఖ్యాతులు వస్తాయని నాకు నమ్మకం ఉంది. మీరు మళ్లీ ఈ పాఠశాలకు పదోన్నతితో రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను (ఇంకా ఉంది).



              మీలో ఎవరైనా సంస్కృతం నేర్చుకోవాలి అనుకున్నా, మీ ఇంట్లో ఎవరైనా ఇంటర్, డిగ్రీ లో సంస్కృతం చదివేవాళ్ళు ఉన్నా మీరు YouTube లో Dr.pusapati ravikantha reddy   అను ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి.



 

No comments: