"ఇందుమతీ స్వయంవరం" అను కథ కాళిదాస మహాకవి చేత రచించిన రఘువంశం లోని ఆరవసర్గ నుంచి స్వీకరించబడినది.
ఎక్కడెక్కడినుంచో రాజులు విదర్భ రాజకుమారి ఇందుమతిని వివాహం చేసుకోవాలనే కోరికతో స్వయంవరమునకు వచ్చి స్వయంవర సభలో వేచియున్నారు. ఆ సమయంలో పతింవర అయిన ఇందుమతి వివాహోచితమైన వేషం ధరించి పల్లకి పరివారంతో సభామండపంలోకి వచ్చెను. అప్పుడు రాజుల వంశచరిత్ర బాగా తెలిసినది. వాక్పటుత్వం కలిగినటువంటి ద్వారపాలకురాలైన సునంద అను చెలికత్తె ఇందుమతిని సమీపించి ఒక్కో రాజు వద్దకు ఇందుమతిని తీసుకుని వెళుతూ ఆ రాజుయొక్క గొప్పతనాన్ని మరియు వంశ చరిత్రను వర్ణిస్తున్నది. అలా మొదట మగధరాజును, అంగరాజును వర్ణిస్తూ అజ మహారాజు వద్దకు చేరుకునెను.
సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ యం
యం వ్యతీయాయ పతింవరా సా ।
నరేంద్రమార్గాట్ట ఇవ ప్రపేదే
వివర్ణభావం స స భూమిపాలః ।। 1 ।।
భావము:- ముందు వెలుతురు లేని గృహములపై వీధిలో దీపం తీసుకుని పోవునప్పుడు వెనుకటి భాగంలో చీకటి అగునట్లు ఇందుమతి ఏఏ రాజును దాటిపోవునో ఆయా రాజుల ముఖములు వాడిపోయెను.
తస్యాం రఘోస్సూనురూపస్థితాయాం
వృణీతవానేతి సమాకులోऽభూత్ ।
వామేతరః సంశయమస్య బాహుః
కేయూరబంధోచ్ఛ్వవసితైర్నునోద ।। 2 ।।
భావము:- అజమహారాజు ఇందుమతి తన సమీపంలోకి రాగానే ఆమె తనను వరించునో లేదో అనే సందేహంతో ఉండగా అతని కుడిభుజం అదరడంతో శుభసూచకంగా భావించి సందేహాన్ని విడిచెను
తం ప్రాప్య సర్వావయవానవద్యం
వ్యావర్తతాన్యోపగమాత్ కుమారీ ।
న హి ప్రపుల్లం సహకారమేత్య
వృక్షాంతరం కాంక్షతి షట్పదాలిః ।। 3 ।।
భావము:- తుమ్మెదలపంక్తి బాగా రుచికలిగిన బాగా వికసించిన తీయని మామిడి చెట్టును పొందినప్పుడు మరొక చెట్టును ఎలాగైతే అపేక్షింపదో అలాగే ఇందుమతి సౌందర్యవంతుడు, శక్తి శాలి అయిన అజమహారాజును చూడగానే మరొక రాజు వద్దకు వెళ్ళాలనే కోరికను విడిచిపెట్టెను.
తస్మిన్ సమావేశితచిత్తవృత్తిం-
ఇందుప్రభామిందుమవేక్ష్య ।
పచక్రమే వక్తుమనుక్రమజ్ఞా
సవిస్తరం వాక్యమిదం సునందా ।। 4 ।।
భావము:- ముందు వెనుక సందర్భములను తెలుసుకుని మాట్లాడుగలుగు సునంద అజమహారాజు నందు మనస్సు నుంచునట్టియు చంద్రునివలె మనోహరురాలగు ఇందుమతిని చూచి ఆరాజు యొక్క చరిత్రను వివరించసాగెను.
ఇక్ష్వాకువంస్యః కకుదో నృపాణాం
కకుత్స్థ ఇత్యాహితలక్షణోऽభూత్ ।
కాకుత్స్థశబ్ధం యత ఉన్నతేచ్ఛాః
శ్లాఘ్యం దధత్యుత్తరకోసలేంద్రాః ।। 5 ।।
భావం:- ఇక్ష్వాకుల సుతుడై రాజులలో గుణముల చేత శ్రేష్టుడిగా ఉండిన కకుత్థ్స మహారాజు యొక్క వంశమునందు అతని వెనుక పుట్టిన గుణాధికులగు ఉత్తర కోసల రాజులు కాకుత్థ్సలనెడి పేరు పొందియున్నారు.
మహేంద్రమాస్థాయ మహోక్షరూపం
యః సంయతి ప్రాప్తపినాకిలీలః ।
చకార బాణౌరసురాఙ్గనానాం
గణ్డస్థలీః ప్రోషితపత్రరేఖాః ।। 6 ।।
భావం:- యుద్ధమునందు ఆకకుత్థ్సమహారాజు ఈశ్వరునివలె గోప్ప వృషభరూపమును దాల్చిన ఇంద్రునిపైన కూర్చోని బాణములతో రాక్షసస్త్రీలను పతివియోగమును చేయుటే అలంకారహితలుగా చేసినవాడు.
ఐరావతాస్ఫాలనవిశ్లయం యః
సంఘట్టయన్నఙ్గదమఙే్గదేన ।
ఉపేయుషః స్వామపిమూర్తి మగ్య్రాం
అర్ధాసనం గోత్రభిదోऽధితష్ఠౌ ।। 7 ।।
భావం:- పిమ్మట దేవేంద్రుడు నిజరూపము ధరించి ఐరావతమును బుజ్జగించి తట్టుటచేత జారిన బాహుపురితో సింహాసనముపై కూర్చున్నప్పుడు కకుత్థ్స మహారాజు ఇంద్రునితో కూడి అర్ధాసనముపై అతని బాహుపురిని తన బాహుపురితో నొరుసుకొనుచు కూర్చున్న వాడయ్యె.
జాతః కులే తస్య కిలోరుకీర్తిః
కులప్రదీపో నృపతిర్దిలీపః ।
అతిష్టదేకోనశతక్రతుత్వే
శక్రాభ్యసూయావినివృత్తయే యః ।। 8 ।।
భావం:- అట్టి కకుత్థ్సరాజవంశమునందు కులప్రదీపుడు, కీర్తివంతుడు అయిన దిలీపుడనురాజు పుట్ఠి తోంబైతోమ్మిది యాగములను చేసి దేవేంద్రనికి అసూయ కలగకూడదని నూరవయాగం చేయకుండా మానుకొనెను.
యస్మిన్ మహీం శాశతి వాణినీనాం
నిద్రాం విహారార్థాపథే గతానామ్ ।
వాతోऽపి నాస్రంసయదంశుకాని
కో లమ్బయేదాహరణాయ హస్తమ్ ।। 9 ।।
భావం:- ఆదిలీపునిరాజ్యభారకాలములో ప్రియవిహారమునకు పోవుచు దారిలో శయనించిన మత్తురాండ్రైన స్త్రీలయొక్క కట్టువస్త్రములను గాలికూడా చలించలేదు. వారి ఆభరణములను ఏవరూ అపహరించుటకు చేయి చాపలేకపోయేను.
పుత్రో రఘుస్తస్య పదం ప్రశస్తి
మహాక్రతోర్విశ్వజితః ప్రయోక్తా ।
చతుర్దిగావర్జితసంభృతాం యో
మృత్పాత్రశేషామకరోద్ విభూతిమ్ ।। 10 ।।
భావం:- ఆ దిలీపరాజునకు కుమారుడగు రఘుమహారాజు రాజ్యమును పరిపాలించుచు విశ్వజిత్తనేడి యాగమును చేసి నలుదిక్కులనుండి జయించితేచ్చిన ఐశ్వర్యము ఆ యాగమునందు వ్యయపరిచి మట్టిపాత్రలను మాత్రము నిలుపుకొనేను
ఆరూఢమద్రీనుదధీన్వితీర్ణం
భుజంగమానాం వసతిం ప్రవిష్టమ్ ।
ఊర్ధ్వం గతం యస్య న చానబన్ధి
యశః పరిచిఛేతుమియత్తయాऽలమ్ ।। 11 ।।
భావం:- పర్వతమీదను, భూమండలములోను ఊర్థ్వాధోలోకములలోను భూతభవిష్యత్ వర్తమానకాలములయందును ఉండునటుల వ్యాపించినయి ఈ రఘుమహారాజు కీర్తియొక్క పరిమాణమును వర్ణింపనలవి కాదు.
స్త్రివిష్టపస్యేవ పతిం జయన్తః ।
గుర్వీధురం యో భువనస్య పిత్రా
ధుర్వేణ దమ్యః సదృశం విభర్తి ।। 12 ।।
భావం:- ఈ అజమహారాజు స్వర్గాధిపతియగు దేవేంద్రుని కుమారుడైన జయంతుడివలె తండ్రిని అనుసరించి పుట్టి చాలాకాలము నుండి రాజ్యభారమును వహించిన తండ్రికి సమానుడిగా యువరాజై రాజకార్యములను జరిగించుచన్నాడు.
కులేన కాంత్యా వయసా నవేన
గుణైశ్చ తైస్తైర్వినయప్రధానైః ।
త్వమాత్మనస్తుల్యమముం వృణీష్వ
రత్నం సమాగచ్చతు కాంచనేన ।। 13 ।।
భావం:- కులము, రూపము, నవయవ్వనము, వినయము, మంచిస్వభావము మొదలగు గుణములతో నీకు సమానుడైన ఈ రాజుని నీవు వరింపుము. మీ ఇరువురి కలయిక బంగారములో పొదిగిన రత్నమువలె ప్రకాశమానముగా ఉండును.
తతః సుననందావచనావసానే
లజ్జాం తనూకృత్య నరేంద్ర కన్యా ।
దృష్ట్యా ప్రసాదామలయా కుమారం
ప్రత్యగ్రహీత్సంవరణస్రజేవ ।। 14 ।।
భావం:- సునంద అజమహారాజు గురించి ఈవిధంగా వివరించగా ఇందుమతి కోంచెం సిగ్గును వదిలి ప్రసన్నరాలై తనచేతిలోని పూలమాలను వేసినట్లు మనోనైర్మల్యవిశిష్టమైన చూపుచేత అతనిని అంగీకరించేను.
సా యూని తస్మిన్నభిలాషబంధం
శశాక శాలీనతయా న వక్తుమ్ ।
రోమాంచలక్ష్యేణ స గాత్రయష్టిం
భిత్వా -నరాక్రామదరాలకేశ్యాః ।। 15 ।।
భావం:- ఆ ఇందుమతి యౌవనస్థుడైన అజునియందు తనకు కల్గినఅభిలాషను సిగ్గుచేత చెప్పలేకపోయేను. ఆ అనురాగము సంతోషాతిశయము చేతనైన రోమాంచము వెల్లడి చేసెను.
తథాగతాయాం పరిహారపూర్వం
సఖ్యాం సఖీ వేత్రభృదాబభాషే ।
ఆర్యే! వ్రజావోऽన్యత ఇత్యథైనాం
వధీరసీయాకుటిలం దదర్శ ।। 16 ।।
భావం:- ఇందుమతి అజునియందు అనురాగము పోందినది అగుచుండగా సునంద పరిహాసముగా మరోక రాజకుమారుని వద్దకు వేళ్దామా అని పలుకగా ఆమాటకు ఇందుమతి అసహిష్ణురాలై సునందను కోపముతో చూసెను.
సా చూర్ణగౌరం రఘునన్దనస్య
ధాత్రీకరాభ్యాం కరభాపమోరుః ।
ఆసంజయామాస యథాప్రదేశం
కంఠే గుణం మూర్తిమివానురాగమ్ ।। 17 ।।
భావం:- ఇందుమతి సునంద పట్టుకోనిన కుంకుమపూసిన పుష్పమాలికేను సునందచేతులలో ప్రీతిపురస్సరముగా అజమహారాజు మెడపైన వేయించెను.
తయా స్రజా మంగళపుష్పమయ్యా
విసాలవక్షస్థలలంబయా సః ।
అమంస్త కంఠార్పితబాహుపాశాం
విదర్భరాజవరజాం వరేణ్యః ।। 18 ।।
భావం:- అజుడు ఇందుమతి తన విశాలమైన వక్షస్థలమునందు,మెడపైన మంగళకరమగు యిప్పమున్నగు పూలయొక్క దండను వేసినందున ఆమె బాహువులను తన మెడపైన ఉంచినట్లు, తనను ఆలింగనము చేసుకున్నట్లు తేలుసుకొనెను.
శశినాముపగతేయం కౌముదీ మేఘముక్తం
జలనిధిమనురూపం జహ్నుకన్యావర్తీర్ణా ।
ఇతి సమగుణయోగప్రీతయస్తతత్ర పౌరాః
శ్రవణకటు నృపాణామేకవాక్యం వివర్తుః ।। 19 ।।
భావం:- ఆస్వయంవరసభలో సకలగుణ సంపన్నులు, దేహసౌందర్యులు అగు ఇందుయతి, అజమహారాజుల దాంపత్యమును చూసి జనులందరు సంతోషించినవారై, మేఘములచేత విడువబడిన చంద్రుని కూడిన వెన్నెల సుమా ఈమె, సముద్రుని కలిసిన గంగ ఈమె అని ఒకేమాటగా పలికెను. ఈ మాటలు ఇతర రాజుల చెవులకు కర్ణకఠోరంగా ఉండెను.
ప్రముదితవరపక్షమేకస్తత్కత్ క్షితి-
పతిమండలమన్యతో వితానమ్ ।
ఉషసి సర ఇవ ప్రఫులపద్మం
కుముదవనప్రతిపన్ననిద్రమాసీత్ ।। 20 ।।
భావం:- అప్పుడు ఇందుమతీదేవిని వరించిన అజమహారాజుయొక్క బంధురాజుల ముఖములు ప్రాతఃకాలమున వికసించిన కమలములు గల సరస్సువలే ఉల్లాసము పోందేను. ఇతర రాజుల ముఖములు ముకుళించినకలువలు కల్గిన సరస్సువలె ఖిన్నభావము పోందెను.
మీకు ఇంటర్, డిగ్రీ కి సంబంధించిన సంస్కృతం పాఠ్యభాగాలు, సారాంశాలు వ్యాకరణ అంశాలు అన్నీ ఈ లింకులో ఉన్నాయి.
https://youtube.com/c/DRPUSAPATIRAVIKANTHAREDDY
డిగ్రీ రెండవ సెమిస్టర్ సంస్కృతం సిలబస్ వీడియో:
No comments:
Post a Comment