Breaking

Friday, January 13, 2023

DASARADHASYA PASCHATAPAHA

 1. दशरथः दुःखं कथं स्वयं कृतमासीत् ?

                        (अथवा)

2. दशरथस्य पश्चात्तापः इति पाठस्य सारांशं लिखत ।



कविपरिचः :-

दशरथस्य पश्चात्तापः इति पाठ्यभागः वाल्मीकिमहर्षिणा विरचित श्रीमद्रामायणे अयोध्यकाण्डात् स्वीकृतः।

కవిపరిచయము:- "दशरथस्य पश्चात्तापः" అను పాఠ్యభాగము ఆదికవి బిరుదాంకితుడైన వాల్మీకి మహర్షిచే రచింపబడిన శ్రీమద్రామాయణములోని అయోధ్యకాండ నుండి స్వీకరింపబడినది.

पूर्वकथा :- రాముడు అడవికి వెళ్ళడంతో పుత్రవియోగముతో బాధపడుచున్న దశరథుడు అందుకు కారణమైన మునిశాప వృత్తాంతమును భార్యయైన కౌసల్యతో ఈ విధంగా పలికెను.

रामः वन गमनानन्तरं पुत्रवियोगेन दशरथः तत्कारणं कौसल्यां प्रति मुनिशाप वृत्तान्तम् एवम् अवदत्।

दशरथस्य पश्चात्तापः :- ఓ కౌసల్యా! మానవుడు తాను చేసుకున్న పాపపుణ్యముల ఫలితముగా సుఖదుఃఖములను పొందుచున్నాడు. పనిని ప్రారంభించినప్పుడు మంచిదా? చెడ్డదా?  దాని వలన కలుగు ఫలము లాభమా? నష్టమా? అని ఆలోచించకుండా చేసే మానవుడు మూర్ఖుడుగా కీర్తంపబడుచున్నాడు. यो कर्मफलं न जानाति स बाल इति उच्यते ।  నేను యవ్వనమునందు ధనుర్విద్యలో శబ్దవేధి అను విద్యయందు నైపుణ్యమును పొంది ఒకరోజు అరణ్యమునకు వెళ్ళితిని. అక్కడ చీకటి యందు సరయునది ఒడ్డున నీటిలో కుండను ముంచుతున్న శబ్దము వినిపించెను. ఆశబ్దాన్ని నేను ఏనుగు నీరు త్రాగుచున్నట్లుగా భావించి బాణమును శబ్దము వచ్చినవైపుకు ప్రయోగించితిని. వెంటనే ఆ ప్రదేశము నుండి హాహాకారములతోపాటు నీటిలో ఏదో పడిన శబ్దము వినిపించెను. अचक्षुर्विषये घोषं वारणस्येव नर्दतः । నేను అక్కడికి వెళ్ళి చూడగా నేను ప్రయోగించిన బాణము  తగిలి చెదిరిన జలు కలవాడు, చిమ్మివేయబడిన కలశోదకము గల మునికుమారుడుని చూచితిని. सरयूनदीतीरे दशरथः बाणेन हतं अवकीर्णजटाभारं, प्रविध्दकलाशोदकं तापसम् अपश्यत् ।

मुनिकुमारस्य वचनानि:- మునికుమారుడు దశరథునితో ఓ రాజా! నేను  అంధులు, వృధ్ధులు  అయిన  నా తల్లిదండ్రులకు సేవచేస్తూ ఈ అడవిలో నివసించుచున్నాను. తల్లిదండ్రుల దప్పికను తీర్చడానికి నీటికొరకు నదిదగ్గరకు వచ్చితిని. ఒక్క బాణంతో నా ఆయువుపట్టుపై కొట్టితివి. కళ్ళులేని నా తల్లిదండ్రులు  నా కోసమే నిరీక్షిస్తూ జలం కోసం ఆశతో ఎదురుచూస్తూ దాహాన్ని ఆపుకొందురు. కావున నిస్సహాయుడైన నా తండ్రి నిన్ను కోపగించి, దహించకుండా ఉండాలంటే వెంటనే వెళ్ళి నా తండ్రికి ఈ వృత్తాంతమును  తెలియజేయమనికోరెను. पितुस्त्वमेव मे गत्वा शीघ्रमाचक्ष्व राघव ।

दशरथः आश्रम गमनम् :- ఓ కౌసల్యా! అంతట నేను నీటితో నిండిన కుండను తీసుకొని ఆ మునికుమారుడు చెప్పిన మార్గంలో ఆశ్రమమునకు చేరితిని. అక్కడ అంధులు, వృద్ధులు అయిన ఆ దంపతులు నా అడుగుల శబ్దమును విని, వచ్చినది తమ కుమారుడేనని  అనుకొని ఆలస్యమునకు గల కారణమును అడిగిరి.

 दशरथः मुनिं प्रति वचनानि  :- తరువాత నేను వృద్ధ దంపతులతో నేను మీ కుమారుడును కాను. రాజైన దశరధుడను.  ఓ మునివర్యా! నేను ధనస్సు చేత ధరించి సరయూ నదీ తీరమున నీటిని త్రాగుటకు వచ్చే జంతువులను వేటాడుటకు వచ్చితిని. ఇంతలో నాకు నీరు నింపుచున్న కుండ ధ్వని వినబడెను. అది ఏనుగని భావించి బాణమును ప్రయోగించితిని. द्विपोयमिति मत्वायं बाणेनाभिहतो मया । పిదప నదీ తీరమునకు వెళ్ళి చూడగా బాణము తగిలి ప్రాణములు వదులుతూ ఉన్న మీ కుమారుడు కనబడెను. నా అజ్ఞానముచే మీ కుమారున్ని చంపితిని. ఓ తాపసులారా ! తెలియక చేసిన ఈ అపరాధమును క్షమించెదరో లేక శపించెదరో ఇక ఆపై మీ దయ.

मुनिशापः :- మనస్సుకి బాధకలిగించే క్రూరమైన  ఆ మాటలు విని ఆ వృద్ధతాపసి తీవ్రమైన ఆగ్రహంతో ఇట్లు పలికెను. ఓరాజా! నీ తెలియనితనంతో నా కుమారుడు చంపబడెను. నీవు నన్ను అంతులేని పుత్రశోకానికి గురిచేశావు. కావున నేను పొందిన విధముగానే నీవు కూడా భరించలేని పుత్రశోకానికి లోనై మరణించెదవు గాక! అని శపించెను. एवं त्वं पुत्रशोकेन राजन् कालं करिष्यसि । एवं दशरथः पश्चात्तापस्य कारणं कौसल्यां प्रति एवम् अवर्णयत् ।


మీకు సంబంధించిన ఇంటర్ మొదటి సంవత్సరం  సంస్కృత పాఠ్యాంశాలు అన్ని వీడియోల రూపంలో ఉన్నవి. కావున మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీకు ఏ సందేహం ఉన్న మెసేజ్ చేయండి.

5 comments:

Unknown said...

Thank you sir

Coin Tales said...

Thank you sir

Anonymous said...

Sir It's really very helpful sir thank you so much sir

Anonymous said...

English lo rase vallaki presentation cheppandi sir

Anonymous said...

👍