Breaking

Sunday, January 22, 2023

DHARMANISHTA

 1. धर्मनिष्ठा इति पाठ्यांशस्य सारांशं लिखत ।

                        (अथवा)

2.दिलीपस्य धर्मनिष्ठामधिकृत्य लिखत ।



कविपरिचयः -  धर्मनिष्ठा इति पाठ्यभागः महाकवि कालिदासेन विरचित रघुवंश महाकाव्ये द्वितीयसर्गात् स्वीकृतः ।पाठेऽस्मिन् सूर्यवंशीयेषु अन्यतमेन दिलीपमहाराजेन अनुष्ठितं वसिष्ठहोमधेनोः नन्दिन्याः रक्षणं निरूपितम् । तथा च कुलगुरोः वसिष्ठस्य आदेशपालनम् , कर्तव्यनिष्ठा, भूतानुकम्पा इत्यादयः दिलीपस्य गुणाः सम्भाषणाशैल्या साधु उपवर्णिताः ।

కవిపరిచయః - ధర్మనిష్ఠా అను పాఠ్యభాగము మహాకవి కాళిదాసుచే రచించబడిన రఘువంశమహాకావ్యములోని ద్వితీయసర్గనుండి స్వీకరింపబడినది. ఈ పాఠ్యభాగమునందు సూర్యవంశరాజులలో ఒకరైన దిలీప మహారాజు వశిష్ఠమహర్షి యొక్క హోమధేనువు అయిన నందినీధేనువును రక్షించిన విధమును మహాకవి చక్కగా వర్ణించెను. కులగురువైన వసిష్ఠుని యొక్క ఆదేశాన్ని అనుసరించుట, కర్తవ్యనిష్ఠ, సకలప్రాణులపై దయాగుణము మొదలగు దిలీపుని గుణములు సంభాషణ శైలితో బాగుగా వర్ణింపబడినవి.  

పూర్వకథ - దిలీపమహారాజు అతని భార్య సుదక్షిణాదేవి సంతానము  కొరకు కులగురువైన వశిష్ఠుని ఉపదేశముననుసరించి నందినీధేనువును ఇరవై ఒక్క రోజులు సేవించిరి. वसिष्ठ महर्षेः आदेशानुसारं सुदक्षिणादिलीपौ सन्तानार्थं नन्दिनीधेनोः सेवायाम् अतीतानि ।

नन्दिनीधेनोः परीक्षा - ఇరవై రెండవ రోజు నందినీధేనువు దిలీపుని పరీక్షించదలచెను. దిలీపుడు పర్వతశోభను చూస్తూ క్షణకాలము ఏమరపాటుగా ఉండగా ఒక సింహము హఠాత్తుగా ధేనువుపైకి దుమికి లాక్కొని గుహలోకి వెళ్ళెను. నందినీ ధేనువు యొక్క ఆర్తనాదమును విని తన దృష్టిని గుహవైపుకి మరల్చెను. ఆ ధేనువును కాపాడటానికి సింహపరాక్రముడైన దిలీపుడు సింహముపై బాణప్రయోగము చేయుటకు సిద్ధపడి  తన అమ్ములపొదిలోని బాణమును పైకి తీయదలిచెను. ఆ బాణమును పట్టుకోగానే చిత్రంలో గీసిన బొమ్మవలె ఉండిపోయెను. चित्रार्पितारम्भ इवाऽवतस्थे దిలీపుడు తన స్థితిని చూసి ఆశ్చర్యపోతూ ఉండగా ఆ సింహము మానవ వాక్కుతో ఇలా పలికింది.

सिंहस्य वचनानि - ఓ మహారాజా ! శ్రమపడకు నీవు నాపై బాణము వేసినను అది నిరుపయోగమే. ఎందుకనగా నేను సాక్ష్యాత్తు పరమేశ్వరుని యొక్క సేవకుడిని. కుంభోదరుడను వాడను. పార్వతీదేవి తన బిడ్డగా భావిస్తున్న ఈ దేవదారు వృక్షము నీకు చూస్తున్నావు కదా ! ఒక అడవి ఏనుగు తన దురదను తీర్చుకొనుటకు ఈ చెట్టు బెరడును రుద్ది దానిని పాడు చేసెను. ఆ బెరడు పార్వతీదేవికి రాక్షసుల బాణము తగిలిన కుమారస్వామి వలె కనిపించగా ఆమె విలపించెను. అప్పటినుంచి ఈచెట్టును రక్షించుటకు శివుడు నన్ను సింహముగా మార్చి ఈచెట్టు దగ్గరకు వచ్చిన జంతువులను నాకు ఆహారముగా అనుగ్రహించెను. కావున నీవు వెళ్ళుము. ప్రయత్నములో దోషము లేనప్పుడు ఓడినవారి కీర్తి నశించదు. సింహము మాటలు విన్న దిలీపుడు ఇదంతయూ శివుని గొప్పదనమని భావించి సింహముతో ఇలా మాట్లాడెను.

दिलीपस्य वचनानि - కదులుటకు వీలులేని నేను ప్రాణుల మనోభావాలు తెలిసినవాడివని నీతో పలుకుచున్నాను. ప్రపంచమునకు సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ పరమేశ్వరుడు నాకూ పూజ్యుడే. నా గురువు యొక్క హోమధేనువును  కూడా రక్షించవలసినదే. కావున నీ ఆహారముకోసం నా శరీరాన్ని స్వీకరించుము. विसृज्यतां धेनुरियं महर्षेः  ఆ లేగదూడ మరియు హోమధేనువుని విడిచిపెట్టుము. దానికి ఆ సింహము నవ్వి దిలీపునితో ఇట్లన్నది. రాజువగు నీవు ఆవుని రక్షించుటకు నీ శరీర త్యాగానికి సిద్ధపడి మూర్ఖనివలె కనిపించుచున్నావు. ఓ రాజా ! నీవు మరణించిన ఈ గోవును మాత్రమే రక్షించగలవు. అలాకాక నీవు జీవించినచో నీ ప్రజలను ఎల్లప్పుడూ కాపాడుకోగలవు అని పలికెను. ఆ మాటలు విని దిలీపుడు  సింహమునకు భయపడుతున్న ఆవుని చూసి సింహముతో ఇట్లనెను. లోకంలో క్షత్రియ అను శబ్దము నాశనము నుండి రక్షించునది అని ప్రసిద్ధమైనది. దానికి విరుద్ధమైన రాజునకు నిందలతో కూడిన ప్రాణములు అవసరం లేదు. राज्येन किं तद्विपरीतवृत्तेः प्राणैः उपक्रोशलामसैर्वा ఎన్ని పాడి ఆవులైన ఈ హోమధేనువుకి సమానము కావు. నీవు దీనిని ఆక్రమించుట శివశక్తియే గాని నీ శక్తికాదు. నీకు ఆహారమే కావాలంటే ఆవుకు ప్రతిగా నా శరీరాన్ని ఇస్తాను. ఓ మృగరాజా ! దేవదారు వృక్షమును నశింపజేసినచో నీవు శివుని ఎదుట ఎట్లు నిలబడలేవో, అట్లే నేను కూడా నందినీధేనువును కోల్పోయి వసిష్ఠుని ఎదుట నిలబడలేను కదా! నా వంటివానికి భౌతిక శరీరముల మీద కంటే శాశ్వతమైన కీర్తి మీదనే మక్కువ ఎక్కువ. కావున నా దేహము మీద కాక నా కీర్తి మీదనే దయచూపుము. पिण्डेष्वनास्था खलु भौतिकेषु 

दिलीपस्य धर्मनिष्ठा - సరే అని సింహము ధేనువును విడిచిపెట్టగా దిలీపుడు తన శరీరమును సింహమునకు అర్పించెను. ఆ సమయములో సింహము ఎదురు నిలబడిన దిలీపుని పై దేవతలు పూలవర్షమును కురిపించిరి. దీనికి మిక్కిలి సంతసించిన హోమధేనువు దిలీపునితో కలిసి ఆశ్రమమునకు వెళ్ళెను.  తరువాత నందినీ ధేనువు యొక్క అనుగ్రహముచేత సుదక్షిణాదిలీపులకు సంతానము కలిగెను. 





1 comment:

Anonymous said...

sir english lo kuda SA pettand sir plz