Breaking

Tuesday, July 25, 2023

రైతేరాజు

                       


                        నా పేరు రంజిత్ వయస్సు 36సం!! నా ప్రయాణం ప్రారంభమై 4 రోజులు ఇంకా నాకు గడువు 3 రోజులే అంతకుమించి బ్రతకలేను అన్నది డాక్టర్ల నమ్మకం. దానికి కారణం నా చిరకాల ప్రత్యర్థి అయిన దామోదర్. వాడిని అంతం చేయడానికి బయలుదేరాను. నా ప్రాణంతో వాడి ప్రాణం కూడా తీసుకువెళ్ళాలి. వాడి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి 4రోజుల నుంచి నిద్ర లేకుండా తిరుగుతున్నాను.  జననం, మరణం అనే ఈ రెండింటి మధ్యలో ఉండే జీవితాన్ని సంతోషంగా గడపక పగ, ప్రతీకారం అని తిరగడానికి నేనేమి పిచ్చి వాడిని కాదు.

                           చరాచర జగత్తులో మానవునికి  ప్రత్యేకమైన స్థానం ఉంది. కష్టసుఖాలు, పాపపుణ్యాలు తెలిసినవాడు కాబట్టి పుణ్యకార్యాలు చేసి స్వర్గాన్ని పొందాలి అని చాలా మంది పరితపిస్తూ ఉంటారు. మరి నేనేమైన నరకం కోసం ప్రయత్నిస్తానా!  కాదు కదా! ఇంతకి నేనెందుకు ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? నాకు జరిగింది చెప్తాను వినండి  నేను ఒక రైతుని. పొలంలో వచ్చే పురుగులను చంపడానికి తప్ప దేనికి మందులు వాడనటువంటి సేంద్రియ వ్యవసాయం చేసే రైతుని.  నా తండ్రి ఆశయం "రైతే రాజు" అని ప్రజలందరికీ తెలియజేయాలి. దాని కోసం మొదట మా గ్రామంలో ప్రజలందరూ ఉద్యోగం కంటే వ్యవసాయమే గొప్పది అని నమ్మకం కలిగి వ్యవసాయం చెయ్యాలని మా నాన్నగారు అనేక ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే నన్ను బి.యస్సి. అగ్రికల్చర్ చదివించి వ్యవసాయంలో కొత్త విధానాలకు మా ద్వారా స్వాగతం పలికించారు. మా నాన్నగారి తెలివితేటలతో ప్రజల అండదండలతో డబ్బు, పేరు సంపాదించుకున్నాను. 

  అయితే ఇది చూసిన మా గ్రామ సర్పంచ్ దామోదర్ మా పలుకుబడిని చూసి ప్రజలకు మేలు చేస్తున్నట్లుగా నటిస్తూ తన బావమరిది అయిన సాజిత్ ను(పురుగుమందులు) వ్యాపారంలోకి దింపాడు. వాడు పైకి పెద్దమనిషి లా కనపడతాడే కానీ ఆకలితో ఉన్న పులి అయినా వేటాడకుండా ఉంటుందేమో కానీ వీడు మాత్రం డబ్బు కోసం చెయ్యి పెట్టని వ్యాపారం లేదు. 


No comments: