కవిపరిచయం - సంస్కృత కధా సాహిత్యంలో పంచతంత్రానికి, దానికి సంక్షిప్తరూపమైన హితోపదేశానికి సాటిలేని స్థానమున్నది. దానికి కారణం అన్ని నాగరిక భాషల్లో ఈ రెండు గ్రంథాలకు ఉన్న అనువాదములే ప్రమాణం.
హితోపదేశం క్రీ.శ 14వ శతాబ్దానికి ముందే వంగదేశాన్ని పాలించిన ధవళచంద్రుని ఆస్థాన పండితుడైన నారాయణపండితునిచే వ్రాయబడినది. ఈ గ్రంధంలో మిత్రలాభం, సుహృద్భేదం, విగ్రహం, సంధి అనే నాలుగు భాగాలు ఉన్నాయి. ఈ గ్రంధాన్ని చదవడం వలన విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలున్నాయని కవి వివరించారు.
పాటలీపుత్ర రాజైన సుదర్శుని కోరిక పై విష్ణుశర్మ అనే పండితుడు ఆరు నెలల కాలంలో రాజకుమారులను నీతివంతులను చేయడానికి పంచతంత్రం అనే గ్రంధాన్ని రచించాడని చెప్పడం జరిగింది. దానిని అనుసరించి నారయణ పండితుడు హితోపదేశం రచించాడు.
ఈ పాఠ్యభాగం నారాయణ పండితుడు వ్రాసిన హితోపదేశంలోని సంధిలోని నాల్గవ భాగం నుండి గ్రహించబడినది. ఈ పాఠ్యభాగంలో ముగ్గురు దుర్మార్గులు ఒక బ్రాహ్మణుడు యాగ పశువును కొని తీసుకొని వెళ్తుండగా ఎలా మోసగించారో, సింహానికి సేవకులేన ముగ్గురు దుర్మార్గులు ఒంటెను ఎలా మోసం చేసారో వివరించబడినది.
సజ్జనులకు కూడా దుర్మార్గుల మాటతో మనస్సు ఎలా చంచలమౌతుందో ఈ కథలో వివరించడం జరిగింది.
ప్రస్తుత పాఠ్యభాగం - గౌతమ అనే అరణ్యంలో ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఒక మేకను కొని భుజం పై వేసుకొని వెళ్తుండగా ముగ్గురు దుర్మార్గులు అతడిని చూసారు. ఆ ముగ్గురు ఎలాగైనా ఆ మేకను కాజేసి వారి తెలివితేటలు గొప్పవని నిరూపించుకోవాలని ఆలోచించారు. ఆ ముగ్గురూ రెండు మైళ్ళ దూరంలో వేరు వేరు చేట్ల పై ఎక్కి ఆ బ్రాహ్మణుని కొసం ఎదురుచూస్తు ఉండెను. మొదటివాడు బ్రాహ్మణునికి ఎదురుపడి అయ్యా! బ్రాహ్మణా భుజం పై కుక్కని ఎందుకు మోసుకుపోతున్నావు? అని అడుగగా బ్రాహ్మణుడు ఇది కుక్క కాదు. నేను యజ్ఞానికి మేకను తీసుకుపోతున్నాను అని పలికెను. మరికొంత దూరంలో రెండవవాడు కూడా అలానే పలుకగా బ్రహ్మణుడు మేకను నేలపైకి దించి చూసుకొని తిరిగి భుజం మీద పెట్టుకొని అనుమానంతో ముందుకు నడిచాడు. అలా ఎందుకు జరిగిందని ఉదాహరణంగా ఈ శ్లోకం చెప్పి మరొక కథను వివరించెను.
మంద నుంచి తప్పిపోయిన ఒంటె - ఒక అడవిలో మదోత్కటమనే పేరు గల సింహం ఉన్నది. ఆ సింహానికి కాకి, పులి, నక్క ముగ్గురు సేవకులుగా ఉన్నారు. ఆ ముగ్గురు అడవిలో తిరుగుతూ ఒక ఒంటెను చూసారు. వారు ఒంటెను సమీపించి నీవు ఎక్కడి నుంచి వచ్చావని ప్రశ్నించగా మంద నుంచి తప్పిపోయి వచ్చానని వారికి చెప్పింది.
అప్పుడు ఆ ముగ్గురు ఒంటెను తెచ్చి సింహానికి పరిచయం చేయగా సింహం ఒంటెతో తినను అని మాటిచ్చి చిత్రకర్ణ అని పేరు పెట్టి తన దగ్గరే ఉంచుకున్నది. ఒకసారి సింహానికి ఆరోగ్యం బాలేని సమయంలో వానలు పడుతుండటం, ఆ సమయంలో ఆహారం దొరకక ఆ ముగ్గురూ ఎంత ప్రయత్నించినా ఆహారం లభించకపోవడంతో చిత్రకర్ణుని మన రాజు స్వయంగా ఎలా చంపుతారో ఆ ఉపాయం ఆలోచించాలి. ముళ్ళ చెట్లను తిని బ్రతికే ఈఒంటె వలన మనకు ఉపయోగం ఏమున్నది? అని చర్చించుకున్నప్పుడు పులి మిగతా రెండింటితో మన ప్రభువు చంపనని అభయమిచ్చారు కావున ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడిగింది. కాకి కష్టంలో ఉన్న ప్రభువు ఏ పాపపు పని అయినా చేస్తాడు ఎందుకంటే - ఆకలితో బాధపడుతున్న స్త్రీ తన కొడుకును వదిలి పెట్టవచ్చు. ఆకలితో బాధపడుతున్న ఆడపాము తన గుడ్డును తానే తింటుంది. ఆకలితో ఉన్నవాడు పాపాన్ని చేయడా! ఆపదలో ఉన్న మనుష్యులు దయలేనివారుగా అవుతారు. అలాగే తాగిన మైకంలో ఉన్నవాడు, జాగ్రత్త లేనివాడు, పిచ్చివాడు, కోపంతో ఉన్నవాడు, పిసినారి, తొందరపాటు ఉన్నవాడు, కాముకుడు అనే వారికి ధర్మం తెలుసుకొనే వారు కాదు. అని ఆలోచించకొని ముగ్గురు సింహం దగ్గరకు వెళ్ళగా సింహం ఆహారం లభించిందా? అని అడిగింది. ఎంత ప్రయత్నం చేసినా ఆహారం దక్కలేదని వారు పలకగా తిరిగి సింహం మనం బ్రతికే దారి ఏది? అని ప్రశ్నించగా అప్పుడు కాకి మనం మన దగ్గర ఉన్న ఆహారాన్ని విడిచి పెట్టడం వలన మనం సర్వనాశనమయ్యే పరిస్థితి వచ్చింది అని చెబుతుంది. దానికి సింహం మన దగ్గర ఆహారం ఎక్కడ ఉంది అని అడిగింది. కాకి సింహం చెవిలో చిత్రకర్ణుడే మన ఆహారం అని చెప్పగా సింహం చెవులు మూసుకొని మనం రక్షణ ఇస్తామని అభయమిచ్చాము. ఇప్పుడు ఒంటెను చంపడం ఎలా సాధ్యమవుతుంది అని అన్నది.
అప్పుడు కాకి ప్రభువు ఒంటెను చంపవల్సిన పని లేదు. మేమే ఆ ఒంటె స్వయంగా తన దేహాన్ని అర్పించే ఏర్పాటు చేస్తాము అని పలుకగా సింహం మౌనంగా ఉండిపోయెను. అదే అవకాశమనుకున్న కాకి అందరితో కలిసి ఒంటెను మోసం చెయ్యడానికి సింహం దగ్గరికి వచ్చింది. కాకి సింహంతో దేవా! మీరు చాలా రోజులుగా ఆహారం లేక బాధపడుతున్నారు కనుక నన్ను ఆహారంగా తీసుకోండి అని అంటుంది.
అప్పుడు సింహం ఇలాంటి పని కంటే ప్రాణంపోవడమే మంచిదని అంటుంది. నక్క, పులి కూడా ఒకరి తర్వాత ఒకరు నన్ను స్వీకరించమంటారు. కానీ సింహం అలా చేయడం ఎప్పటికీ మంచిది కాదని అనడంతో చిత్రకర్ణుడు కూడా ప్రభువు ఏమి చెయ్యడనే నమ్మకంతో తనని తినమంటుంది. అప్పుడు పులి తన గోళ్ళతో ఒంటెను చీల్చి చంపడంతో అందరూ దానిని తిన్నారు. అందుకే సజ్జనులకు కూడా దుర్మార్గుల మాటలతో చంచలమవుతుందని అంటారు.
తరువాత మూడవవాడు కూడా బ్రాహ్మణున్ని సమీపించి మొదటి ఇద్దరి వలె అనేసరికి బ్రహ్మణుడు తనకే మతి చెడిందని నిజంగానే కుక్కని తెస్తున్నా అని భావించి నిజమైన మేకని వదిలి వెళ్ళిపోయాడు. ఆ ముగ్గురు మేకని స్వీకరిస్తారు.
No comments:
Post a Comment