1. रावणं प्रति हनुमता कृतम् उपदेशं सङ्ग्रहेण लिखत।
(अथवा)
2. हनुमदुपदेशः इति पाठ्यभागस्य सारांशं लिखत ।
कविपरिचयः - हनुमदुपदेशः इति पाठ्यभागः वाल्मीकिमहर्षिणा विरचिता श्रीमद्रामायणे सुन्दरकाण्डस्य एकपञ्चाशत्तम सर्गात् स्वीकृतः।
కవిపరిచయము - హనుమదుపదేశః అను పాఠ్యభాగం వాల్మీకి మహర్షిచేత రచింపబడిన శ్రీమద్రాయణంలోని సుందరకాండ నందు 51వ సర్గనుండి స్వీకరించబడినది.
పాఠ్యభాగ పరిచయము - ఈ పాఠ్యభాగము నందు నవవ్యాకరణకర్తగా పేరుగాంచిన వాయుపుత్రుడైన హనుమంతుని రాయబార కౌశలము, వాక్చాతుర్యములు చక్కగా వర్ణింపబడినవి. ఈ పాఠ్యభాగమునందు రామునకు సీతాదేవిని అప్పగించమని రావణునికి హనుమంతునిచే ఉపదేశింపబడినది.
हनुमता रावणाय उपदेशः - ఓ రావణా! వానరరాజైన సుగ్రీవుని యొక్క ఆదేశముతో నీ లంకా రాజ్యమునకు వచ్చితిని. సోదర సమానుడైన సుగ్రీవుని ధర్మార్థములతో కూడిన మాటలు ఇహపరలోకములందు శ్రేయస్సుని కలిగించును. धर्मार्थसहितं वाक्यमिह चामुत्र च क्षमम्।
श्रीरामस्य पराक्रमः - ప్రజలకు తండ్రి వంటివాడు, గొప్పసైన్యమును కలిగినవాడు దేవేంద్రునితో సమానుడైన దశరధుడు అను రాజుకు పెద్ద కుమారుడు, ఆజానుబాహుడు, ధర్మనిరతుడు అయిన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి సోదరుడైన లక్ష్మణునితో, భార్యయైన సీతాదేవితో అరణ్యమునకు ప్రవేశించును.
रामो नाम महातेजा धर्म्यं पन्थानमाश्रितः।
लङ्का नगरे सीता - మహాసాధ్వీ, జనకమహారాజు కుమార్తే అయిన సీతాదేవి దండకారణ్యమున కనపడుటలేదు. సీతను వెతుకుతూ ఋష్యమూక పర్వతమునకు లక్ష్మణునితో వచ్చిన రామునకు సీతను వెదుకుటయందు సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేసెను. तस्य तेन प्रतिज्ञातं सीतायाः परिमार्गणम् రాముడు సుగ్రీవున్ని వానర రాజుగా చేయుటకు నీకు తెలిసిన వానర ప్రముఖుడైన వాలిని ఒక్క బాణముతో హతమార్చి వానర, భల్లూకములకు ప్రభువుగా, కిష్కిందకు రాజుని చేసెను.
सङ्ख्ये शरेणैकेन वानरः।
సత్యప్రతిజ్ఞ కలవాడైన సుగ్రీవుడు తన లక్షలమంది వానర సైన్యములతో అన్నిదిక్కుల యందు వెదుకుచున్నారు. వారిలో కొందరు గరుత్మంతునివంటి బలం కలిగినవారు, మరికొందరు వాయువేగం కలవారు.
असङ्गतयः शीघ्रा हरिवीरा महाबलाः।
వారిలో వాయుపుత్రుడైన హనుమంతుడను నేను సీతను వెదుకుచూ వంద యోజనముల సముద్రమును దాటిన నాకు నీ లంకయందు ఆ సీతాదేవి దర్శనం లభించినది.
भ्रमता च मया दृष्टा गृहे ते जनकात्मजा।
हनुमदुपदेशः - ఓ రాజా! నీవు ధర్మార్ధములు తెలిసినవాడవు, గొప్ప తపస్సులు చేసి వరములను పొందినవాడవు. అటువంటి నీవు పరస్త్రీలను బంధించుట తగదు. ధర్మశాస్త్రములకు విరుద్ధమైనవి, అపాయకరమైనవి, మొదటకే వినాశనమును కలిగించు చెడు కార్యాలకు నీ వంటివారు పూనుకొనరు. క్రుద్ధులైన రామలక్ష్మణుల బాణములకు ఎదురుగా నిలుచుటకు దేవాసురులలో కూడా ఎవ్వరికి శక్తి చాలదు. అన్ని కాలాలయందు హితమైనది,ధర్మబద్ధమైనది, ప్రయోజనకరమైనది అగు నా మాట విని పురుషోత్తముడైన రామునకు జానకీదేవిని అప్పగించుము.
नरदेवाय जानकी प्रदीयताम्।
ఓ రావణా! నీచే అపహరింపబడి తేబడిన ఆ సీతాదేవి నీ లంకానగరాన్నంతటిని కాటువేయనున్న ఐదు పడగల ఆడసర్పమని తెలుసుకోలేకున్నావు. ఆమె నీ పాలిట మృత్యువు. ఎన్నో కష్టాలను భరించి తపస్సుతో నీవు దేవతల వలన, అసురులవలన మరణము లేని వరమును పొంది కూడా నాశనము చేసుకొనుట యుక్తం కాదు. దానికి కారణము- మానవుడైన రాముడు, కపీశ్వరుడైన సుగ్రీవులతో నీ ప్రాణములను ఎట్లు కాపాడుకొనగలవు.
చేసిన కర్మయొక్క ఫలితము శుభాశభకార్యములను తప్పక అనుభవించును కావున నీవు ఆచరించిన ధర్మంయొక్క ఫలము నీకు లభించినది. నీ అధర్మ పలమును త్వరలోనే పొందగలవు.
फलमस्याप्यधर्मस्य क्षिप्रमेव प्रपत्स्यसे।
हनुमता रावणाय हितवचनानि - ఓ రావణా! నీ హితముు గోరి చేప్పుచున్నాను. చతురంగ బలము కలిగిన లంకా నగరమును నాశనము చేయగల నాకు శ్రీరాముని అనుమతి లేదు. శ్రీరాముడు సీతను అపహరించిన శత్రువుని సంహరించెదనని వానర సమక్షమున ప్రతిజ్ఞ చేసెను. రామునకు అపకారం చేసిన దేవేంద్రునికైన సుఖము లేదు. ఇక నీ వంటి వాని పరిస్థితి ఏమవునో! నీచే బంధించబడిన సీత లంకనంతటిని సర్వనాశనము చేయు కాళరాత్రిగా తెలుసుకొనుము.
कालरात्रीति तां विद्धि सर्वलङ्काविनाशिनीम्
సీతా అను కాలపాశమును ధరించియున్నావు. ఆమె తేజస్సుకు విశాలమైన వీధులు, రాముని కోపంచే ఈ పట్టణము అగ్నికి ఆహుతి అగును.
కావున ఓ రావణా! నీ మిత్రులను, మంత్రులను, బంధువులను సోదరులను, హితులను భోగాలను, భార్యలతో కూడిన లంకను నాశనము చేయకోవద్దు. రామ దూతైనైన వానరుడినైన నా మాట విని సీతను రామునికి అప్పగించుము అని హనుమంతుడు ఉపదేశించెను.
No comments:
Post a Comment