1. रघोः शौर्यम् इति पाठ्यभागस्य सारांशं लिखत।
अथवा
2. युवराजस्य रघोः शौर्यं विवृणुत।
कविपरिचयः - रघोः शौर्यम् इति पाठ्यभागः महाकवि कालिदासेन विरचित रघुवंशमहाकाव्यस्य तृतीयसर्गात् स्वीकृतः।
कालिदास कवेः वैशिष्ट्यम् - कालिदासेन कुमारसम्भवम्, रघुवंशमिति महाकाव्यद्वयम्, विक्रमोर्वशीयम् - मालविकाग्निमित्रम्- अभिज्ञानशाकुन्तलम् इति रूपकत्रयम्, ऋतुसंहारः - मेघसन्देशः खण्डकाव्यद्वयम् प्रणीतम्। उपमालङ्कार प्रयोगे कालिदासः प्रमुखः। अतः उपमा कालिदासस्य इति आर्योक्तिः सुप्रसिद्धैव।
కవిపరిచయము - రఘోః శౌర్యమ్ అను పాఠ్యభాగము మహాకవి కాళిదాసుచేత రచించబడిన రఘువంశమహాకావ్యము యొక్క తృతీయసర్గనుండి స్వీకరింపబడినది.
కాళిదాసుని గొప్పతనము - కాళిదాస మహాకవి కుమారసమభవమ్, రఘువంశము అను రెండు మహాకావ్యాలు, విక్రమోర్వశాయమ్, మాలవికాగ్నిమిత్రమ్, అభిజ్ఞానశాకుంతలమ్ అను మూడు నాటకాలు, ఋుతుసంహారమ్, మేఘసందేశమ్ అను రెండు ఖండకావ్యాలను రచించెను. ఉపమాలంకార ప్రయోగంలో కాళిదాసు నైపుణ్యం కలిగినవాడు. కావున "ఉపమా కాళిదాసస్య" అని లోక ప్రసిద్ధడు.
पाठ्यभागपरिचयः - దిలీపమహారాజు తన కుమారుడైన రఘువుకి యువరాజ పట్టాభిషేకం చేసెను. దిలీపుడు తన వందవ యాగమున నియమించిన యాగశ్వమును ఇంద్రుడు అపహరించెను. రఘువు ఇంద్రునితో యుద్ధము చేసి విజయం పొందుటవలన సంతోషించిన ఇంద్రుడు రఘువుని అభినందించి వరము కోరుకోమని పలికెను. రఘువు తనతండ్రి యొక్క యాగఫలమును వరముగా అడిగెను. ఈ విషయాన్ని ఇంద్రుని దూత ద్వారా తెలుసుకున్న దిలీపుడు సంతోషించినవాడై రఘువుని అభినందించి "శతక్రతు" అను బిరుదుని పొందెను.
सन्तुष्टः दिलीपः रघुमभिनन्द्य शतक्रतुविरुदमवाप
दिलीपेन उत्सृष्टः यागाश्वम् - దిలీపుడు తనకుమారుడైన రఘువుకి యువరాజ పట్టాభిషేకమును చేసెను. వాయువుతో కూడిన అగ్ని వలె, శరత్కాలమునందు సూర్యుని వలె రఘువుతో దిలీపుడు అజేయుడై ఉండెను. 99 యాగములు చేసిన దిలీపుడు తన నూరవ అశ్వమేధయాగము నందు అశ్వమును విడిచి దాని రక్షణకై నియమించిన రఘువు తన పరివారము చూస్తుండగానే ఆ అశ్వమును దేవేంద్రుడు అపహరించెను. जहार शक्रः किल गूढ विग्रहः ఆశ్చర్యానికి గురైన రఘువుకి అకస్మాత్తుగా నందినీ ప్రత్యక్షమయ్యెను. ఆ ధేనువు పంచకముతో కన్నులు తుడుచుకున్న రఘువుకి ఎవ్వరికీ కనిపించని వస్తువులను చూడగలశక్తి లభించెను.
इन्द्रेण चोरितः यागाश्वम् - యాగాశ్వాన్ని రథముకి కట్టి తీసుకెళ్తున్న ఇంద్రున్ని చూసి రఘు గంభీర స్వరముతో ఓ దేవేంద్ర! యజ్ఞభోక్తవుడైన నీవు యజ్ఞదీక్షుడైన మా తండ్రిగారి యజ్ఞమును ఎలా భంగపరచదలచితివి. అది నీకు నష్టము కదా? అని ప్రశ్నించెను. क्रिया विघाताय कथं प्रवर्तसे। ఈ లోకమునందు యాగవిఘాతకులని నాశనం చెసే మీరే యజ్ఞవిఘాతము కలిగించినచో సత్కార్యమే నశించును కదా! కావున నా తండ్రి యాగాశ్వాన్ని తిరిగివ్వమని కోరెను.
రఘుమహారాజు మాటలకు రథమును వెనక్కి తిప్పినీవు చెప్పింది నిజమే కానీ మీ తండ్రి వంద యజ్ఞములను పూర్తిచేసి నాకున్న శతక్రతు అను బిరుదును పొందుటకు ప్రయత్నిస్తున్నాడు. మరి నాకు సొంతమైన ఆ బిరుదును పొందుటకు మరెవరూ అర్హులు కాదు. నీవు సగరుని కుమారుల వలె నశింపక వెళ్ళమని పలికెను. ఆ మాటలకు భయపడని రఘువు యాగాశ్వాన్ని విడవని ఇంద్రునితో యుద్ధానికి సిద్ధపడెను.
శివునితో సమానమైన శరీరం కలిగిన రఘువు బాణంతో ఇంద్రుని హృదయంపై కొట్టెను. वपुः प्रकर्षेण विडम्बितेश्वरः దేవేంద్రుడు కోపం కలిగినవాడై ఇంద్రధనస్సునందు బాణము ఉంచి విడువగా రఘువు హృదయమునకు తగిలి రక్తము స్రవించెను. రఘువు మరియొక బాణముతో ఇంద్రుని జెండాను విరుగగొట్టెను. మరింత కోపాన్ని కలిగిన ఇంద్రుడు సాధారణ బాణాలతో రఘువును జయించుట సాధ్యపడదని భావించి వజ్రాయధమును ప్రయోగించినా రఘువు నేలకు పడినా సైనికుల సింహనాధాలకు పైకి లేచి నిలబడటంతో అతని పరాక్రమానికి సంతోషించిన ఇంద్రుడు గుర్రమును తప్ప మరేదైన వరమును కోరుకోమనెను. రఘువు తన తండ్రి యొక్క అశ్వమేధయాగఫలాన్ని ప్రసాదించమని కోరగా దానికి ఇంద్రుడు అంగీకరించెను. రఘువుకి యాగాశ్వము దక్కకపోవడంతో సంతోషము కలగలేదు.
क्रतोरशेषेण फलेन युज्यताम्।
రఘువు కోరిక మేరకు ఇంద్రుడు మాతలి అనే దూత ద్వార దిలీపునికి ఈ విషయాన్ని చేరవేయడంతో సంతోషించిన దిలీపుడు తన కుమారుడికి పట్ఠాభిషేకము చేసి భార్యతో వానప్రస్తాశ్రమమునకు వెళ్ళెను.
No comments:
Post a Comment