1. जनादरः इति पाठ्यभागस्य सारांशं सङ्ग्रहेण लिखत।
अथवा
2. जनादरः इत्यस्मिन् पाठे कविना वर्णिताः प्राचीनप्रजानां श्थितिगतीः विवृणुत।
कविपरिचयः - अयं जनादरः नामक पाठ्यभागः कथापञ्चकात् सङ्गृहीतः। कविः श्री पि. पट्टाभिरामारावु।
కవిపరిచయము - ఈ जनादरः అను పాఠ్యభాగము ఆధునిక కవులలో ఒకరిగా పేరుగాంచిన శ్రీ పమిడిపాటి. పట్టాభిరామారావు గారిచే రచింపబడిన कथापञ्चकम् అను గ్రంధము నుండి స్వీకరింపబడినది.
पाठ्यभागसारांशः - ప్రాచీనకాలంలో ప్రజలయొక్క స్థితిగతులను స్వయంగా తెలుసుకోవడానికి రాజు తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి తన స్నేహితునితో కలిసి వేషమును మార్చుకొని దగ్గరలో ఉన్న గ్రామానికి బయలుదేరెను. राज्यस्य भारं सचिवे निधाय नृपः प्रतस्थे नववेषधारी। అక్కడికి చేరుకునె సరికి సాయంత్రం కావడంతో సంధ్యావందన కార్యక్రమాన్ని ముగించుకొని గ్రామంలోని ధర్మసత్రానికి చేరుకొని ఆ రాత్రి విశ్రాంతి తీసుకోనెను.
राजा ग्रामे प्रथमदिवसः - రాజు మరుసటి రోజు ప్రభాత సమయమున సూర్యుని ఎర్రని కిరణాలకు సముద్రపు అలలు సింధూరవర్ణముగా మారడం, పద్మమునుంచి మకరందం స్వీకరించి ఝుంకారనాదమును చేస్తున్న తుమ్మెదను చూస్తు ముందుకు వెళ్ళగా, పక్షులు తన పిల్లలను విడిచి ఆహారము కోసము వెళ్ళడాన్ని గమనించి ఆనందాన్ని పొందినవాడై కార్యసాధనకు శ్రమయే ఉత్తమ మార్గము అని భావించెను.
साध्ये स्वकार्ये श्रम एव युक्तिः
సూర్యనమస్కారములు పూర్తిచేసుకొని తన మిత్రునితో పాటు ప్రజల దినచర్యలను తెలుసుకునేందుకు భయలుదేరెను.
ఒక రైతు పెరుగన్నం పాత్రను పట్టుకొని నాగలిని ఎద్దులకు తగిలించి పొలానికి సిద్ధమయ్యెను. ఒక స్త్రీ ఇంటిముందు నీటిని చల్లి, బియ్యపు పిండితో అందమైన రంగవల్లికను వేయగా మరికొంత మంది రంగవల్లిక యందు ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను అలంకరించి పాటలను పాడుచూ చప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుచున్నారు. మైదానంలో బాలురు బంతితో ఆడుతుండగా, కొందరు గోపాలురు గోవులను మేపడానికి తన పిల్లలను తీసుకోని వెళ్తుండెను. ఒక గృహిణీ వెన్నను తీయుటకు పెరుగుకుండను పెద్ద కవ్వంతో చిలుకుతూ శ్రీకృష్ణుని గేయాన్ని మనోహరముగా పాడుచుండెను.
मनोहरं गायति कृष्णकीर्तनम्।
ఒక స్త్రీ గోవులనుండి పాలను పిండుతున్నప్పుడు ఆమె చేతిగాజులు చేస్తున్న వినసొంపైన శబ్దము, ఆ ప్రక్కనే పళ్ళులేని ఒక వృద్ధురాలు తన మనవరాలను పిలిచి రామాయణమును చెప్పమని కోరగా మనవరాలు ముక్తిని ప్రసాదించే రామకావ్యాన్ని మధురంగా కీర్తిస్తుండగా ఆ వృద్ధురాలు భక్తితో నమస్కరించుచుండెను.
भक्त्या वृध्दा मुकुलितकरा वन्दनं चाकरोत् सा।
ఈ విషయాలన్నింటిని గమనిస్తూ ధర్మసత్రానికి చేరుకొని తన మిత్రునితో చర్చిస్తూ ప్రశాంతమైన మనస్సుతో హాయిగా నిద్రించెను.
राजा ग्रामे द्वितीयदिवसः - మరుసటి రోజు నిర్మలమైన మనస్సుతో ప్రజల ధర్మకార్యాలను పరిశీలించుటకు బయలుదేరగా రాజు రావడాన్ని గమనించిన ఒక వ్యక్తి దగ్గరకి వెళ్ళి ప్రియమైన మాటలతో మీమ్మలను ఇంతకుముందు ఇక్కడ చూడలేదు. మీరు ఏ రాజ్యం నుండి వచ్చారు? ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించెను. అప్పుడు రాజు ఈగ్రామంలోని విశేషాలను స్వయంగా చూడాలని నా మిత్రునితో వచ్చి ధర్మసత్రమునందు ఉన్నామని సమాధానమిచ్చెను.
सुशर्मस्य वचनानि - ఓ మహాత్మా! నేను సుగుణుడు, సుమతి అను దంపతుల యొక్క కుమారుడను. నా పేరు సుశర్మ. మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిధ్యాన్ని స్వీకరించమని కోరెను. ఎందుకంటే అతిధికి ఆతిధ్యమివ్వడమంటే పూజాఫలము సిద్ధించినట్లే అని పలుకగా రాజు సంతోషించి సుశర్మని అనుసరించెను.
दैवस्वरूपो ह्यतिथिर्महात्मन्
అతిధిగా వచ్చిన రాజుని సుశర్మ మరియు అతని భార్య అతిధి మర్యాదలతో సత్కరించి షడ్రుచులతో కూడిన భోజనాన్ని వడ్డించెను. సత్యమును పలుకుట, అర్హులైన వారికి దానచేయుట, పెద్దలను సేవించుట వంటి ధర్మాలను ఆచరించు గృహము నందు లక్ష్మీ ఎల్లప్పుడూ నివాసముండును.
गृहिणे तन्वन्ति लक्ष्मीः सदा।
అతిథి సత్కార్యములను స్వీకరించిన రాజు మిక్కిలి సంతోషించి తిరిగి వెళ్తూ సుశర్మ ఒక గ్రామం యొక్క విశిష్టతను మంచి వ్యక్తులద్వారా తెలుసుకోవచ్చునని పలికి కృతజ్ఞతలు తెలియచేసి తన మిత్రునితో రాజ్యమునకు బయలుదేరగా సుశర్మ ద్వారం వరకు వచ్చి సాగనంపెను.
No comments:
Post a Comment