Breaking

Sunday, August 30, 2020

గురుశిష్యుల కథలో నీతి ఏమిటి?

                    ఒక పెద్ద నగరానికి దగ్గరలో ఉన్న చిన్న అనాధాశ్రమంలో 40 సంవత్సరాల వయసు కలిగిన కాలు విరిగిన వ్యక్తి (రఘు) ఉండేవాడు. అక్కడ ఉన్న పిల్లలను తన పిల్లలుగా చూసుకుంటూ మంచి చెడులను వివరిస్తూ కాలం గడుపుతున్నాడు. అందులో ఒకరు అరుణ్ (తెలివితేటలు, కోపం కలిగినవాడు), రెండవవాడు చరణ్ (చలాకీ తనానికి ముందుంటాడు), మూడవవాడు సంజయ్(అరుణ్ కి నమ్మినబంటు, వీడికి అన్నీ ఎక్కువే).

                       ఊరికి సర్పంచ్ (కనకారావు) భార్య (గంగా) ఆడబిడ్డ ప్రసవించగానే స్వర్గాన్ని పొందింది. కూతురు సంధ్యా కూడా తండ్రిలాగే గొప్పవి విలువైనవి తనదగ్గరే ఉండాలని ఆరాటపడుతుంటుంది. సర్పంచ్ కి మరో వ్యాపారం రియల్ ఎస్టేట్. వ్యాపారంలో భాగంగా ఊరి చివర ఉన్న అనాధాశ్రమాన్ని తన సొంతం చేసుకోవాలని రాత్రికి రాత్రి తగలబెట్టిస్తాడు. ఆ ప్రమాదంలో రఘు తనకు ఇష్టమైన ముగ్గురు పిల్లలతో మరొక పిల్లోడిని మాత్రమే రక్షించగలగుతాడు. ఆ పిల్లాడే మనోజ్ (తక్కువగా మాట్లాడతాడు, అరుణ్ కి బాగా ఇష్టమైనవాడు).

                     రఘు తనకున్న పలుకుబడిని ఉపయోగించి అగ్నిప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేయగా సర్పంచ్ అని తెలిసి ఇక ఎవరిని కలిసినా ఉపయోగం ఉండదని ఆ నలుగురు పిల్లలతో వెళ్ళిపోతాడు. అయితే ఆ పిల్లల్లో పెద్దవాడైన అరుణ్ తన మిత్రులతో ఇప్పుడు ఎవరిని రక్షించలేకపోయాము. కానీ ఇకపై అందరిని రక్షించాలని చెబుతాడు. కానీ రఘు వారందరికీ ఇది సమయం కాదని ఇప్పటి నుంచి ప్రయత్నం ప్రారంభిద్దామని దానికోసం మనమందరం వేర్వేరు ప్రదేశాల్లో ఉండాలని సంవత్సరానికి ఒకరోజు మాత్రమే కలుసుకోవాలని చెబుతాడు. చరణ్ని రఘుతో ఉండమని, వివరాలు అడిగినా అందరూ అగ్నిప్రమాదంలో మరణించారని చెప్పాలని అందరూ నిర్ణయించుకుంటారు.

       అలా సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటూ ఎప్పటికప్పుడు వారి ఆలోచనలు మార్చుకుంటూ చేతనైన సహాయం చేస్తూ పెరిగి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే కనకారావుకి కూతురుతో పాటుగా అక్రమాలు, ఆస్తులు కూడా పెరిగిపోయాయి. అంతేకాక ఎమ్మెల్యేగా ఎదిగినా పదవుల పైన, డబ్బు పైన ఆశ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు.

             ప్రతిసారి అందరూ కలిసి సంతోషంగా తిరిగి వెళ్లేవారు. కానీ ఈసారి చరణ్, గురువు ఇద్దరు కలుద్దామని ఉత్తరం కూడా రాసి, రాకపోవడంతో అరుణ్ సంజయ్ ని కనుక్కోమని చెప్తాడు. సంజయ్ కాలేజీకి వెళ్లి కనుక్కోగా చరణ్, సంధ్య అనే అమ్మాయిని కాలేజీలో ఇష్టపడ్డాడు. సంధ్యకి ఇష్టం లేకపోయినా వెంటపడుతున్నాడు. ఆ విషయం తెలిసి తండ్రి మనుషులతో కొట్టించాడు. ఆరు నెలల నుండి కనపడటంలేదని, సంధ్య వివరాలు తెలుసుకొని అరుణ్ కి వివరిస్తాడు.

          అన్ని విషయాలు తెలుసుకున్న అరుణ్ తనతో ఉద్యోగం చేసే సంధ్యే చరణ్ ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకొని చరణ్ గురించి చెప్పి సంధ్య తండ్రి తెలుసుకుంటాడు. కనకారావు దగ్గరికి వెళ్లి అడగగా వారు తన ఆశ్రమం లోని పిల్లల గురించి వెతుక్కుంటూ కాశీ చేరుకున్నారని చెబుతాడు. వారి కోసం వచ్చిన నీవెవరు? అని ప్రశ్నించగా చిన్న వయసులో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలియజేసి, రఘు యొక్క శిష్యుడినని చెప్పి ఇక నీవు చేసే అడ్డమైన పనులకు స్వస్తి పలికించడానికి వచ్చిన నీ శత్రువుని అని చెబుతాడు. ఇప్పటివరకు హూ విన్ ద డబ్బుని ప్రజలకు అందిస్తామని చెప్పి అరుణ్ మరియు మనోజ్ వెళ్లిపోతారు. 

               ఆ మాటలు విని తన తండ్రి చేసిన మోసాలను తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే చిన్నప్పుడు జరిగిన విషయం వలన చరణ్ రఘు అనే ఇద్దరిని చంపించాడు అని తెలుసుకుని అరుణ్ చేసే మంచి పనుల వలన అరుణ్ కి దగ్గర అవుతుంది. అయితే మనోజ్ తన తమ్ముడని, తన తండ్రికి మరో స్త్రీ(రాజ్యలక్ష్మి)తో సంబంధం ఉందని చేసే తప్పులు రాజ్యలక్ష్మికి తెలియడం వలన గర్భంతో ఉన్న ఆమెను యాక్సిడెంట్లో చంపడానికి ప్రయత్నించగా రఘు ఆమె కడుపులోని బిడ్డను మాత్రమే కాపాడగలిగారు అని అరుణ్ తెలియజేస్తాడు.

                        అరుణ వల్ల తనకి ఎలక్షన్స్ లో ఓటమి, తన కూతురు వెళ్లిపోవడానికి కూడా అరుణ్, మనోజ్, సంజయ్ లు ఈ ముగ్గురిని చంపాలనే ప్రయత్నంలో నిద్రిస్తున్న మనోజ్ ని అరుణ్ అనుకొని కిడ్నాప్ చేయడం, కారు శబ్దంతో మెలకువ రావడం వల్ల అరుణ్ వారిని అనుసరిస్తూ వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక కనకారావు అరుణ్ అనుకొని తీసుకువచ్చిన మనోజ్ ని చంపే ప్రయత్నంలో మనోజ్ నీ కొడుకేనని అనుసరిస్తూ వచ్చిన అరుణ్ తెలియజేస్తాడు. సంధ్య కూడా అరుణ్ దగ్గరే ఉందని తెలుసుకుంటాడు. 

             ఎదురుగా పెట్టుకొని కూడా చంపలేకపోతున్నాను అనే కసితో పక్కనే ఉన్న ఒక ఇనపరాడ్డుతో పొడవడానికి ప్రయత్నిస్తాడు. అంతలోనే చేసిన పాపాలు పడినట్లుగా కొడుకైన మనోజ్ చేతిలో మరణాన్ని పొందుతాడు. కనకారావు ఆస్తులు మనోజ్ కి వచ్చినా వాటికి ఆశపడక మా ఊర్లోనే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆస్తులు ఆశ్రమానికి ఇచ్చేసి మంచికార్యాలను చేసి ప్రజలందరిని సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. ఇక అరుణ్ సంధ్య తన ప్రేమ గురించి చెప్పడం వలన మనోజ్ దగ్గర ఉండి వివాహం జరిపిస్తాడు.

1. ఈ బ్లాగులోని మీ అనుభవాలను కథలోని నచ్చిన/నచ్చని అంశాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

2. క్రింద ఉన్న వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు ఈ కథను షేర్ చేయవచ్చు.





3 comments:

Anji said...

The suspense that has been matained throughout the story with unexpected twists and turns is amazing.... Keep it up

ALL THE BEST

Rk said...

Tq Anji sir

Anonymous said...

Excellent sir