Breaking

Thursday, September 3, 2020

చుంబనం ఎన్ని రకాలు? ఎవరు ఎక్కడ పెట్టాలి?

                  ఈ ఆర్టికల్ లోని విషయాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం మంచి విషయాన్ని తెలియజేయాలి అనే భావన తప్ప. మరే దురుద్దేశం లేదు అని గమనించాలి.



                     ఒక మారుమూల పల్లెటూర్లో  ఒక హైస్కూల్.  చుట్టుపక్కల గ్రామాల నుండి ఎందరో విద్యార్థులు అక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. అక్కడ ఎప్పటినుండో అక్కడే పనిచేసే ఉపాధ్యాయులు అక్కడి ప్రజలకి ఉపాధ్యాయుల గురించి బాగా తెలుసు. కానీ ఎందుకో ఒకరోజు  ఆ ఊళ్లోని తల్లిదండ్రులు పాఠశాలకు పరిగెత్తుకుంటూ వచ్చారు.
                 
                  పాఠశాలకు ఎప్పుడూ రాని విధంగ తల్లీదండ్రులు రావటం చూసి ప్రధానోపాధ్యాయుడు  అయిన రవి చాలా సంతోషంతో అందరికీ వాళ్ళ పిల్లల చదువు మీద శ్రద్ధ ఉన్నందుకు సంతోషంతో వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వారి ముఖాల్లో కోపం, అసహ్యంతో కనపడటంతో ఎవరినో కొట్టడానికి వచ్చినట్లు భావించాడు. 

                     ప్రధానోపాధ్యాయుడు అయిన రవి   వారందరి  రాకకు కారణం అడిగే లోపే వారందరు ముక్తకంఠంతో సత్యం అనే ఉపాధ్యాయుడు ఎవరు? అని గట్టి గట్టిగా కేకలు వేయడంతో ఏమిచేయాలో తెలియక  ఆ ప్రధానోపాధ్యాయుడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. తల్లిదండ్రులు ఆవేశంతో నోటికి వచ్చిన మాటలన్నీ అన్నారు.   పిల్లలకు పాఠాలు చెప్పకుండా చుంబనాలు గురించి చెబుతున్నాడు, పిల్లల్ని చెడు దారి పట్టిస్తున్నాడు. ఎవరు అతను? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేసరికి, ప్రధానోపాధ్యాయుడు చాలా ధైర్యంగా, సత్యం అనే ఉపాధ్యాయుని మీద నమ్మకంతో తాను అటువంటి వ్యక్తి కాదని, తన పేరుకి తగినట్లుగా సత్యపలుకులు పలుకుతూ  అందరి మన్ననలను పొందిన వ్యక్తి అని చెప్తాడు. 

                     ఆ మాటలకి ఆ తల్లిదండ్రులు మరి చుంబనం గురించి ఎందుకు చెప్పాడు. అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకోవాలంటే సత్యమనే గురువుని ఇక్కడికి పిలిపించండి అని అడుగుతారు. ఒకవేళ పిలిపిస్తే అతను అబద్ధం చెప్పవచ్చు ఏమో. అసలు జరిగిన విషయం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయుడు తరగతిగదికి వెళ్ళాక తనకు తెలియకుండా బయటి నుండి వినమని చెప్పి వారందరినీ తరగతిగది దగ్గరకు పంపుతాడు. తరగతిగది బయట తల్లిదండ్రులు ఉన్నారని తెలియక ఉపాధ్యాయుడు విద్యార్థులతో నిన్న గంట కొట్టడం వలన ఆగిన కథకి కొనసాగింపుగా చుంబనం అంటే ముద్దు అని, ముద్దు మూడు రకాలు అని ఒక్కో దాని గురించి ఇలా వివరిస్తాడు.

1. తండ్రి తనబిడ్డకి నుదుటి మీద ఇచ్చే ముద్దు. 
ఇది తన బిడ్డ నుదుటి రాత బాగుండాలని ఇచ్చేది. తండ్రి తన పిల్లల జీవితానికి కావలసిన ధనార్జన చేస్తూ, జ్ఞానాన్ని ప్రసాదించేలా చేస్తాడు. అందులో ఎటువంటి లోటు రాకూడదు అని ఆశిస్తూ ఇచ్చేది.

2. తల్లి తనబిడ్డకి బుగ్గ మీద ఇచ్చే ముద్దు.
ఇది తన బిడ్డ అందంగా, ఆరోగ్యంగా  ఉండి, ఎవరి దిష్టి తగలకుండా ఉండాలని ఇచ్చేది. తల్లి గుణాలు బిడ్డకు వచ్చేలా అందరితో మంచిగా కలిసేలా చేస్తూ మంచి పేరుప్రఖ్యాతులు కలగాలని ఆశీర్వదిస్తూ ఇచ్చే ముద్దు

3. భార్యకి పెదవి మీద భర్త ఇచ్చే ముద్దు. 
ఇది భర్త తన కుటుంబానికి సంబంధించిన విషయాలు భార్య పెదవి దాటకూడదని ఇచ్చేది. అటు పుట్టింటి విషయాలు ఇటు మెట్టినింటికి సంబంధించిన విషయాలు  ఇక్కడివి అక్కడ, అక్కడవి ఇక్కడ నోరు జారకూడదు. వాటివల్ల ఎటువంటి అనర్థాలు రాకుండా ఉండటం కోసం ఇచ్చేది.
            ఈ మూడు రకాల ముద్దుల విశిష్టతలను తెలియచేసి చదువు జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ ఆ జీవితంలో మనలను ఉన్నత స్థానం లో నిలబెడుతుంది. కుటుంబ వ్యవహారాలలో చదువుతో వచ్చిన ఆ జ్ఞానం పనికిరాదు.  ఆధునిక కాలంలో పిల్లలు చదువుతోపాటు అన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్తూ ఉండగా విని తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుని వద్దకు వెళ్ళి ఉపాధ్యాయున్ని తప్పుగా అర్ధం చేసుకున్నామని క్షమాపణ చెప్తారు.
                    అయితే ఆ ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయున్ని పిలిపించి  తాను "చుంబనం" అనే విషయాన్ని చెప్పడానికి కారణం అడుగగా ఆ ఉపాధ్యాయుడు  ప్రతి ఒక్కరికి సృష్టిలో మొదటి అద్భుతము ముద్దు అది నా చివరి బోధనా తరగతి  (ఇక పదవీ  విరమణ) అనే విషయాన్ని చెప్తాడు.
                    
                    ఆమాటలకు అందరూ సంతోషించి, ఉపాధ్యాయునికి శుభాకాంక్షలు తెలియజేసి, సిగ్గుతో అక్కడినుండి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల ఎదుగుదలకు, ఉన్నతమైన స్థితికి ఆ పాఠశాలలో పనిచేసిన ప్రతి యొక్క గురువు పేరుని వారి బంధువులకు, మిత్రులకు తెలియచేయడం ప్రారంభించారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా సత్యమనే గురువును తప్పుగా అర్థం చేసుకున్నందుకు లోలోపల  కుమిలిపోతూనే ఉన్నారు
     గురువు తన ఆలోచనలను తన అనుభవాన్ని వివరించి తన శిష్యుల విజయాన్ని తన విజయంగా భావిస్తాడు.

1. మిత్రులందరికీ ఒక విన్నపం క్రింద వచ్చిన గంట సింబల్ నొక్కితే నా బ్లాగు నుండి వచ్చే ఆర్టికల్ లేదా కథ మీకు సందేశం రూపంలో వచ్చును.

2. ఈ ఆర్టికల్ లేదా కథను క్రింద ఉన్న వాట్సాప్, ఫేస్బుక్ మొదలగు సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు పంపవచ్చు.

3. ఈ బ్లాగులోని మీ అనుభవాలను, ఆర్టికల్ లేదా కథ గురించి కామెంట్ రూపంలో తెలియజేయగలరు.