Breaking

Friday, September 18, 2020

మరణం ఎందుకు తెచ్చుకుంటున్నారు.

                                    కొన్ని సంవత్సరాల కిందట మనిషి సాధారణంగా వంద సంవత్సరాలు బ్రతికేవాడు. అప్పట్లో కొత్త రోగం వస్తే మందు లేక మరణించేవారు. కాలంలో మార్పులను బట్టి మనిషి ఇప్పుడు సుమారుగా 70 సంవత్సరాలు బతుకుతున్నాడు. ఇప్పట్లో కొత్త రోగాలకు కూడా మందులు కనిపెడుతున్నారు కానీ మనుషుల ఆలోచనలకు, ఆశలకు హద్దులు లేకపోవడం వలన మరణాలు కావాలని కొని తెచ్చుకుంటున్నారు.

                    ఎంతో పుణ్యం చేసి ఉంటే మానవజన్మ వచ్చిందంటారు. మరి ఈ మానవ జన్మని పొంది చాలామంది సంతోషంగా గడపకుండానే మధ్యలోనే చదువులో మంచి మార్కులు రాలేదని కొంతమంది, అప్పులు చేసి అవి తీర్చలేక మరి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కారణాలు ఏవైనా కావచ్చు కానీ తనకు తానుగా శిక్ష (ఆత్మహత్య) విధించుకోవడం చాలా తప్పు.

                  ఎంతోమంది భార్యాభర్తలు పిల్లలు పుట్టలేదని డాక్టర్ల చుట్టూ, దేవాలయాల చుట్టూ తిరిగి ధనాన్ని ఖర్చుపెట్టుకొని ఎన్నో అవమానాలు భరిస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటి కాలంలో కొంతమందికి పిల్లలు పుట్టలేదని, మరికొంతమందికి ఆడపిల్లలే పుట్టారని, కొంతమందికి అంగవైకల్యం కలిగిన పిల్లలు పుట్టారని చంపే వారున్నారు, చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఇది ఇప్పటి సమాజం.

                 ముందు మనుషులు మానసికంగా ధైర్యాన్ని పొందాలి. అది ఎలా సాధ్యపడుతుంది?, ఎక్కడైనా నమ్ముతారా? ఎక్కడైనా దొరుకుతుందా? ఇలా కాదు ఆలోచించాల్సింది. మనకి మనుషులతో సత్సంబంధాలు ఏర్పడాలి. అంటే స్నేహ సంబంధాలు, బంధువులు మాట్లాడటం, వారిని కలవడం ఒంటరిగా లేకుండా, ఎప్పుడు మొబైల్ తోనే కాలక్షేపం చేయకుండా ఎప్పుడు అందరితో సంతోషంగా ఉన్న రోజు కచ్చితంగా మనోధైర్యం పెరుగుతుంది.

దానికి కారణం: 

                       ఇప్పటి కాలంలో కుటుంబానికి ఒకరు లేక ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలను తల్లిదండ్రులు గారాబంగా, ప్రేమగా పెంచుకుంటున్నారు. అయితే తల్లిదండ్రులు పక్కింటి పిల్లలను చూసి వారు పెద్ద పెద్ద పాఠశాలలో, కళాశాలలో చదువుతున్నారని మన పిల్లలని కూడా అక్కడే చదివించాలని ఆశపడి చేర్చుతున్నారు. కానీ పిల్లవాడి మార్కులు వచ్చినప్పుడు తప్ప మరెప్పుడు ఆ పిల్లవాడి చదువు మీద శ్రద్ధ తీసుకోరు. ఒక్కసారిగా ఆ పిల్లవాడి మీద ఒత్తిడి పెరగడంతో వారి జీవితం మధ్యలోనే అంతమవుతుంది. తల్లిదండ్రులకి పిల్లలు ఎక్కడ చదివారు అనేదానికన్నా ఎంత జ్ఞానాన్ని సంపాదించారు అనే విషయం పైన దృష్టి పెట్టాలి.

ప్రతి పిల్లవాడికి జీవితంలో ఏదో సాధించాలని ఆశ కానీ సాధించే ప్రయత్నంలో ఏదో లోటు. ఆ లోటుని తెలుసుకునే సమయానికి తన జీవితమంతా అయిపోయింది అని భావిస్తారు.

                     తల్లిదండ్రులు పిల్లలకు చదువు అందించడంతో పాటు ఆటలను ప్రోత్సహిస్తూ, మనోధైర్యాన్ని, మిత్రుల నుంచి సలహాలు, అందుతాయని భరోసా ఏర్పడితే ఒకవేళ జీవితంలో ఓడినా, తల్లిదండ్రుల, మిత్రుల సహకారంతో ఓటమికి గల కారణాన్ని తెలుసుకుని ఖచ్చితంగా విజయం సాధిస్తాం అనే నమ్మకాన్ని కలిగి ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. నమ్మకమే విజయానికి పెట్టుబడి దానిని నువ్వు అందించిన రోజున నిప్పు కి వాయువు తోడైనట్లు వాడి విషయంతో నీ నీ విషయం ముడిపడి ఉంటుంది ఇది ఎప్పటికైనా వాస్తవమే. రకాలుగా చెప్పినా మరణానికి మొదటిమెట్టు భయం కాబట్టి భయం లేకుండా ఉన్న వాడు కచ్చితంగా మరణాన్ని సాధిస్తాడు అనడంలో సందేహం లేదు కదా! నిజమే కదా!

               మరి ఒకప్పుడు ఒకే ఇంట్లో నలుగురు ఐదుగురు పిల్లలు ఉండేవారు వారిలో ఒకరు బాగా చదివినా మిగతా ఒకరు లేదా ఇద్దరు కొంచెం అటుఇటుగా చదివినా ఒక్కడు చదువుకోకపోయినా వారందరికీ ధైర్యం చెప్పడానికి, ఏదోక పని నేర్పించడానికి తల్లిదండ్రులు సహాయపడేవారు. అన్నదమ్ములు ధైర్యం ఇచ్చేవారు. ఇదంతా మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. 

             మరి ఇప్పుడు అందరూ ఉద్యోగాలు, వ్యాపారాలు చూసుకుంటూ హడావుడిగా ఉండటం వలన పిల్లలు చెడు దారిలో పడటం లేదా వారు చేసిన తప్పిదాల వల్ల మరణాన్ని పొందడం జరుగుతుంది. మనకు డబ్బు కన్నా మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం.  కొంచెం శ్రద్ధ తీసుకుని అయినా వారితో మాట్లాడటం, వారు చేసే పనుల గురించి తెలుసుకోవడం, లేదంటే వారంలో ఒకరోజు అయిన వారిని బయటకు తీసుకు వెళుతూ ఆ వారంలో జరిగిన సంఘటనలను అడిగి కనుక్కోవడం వల్ల వారు కొంచెం మానసికంగా, బలంగా తయారవుతారు అన్నది నా నమ్మకం.

ఇక్కడ తెలుసుకోవాల్సింది జనాభాని కాదు ఉన్నటువంటి పిల్లలకి జ్ఞానాన్ని ఇస్తూ, వారితో కనీసం రోజుకు ఒక గంట అయినా పిల్లల చదువుల గురించి, వారి జీవిత లక్ష్యం గురించి, ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి కావలసిన విషయాల గురించి చర్చించ గలిగితే  ఆ వ్యక్తి జీవితంలో నీవే అద్వితీయమైన శక్తివి కాగలవు.

1. మిత్రులందరికీ ఒక విన్నపం. క్రింద వచ్చే గంట గుర్తును నొక్కడం వలన నా బ్లాగ్ నుండి వచ్చే కథ గాని ఆర్టికల్ గానీ నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది.

2. ఈ ఆర్టికల్ లేదా కథని క్రింద కనబడుతున్న వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు పంపవచ్చు.

3. ఈ బ్లాగులోని మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

3 comments:

Unknown said...

Nice sir same story Natho undi sir koncham difference

Anonymous said...

Nice

Unknown said...

Yes
This really..