అసలు ఈ రోజుల్లో యూట్యూబ్ లో వీడియోలు అయితే ఎంతసేపైనా చూస్తారుకానీ, పుస్తకాలు, న్యూస్పేపర్లు, కథలు చదివేవారు లేరేమో, ఒకవేళ ఉన్నా తక్కువ మంది చదువుతారు ఏమో......... కానీ అమ్మాయి గురించి అనగానే ఖచ్చితంగా చదువుతారు.
సృష్టి ప్రారంభమైన నాటినుంచి తన కన్నా బిడ్డల గురించి, భర్త గురించి, కుటుంబం గురించి నేటికీ మరి ఎప్పటికైనా ఆలోచిస్తూ, తనవారి కోసం కష్టపడే అలుపెరగని అద్భుతం ఎవరంటే ఒకే ఒక్కరు " స్త్రీ". ఎంత గొప్ప చరిత్ర సృష్టించిన మగాడైనా ఒక అమ్మకు కొడుకే అందుకే చెప్పారు పెద్దలు. "సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినది ఒక అమ్మ" ఇక్కడ అమ్మ అంటే స్త్రీ. అందుకే "కంటే కూతుర్నే కనాలి" అని పెద్దలు ఊరకే అనలేదు.
మరి అంత గొప్పగా చెప్పిన మాటలు కాదని ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టిందని చంపేసేవారు, ఎక్కువ మంది ఉన్నారు స్త్రీ లేకపోతే మనకు జన్మే లేదు కాబట్టి ఆలోచించండి.ఎంత మంది కొడుకులు ఉన్నా ఒక్క కూతురు లేదే అని బాధ పడేవారు ఎంతో మంది ఉన్నారు. సర్వసాధారణంగా నవ్వుకోవడానికి ఆడవారి (స్త్రీ) మీద వేసిన జోకులు అవి హిట్. ఆ జోకులలో స్త్రీ లేకపోతే అది ఫట్.
బంధాలు కలవాలన్న, స్నేహం కలకాలం నిలవాలి అన్నా ఖచ్చితంగా అది ఇంటికి వచ్చిన కోడలు (స్త్రీ)మీద ఆధారపడి ఉంటుంది. మగవారి కన్నా ఆడవారికి కసి, పట్టుదల ఎక్కువే. అందుకే ఇప్పుడు విద్యారంగంలో మగవారి కన్నా ఎక్కువ పట్టుదలతో, ఉద్యోగాలలో మగవారితో పోటీ పడుతున్నారు. వ్యాపార రంగంలో ఇప్పుడిప్పుడే ముందడుగులు పడుతున్నాయి.
కసి అనే పదానికి నిదర్శనం ఝాన్సీలక్ష్మీబాయి. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చిన్న పిల్లవాడిని వీపుకు తగిలించుకొని యుద్ధం చేసిన వీరనారిగా శాశ్వతంగా అందరికీ గుర్తుంటుంది. రాజ్యాలు ఏలిన మహారాణులలో గొప్ప కీర్తిని పొందింది. ఆ తర్వాత కాలంలో ఎంతోమంది మహారాణులకు ఝాన్సీలక్ష్మీబాయి ఆదర్శం. "పట్టుదల" అనే పదానికి నిదర్శనం మాత్రం మదర్ థెరిస్సా, సరోజినీనాయుడు,
ప్రస్తుతకాలంలో కల్పనా చావ్లా, కిరణ్ మజుందర్ షా, మేరీ కోమ్, కిరణ్ బేడి, హంపి, మిథాలీ రాజ్, సింధు ఇంకా చాలామంది భారతదేశపు కీర్తిని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళినవారు.
కాబట్టి స్త్రీలను విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ప్రోత్సహించండి, వారి మనోభావాలను గౌరవించండి.
చదివిన ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయలేక పోవచ్చు అంత మాత్రాన వారు చదివిన చదువు వృధా అయిందని కాదు. చదువు అంటే జ్ఞానం ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి, రాబోయే కాలంలో మార్పులకు అనుగుణంగా తన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి తల్లి నేర్పుతుంది. తండ్రి తన పిల్లల చదువులకు, కుటుంబ పోషణకు ధనార్జన కోసం పని చేస్తాడు. కానీ తల్లి అంటే స్త్రీ బిడ్డకు మంచీచెడులను, ధర్మాధర్మాలను నేర్పిస్తుంది.
స్త్రీ వలన రాజ్యాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. స్త్రీ కోసం రాజ్యాలను జయించిన వారు ఉన్నారు. దీనికి ఉదాహరణ: రావణాసురుడు బ్రాహ్మణోత్తముడు, గొప్ప శివ భక్తుడు, శివుడు అంతటివాడే తనకోసం రాజ మందిరాన్ని నిర్మించమని రావణాసురున్ని కోరాడు. అంతటి బలమైన రావణాసురుడు సీతను అపహరించడం వలన రాజ్యాన్ని, ప్రాణాలను సైతం కోల్పోయాడు. ఇక్కడ దుర్యోధనుడు ఉదాహరణగానే చెప్పుకోవచ్చు. తను కూడా పాండవుల మీద చిన్నప్పట్నుంచి కోపం ఉన్నా కేవలం ద్రౌపది నవ్విందని ఒకేే ఒక్క భావనతో వారికి కష్టాలు కల్పించాలని, వారిని అవమాన పరచాలని చివరకు వారే కష్టాలను కొని తెచ్చుకొని ప్రాణాలను కోల్పోయిన వారు కౌరవులు.
వివేకానందుని మాటలలో ప్రపంచ దేశాలకు తెలిసినటువంటి విషయం భారతదేశంలోని ప్రతీ "స్త్రీ" ఓ యువరాణి.
స్త్రీ గొప్పతనం గురించి ఎంత మంది చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా అది తక్కువే అవుతుంది. అందుకే స్త్రీ జీవితం కావ్యం లాంటిది ఎంత రాసినా అంతం ఉండదు............
కానీ ఒక్కటి వాస్తవం అదేమిటంటే స్త్రీ కి స్త్రీ యే శత్రువు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. ఎందుకిలా చెబుతున్నానంటే ఇప్పుడు కోడలుగా ఉన్న ప్రతి ఒక్కరూ అత్త గురించి చెడుగానే చెబుతారు, ప్రతి అత్తా కోడలు గురించి కూడా అలాగే చెబుతూ ఉంటుంది. మరి ఈ కోడలు అత్త వయసుకు వస్తే అప్పుడు ఏమైనా మారుతుందా! మారదు. కానీ అందరూ మాత్రం నేనైతే అలా చేయను నేను ఇలా చేయను అని చెబుతూనే ఉంటారు. ఈ కోడలు అత్త వయస్సు వచ్చేసరికి ఆమె కూడా అలాగే చేస్తుంది. ఏది ఏమైనా స్త్రీ ఒక శక్తి ఇది మాత్రం వాస్తవం
"కార్యేషు దాసి కరణేషు మంత్రి
భోజ్యేషు మాతా శయనేషు రంభ"
"స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం"
1. మిత్రులందరికీ ఒక విన్నపం. క్రింద వచ్చిన గంట గుర్తు నొక్కితే నా బ్లాగ్ నుండి వచ్చే కథ గాని, ఆర్టికల్ గాని మీకుమీకు నోటిఫికేషన్ల రూపంలో అందుతుంది.
2. ఈ ఆర్టికల్ ను వాట్సప్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు పంపవచ్చు.
3.ఈ బ్లాగులోని మీ అనుభవాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు.
4 comments:
👏👏
Super 👏👏👏👏
Very very 👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐🌷🙏🌷
It's good & ossom prediction 🌸✨😍😍🥳
Post a Comment