మనం సుఖంగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా ఈ రెండిటికీ కారణాలు పూర్వ జన్మలో మనం చేసిన పాపపుణ్యాల మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ఎవరూ రాకపోతే అనాధలా చనిపోయాడని లేక కుక్క చావు చచ్చాడు అనేవారు. మరి ఇప్పుడు కరోనాతో చనిపోయిన వారిని ఏమనాలి. అంటే ముందు చెప్పిన పదాలు అన్ని కూడా కల్పితం. ఏది జరిగినా మన తలరాత అనుకోవాలి.
భర్త బాధగా, మౌనంగా ఉండడాన్ని గమనించిన భార్య భర్తతో ఛీ ఎదవ జీవితం ఒకప్పుడు డబ్బు పుష్కలంగా ఉండేది కానీ తినడానికి సమయం ఉండేది కాదు. సంతోషంగా, సరదాగా గడుపుదాం అంటే సమయం ఉండేది కాదు. ఉద్యోగం, ఇల్లు, పిల్లలు అంటూ సమయం సరిపోయేది. సరే ఇప్పుడు కరోనా వలన సమయం దొరికింది సరదాగా గడపవచ్చు అని ఒక వారం సంతోషంతో, ఒక నెల కరోనా భయంతో ఇంట్లోనే సంతోషంగానే గడిచింది. కానీ అప్పుడే తెలిసింది కరోనా మహమ్మారి కుటుంబంతో సంతోషంగా గడపడానికి సమయం ఇవ్వలేదు అది కేవలం మన జీవితంలో మనం చేసే తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చింది అని చెబుతూ ఉండగా భర్త తప్పులేంటే ఏం తప్పు చేశాం అని అడుగగా దానికి సమాధానంగా భార్య ఇలా చెప్పడం ప్రారంభించింది.
మనకి ఇద్దరు పిల్లలు కరోనా పుణ్యమాని పెద్దవాడు పరీక్షలు రాయకుండానే పదోతరగతి పాస్ అయ్యాడు. రెండవవాడు ఏడో తరగతి వచ్చాడు. వారి భవిష్యత్తు కి అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. కానీ కుటుంబ పోషణకు మన జల్సాలకు జీతాన్ని ఖర్చుపెట్టి సేవింగ్స్ కి ఏమీ చేయలేకపోయాం. మరి ఇప్పుడు కరోనా వలన దీనమైన పరిస్థితి వచ్చింది. అది మన కుటుంబానికే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమస్యగా మారింది. కాకపోతే మనలాంటి కుటుంబాలకు అది పెద్ద సమస్యగా మారింది. ఈ మాత్రానికే మీరు డీలా పడిపోతే ఎలా?
మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు, మీరే జీవితం అని వచ్చిన భార్య, మంచిజీవితాన్ని అందించాలని ఆశపడి మనం కన్న పిల్లలు ఏమైపోవాలి. మనోధైర్యం ఉన్న స్త్రీకైనా భర్తే కొండంత అండ. అది మానసికంగానైనా, శారీరకంగానైనా అని వివరించింది.
అంతేకాక మంచిరోజులు వచ్చేంతవరకు వేచి చూద్దాం అలా వేచి చూడాలి అనుకుంటే మనకు చేతనైన పని తో ముందుకు సాగేందుకు ప్రయత్నం చేద్దాం. మానసిక క్షోభను అనుభవించే కన్నా మానవప్రయత్నం తో జీవనాన్ని ముందుకు కొనసాగించుడం మంచిది. చిన్నదైనా, పెద్దదైనా పని పనే కావున మీరు ఢీలా పడకండి. మీకు కుటుంబ సభ్యుల సహకారం ఎప్పుడూ ఉంటుంది అని ధైర్యాన్నిచ్చింది భార్య.
ఇది నా కథో లేదా నీ కథో కాదు ఇది ప్రపంచంలోని ప్రతి మధ్యతరగతి, దిగువ తరగతుల కథ ప్రతి వ్యక్తి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సహజం. కరోనా ప్రభావంతో ఇడ్లీ బండి పెట్టుకునే వాడి నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరు వారి సంపాదనను కోల్పోయి కష్టాలు ఎదుర్కొనే వారే. కానీ ఇప్పటివరకు మీరందరూ ఏదో ఒక సంస్థ మీద ఆధారపడి పని చేసి ఉంటే, ఆ సంస్థ ఇప్పుడు ఈ కష్ట సమయంలో మీకు ఉపయోగపడక పోయుంటే ఇప్పటికైనా మేల్కొండి. మీరు మీలో ఉన్న టాలెంట్ ని, మీకు నచ్చిన పనిని చేస్తూ ఎవరినో బాగుపరిచే బదులు మిమ్మల్ని మీరు బాగు పరచుకోండి.
ఒకసారి ఆలోచించండి ఈరోజు కష్టం ఉండొచ్చు కానీ మీరు కష్టపడి పనిచేసే కష్టం కూడా సుఖంగా మారుతుంది. మనం కష్టంలో ఆదుకోని సంస్థ కంటే మనలను మనము నమ్ముకునిి ఒక నెల కష్టపడినా, రెండు నెలల కష్టపడినా తరువాత నువ్వు జీవితంలో సక్సెస్ అవుతావు.
"కష్టం వచ్చినప్పుడు బాధపడినా సుఖం కలిగినప్పుడు సంతోషపడినా పర్వాలేదు కానీ జీవితం మధ్యలోనే ముగిసే ప్రయత్నం ఎప్పటికీ చేయకూడదు" మంచి సమయం కోసం ఎదురు చూద్దాం మంచి జరగాలని కోరుకుందాం.
ఇప్పటివరకు స్వాతంత్రం రాక ముందు వచ్చిన తరువాత, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఇలా చెప్పేవారు కానీ ఇకనుంచి కరోనా ముందు కరోనా తర్వాత అని రాబోయే తరాలవారు చెప్పుకుంటారు ఎందుకంటే అంతలా "భారతదేశ ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీసింది ఒక్క కరోనా మాత్రమే."
ఏది ఏమైనా ఇప్పటివరకు సేవింగ్ అని ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షణం నుంచి కొంచెమైనా సేవింగ్ చేసుకుంటూ ఇక ఎప్పుడు ఇటువంటి లాక్ డౌన్ పరిస్థితులు లాంటివి వచ్చినా ఆ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ కరోనా రాజు పేద అని తేడా లేకుండా ఎంతోమంది మహాపురుషులను తన సొంతం చేసుకుంది వారి అందరి ఆత్మలకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ......
జై హింద్
1. మిత్రులందరికీ ఒక విన్నపం. క్రింద వచ్చిన గంట గుర్తును నొక్కడం వలన నా బ్లాగు నుండి వచ్చే ప్రతి ఆర్టికల్ లేదా కథ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.
2. ఈ ఆర్టికల్ ను క్రింద ఉన్న వాట్సప్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా మిత్రులకు పంపవచ్చు.
3. ఈ బ్లాగులోని మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు.
No comments:
Post a Comment