లక్ష్యం తెలియని ఎందరికో లక్ష్యాన్ని తెలియచేసే గురువులకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు. గురువులకు, మేధావులకు, మేథో సంపన్నులకు అందరికీ శుభోదయం.
ఇక్కడి పదాలు నా మనోభావాలు ఎవ్వరి గురించికాదు. ఎవ్వరినీ తప్పుపట్టాలనీ కాదు. కాలానుగుణంగా ఆలోచనలు మారాలని మాత్రమే.
1.గురువే దైవం:
బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల సాక్షాత్కారమే గురువు. అటువంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను.
గురువు అంటే అంధకారాన్ని పోగొట్టి వెలుగు నింపేవాడు అని అర్థం. గ్రంథాలలో కూడా గురువులేని విద్య వ్యర్థం అని చెప్పారు. అరిస్టాటిల్ అంతటి గొప్ప గురువే అలెగ్జాండర్ తో భారతదేశం నుంచి తిరిగివస్తూ ఒక్క గొప్ప గురువుని తీసుకురమ్మని చెప్పాడంటే మన దేశంలోని గురువుల ప్రాధాన్యత తెలుస్తుంది. గురువు చదువుతో పాటు మంచి, చెడుల గురించి తెలియజేస్తూ నిస్వార్థంతో విద్యార్థిని ఉన్నత స్థానంలో నిలబెట్టడంలో తమ వంతు పాత్ర పోషిస్తారు. అందుకే మన దేశంలోని గురువులు మంచి స్థానం సంపాదించుకున్నారు. అందుకే
गुरुर्विना नास्ति ज्ञानम्, ज्ञानं विना वृध्दिः नास्ति।।
గురువు లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే వృద్ధిలేదు. మరి గురువు, జ్ఞానం ఇవి రెండూ ఉంటే శిష్యుడు అభివృద్ధి చెందుతాడు అంటే పోరపాటే దానికి చిన్న ఉదాహరణ.
ఒక గురుకులంలో కొంతమంది విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్నేహపూర్వకంగా ఆ గురుకులంలో విద్య నేర్చుకుంటూ గురువుకి సేవ చేసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే వారి విద్యాభ్యాసం పూర్తయ్యే సరికి అక్కడ ఉన్న వారిలో ఎవరు గొప్పవారు అని నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో గురువు అక్కడ ఉన్న వారందరికీ పరీక్ష పెడితే వారందరిలో ముగ్గురు సమానమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. అయితే ముగ్గురికి ఒకేసారి పరీక్ష పెట్టాలి అనుకొని గురువు శిష్యులతో రేపు ఉదయం మీ ముగ్గురు నాతో నదీ స్నానానికి వస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. అందరికీ ఒకటే సందేహం గురువు ఏ పరీక్ష పెడతాడు ఎలా గెలవాలి అని ముగ్గురి మనసులో మెదులుతూ ఉంటుంది. ముగ్గురిలో ఇద్దరు రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటారు. ఒకడు అయితే ప్రశాంతంగా నిద్ర పోతాడు. వాడి మనసులో ఒకటే ఆలోచన అదేమిటంటే రేపటి కార్యం గురించి ఇప్పుడు ఆలోచించుకుని ఉన్న సమయాన్ని వృధా చేసుకోకూడదు అనేది. గురువే ఒక మాట చెప్పి ఉన్నాడు అదేమంటే నుదుటున రాసిపెట్టిన రాతను ఎవరూ మార్చలేరు. కాబట్టి ఆలోచించి సమయం వృధా అనేది వాడి నమ్మకం.
రెండవరోజు ఉదయాన్నే ముగ్గురు శిష్యులను నది స్నానానికి తీసుకుని వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ముళ్లతో కూడిన దారిని చూపించి ఈ దారి గుండా ఆశ్రమానికి ముందుగా ఎవరైతే వస్తారో వారిని గొప్పవారిగా నిర్ణయిస్తాను అని చెప్పాడు. ముగ్గురు ఆశ్రమానికి కొంచెం సమయం అటుఇటుగా చేరుకుంటారు. వచ్చిన ముగ్గురిలో మూడోవాడు గొప్పవాడు అని గురువు కీర్తిస్తాడు. వెంటనే అందరిలో సందేహం ఎందుకు మూడో వాడు గొప్పవాడు అయ్యాడు? దానికి సమాధానంగా గురువు ఇలా చెప్తాడు
మొదటివాడు విజయం సాధించాలనే తపనతో ముళ్ళను సైతం లెక్కచేయకుండా పాదుకలు ధరించి త్వరగా గమ్యాన్ని చేరతాడు. రెండోవాడు మొదటి వాడి అడుగులలో అడుగులు వేస్తూ తను గమ్యాన్ని చేరతాడు. కానీ మూడోవాడు ఆలస్యంగా గమ్యాన్ని చేరతాడు. అయితే గురువు మూడోవాడే ఉత్తముడు అని చెప్పగా అక్కడ శిష్యులందరూ ఎందుకు మూడోవాడు ఉత్తముడు అని ప్రశ్నిస్తారు. దానికి సమాధానంగా మూడోవాడు దారిలోని ముళ్ళను తీసివేస్తూ అందరూ నడవడానికి వీలుగా దారిని ఏర్పాటు చేశాడు మొదటి ఇద్దరు వారి స్వార్ధం మాత్రమే చూసుకున్నారు కానీ మూడోవాడు గురువు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఎందరో ఆ దారిలో నడవడానికి సహాయపడ్డాడు అని వివరణ ఇచ్చాడు.
ఇక్కడ అర్థం చేసుకోవలసినది గురువు ఉన్నంత మాత్రాన శిష్యుడు గొప్పవాడు అవుతాడు అనుకుంటే అజ్ఞానమే, జ్ఞానం పుట్టుకతో లభించిన గురువు యొక్క సహాయ సహకారాలు లేకుండా విజయం దక్కదు. అందరికీ గురువు, జ్ఞానం రెండు ఉండి గురువు చెప్పిన విషయాలను జ్ఞానంతో ఆచరణలో పెట్టిన శిష్యుడు మాత్రమేమాత్రమే విజయం సాధిస్తాడు.
గురువు లేకుండా జ్ఞానం ఉంది అని అనుకునేవారికి మహాభారతంలోని ఏకలవ్యుడు ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే ద్రోణాచార్యుడి విగ్రహాన్ని పెట్టుకుని విద్య నేర్చుకున్నా చివరికి అతని బొటనవేలు ద్రోణాచార్యుడు అడిగాడని గురుదక్షిణగా ఇవ్వడం వలన అతను నేర్చుకున్న విద్య మొత్తం కూడా వ్యర్థం అయ్యింది కాబట్టి అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే గురువుతో పాటు, జ్ఞానం రెండు సరైన పద్ధతిలో ఆచరణలో పెట్టినప్పుడే విజయం సాధిస్తాడు శిష్యుడు. అటువంటి శిష్యుని పొందినప్పుడే గురువుకి మహదానందం.
1. మిత్రులకు ఒక విన్నపం. క్రింద ఉన్న గంట గుర్తు ను నొక్కండి దాని వలన నా బ్లాగ్ నుండి వచ్చే కథను లేదా ఆర్టికల్ ను నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు.
2. ఈ కథ లేదా ఆర్టికల్ ను క్రింద ఉన్నటువంటి వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు పంపవచ్చు.
3. ఈ బ్లాగులోని మీ అనుభవాలను, కథ లేదా ఆర్టికల్ గురించిన విషయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు.
2 comments:
Excellent.
Excellent.
Post a Comment