రంజిత్(23) తన పుట్టినరోజు సందర్భంగా ఆరు నెలల తర్వాత మొదటిసారిగా హోటల్ కి వెళ్లి రుచికరమైన భోజనం స్వీకరించాలి అనుకొని సాయంత్రం బయలుదేరుతాడు. బెంగుళూరు సిటీకి పాతయినా పెద్ద హోటల్కి కొత్తగా వెళ్లడం వల్ల అక్కడే ధరలు చూసి భయపడి బయటికి వెళ్ళి పోతూ ఉంటాడు. అంతలో వీల్ చైర్లో ఒక వ్యక్తి అక్షయ్ (47) ఎదురుగా వస్తూ ఉంటే అందరూ సెల్యూట్ కొడుతూ ఉంటారు. ఎదురుగా వచ్చే అక్షయ్ ని చూసి సార్ ఎలా ఉన్నారు? అని ప్రశ్నిస్తాడు. రంజిత్ని గుర్తు పట్టిన అక్షయ్ ఎలా ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? నీ గురించి చాలా రోజులు వెతికాను కానీ నిన్ను పట్టుకోలేకపోయాను. రా లోపలికి వెళ్లి ఏమైనా తింటూ మాట్లాడుకుందాం అంటాడు దానికి రంజిత్ ఇక్కడ అన్ని ధరలు ఎక్కువ ఎక్కడికైనా వెళ్దాం అనిచెప్తాడు. దానికి సమాధానంగా ప్రమాదం జరిగిన తర్వాత హోటల్ ప్రారంభించానని చెప్పి రంజిత్ ఎక్కడ పని చేస్తున్నాడన్న వివరాలను సేకరిస్తాడు.
ఆ తర్వాత రోజు అక్షయ్ తన కుటుంబాన్ని తీసుకొని రంజిత్ పనిచేసే ప్రదేశానికి వెళ్ళి కుటుంబం మొత్తం ధన్యవాదాలు తెలియచేస్తారు. అయితే రంజిత్ ని తమతో రమ్మని కుటుంబం మొత్తం కూడా బ్రతిమిలాడుతారు. చేసేది మెకానిక్ పనైనా యజమాని మంచి జీతం ఇస్తున్నాడు అని తెలియజేస్తాడు. దానికి అక్షయ్ నీవు నాకు జీవితం ఇచ్చిన వాడివి నీకు మంచి జీవితాన్ని, జీతాన్ని కల్పిస్తానని తెలియజేస్తాడు.
అక్షయ్ కుటుంబంతో వెళ్లిన రంజిత్ అక్షయ్ కి జరిగిన ప్రమాదానికి కారణం తను ప్రమాదానికి ముందు బైక్ రేసర్నని బెంగళూరులో ప్రతి మూడు నెలలకు ఒకసారి రేసులు జరుగుతాయని గత సంవత్సరం వరుసగా జరిగిన మూడు రేసులలో నేనే గెలవడంతో అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. దానితో శత్రువులు కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చారు అని చెప్తాడు. అయితే ఇప్పుడు నా స్థానంలో నిన్ను నిలబెడతాను నీవు బైక్ మెకానిక్ వి కాబట్టి బండి యొక్క పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిగలవు అంతేకాక వేగంగా కూడా డ్రైవ్ చేయగలవని నా నమ్మకం కాబట్టి జీవితంలో నిన్ను మంచి స్థానంలో నిలబడతాను ఈ అవకాశంతో అని చెప్పి వివరిస్తాడు.
రంజిత్ కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని తండ్రి చనిపోయిన తర్వాత జీవితంలో ఎదగడానికి మొదటి అవకాశం ఇదేనని భావించి కష్టపడి రేసర్ లక్షణాలను, శరీరాకృతిని, బండిని నడపడానికి కావలసిన మరికొన్ని విషయాలు తెలుసుకుంటాడు. అయితే రంజిత్ కి ఉత్తరాలు, బహుమతులు, తనఫోటోలు తనకే రావడంతో తనని ఎవరో ప్రేమిస్తున్నారని తెలుసుకుంటాడు.
ఊహాలోకంలో, రంగుల ప్రపంచంలో, మంచుతెరల వెనక దాగిన ఆ అందాల తారని వెతికి పట్టుకోవడం కన్నా రంజిత్ కి రేసు ఒక పెద్ద సవాలు. దాన్ని జయిస్తే జీవితంలో అన్నీ సాధించినట్లే అని భావించి ఆ బహుమతుల విషయాన్ని పక్కన పెడతాడు. సినిమా కథలా తన జీవితం ఉంటుందని ఏరోజు అనుకోలేదు.
రేస్ జరిగే స్టేడియానికి వెళ్ళినప్పుడు అక్షయ శత్రువులు రంజిత్ ని చూసి ఎగతాళి చేయగా కోపంతో రగులుతున్న రంజిత్ కి అక్షయ్ నీవు నన్ను రక్షించిన ఆరోజు రాత్రి నన్ను ప్రమాదానికి గురి చేసింది వీరే అని చెప్పి ఈ రేసులో వీరితో జాగ్రత్త. కుటుంబ సభ్యులందరూ విజయంతో తిరిగి రమ్మని ధైర్యాన్ని చెప్పి పంపుతారు. అక్షయ మాత్రం నీ విజయం చదువులో ఫెయిలైన వారందరికీ ఒక గుణపాఠం కావాలి అంతేకాక ఓటమికి గెలుపుకి తేడా ఒక్క క్షణం మాత్రమే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని వివరిస్తాడు.
రేస్ ప్రారంభమయి అందరూ వేగంతో వెళ్తూ ఉండగా రంజిత్ ని మంచి ప్రయత్నంలో ఒక టర్నింగ్ దగ్గర బ్రేక్ వేయడంతో అప్పటివరకు వేగంగా వెళ్తున్న రంజిత్ అదృష్టం తండ్రి రూపంలో తనంటే ఉందేమో అన్నట్లుగా శత్రువుల ఆలోచనలను ముందే పసిగట్టడం తో తన బైక్ ని 5 అడుగుల ఎత్తుకి గాల్లోకి లేపడంతో శత్రువుల నుంచి తప్పించుకోవడమే కాకుండా విజయతీరాలకు చేరాడు. విజయం అందరు సాధారణంగా తీసుకున్న అక్షయ్ కి, రంజిత్ కి, రంజిత్ ని ప్రేమించిన అమ్మాయికి జీవితంలో మరువలేనివి
రంజిత్ కి ఆ ఒక్క క్షణం తన తండ్రి తనతోనే ఉండి విజయాన్ని అందించాడు అనిపించింది. ఇక రంజిత్ కి విజయం అంటే తనను ఇష్టపడుతున్న అమ్మాయిని వివాహం చేసుకోవడం. ఆ అమ్మాయి ని కనుక్కోవడం కోసం ఆలోచిస్తూ ఉండగా రేసు ప్రారంభానికి ముందు ఒక అమ్మాయి ఈ విజయం మన జీవితానికి నాంది పలకాలి అని చెప్పిన మాట గుర్తు వచ్చి అక్షయ్ వాళ్ల ఇంటికి స్వీట్స్ తీసుకొని వెళ్లి తనకు బహుమతులు, పూలు, ఫోటోలు పంపి ప్రేమించిన అమ్మాయి దొరికిందని రిజిస్టర్ ఆఫీసులో రేపే వివాహమని చెప్పగా అప్పటివరకు రంజిత్ ఎవరో తెలియని అమ్మాయిల ఉన్న అక్షయ్ కుమార్తె సోనాక్షి(21) తన ప్రేమని మనసులో దాచుకోలేక ఆ ఫోటోలు, బహుమతులు పంపింది నేనే అని చెప్తుంది.
రంజిత్ ఆ విషయం తెలుసు కానీ నీ ద్వారానే చెప్పించాలని కోరికతో వచ్చానని చెప్తాడు. మంచి మనసు కలిగిన వారికి అంతా మంచే జరుగుతుందని భావించి అక్షయ్ వివాహం జరిపిస్తాడు. రంజిత్ తన తండ్రి తనతోనే ఉన్నాడని అందుకే విజయం సాధిస్తున్నానని భావించి తన జీవితాన్ని సంతోషంగా గడపడం ప్రారంభిస్తాడు.
మనం ప్రమాదం జరిగినప్పుడు చూసి చూడనట్లు వెళ్లిపోతుంటాము కానీ సహాయం చేయాలనే ఆలోచన ఒక్క క్షణం చాలు ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని కాపాడుతుంది ఆ వ్యక్తి ఎందరికో జీవితాన్ని ఇస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది.
No comments:
Post a Comment