Breaking

Sunday, November 1, 2020

ఆశకి, అత్యాశకి తేడా ఏంటి?

          
       ఆశ ఏమిటి? కోరిక అంటే ఏమిటి? ఆశకీ కోరికకి తేడా ఏమిటి? ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించండి. మనిషి ఏదైనా ఒక కార్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని సాధించడాన్ని కోరిక అంటాము. కోరిక తీరిన తరువాతదానితో తృప్తి పడుట గాల్లో మేడలు కట్టడాన్ని ఆశ అంటాం. ఆశ మనిషిని ఉన్నతమైన స్థానానికి తీసుకు వెళ్తుంది. అత్యాశ మనిషిని పాతాళానికి తీసుకుపోతుంది.          
                 ఆశ మనిషిని బతికస్తుంది అత్యాశ సుఖాన్ని, బంధాలు అన్నింటినీ దూరం చేస్తుంది. కొంతమంది ఆశతో ఎదిగినా అత్యాశతో చచ్చి బ్రతికుతున్నారు.ఆశ ఆశ ఆశ, ఆశ లేకపోతే ఈరోజు మనం ఇంత దర్జాగా, ఇంత లగ్జరీగా బ్రతికి ఉండేవారిమి కాదేమో కదా! నిజమే, ఆ మాట వాస్తవం. ఈ రోజుల్లో జనాలు సంతోషంగా బ్రతకడం మానేసి ఎదుటివారి మీద పడి బ్రతుకుతున్నారు. దానర్థం ఎదుటి వారు కారు కొన్నారని వారికన్నా గొప్ప కారు కొనాలని ఇలా బ్రతుకుతున్నారు. మీరందరూ దీని పోటీ అనొచ్చు. కానీ పోటీ అనేది స్థాయిని బట్టి ఉంటుంది. ఇక్కడ స్థాయి ముఖ్యం.             
                          ఉదాహరణకి ఒక పిల్లవాడిని తీసుకుంటే 35 మార్కులుకూడా రాని విద్యార్థి స్టేట్ రాంక్ కొట్టాలని ఆశపడటం ఇది స్థాయిని గురించి తెలియజేస్తుంది. ఈ కాలంలో ఎక్కువగా జనాలందరూ అత్యాశతో ఉన్న  దానిని పోగొట్టుకోవడం, లేదా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

              సూర్య ఎంతో కోరికతో కష్టపడి చదువుకుని తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని హైదరాబాదులో సొంత ఇంటిని నిర్మించుకుని, వివాహం చేసుకొని వచ్చిన కట్నం డబ్బుని ఫిక్సిడ్ డిపాజిట్ చేసి, సంతోషంగా ఉద్యోగం చేస్తూ ఉన్న సమయంలో మిత్రులు అందరూ ఉద్యోగంతో పాటు పక్కన బిజినెస్ కూడా చేస్తూ  ఉండడంతో రోజురోజుకి వారి మాటలకు తనకి కూడా వ్యాపారం చేయాలి అని ఉత్సాహం పెరిగింది. దానితో వ్యాపారం ప్రారంభించాడు కానీ తెలియనివారు, తెలియని ఊరు కావడంతో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవాడు తెలియక తనతో ఉద్యోగం చేసే సహఉద్యోగితో కలిసి వ్యాపారం ప్రారంభించాడు. 
 
                       సూర్య ఎంత మంచివాడో అతని మిత్రుడు జీనా అంతే చెడు అలవాట్లు కలిగినవాడు. పగలంతా ఉద్యోగి. చీకటి పడితే మందు పడాలి, పేక ఆడాలి అది అతని కర్తవ్యం. జీనా గురించి తెలియక తనతో కలిసి ఒక స్థలాన్ని కొంటారు. దాని విలువ 22 లక్షలు అయితే తెలిసిన మిత్రుడు కాబట్టి మనకి 20 లక్షలు ఇస్తా అన్నాడు అని చెప్పి స్థలాన్ని కొని ఆరు నెలల తర్వాత 30 లక్షల వరకు అమ్మవచ్చు అని చెప్పడంతో ఆశపడి సూర్య తన వంతుగా పది లక్షలను జీనాకు ఇస్తాడు.

                            రెండు నెలలు తిరిగే సరికి 25 లక్షలకు అమ్ముడు పోవడంతో సంతోషంతో 2నెలలకి 10 లక్షలకి 2.5 లక్షలు వస్తాయి. అయితే మిత్రులందరూ కూడా జీనా తాగుబోతు, కాబట్టి అతనితో వ్యాపారం చేస్తే ఎప్పటికైనా నీకు ఎదురు దెబ్బలు తగలవచ్చు అని చెప్పడంతో సూర్య స్థలం కొని అమ్మడమే కదా! ఈ మాత్రం దానికి ఇంకొకరికి వచ్చిన లాభంలో సగం ఇవ్వటం ఏమిటి? అది కూడా నేనే తీసుకుంటే సరిపోతుంది కదా! అని చెప్పి జీనాకు చెప్పకుండా మొఖం దాటేస్తూ ఎవరో తెలియని ఒక బ్రోకర్ చెప్పిన మాటలు విని, నెల తిరిగేసరికి కోటీశ్వరుడు కావాలని ఆత్యాశతో ఎటువంటి సమాచారాన్ని తెలుసుకోకుండానే తన దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి ఒక స్థలాన్ని కొంటాడు. 
                         ఆ స్థలం నెల తరువాత అమ్మేటప్పుడు ఆ స్థలం యొక్క బాగోతం బయటపడుతోంది. ఆస్థలం వేరే వారి పేరు మీద రిజిస్టర్ అయింది అని తెలుసుకొని బ్రోకర్ చేతిలో మోసపోయాను అని ఎవరికీ చెప్పుకోలేక, పోయిన డబ్బులు రాబట్టుకోలేక బాధపడుతూ ఉంటాడు అలా అలా రెండు నెలలు గడుపుతాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న జీనా గట్టిగా అడిగేసరికి సూర్య అసలు నిజం చెప్తాడు. ఏది ఏమైనా సూర్యాని మోసం చేసిన వారిని వదిలి పెట్టకూడదు అనే అభిప్రాయంతో, 20 రోజులు ఆఫీస్ కి సెలవు పెట్టి తనకు తెలిసిన వారందరి ద్వారా ఆ బ్రోకర్ని పట్టుకొని బ్రోకర్ దగ్గర ఉన్న ధనాన్ని, మరొక స్థలం కాగితాలను తీసుకొని వాటిని సూర్యా కి అందిస్తాడు.
          కానీ జీనా వెళ్తూ మందు తాగి, పేకాట ఆడినంత మాత్రాన మనుషులు చెడ్డవారు అయిపోరని చెప్తాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న సూర్య నా కోసం ఉద్యోగం కూడా లెక్కచేయకుండా కష్టాలు పడినాడు. జీనాతో కలిసి వ్యాపారం చేయడానికి ఇష్టపడి, అతనికి తన గుర్తుగా బ్రోకర్ దగ్గర పొందిన స్థలం కాగితాలను బహుమతిగా ఇస్తాడు. జీనా మొదట కాదన్నా తర్వాత స్వీకరిస్తాడు. ఆ తర్వాత జీనా ఆ స్థలంలో  రెండు అంతస్తుల మిద్దె కట్టించి తన ఇంటి పైన ఉన్న ఇంటిని సూర్య కి ఇచ్చి మీరు ఇక్కడే ఉంటే చెడు అలవాట్లను మానేస్తాను  అని తెలియజేస్తాడు. అందరూ కలిసి  ఒకేచోట సంతోషంగా జీవితాన్ని గడుపుతారు.
                            ఈ కథలో "సూర్య జీవితంలో స్థిర పడాలనే కోరిక తీరింది." "డబ్బు సంపాదించాలనే ఆశతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చాడు అది కూడా తీరింది." ఇక తీరనిది అత్యాశ అదే అతని జీవితాన్ని నాశనం చేసే పరిస్థితికి తీసుకువచ్చింది కానీ మంచి మిత్రుడు ఉండటం వల్ల అతను  తన సంపదను, ఆస్తులను తిరిగి పొందాడు. ఇలా డబ్బులు పోగొట్టుకొని చెప్పుకో లేక బాధపడేవారు చాలా మందే ఉన్నారు కాబట్టి "అందరికీ హెచ్చరిక ఆశపడి కోరికలను తీర్చుకోండి కానీ అత్యాశకు పోయి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు."


4 comments:

Unknown said...

Nice

Anonymous said...

మంచి విషయాలను జనబాహుళళ్యంలోనికి తెచ్చి వివేకవంతుల్ని చేసే మీ... ప్రయత్నం అభినందనీయం మీకు శుభాకాంక్షలు. మీ...అభిమాని పూర్ణచంద్రరావు.

Unknown said...

మంచి కథలు అందిస్తున్నందుకు ధన్యవాదములు

RK (RAVIKANTHA REDDY) said...

కథలను చదువుతున్న మీ అందరికీ ధన్యవాదాలు.
ఎందుకంటే సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా సినిమాలు, కామెడీ షోలు చూసే వారే ఉన్నారు. అయినప్పటికీ ఓపికగా చదువుతూ రాసే వారిని ప్రోత్సహిస్తూ ఉండటం మీ గొప్పతనం. మరొకసారి ధన్యవాదాలు