ప్రతి మనిషి తను చేసేది తప్పా, ఒప్పా అనే విషయం ఎవరికి చెప్పినా చెప్పకపోయినా తన అంతరాత్మకు మాత్రం చెప్పుకోవాల్సిందే. ఒకవేళ నీవు అంతరాత్మకు కూడా చెప్పుకోలేకపోతే అది ఎంత తప్పో ఎవరూ చెప్పనవసరం లేదు.
దశరథుడు అంతటి వాడు కైకేయికి ఇచ్చిన మాట కోసం భరతున్ని పట్టాభిషీక్తుడిని చేయడం కోసం రాముడిని అడవికి పంపి, తన అంతరాత్మకు సమాధానం చెప్పుకోలేక, అంతర్మథనంతో పశ్చాత్తాపంతో మరణించాడు అని విన్నాం. సీతను అరణ్యానికి పంపే విషయంలో రాముడు ఒక్కసారైనా ఆలోచించి ఉంటే సీతకి కష్టాలు వచ్చేవి కాదు. అంతేకాదు గాంధారీ చేతిలో శాపాన్ని పొందిన శ్రీకృష్ణుడు యదు వంశాన్ని కాపాడుకోవడం కోసం ఎంతో మదనపడ్డాడని ఆ తర్వాత అర్జునుడికి కృష్ణావతారం పరిసమాప్తి కాబోతుందని తెలియచేసి అడవికి వెళ్లి ధ్యానం లో ఉన్నటువంటి సమయంలో వేటగానిగా పుట్టిన వాలి బాణం వలన కృష్ణావతారాన్ని చాలిస్తాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు మధన పడినా ద్వారక నగరాన్ని రక్షించుకో లేకపోయాడు. కొన్నిసార్లు మథన పడినా ఉపయోగం ఉండదు అని అంటానికి దశరథుని మరణం, సీతాదేవి కష్టాలు, శ్రీకృష్ణుడు అవతారం చాలించడం, ద్వారకా నగరం సముద్రములో మునగడం నిదర్శనాలు.
అభిరామ్, మహేశ్వరీ లకు ఒకే ఒక కుమారుడు అజిత్. అజిత్ ఆవేశాన్ని కలిగినవాడు, కానీ మంచివాడు అందరికీ సహాయం చేయాలనుకునే వాడు. తనకి హోటల్ మేనేజ్మెంట్ చేయాలని తన తల్లిదండ్రులను ఒప్పించి ముంబైలోని ఒక కాలేజీలో చేరిన కొన్ని రోజులకే అనన్య అనే అమ్మాయిని ఇష్టపడటం, ఆ తర్వాత ఎక్కువ మందితో స్నేహం, సముద్రానికి దగ్గరగా ఉండటం వలన అజిత్, అనన్యలు ప్రతిరోజు సాయంత్రం సముద్రపు ఒడ్డునే ఎక్కువగా కాలాన్ని గడుపుతూ ఉండేవారు. ఇలా మూడు సంవత్సరాలు ఎలా గడిచాయో కూడా తెలియని పరిస్థితి.
కాలేజీలో చదువు పూర్తయిన చాలా సంవత్సరాలకి ఇప్పుడు అదే సముద్రపు ఒడ్డున అనుకోకుండా ఒంటరిగా నడుస్తూ సముద్రపు ఒడ్డున జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన తప్పులకి మదనపడుతూ చదువుకునే సమయంలో జీవితంలో మనం కావాలనుకున్న వారు పక్కన ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మనసులో ఎప్పుడూ బలంగా అనుకునేవాడిని. కానీ చదువు పూర్తయ్యే సమయానికి అనన్య వివాహం చేసుకోమని గట్టిగా పట్టుబట్టడంతో ఉద్యోగం లేక, తల్లిదండ్రులను ఒప్పించ లేక అనన్యను దూరం చేసుకున్నాను. ఆ తర్వాత నా కోపం వలన మిత్రులను దూరం చేసుకున్నాను. కోరుకున్న ప్రియురాలు లేకపోతే జీవితంలో ఏమి సాధించలేమా? జీవితం అంటే ఇదేనా? ఇప్పటివరకు అందరూ కావాలి అనుకున్నాను. ఇప్పటినుండి ధనమే కావాలి అని నిర్ణయించుకొని కష్టపడితే ధనం సంపాదించుకోలేనా?
ఆ ఒక్క ఆలోచన రాత్రి పగలు తేడా లేకుండా దృష్టి మరోదారి పట్టకుండా ఎప్పటికప్పుడు లక్ష్యం నిర్ణయించుకుని ప్రేమాభిమానాలు మరిచిపోయి తల్లిదండ్రులు నిర్ణయించిన ఒక పల్లెటూరు అమ్మాయి కీర్తనని పెళ్లి చేసుకున్నా కేవలం భర్తగా కూడా ఉద్యోగమే. దానికి ప్రతిఫలం ఒక కొడుకు పృథ్వి. పల్లెటూరి అమ్మాయి అయినా చదువుకోకపోయినా తెలివితేటలు వినయ విధేయతలు కలిగినటువంటి అమ్మాయి కావటం వలన కుటుంబ బాధ్యతలను నేను పట్టించుకోలేదు దానికి కారణం నా లక్ష్యం. కాలం తెలియకుండానే కొడుకు పెరిగి పెద్దవాడు అయ్యాడు కొడుక్కి పెళ్లి సంబంధాలు చూడు అని భార్య చెప్పేంతవరకు కూడా కాలాన్ని మర్చిపోయాను.
కానీ పృథ్వి ప్రాణ స్నేహితురాలు మిషికా తన బంధువుల అమ్మాయి మన్విత గురించి ధనం లేక పోయినా మంచి అమ్మాయి అని చెప్పడంతో నా భార్య అంగీకరించడంతో కేవలం 20 రోజుల్లోనే పృథ్వి, మన్వితలకు వివాహం జరిగిపోయింది. 30 సంవత్సరాల వివాహ జీవితంలో నా వివాహం గురించి ఒక్కసారి కూడా తలచుకోలేదు. కానీ నా కొడుకు వివాహంలో నా జ్ఞాపకాలు నన్ను వెంటాడి ఈ సముద్రం ఒడ్డుకు చేర్చాయి.
పున్నమి వెన్నెల వెలుతురులో చల్లని గాలులు, అలల తాకిడితో నా అడుగులు పడుతూ ఉన్న సమయంలో చదువుకునే రోజుల్లో నేను ఎప్పుడూ కూర్చునే ప్రదేశంలో తల కిందకు ఉండడం వలన ముఖం కనపడని ఒక స్త్రీ కూర్చొని ఉండటంతో ముందుకు అడుగులు వేశాను. అంతలో అజిత్ వచ్చి కూర్చో అని ప్రేమగా, ఎక్కడో వినిన గొంతు అవడంతో అడుగులు ఆగాయి. అంతలో మరోసారి ఎలా ఉన్నావు? అప్పటి వరకు ఎక్కడో ఉన్న ప్రాణం ఒక్కసారిగా లేచింది ఆ గొంతు నాకు తెలుసు అన్నట్లుగా ఆగిపోయాను.
అడుగులు ఆగిపోయాయి, శరీరంలో ఒక్కసారిగా ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే జీవితం అనుకున్నా అమ్మాయి. నేను ప్రేమించిన, నన్ను ప్రేమించిన అమ్మాయి అనన్య. అనన్యని యోగక్షేమాలు తన జీవిత విషయాలు తెలుసుకోవాలని తపనతో నా నోటి నుండి ప్రశ్నలు మాత్రమే దొర్లుతున్నాయి. సమాధానాలు మాత్రం నా చెవులకి వినిపించడం లేదు. దానికి కారణం తన మౌనం. తను చెప్పిన ఒకే ఒక సమాధానం ఇక నేను ఎక్కువ రోజులు బ్రతకలేను కారణం ఆరోగ్యం బాగా దెబ్బతింది. గుండె ఆగినంత పనైంది. తెలిసిన వ్యక్తి కి ఆరోగ్యం బాలేదు అంటే చాలా బాధ పడతాము. ఇంట్లో వ్యక్తికి బాలేదంటే నిద్ర కూడా పోము. మరి ప్రేమించి దూరమై చాలా సంవత్సరాల తర్వాత కనపడిన వ్యక్తి ఇక నేను బ్రతకను అంటే ఆ మాట వినే వ్యక్తి బ్రతకగలడా?
అంతలో చిన్నగా ఇప్పటివరకు నేను బ్రతికి ఉన్నాను అంటే దానికి కారణం నీ భార్య కీర్తన వలనే. కీర్తన లాంటి భార్య దొరకడం నీ అదృష్టం. నా యోగక్షేమాలను ఇప్పటి వరకు చూసింది నీ భార్యే. నా కూతురు నీ కొడుకు ప్రాణమిత్రులుగా తయారవడానికి కారణం నీ భార్యే. అంతెందుకు ఈ క్షణం నేను నీ ముందు నిలబడడానికి కారణం నీ భార్యే. అంటూ అజిత్ ఒడిలో వారు ప్రేమించుకున్న అప్పుడు ఎక్కడైతే కూర్చునే వారో అదే ప్రదేశంలో అనన్య ఆత్మ శరీరాన్ని వీడింది.
మరుసటి రోజు ఉదయం దహన కార్యక్రమాలు అన్నీ అయిపోయాక కీర్తన, అజిత్ దగ్గరికి వెళ్లి క్షమించు అని ప్రాధేయపడింది. నా హృదయమంతా అంతుచిక్కని ప్రశ్నలు, శ్వాసనిశ్వాసలో కూడా సమాధానం చిక్కని ప్రశ్నలు దానికి కారణం కీర్తన కి అనన్య ఎలా తెలుసు అక్కడ ప్రారంభమైంది? నా మొదటి ప్రశ్న. కీర్తన నాకు మగ బిడ్డ పుట్టినప్పుడు ఏ తండ్రి అయినా సంతోషాన్ని భార్య, తన తల్లిదండ్రులతో పంచుకుంటాడు. కానీ పట్టించుకోని మిమ్మల్ని చూసి బాధతో అత్తమామలను అడిగినప్పుడు జరిగిన విషయం మొత్తం చెప్పారు. అప్పుడే నా ప్రయాణం నాకు తెలిసిన మిత్రుల సహకారంతో వారంలో ఒకరోజు అనన్య కోసం వెతుకులాట ప్రారంభించాను. కానీ అనన్యకు పాప పుట్టిన సంవత్సరానికి బ్లడ్ క్యాన్సర్ తెలియడంతో భర్త వదిలేశాడని తెలుసుకున్నాను. అనన్యకి నిన్ను కలిసిన క్షణం అదే చివరి క్షణం కావాలని కోరుకుంది. అదే జరిగింది కూడా.
చివరికి అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. కానీ మిషికా గురించి అనే లోపే కీర్తన మిషికాని తన తమ్ముడి కొడుకుకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుంది. ఇవన్నీ వినగానే అజిత్ కు తెలియని అంతర్మథనం దానికి కారణం పెళ్లయినప్పటి నుంచి ఈరోజు వరకు తిన్నావా? అని కూడా అడగకపోవడం. కానీ ఈ రోజు నా కోసం తన జీవితమంతా త్యాగం చేసింది. నేను అంటే ఎంత ఇష్టం ఉంటే ఇలా చేస్తుంది. ఇప్పుడు ఎంత బాధపడినా ఉపయోగం లేదు. ఇప్పుడైనా నా ఆలోచనలు కేవలం నా భార్య కోసమే అనేలా ఉండాలి నా ఈ చివరి క్షణాలు నా భార్య కే అంకితం చేయాలి అని నిర్ణయించుకున్నాను. ఆ క్షణం నుంచి ఎక్కడికి వెళ్లినా భార్యతోనే వెళుతూ ప్రేమగా ఆనందపరుస్తూ గడుపుతున్నాడు.
విన్నపం: ఈ కథలను మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ కథలో మీకు నచ్చిన విషయాలను, నచ్చని విషయాలను, కామెంట్ రూపంలో తెలియజేయండి.
2 comments:
Super
Very useful content🙏
Post a Comment