
హైదరాబాద్లో ధనవంతుల కుటుంబానికి చెందిన కీర్తి, శరత్ లకు ఒక్కడే కాదు మేడం కొడుకు, వాడే భార్గవ్. ఒక ఉమ్మడి కుటుంబం. మొట్టమొదటిసారిగా మగ సంతానం. ఇప్పటివరకు ఆ ఇంట్లో ఉన్న మగవారు అందరూ ఇల్లరికం వచ్చిన వారే. ఇక భార్గవ్ పుట్టాక ఆ ఇంట్లో ప్రతిక్షణం ప్రతిరోజు పండుగే. గారాల ముద్దుబిడ్డ అయ్యాడు ఆ ఇంటి మొత్తానికి. మొదటిసారిగా మగబిడ్డ పుట్టడంతో అందరూ జాతకాల మీద పడ్డారు ఆ జాతకంలో భార్గవ్ 24 సంవత్సరాల వయసులో మరణిస్తాడు లేదా సంచలనం సృష్టిస్తాడు. అంటే ఏదో గొప్ప మార్పు జరగబోతుంది అర్థం. దానికి కారణం ఆ వంశానికి ఉన్న శాపం అని జ్యోతిష్యుడు తెలియజేస్తాడు.
గ్రామాలకు దూరంగా అడివి ప్రదేశం లో జన్మించిన ఒకానొక, మరొక మగ పురుషుడు చందన్. తక్కువధరకు వచ్చినటువంటి పొలాన్ని అడవికి దగ్గరలో తీసుకుని అక్కడే పొలము చేసుకుంటూ ఉన్నారు చందన్ తల్లిదండ్రులు వారే లక్ష్మి, హరి. పెద్దగా ఆస్తి లేకపోయినా రెండు ఎకరాల పొలం లో ఇల్లు కట్టుకుని పండిన పంటలతో సంతోషంగా బ్రతికేస్తున్నారు. హరి అప్పట్లోనే పెద్దలు తిరస్కరించినా ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో అందరూ ఉన్నా లేని వారిగా బ్రతికేస్తున్నారు.
హరి చిన్నప్పటి నుండి తనకి నచ్చిన పని చేస్తూ ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవాడు. శత్రువుకి కూడా మంచి చేసే ఆలోచనలు కలిగిన వాడు. అలాగే తన కొడుకు చదివి ర్యాంకులు కొట్టక పోయినా పర్వాలేదు కానీ ఏదో ఒక విషయంలో నైపుణ్యాన్ని కలిగి ఉండేలా చేయాలి అని ఆశ. కొడుకుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా రావడంతో బంధువులు అందరూ తిరిగి కలవడంతో చందనే వారి అదృష్టం అని భార్యాభర్తల భావం. చందన్ తండ్రి మాట వింటాడా?
ఇకపోతే లావణ్య అనిరుద్ని వదిలిపెట్టేది కాదు. తన తమ్ముడిని ఎవరు పట్టుకున్న ఒప్పుకునేది కాదు. తల్లిదండ్రుల కన్నా అక్కే చాలా ప్రేమగా బడి వదిలి పెట్టగానే చదువు పక్కన పెట్టి తమ్ముడు తోనే కాలక్షేపం చేస్తూ ఉంది. అక్కాతమ్ముళ్ళు చివరి వరకు ఒకరికొకరు సహకారంగా ఉంటారా? అక్క ప్రోత్సాహంతో తమ్ముడు విజయం సాధిస్తాడా లేక తమ్ముడు సహకారంతో అక్క విజయం సాధిస్తుందా?.
ఉమ్మడి కుటుంబంలో కీర్తి, శరత్ తన కుమారుడి జాతకాన్ని తెలుసుకుని తన కుమారున్ని రక్షించుకోవడానికి వారు చేయాలనుకునే పని ఏమి? దీనివల్ల ఆ కుటుంబంలో జరిగే పరిణామాలేమిటి? ధనమున్న సుఖసంతోషాలు లేని వీరు తీసుకునే నిర్ణయాలు ఏమిటి?
ఈ మూడు కుటుంబాల ఆలోచనలు వారి పిల్లల భవిష్యత్తును ఏ విధంగా నిర్ణయిస్తాయి? ఆ పిల్లలు ఏ విధంగా ఎదుగుతారు? వారి ఆశయాలు సాధించుకునే క్రమంలో వారు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? వీరు ఏ విధమైన సంచలనం సృష్టించబోతున్నారు. వీటన్నిటికీ సమాధానమే ఈ సంచలనం.
1.మిత్రులకు ఒక విన్నపం క్రింద వచ్చిన గంట గుర్తును నొక్కడం వల్ల నా బ్లాగ్ నుండి వచ్చే ప్రతి ఆర్టికల్ లేదా కథను ముందుగా నోటిఫికేషన్ల రూపంలో మీరు పొందవచ్చు.
2. క్రింద ఉన్న సోషల్ మీడియా ద్వారా ఈ కథను మీ మిత్రులకు పంపవచ్చు
3. ఈ కథలోని మంచి చెడులను కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను.
3 comments:
Super bayya
Continue with suspension
Txs for ur supporting
Post a Comment