Breaking

Saturday, November 21, 2020

సంచలనం రెండవవారం

                  సంచలనం  రెండవవారం

                సంచలనం మొదటి వారానికి సంబంధించిన కథ చదవాలి అనుకుంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి. http://www.manakathalu.in/2020/11/blog-post_14.html


        ఈ కథలోని పాత్రలు కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కాదు. కేవలం మంచి విషయాలను తెలియ చేయాలనేది మా ఉద్దేశం. కావున అందరూ దయచేసి ఈ విషయాలను గుర్తించవలసిందిగా మనవి.



                    విజయ, నారాయణలు చిన్న పల్లెటూరు కావడంతో వ్యవసాయం చేసుకుంటూ, ఆ ఊర్లో రైతులకు పొలాల్లోని పంటను చూసి పంటకు సంబంధించినటువంటి పురుగుమందులను అమ్ముతూ ఉండేవాడు. ఆ ఊరిలో అతనికి చిన్ననాటి నుండి మిత్రుడు అయిన అనిల్ ఆర్మీలో పని చేస్తూ సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే ఊరికి వచ్చి ఉండేవారు. అనిల్ కి శరణ్యతో వివాహం జరిగి పది సం!! అయినా పిల్లలు పుట్టక పోవడంతో నారాయణ పిల్లలను తన పిల్లలుగా భావిస్తుంటారు. సరైన కాలంలో వర్షాలు పడకపోవడంతో పంటలు పండక పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో  సతమతమవుతూ ఉంటారు ఆ ఊరిలో జనం. అలా రెండు సంవత్సరాలు గడవడంతో ప్రజలు పడుతున్న కష్టాన్ని చూసి అనిల్ ఒక నిర్ణయం తీసుకుంటాడు అదేమంటే పాడి పరిశ్రమతో జనాలందరికీ చేయూత కల్పించాలని ఆశిస్తూ ఒక పాల డైరీ ని ప్రారంభించాలని దానిని నారాయణకు చెప్పి ఊరిలో ఉన్న వారందరినీ సమావేశపరుస్తాడు. మొదట అందరూ ధనం పరంగా ఇబ్బంది పడుతున్నామని వివరించి దానికి తిరస్కరిస్తారు. వారిని ఒప్పించడానికి ఏమి చేయాలి అనేది  అనిల్, నారాయణ ల ఆలోచన. 

           కీర్తి, శరత్ లది  ఉమ్మడి కుటుంబం కావడంతో శరత్ అప్పటివరకు ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ బంధువులకు అప్పగించి కొత్తగా భవనాలను నిర్మించే (construction company) సంస్థని తన మిత్రుడు చరణ్ తో కలిసి  ప్రారంభించడం వలన ఎప్పుడూ తిరుగుతూ బిజీగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కుటుంబంలో పెద్దలు కొత్త వ్యాపారం వద్దని చెప్పినా విస్తరింపజేసి కొత్త వ్యాపార రీత్యా అప్పుల పాలవుతాడు. కానీ పెద్దల మాటలకు  బాధపడినా ఎలాగైనా ఈ వ్యాపారంలో కూడా విజయం సాధించాలని మాట్లాడిన వారందరి మాటలకు తాళం వేయాలని కష్టపడుతూ ఉంటాడు. చరణ్ కోరిక మేరకు బ్యాంకులో లోను తీసుకుని మెంటల్ గా ఉన్న సమస్యను కొంచెం తగ్గించుకోవాలని అనుకొని ఇంట్లో పెద్దలతో మాట్లాడాలని కీర్తి కి తెలియజేస్తాడు. కీర్తి ఒప్పుకుంటేనే పెద్దలతో మాట్లాడాలి అనేది తన నిర్ణయం.

                దానికోసం విశ్వప్రయత్నం చేసి కీర్తిని ఒప్పిస్తాడు. కానీ పెద్దలు మాత్రం వారి ఆస్తులను బ్యాంకులో పెట్టడానికి ఇష్టపడరు. వారిని ఒప్పించే క్రమంలో అనేక మాటలు పడుతూ అన్నింటికీ ఓర్పే గెలుపుని ఇస్తుందని భావించి  భరిస్తాడు. కొన్ని రోజులకి కీర్తి బలవంతం మీద తన పేరు మీద ఉన్న ఆస్తులను బ్యాంకులో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో తన సమస్యలను పరిష్కరించుకుంటాడు. 

                      హరి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం రావడంతో పొలాన్ని కౌలుకు ఇచ్చేసి వారు ఉన్న పొలం దగ్గర నుంచి ఆ పాఠశాల ఉన్న గ్రామానికి వెళ్తారు. హరి మంచితనంతో ఆ పాఠశాలలోని పిల్లలను, వారి  తల్లిదండ్రుల మనసును  ఆకట్టుకుంటాడు.  అంతేకాకుండా  పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని తెలియజేసి ఆ గ్రామ రూపురేఖలను మార్చడంతో ఆ ఊరి సర్పంచ్ కృష్ణారెడ్డి హరికి సన్మానం చేస్తాడు. దానితో హరికి, కృష్ణారెడ్డికి మంచి స్నేహం ఏర్పడుతుంది. 

                   పెద్దలందరికి హరి అంటే గౌరవం ఉండడంతో కృష్ణారెడ్డి గ్రామాభివృద్ధికి కూడా హరి సలహాలను స్వీకరిస్తూ ఉంటాడు. అప్పటివరకు ఆ ఊరి నుండి పట్టణానికి చదువుకోవడానికి వెళ్ళే పిల్లలందరూ ప్రైవేట్ పాఠశాలలను మానేస్తారు. ఆ చుట్టుపక్కల ఊర్లో ఉండే వారందరూ కూడా ఈ ఊరికి పాఠశాలకు రావటం ప్రారంభిస్తారు. అలా రెండు సంవత్సరాలు గడిచేసరికి హరి కూడా ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో  మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించుకుంటాడు.

                 ఇప్పటివరకు ఊర్లో పరిస్థితులను చక్కదిద్దిన హరి విద్యార్థులకు కూడా తన కొడుకు విషయంలో జరగాలి అనుకున్న విషయం ఏమంటే చదువుతోపాటు ఏదో ఒక విషయంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి అనే అభిప్రాయంతో సర్పంచి ప్రోత్సాహంతో పిల్లలకు పాఠశాలలో యన్.సి.సి.ని, క్రీడలకు ప్రోత్సాహాన్ని కల్పిస్తాడు. ఇవన్నీ  ఆ పాఠశాలలో పనిచేసే ప్రిన్సిపాల్ కి నచ్చకపోయినా తప్పక ఒప్పుకుంటున్నాడు. అన్నిటికీ అసూయపడుతూ పాఠశాలలో ఏమి జరిగినా దాని గొప్పతనమంతా హరికే దక్కుతుందని లోలోపల కోపం పెంచుకుంటూ ఉంటాడు.

              అనిల్, నారాయణలు గ్రామంలో ప్రజలను పాల డైరీ పెట్టడానికి ఎలా ఒప్పిస్తారు. శరత్ బ్యాంకు లో పెట్టిన ఆస్తులను ఎలా విడిపిస్తాడు. హరి తన పాఠశాలలో ఉన్న ప్రిన్సిపాల్ ని ఎలా ఎదుర్కొంటాడు. ఈ విషయాలను వచ్చేవారం తెలుసుకుందాం.  

1. మిత్రులకు ఒక విన్నపం. క్రింద ఉన్న గంట గుర్తును నొక్కడం వలన నా బ్లాగ్ నుండి వచ్చే ప్రతి ఆర్టికల్ మీకు ముందుగా నోటిఫికేషన్లో లోకం అందుతుంది.

2.ఈ ఆర్టికల్ ను క్రింద ఉన్న సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు పంపవచ్చు.      

3. ఈ బ్లాగ్ లోని మంచిచెడులను కామెంట్ రూపంలో తెలియజేయగలరు .                   


No comments: