సంచలనం రెండవ వారానికి సంబంధించినటువంటి కథ చదవాలి అనుకుంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి.
http://www.manakathalu.in/2020/11/blog-post_21.html
ఈ కథలోని పాత్రలు కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కాదు. కేవలం మంచి విషయాలను తెలియ చేయాలనేది మా ఉద్దేశం. కావున అందరూ దయచేసి ఈ విషయాలను గుర్తించవలసిందిగా మనవి.
అనిల్, నారాయణలు గ్రామంలోని ప్రజలతో మాట్లాడితే ఉపయోగం లేదని భావించి ముందుగా ఆ గ్రామంలోని బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి వారందరికీ పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం లోన్లు ఇవ్వడానికి ఒప్పిస్తారు. దానికి గ్రామ ప్రజలందరూ, ముఖ్యంగా ఆడవారు సంతోషిస్తారు. పాల డైరీ ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆర్మీ అంటే రక్షణ. శత్రువులు దేశంలోకి చొరబడకుండా చూడటమే కాదు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి ఆర్మీ లో పనిచేసే ప్రతి ఒక్కరు బాధ్యతగా భావిస్తారు అని అనిల్ ని ప్రశంసిస్తారు. దానికి అనిల్ మాట్లాడుతూ ఇదంతా నా ఆలోచన కాదు. కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వమే అవసరం లేదు మన వల్ల ఒక్కరైనా సంతోషంగా ఉండాలి అని భావించే నిస్వార్ధమైన నా మిత్రుడు నారాయణ ఆలోచన. కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే వాడే నిజమైన మిత్రుడు మీ అందరి కష్టాన్ని తన కష్టంగా భావించి మీ అందరి ముందు నన్ను నిలబెట్టాడు. మీ అందరి మంచి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈ డైరీ బాధ్యత కూడా నారాయణే వహించాలి అన్నది నా నిర్ణయం.
శరత్ ప్రస్తుతానికి ఉన్న అప్పులు తీర్చుకుని సంతోషపడినా సాధ్యమైనంత త్వరగా బ్యాంకు లో ఉన్న లోను కూడా తీర్చుకోవాలనేది తన తాపత్రయం దానికోసం రేయింబవళ్ళు తన మిత్రుడు చరణ్ తో కలిసి కష్ట పడటం ప్రారంభిస్తాడు కానీ అనుకోని అదృష్టం వచ్చినట్లుగా అప్పటివరకు తను కొన్నటువంటి స్థలాలలో ఒక చోట ఒక పెద్ద హోటల్ నిర్మిస్తున్నారు అని వార్తలు రావడంతో భారీగా రేటు పెరగడంతో దానిని అమ్మినా కష్టాలు తీరిపోతాయి అని అమ్మకానికి పెడతాడు. కానీ ముందు ముందు ధరలు ఇంకా పెరుగుతాయని చరణ్ చెప్పడంతో కొన్ని రోజులు వేచి ఉండాలని నిర్ణయించుకుంటాడు. శరత్ కష్టాలు తీరడానికి చరణ్ కూడా తన ఇంటిని తాకట్టు పెట్టి ధనం తెచ్చి ఒక మంచి మిత్రుడు అని అనిపించుకుంటాడు.
శరత్ చేసిన పనికి మొదట అందరూ నిందించిన స్థలాలు రేటు పెరగడంతో అందరూ నోటి మీద వేలు వేసుకున్నారు. ఇప్పుడు శరత్ నిర్మించే భవనాలు అన్నిటికీ వారి బంధువుల సిమెంట్ వాడాలని పెద్దల ద్వారా అడిగించడం ప్రారంభించారు. కీర్తి కూడా ఒప్పుకోమని చెప్పడంతో తప్పని పరిస్థితులలో ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సి వచ్చింది.
హరి పనిచేస్తున్న పాఠశాలలోని ప్రిన్సిపాల్ ఒకసారి ఎన్.సి.సి. కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో ఒక పిల్లవాడు కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల అవకాశం దొరికిందని లోపల ఉన్న కోపాన్ని పిల్లల అందరి ముందు ప్రదర్శిస్తాడు. ఒకసారి సర్పంచ్ గ్రామ అభివృద్ధి కోసం గ్రామపంచాయతీ లో పెట్టిన సమావేశానికి హరిని ఆహ్వానిస్తే దానికి హరి ప్రిన్సిపాల్ ని పర్మిషన్ అడిగినా పంపించక పోగా స్కూల్లో ఉపాధ్యాయుడు అనే దానికన్నా కూడా సొంత పనుల మీద, సొంత ఎదుగుదల మీద ఆసక్తి చూపిస్తున్నావు. అప్పుడప్పుడు ప్రిన్సిపాల్ తన కోపం ప్రదర్శించడం తో హరికి ప్రిన్సిపాల్ పరిస్థితి అర్థం అయింది. దానికి సమాధానంగా ఈ పాఠశాలకు ఇప్పటివరకు ఏమి చేసినా అది నిస్వార్ధంగా, చేయాల్సిన దానికన్నా మన పాఠశాల, మన గ్రామం, అందరూ మనవారు అనుకోని పని చేశాను. ఇందులో నా స్వార్ధం అంటూ ఏమీ లేదు కదా! అని చెప్పడంతో నీకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది. అది కేవలం పాఠశాలలో పాఠం చెప్పడానికి మాత్రమే అని అసహ్యించు కుంటూ మాట్లాడి వెళ్ళిపోతాడు. ఈ పాఠశాలలో ఇక నాకు ప్రిన్సిపాల్ కు సరిపడదు అని అక్కడి నుండి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అని భావిస్తాడు.
ఈ విషయాలన్నీ కూడా తన భార్య లక్ష్మి కి చెప్పి బాధ పడతాడు. అయితే భార్య కూడా ప్రిన్సిపాల్ గురించి ఎక్కడ చెప్పవద్దని సాధ్యపడితే ట్రాన్స్ఫర్ తీసుకొని ఎక్కడికైనా వెళ్దాం అని సలహా ఇవ్వడంతో తప్పని పరిస్థితుల్లో కొన్ని రోజులు ఆరోగ్యం బాలేదని కేవలం పాఠశాలలో తరగతులు మాత్రమే పూర్తి చేసుకుని గ్రామ పనులను పట్టించుకోకుండా ఇంటికి వచ్చి తన కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ప్రిన్సిపాల్ గురించి ఎవరికీ చెప్పకపోయినా అక్కడ జరుగుతున్న విషయాలను ఉపాధ్యాయులు అందరూ అర్థం చేసుకుంటారు.
ఆ పాల డైరీ అభివృద్ధికి ప్రజలు ఏ విధంగా సహాయపడతారు? శరత్ తన బంధువుల నుండి వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కొంటాడు? హరి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావాలనుకుంటాడు. అవుతాడా? లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చే వారం మీ సంచలనం లో చూడండి.
1. మిత్రులందరికీ ఒక విన్నపం. క్రింద వచ్చే గంట గుర్తు ను నొక్కడం వలన నా బ్లాగ్ నుండి వచ్చే ఆర్టికల్ను ముందుగా నోటిఫికేషన్ల రూపంలో మీరు పొందవచ్చు.
2. ఈ కథను క్రింద ఉన్న సోషల్ మీడియా ద్వారా మిత్రులకు పంపవచ్చు.
3. ఈ బ్లాగులోని మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు
No comments:
Post a Comment