ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఈ కాలం పిల్లలకి అన్నీ క్షణాల్లో జరిగిపోవాలి. కానీ దాని కోసం పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ పెట్టిన మరుక్షణం నుంచి దాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అది రావడానికి సుమారు గంట పడుతుందని తెలుసు. కానీ ఎదురు చూస్తూ, నోరు పారేసుకుంటారు. అలాగే జీవితంలో కూడా ముందు వెనుక ఆలోచించకుండా చేసే పొరపాట్లే మనిషి జీవితాన్ని ఎటువైపో నిర్దేశిస్తాయి.
కలికాలం కలలు కనే కాలం కానీ ఆ కలలను నిజం చేసుకోవడానికి ఎంతో పట్టుదల, కృషి, తెలివితేటలు అవసరం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఆ కల కలగానే మిగిలిపోతుంది.
రమేష్, ప్రకాష్ ఇద్దరూ ఒకే ఊరు కావడంతో చిన్నప్పటినుండి కలిసి ఇంటర్ వరకు చదివారు. ఎంతో మంచి స్నేహాన్ని కలిగినవారు. రమేష్ తల్లి చిన్నప్పుడే మరణించడంతో తండ్రి పెంచి పెద్దచేసాడు. రమేష్ తండ్రి రైతు కావడంతో రమేష్ కూడా తండ్రితోనే ఉంటూ అక్కడ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ప్రకాష్ తండ్రి వ్యాపారం చేస్తూ ఉంటాడు. బాగా చదివి గవర్నమెంట్ టీచర్ గా ఉద్యోగాన్ని పొందాడు. ఇద్దరూ ఒకే ఊరులో బాగానే ఉన్నారు.
అనుకోకుండా అతిథిగా వచ్చినటువంటి తుఫాను ఆ గ్రామంలోని ప్రజలకు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎంతో మందికి వాళ్ల వారందరిని దూరం చేసింది. అయితే ఆ ఊర్లో ఎవరు పట్టించుకోకపోయినా రమేష్ తండ్రి మాటను అనుసరించి "కష్టంలో ఉన్నప్పుడే శత్రువు కూడా బంధువు అవుతాడు" అని చెప్పడంతో రమేష్ తనకు చేతనైనంతలో చేతనైనంత ఆ గ్రామ ప్రజలకు మూడు పూటలా భోజనం అందించడం ద్వారా ఆ చుట్టుపక్కల గ్రామాలలో మంచి పేరు సంపాదించుకున్నాడు.
కానీ రమేష్ చేసిన పనిని తన మిత్రుడు ప్రకాష్ తప్పు చేసావ్ అని అనడంతో రమేష్ మాత్రం ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అని సంతోషించాడు. రమేష్ ఊర్లోని అమ్మాయిని వివాహం చేసుకుని వారికి జన్మించిన ఇద్దరు (ఒక మగ, ఒక ఆడ) పిల్లలకు మంచీచెడులను తెలియజేస్తూ అదే ఊర్లో ప్రకాష్ పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. ప్రకాష్ మాత్రం ఒక్కగానొక్క కొడుకుని పట్టణంలోని ఒక మంచి ప్రైవేటు పాఠశాలలో హాస్టల్ లో ఉంచి చదివిస్తున్నాడు.
ప్రకాష్ కొడుకు వినోద్ చదువులో వెనకబడినా, ఖర్చు పెట్టడంలో మాత్రం ముందు స్థానంలో ఉండేవాడు, దానికి కారణం ఒక్కడే కొడుకు అని గారాబంగా పెంచడం, కానీ రమేష్ పిల్లలు అటు మంచితనము లోనూ ఇటు చదువులోనూ ముందు స్థానంలో ఉండటం వలన కొన్ని సంవత్సరాలకి ప్రకాష్ కి తన కొడుకు మీద కోపం రెట్టింపు అయ్యింది. దానికి కారణం వినోద్ చెడు స్నేహాలతో, అనవసర నోటి దురదతో కాలేజీ నుంచి సస్పెండ్ అవడం. అంతేకాక బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ బ్యాక్ లాక్స్ ఉండటంతో అటు తండ్రి ప్రేమకి, ఇటు మంచి ఉద్యోగానికి, దూరం కావడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయాడు. కానీ తల్లి సహకారంతో తండ్రికి తెలియకుండా తల్లి బంగారమంత బ్యాంకు లో పెట్టి, ధనాన్ని స్వీకరించి మిత్రుల మాటలను నమ్మి తక్కువ కాలములో ఎక్కువ సంపాదించాలనే తపనతో తెలియని షేర్ మార్కెట్ వ్యాపారం ప్రారంభించి ఒక సంవత్సరానికి ఉన్న డబ్బంతా కూడా పోగొట్టుకున్నాడు.
రమేష్ కూతురు కావ్య బాగా పట్టుదలతో చదవడంతో మంచి ఉద్యోగాన్ని సంపాదించకుంది. తనకు వచ్చిన మొదటి జీతాన్ని తండ్రి అంగీకారంతో మరికొంత ధనాన్ని తండ్రి దగ్గర స్వీకరించి తన తమ్ముడు విజయ్ మరియు వినోద్ లతో ఒక బైక్ షోరూమ్ ను ప్రారంభిస్తుంది. దానికి కారణం విజయ్ ఎంబీఏ చేయడం, వినోద్ బీటెక్‌లో మెకానిజం చేయడం, అప్పటినుడి వినోద్ కూడా తన చెడుసావాసాలు వదిలి కష్టపడి జీవితంలో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. కావ్య తెలివితేటలు విజయ్ కి వినోద్ కి మంచి జీవితాన్ని ఇచ్చాయి.
అయితే ప్రకాష్ తను చేయలేని పని తన మిత్రుని కుమార్తె చేసిందని సంతోషపడి, కావ్య ను తన కుమారుడికి ఇచ్చి వివాహం చేయమని అడగడంతో, కావ్య కు వినోద్ అంటే ఇష్టం ఉంది కాబట్టే వినోద్ చెడు సావాసాలు మానేసి జీవితంలో స్థిరపడిన తర్వాత వివాహం చేసుకుంటానని నాతో చెప్పడంతో నేను దానికి అంగీకరించి, వినోద్ మంచి దారి లోకి వచ్చి, స్థిర పడితేనే వివాహం చేస్తానని చెప్పాను. అప్పటి వరకు తన మనసులో మాట వినోద్ కూడా చెప్పనని చెప్పింది. కానీ ఇప్పుడు మీరే మీ కొడుకు కి నా కుమార్తెను అడగడం చాలా ఆనందంగా ఉంది.
ఈ కథలో పట్టుదల, కృషి, తెలివితేటలు ఉండటం వలన కావ్య తనతో పాటు తను కావాలనుకునేవారిని కూడా జీవితంలో విజయం సాధించేలా చేసింది. కలికాలం కి ఉదాహరణ వినోద్. తక్కువ కాలంలో ఎదగాలి అనుకున్నాడు కానీ ఎదగలేక పోయాడు తొందర పడితే ఏది సాధ్యపడదు.
ఏ కార్యమైనా ఆలోచించి నెమ్మదిగా ప్రారంభించి విజయం సాధించాలని కోరుకుంటూ మీ రవికాంత్.
నవంబర్ 14 నుండి ప్రతి శనివారం వీక్లీ స్టోరీని ఈ బ్లాగ్ లో చదవండి.
3 comments:
👌👌👌👌👌👌👌👌👌👌👌
Good message Ravi
అందరికీ ధన్యవాదాలు
Post a Comment