సంచలనం ఆరవ వారానికి సంబంధించిన ఈ కథను చదవాలనుకుంటే ఈ క్రింది లింకును నొక్కండి.
http://www.manakathalu.in/2020/12/blog-post_19.html
అనిల్ తల్లి, మిత్రుడు మరియు మిత్రుని భార్య దహన కార్యక్రమాలు పూర్తి చేసుకొని తిరిగి వచ్చే సమయంలో ఊరి పెద్దలందరూ విజయ, నారాయణల పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉండగా విని అనిరుద్, లావణ్యను తనతో తీసుకుని వెళ్ళి చదివించాలని తన భార్యతో చెప్పాలని నిర్ణయించుకొని ఇంటికి వచ్చేసరికి అనిల్ భార్య శరణ్య కూడా అనిల్ మనస్సులోని విషయాన్నే చెప్పడంతో ఆశ్చర్యానికి గురవుతాడు. దానికి కారణం తెలుసుకోవాలనే అభిప్రాయంతో శరణ్యతో పిల్లలు మనతో వస్తే మనస్పర్ధలు పెరిగి పిల్లలు మనకి కూడా దూరం అవుతారు. అటువంటప్పుడు మనం ఎందుకు ఈ ఆలోచన చేయాలి అని అంటాడు.
దానికి శరణ్య, నారాయణ అన్న నన్ను చెల్లెల్లా చూసుకునేవారు. ఇప్పుడు మనకి పిల్లలు లేరు. అంతేగాక నీకు కూడా మిత్రుడు అంటే ఇష్టం. మరి మీరు కూడా ఏదో ఒకటి వారి గురించి ఆలోచించి ఉంటారు కదా! నా ఆలోచన ప్రకారం వారి పిల్లల్ని మన పిల్లలుగా దత్తత తీసుకొని చదివించి ప్రయోజకులను చేద్దామనేదే కదా! అని చెప్పి ఇంతకీ పోలీసుల నుంచి పోస్టుమార్టం రిపోర్టు ఏమి వచ్చిందని అడుగుతుంది. ప్రమాదం వల్ల తలకు బలమైన దెబ్బలు తగలడంతో మాత్రమే చనిపోయారని చెప్తాడు. శరణ్య అనిరుద్, లావణ్యలను తీసుకుని వచ్చి ధైర్యం చెబుతూ వారితో ప్రేమగా మాట్లాడుతూ అందరం ఢిల్లీ వెళ్దామని, మీరు కూడా అక్కడే చదువుకువాలని, మాతో వస్తే ఏ లోటు లేకుండా చూసుకుంటామని ఎంత ధైర్యం చెప్తున్నా అన్నం కూడా తినకుండా రాత్రంతా ఏడుస్తూనే ఉంటారు.
అర్ధరాత్రి పూట తలుపు గట్టిగా కొడుతూ ఉండటంతో భయపడి పిల్లల దగ్గర పడుకున్న శరణ్య పరిగెత్తుకుంటూ వెళ్లి అనిల్ కి చెప్పగా వచ్చి తలుపు తీయగానే నారాయణ సహాయం పొందినటువంటి అనిల్ కు బాగా పరిచయం ఉన్న అదే ఊరికి చెందిన ఒక కానిస్టేబుల్ రామయ్య వచ్చి భయం భయంగా అటూ ఇటూ చూస్తూ, ఇంట్లో మీరు కాకుండా మరెవరైనా ఉన్నారా అని అడిగి లేరని తెలుసుకున్న తరువాత అనిల్ ని ఒంటరిగా మిద్దె మీదకు తీసుకుని వెళ్లి నారాయణను ఎవరో కావాలని తల మీద బలంగా కొట్టి చంపారని అది యాక్సిడెంట్ కాదని, డబ్బులు ఇచ్చి పోస్టుమార్టం రిపోర్ట్ ను మార్పించారని చెబుతాడు. దానికి అనిల్ నారాయణకి శత్రువులు ఎవరూ లేరు కదా మరెవరు చేయించారని అడగగా తెలియదు అని చెప్పి నేను ఈ విషయం మీకు చెప్పానని గానీ ఎవరికైనా తెలిస్తే నా ప్రాణాలకు కూడా ముప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు.
శరణ్య, భర్తను ఎందుకు అతను అంత కంగారుగా ఉన్నాడు? అని అడిగినా ఏమి లేదని పడుకోమని చెప్పి తను ఆ క్షణం నుంచి పిల్లల ప్రాణాలకు కూడా ముప్పు ఉందేమోనని నిద్రపోకుండా నారాయణకు ఎవరైనా శత్రువులు ఉన్నారేమోనని ఆలోచిస్తూ ఉండగానే ఉదయం కొంతమంది ప్రజలు వచ్చి అందరి మంచి కోరుకునే నారాయణకు అలా జరిగి ఉండకూడదని పాల డైరీ విషయాన్ని ప్రస్తావించగా సాధ్యమైనంత త్వరగా మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి ఆ డైరీ విషయాన్ని కూడా ఊరి పెద్దలతో మాట్లాడతానని తెలియజేస్తాడు.
హరి, సర్పంచ్ తో శరత్ వాళ్ళ ఆఫీస్ కు వచ్చే సరికి శరత్, చరణ్ తో ఇంకా ఎవరైనా ప్లాట్లు కొనడానికి సిద్ధంగా ఉంటే పిలిచి మాట్లాడమని చెబుతూ ఉంటాడు. ఆ మాటలు వింటూ కుర్చీలో కూర్చుంటారు. హరి నెమ్మదిగా సార్ ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే అది కొంచెం కష్టంతో కూడుకున్న పని. కనీసం ఒక వారం అయినా సమయం ఇవ్వమని అడుగుతాడు. కొంచెం హడావిడిగా ఉన్న శరత్ వచ్చిన వారితో రేపటికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా సరే సరే లేదంటే మరెవరికైనా అమ్మేస్తాను అని కఠినమైన స్వరంతో చెప్పడం వలన హరి మొన్న అడ్వాన్స్ ఇస్తానంటే వద్దన్నారు ఇప్పుడేమో ఇప్పటికిప్పుడు హడావిడి పెడుతున్నారు మా దగ్గరంత డబ్బు లేదు అర్థం చేసుకోమని చెబుతాడు.
శరత్ 37 లక్షలను రెండు రోజుల్లో కట్టాలనే తాపత్రయంతో తనకి ఉన్న అసహ్యాన్ని, కోపాన్ని ప్రదర్శిస్తూ గట్టిగా చరణ్ ఆ ఫ్లాట్ వేరే వాళ్ళు అడుగుతున్నారుగా వారికి ఫోన్ చేసి రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకోమని చెప్తాడు. సర్పంచ్ మాట్లాడటానికి ప్రయత్నించే లోపే సర్పంచ్ ని ఆపి హరి లేచి బయలుదేరుతాడు. అలా ఇద్దరు బయటికి వచ్చేసరికి వారిని అనుసరిస్తూ చరణ్ కూడా వచ్చి శరత్ కట్టవలసిన ధనం, ఇంట్లో జరిగిన గొడవ గురించి వివరిస్తాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న హరి కూడా దిక్కు తోచక ఉన్న సమయంలో సర్పంచ్ నెల రోజులలో తిరిగి ఇస్తానంటే ధనం ఇస్తానని హామీ ఇస్తాడు.
తిరిగి శరత్ దగ్గరికి వెళ్లి రేపు సాయంత్రానికి కట్టవలసిన ధనాన్ని ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని అవసరమైతే మరికొంత ధనాన్ని కూడా ఇస్తానని ధైర్యం చెబుతాడు. హరి మనసుని అర్థం చేసుకుని తను కోపంతో మాట్లాడినందుకు క్షమించమని అడుగుతాడు. అంతేకాక కావల్సిన ధనాన్ని అడగలేని స్థితిలో ఉన్న సమయంలో హరి ఫ్లాట్ కు 15 లక్షలు ఆ పైన మీకు ఒక ఐదు లక్షలు నేను ఇవ్వగలను అని చెప్తాడు. సంతోషంతో శరత్ పరిగెత్తుకుంటూ వచ్చి హరి ని కౌగిలించుకుని తన బాధను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు.
అనిల్ తిరిగి వెళ్లబోయే లోపు నారాయణను చంపినవారిని కనుక్కుంటాడా ? లేదా? హరి సర్పంచును నమ్మి శరత్ కు మాట ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకోగలడా? అనే విషయాలను వచ్చే శనివారం మీ మనకథలు లో చదవండి.
1. మిత్రులకు గమనిక క్రింద ఉన్న గంట గుర్తును నొక్కితే నా బ్లాగ్ నుండి వచ్చే కథలు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి.
2. ఈ బ్లాగులోని మీ అనుభవాలను, కథలోని నచ్చిన/నచ్చని అంశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ధన్యవాదాలు
2 comments:
Twist bagundi
Super sir
Post a Comment