Breaking

Friday, December 4, 2020

సంచలనం నాల్గవవారం

సంచలనం 3వ వారానికి సంబంధించిన కధ చదవాలనుకొంటే ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

http://www.manakathalu.in/2020/11/blog-post_28.html


                  నారాయణ తన గ్రామాన్ని ఇంటిలా భావించి కష్టాల నుంచి రక్షించుకుంటూ ఉన్నాడు. మంచితనం ఎక్కడ ఉంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది. ఆ ఊరిలో నారాయణకు శత్రువులు కూడా పెరిగారు. అయితే అనిల్ తన సెలవులు అయిపోవడంతో ఢిల్లీ వెళ్లిపోయాడు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. గ్రామంలో పాల డైరీ ప్రారంభించిన తర్వాత మొదటి దసరా పండుగ సందర్భంగా సభ్యులందరికీ ఏదో ఒక బహుమతి అందించాలని అనుకున్నాడు. తన కుటుంబానికి కూడా బట్టలు కొనాలి  అనే ఉద్దేశంతో తన భార్యతో పాటుగా సిటీలో బ్యాంకుకి వెళ్లి డబ్బులు డ్రా చేసుకుని సిటీ లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యేసరికి చీకటి పడటంతో బండి మీద నెమ్మదిగా వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారు అని తెలుసుకున్న నారాయణ డబ్బులు ఎక్కువగా ఉండటంతో బండిని వేగంగా నడుపుతూ ఉండగా వారు నారాయణ బండిని  కావాలనే  యాక్సిడెంట్ చేసి నారాయణ, భార్య విజయ తలల మీద బలంగా కొట్టి బంగారం, డబ్బులు మొత్తం దొంగిలిస్తారు. 

                        శరత్ కంపెనీ లాభం లోకి రావడానికి కారణం ఒకరకంగా చరణ్ కూడా అందుకనీ శరత్, చరణ్ ని కూడా తన వ్యాపారంలో భాగస్వామిని చేసుకోవాలని కీర్తి తల్లిదండ్రుల సమక్షంలో అందరికీ తెలియజేస్తాడు. అప్పుడు బంధువులు కూడా కొంత పెట్టుబడి పెట్టి మేము కూడా మీ వ్యాపారంలో బాగస్వాములు కావాలని శరత్ కి తెలియజేయగా శరత్ అంగీకరించడు. కానీ పెద్దలు అంగీకరించమని చెప్పినప్పటికీ  తిరస్కరించడం వలన వారి మధ్య మాటకి మాట పెరుగుతుంది.

           ఇంకా ఇక్కడే అందరితో కలిసి ఉంటే గొడవలు ఇంకా పెద్దవి అయ్యే అవకాశం ఉందని శరత్ వేరేగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. చరణ్ తన ఇల్లు తాకట్టు పెట్టి ధనం తీసుకుని వచ్చి నేను కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేశాడు అనే విషయం గుర్తుకొచ్చి నా భాగస్వామి అయితే ఇద్దరమూ ఒకే అపార్ట్మెంట్ లో పక్క పక్కనే ఉంటే ఇద్దరికీ వ్యాపారరీత్యా బాగుంటుంది కదా! అని ఆలోచించి శరత్ చరణ్ కి చెప్పాడు. శరత్ స్థలంలో   నిర్మించిన అపార్ట్మెంట్లో ప్రక్క ప్రక్కనే ఫ్లాట్లలో ఉండాలని నిర్ణయించుకున్నారు. శరత్ నిర్ణయానికి చరణ్ ఇంతకన్నా గొప్ప అవకాశం ఏముంది? మీ దగ్గర ఉద్యోగం దొరకడమే అదృష్టం అనుకున్న నాకు మీ కంపెనీలో భాగస్వామ్యం అంటే దేవుడే స్వయంగా ప్రత్యక్షమై వరం ఇచ్చినట్లుగా ఉంది. 

              గ్రామంలో ఏ విధమైన కార్యం జరిగినా బంధువులను కాకుండా మిత్రులను ఎవరినైనా పిలవాలంటే మొదట హరినే పిలిచేవారు. హరి కూడా గ్రామంలోని ప్రతి కార్యానికి హాజరవుతూ, నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ఉండేవాడు. పాఠశాలలోని ప్రిన్సిపాల్ కు, హరికి ఇద్దరి మధ్య ప్రిన్సిపాల్ యొక్క ఏకచ్ఛత్రాధిపత్య యుద్ధం జరుగుతున్నటువంటి విషయం ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్న సర్పంచ్ తో సహా మరి కొంతమంది పెద్దలు హరి ఇంటికి వెళ్లి అడిగినా  హరి మాత్రం ప్రిన్సిపాల్ గురించి మంచిగానే చెబుతూ మాట దాటేసే వాడు. ఏది ఏమైనా మనసులో కోపం, బాధ ఉన్నప్పటికీ బయటికి కనపడకుండా అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని బదిలీ అనే అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆ ఊరి  అల్లుడు అయిన ప్రిన్సిపాల్ కు ఆరోగ్యం సరిగా లేక మెడికల్ లీవ్ పెట్టి ఇంట్లో ఉన్న సమయంలో ఊరి ప్రజలు కూడా వచ్చి పలకరించే పరిస్థితి లేకుండా పోయింది.

                దానికి కారణం అందరికీ సహాయం చేస్తూ, బాగా చదువుకోవాలని విద్యార్థులను ప్రోత్సహిస్తూ, పెద్దలందరిని ఎప్పుడూ నవ్వుతూ పలకరించే హరి తో గొడవ పడడం. కానీ హరి మాత్రం ప్రిన్సిపాల్ కి బాలేదు అని తెలిసి మనస్పర్ధలు అన్నీ పక్కన పెట్టి వయసులో పెద్దవాడు అనే గౌరవంతో తన భార్య లక్ష్మి తో సహా ఇంటికి వెళ్లి పలకరించడంతో ప్రిన్సిపాల్ కి తనమీద తనకే అసహ్యం వేస్తుంది. ఊర్లో కూడా సొంత బంధువులు తప్ప మరెవరు ప్రిన్సిపాల్ అనే గౌరవంతో కూడా రాకపోవడంతో తన తప్పును తెలుసుకొని హరికి మాత్రం క్షమాపణ చెప్పాలని అనుకున్నాడు.

                ప్రమాదం జరిగినటువంటి విజయ, నారాయణ ల పరిస్థితి ఏమిటి? కీర్తి తన కుటుంబాన్ని వదిలి పెట్టి వేరే కాపురం పెట్టడానికి ఇష్టపడుతుందా! లేదా! ప్రిన్సిపాల్ హరికి క్షమాపణ చెబుతారా! లేదా హరి బదిలీ అవుతాడా! అనే విషయాలను వచ్చేవారం సంచలనం లో వీక్షించండి.

1. మిత్రులందరికీ ఒక విన్నపం. క్రింద ఉన్న గంట గుర్తును నొక్కడం వలన నా బ్లాగ్ నుండి వచ్చే ఆర్టికల్ను లేదా కథను మీరు ముందుగా పొందవచ్చు.

2. ఈ కథను లేదా ఆర్టికల్ను క్రింద ఉన్న సోషల్ మీడియా ద్వారా ఈ ఆర్టికల్ లేదా కథనం  మీ మిత్రులకు పంపవచ్చు.

3. ఈ బ్లాగులోని మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు.