పాదుకా పట్టాభిషేకం మూడవ భాగం చదవాలనుకుంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి. https://www.manakathalu.in/2021/02/blog-post_27.html
దేవతార్థే చ పిత్రార్థే బ్రహ్మణాభ్యాగతేషు చ।
యోధేషు మిత్రవర్గేషు కచ్చిద్గచ్ఛతి వ్యయః।। 56
భావం: నీ కోశాగారమునందు ధనము దైవ కార్యములకు, పితృకార్యములకు, బ్రాహ్మణోత్తములకు, అభాగ్యులకు, యోధులకు, మిత్రులకు వినియోగపడుచున్నదా?
కచ్చిదార్యో విశుద్ధాత్మాక్షారితశ్చోరకర్మణా ।
అపృష్టఃశాస్త్రాలకు లై న లోభాద్వధ్యతే శుచిః।। 57
భావం: సజ్జనులు, ఉత్తమస్వభావంగలవారు, త్రికరణశుద్ధిగలవారు దొంగతనం మరో మొదలగు నేరారోపణలకు గురైనప్పుడు న్యాయశాస్త్ర నిపుణుల చేత లోతుగా విచారణ చేయింపకయే లోభవశమున వారికి శిక్షలు విధించుటలేదు కదా?
గృహీతశ్చైవ పృష్టశ్చ కాలే దృష్టికి సకారణః ।
కచ్చిన్న ముచ్యతే చోరో ధనలోభాన్నరర్షభ! ।। 58
భావం: ఓ రాజకుమారా! దొంగతనము చేయుసమయమున చూడబడినవాడును, చౌర్యముచేసి పట్టుబడినవాడును, అధికారులు ప్రశ్నించినపుడు దొరికిపోయినవాడును, దొంగిలించిన ధనముతో చిక్కినవాడును ఇట్టి పెక్కు కారణములతో నేరములు ఋజువైనను అటువంటి చోరుని ధనలోభముచే విడిచిపెట్టుటలేదు కదా!
వ్యసనే కచ్చిదాఢ్యస్య దుర్గతస్య చ రాఘవ ।
అర్థం విరాగాః పశ్యతి తవామాత్యా బహుశ్రుతః।। 59
భావం: ఓ భరతా! ధనికుని విషయంలో గాని ధనములేని వారి విషయమున గాని ఏదైనా ఒక వివాదం ఏర్పడినప్పుడు న్యాయశాస్త్ర నిపుణులైన నీ మంత్రులు ధన లోభముచేగానీ, పక్షపాతబుద్ధిచేగానీ వ్యవహరించడంలేదుకదా?
యాని మిథ్యాభిశస్తానాం పతంత్యాస్రాణి రాఘవ ।
తాని పుత్రాన్ పశూన్ ఘ్నంతి ప్రీత్యర్థమనుశాసతః।। 60
భావం: ఓ భరతా! నిర్దోషులు అసత్యములైన నేరారోపణములకు గురైైైైైైైైనప్పుడు రాజు వాస్తవాలను తెలుసుకొనక తనకు తిరుగులేదని ఇష్టమొచ్చినట్లు నిరపరాధులను శిక్షింపరాదు. అట్లు శిక్షించినచో ఆనిర్దోషులు అవమానభారముచే కన్నీరుకార్తురు. ఆ దుఃఖార్తులకన్నీరు ఆరాజుయొక్క పుత్రులను, పశుసంపదలను, సమస్తమును నశింపజేయును.
కచ్చిద్వృద్ధాంశ్చ బాలాంశ్చ వైద్యముఖ్యాంశ్చ రాఘవ।
దానేన మనసా వాచా త్రిభిరేతైర్బభూషసే।। 61
భావం:- నాయనా భరతా! వృద్ధలను, బాలురను, విద్యావంతులను కలిసినప్పుడు వారికి ఇష్టమైన బహుమతులను ఇచ్చి మిత్రభావముతో వారిని మంచి చేసుకొనుచున్నావా?
కచ్చిద్గురూంశ్చ వృద్ధాంశ్చ తుపాన్ దేవతాతిథీన్ ।
చైత్యాంశ్చ సర్వాన్ సిద్దార్ధాన్ బ్రాహ్మణాంశ్చ నమస్యసి।। 62
భావం:- భరతా! గురువులకు, వృద్ధలకు, తాపసులకు, దేవతలకు, అతిధులకు, దేవమందిరంనందు మహవృక్షాలకు,ఉత్తములైన బ్రాహ్మణులందరికి నమస్కరించుచున్నావా?
కచ్చిదర్థేన వా ధర్మమ్ అర్ధం ధర్మేణ వా పునః।
ఉభౌ వా ప్రీతిలోభేన కామేన చ న బాధసే 63।।
భావం:- నాయనా! ధర్మాచరణమునకు అనువగు పూర్వాహ్ణసమయమున అర్థార్జనకు పూనుకొని , ధర్మలోపము కావించుటలేదుగదా! అర్థార్జనకు అనుకూలమైన అపర్ణాహ సమయమున ధర్మకార్యములలో మునిగి అర్థార్జనకు భంగము కలిగించుటలేదుగదా! సుఖాభిలాష కారణంగా సాయంకాలమున ధర్మార్థములు రెండింటికిని హాని కలిగించుటలేదుగదా!
కచ్చిదర్థం చ ధర్మం చ కామం చ జయరాం వర।
విభజించారు కాలే కాలజ్ఞ ! సర్వాన్ వరద! సేవసే।। 64
భావం:- విజేతలలో శ్రేష్టుడా!! కాలోచితముగా కార్యములను ఆచరించుట ఎరిగినవాడా! ఓ వరదా! ధర్మాచరణమునకును, అర్ధార్జనమునకును, కామానుభవములకును సముచితసమయములను విభజించుకొని, తగిన సమయములలో ధర్మార్ధకామములను నడుపుచున్నావుగదా?
కచ్చిత్ తే బ్రాహ్మణాః శర్మ సర్వశాస్త్రార్ధకోవిదాః।
ఆశంసంతే మహాప్రాజ్ఞ! పౌరజనపదైః సహా।। 65
భావం:- ఓమహప్రజ్ఞా! సమస్తశాస్త్రములను, వాటివిశేషములను బాగుగా ఎరిగిన బ్రహ్మణోత్తములు పౌరులతోడను, జానపదులతోడను గూడి, నీశ్రేయోలాభములనే అభిలాషించుచున్నారు గదా?
నాస్తిక్యమనృతం క్రోధం ప్రమాదం ధీర్ఘసూత్రతామ్।
ఆదర్శనం జ్ఞానవతామ్ ఆలస్యం పంచవృత్తితామ్।। 66
ఏకచింతనమర్ధానామ్ అనర్థజ్ఞైశ్చ మంత్రణమ్।
నిశ్చితానామనారంభం మంత్రస్యాపరిరక్షణమ్।। 67
మంగళస్యాప్రయోగం చ ప్రత్యుత్థానం చ సర్వతః।
కచ్చిత్ త్వాం వర్జయస్యేతాన్ రాజదోషాంశ్చతురదశ।। 68
భావం:- ఓ భరతా! నాస్తికత్వము, అబద్దములాడుట, క్రోధము, ఏమరపాటు, కర్తవ్యములను ఉపేక్షించుచు కాలయాపనచేయుట, జ్ఞానులను దర్శింపకుండుట, సోమరితనము, పంచేంద్రియములకు వశమైయుండుట, రాజకార్యములవిషయమున మంత్రులతో చర్చింపక తాను ఒక్కడే ఆలోచించుట, విషయములయెడ అవగాహన లేనివారితో సమాలోచనచేయుట,న నిశ్ఛయించిన పనులను వెంటనే ప్రారంభింపకయుండుట, రహస్యవిషయములను దాచలేకపోవుట, మంగళకరములైన ఆచారములను పాటింపకుండుట పెక్కుమంది శత్రవులపై ఒకేే సమయమున దండేత్తుట ఈ పద్నాలుగు పనులను రాజు చేయరాదు. నీవు ఈ రాజదోషములను పరిత్యజించుచున్నావు గదా?
దశపంచ చతుర్వర్గాన్ సంప్రదాయం చ తత్త్వతః।
అష్టవర్గం త్రివర్గం చ విద్యాస్తిస్రశ్చ రాఘవ ।।69
ఇంద్రియాణాం జయం బుద్ధా షాడ్గుణ్యం దైవమానుషమ్।
కృత్యం వింశతివర్గం చ తథా ప్రకృతి మండలమ్।। 70
యాత్రాదండవిథానం చద్వియోనీ సంధివిగ్రహౌ।
కచ్చిదేతాన్ మహాప్రాజ్ఞ! యథా వదనుమన్య సే।। 71
భావం:- మహాప్రజ్ఞా!భరతా! 1)దశవర్గము, 2)పంచవర్గము, 3)చతుర్వర్గము, 4)సప్తవర్గము, 5)అష్టవర్గము, 6)త్రివర్గము, 7)మూడువిద్యలు, 8)ఆరుగుణములు, 9)దైవీమానుష బాధలు, 10)రాజు ఆచరించవల్సిన కృత్యములు, 11)వింశతి వర్గము, 12)ప్రకృతి మండలము, 13)యాత్ర 14)దండవిధానము, 15)సంధివిగ్రహము, వీటి అన్నింటిపై నీవు తగిన శ్రద్ధ చూపుచున్నావా వీటిలోని దోషవర్గములను త్యజించి, గుణవర్గములను మాత్రమే గ్రహించుచున్నావా?
మంత్రిభి స్త్వం యథోద్ధిష్టైః చతుర్భిస్త్రిభి రేవ వా।
కచ్చిత్ సమస్యైర్వ్యస్తైశ్చ మంత్రం మంత్రయ సే మిథః।। 72
భావం:- ఓ భరతా! రాజనీతిశాస్త్రమును అనుసరించి, నలుగురు లేక ముగ్గురు మంత్రులతో విడివిడిగా గానీ లేక అందరితో కలిసిగాని రహస్య సమాలోచనలు చేయుచున్నావా?
కచ్చిత్ తే సఫలా వేదాః కచ్చిత్ తే సఫలాః క్రియాః।
కచ్చిత్ తే సఫలా దారాః కచ్చిత్ తే సఫలం శ్రుతమ్।। 73
భావం:- నాయనా! వేదోక్తధర్మములను ఆచరించుచు నీవు కృతకృతుడవు అగుచున్నావా? నీ అగ్నిహోత్రాది- అనుష్ఠానములన్నియును సఫలీకృతములగుచున్నవా? నీ భార్య అనుకూలవతియై నిన్ను సేవించుచు సంతానవతియైనదా? నీ శాస్త్రజ్ఞానము నీలోవినయాది సద్గుణములను పెంపొందించుచున్నదా?
కచ్చిదేషైవ తే బుద్ధిః యధోక్తా మేము రాఘవ! ।
ఆయుష్యా చ యశస్యా చ ధర్మకామార్థసంహితా।। 74
భావం:- ఓ భరతా! నేను చేసినబోధలు ధర్మములను ఆచరించుటకును, ధర్మమార్గమున సంపదలు ఆర్జించుటకును, ధర్మర్ధములకు అనుగుణముగా సుఖములను అనుభవించుటకును ఉపయోగపడును. ఆవిధముగా నీకు ఆయుర్వృద్ధి కలుగును. నీ కీర్తిప్రతిష్ఠలు ఇనుమడించును.
యాం వృత్తిం వర్తతే తాతో యాం చ నః ప్రపితామహః।
యాం వృత్తిం వర్తసే కచ్చిత్ యా చ సత్పథగా శుభ।। 75
భావం:- నాయనా! మనతండ్రియు, తాతముత్తాతలును ఆచరించిన ధర్మములను పాటించుచు నీవు రాజ్యపాలనమును ఒనర్చుచున్నావా? అదియే సత్పురుషులు అనుసరింపవల్సిన మార్గము, అది సర్వశుభంకరము.
కచ్చిత్ స్వాదు కృతం భోజ్యమ్ ఏకో నాశ్నాసి రాఘవ।
కచ్చిదాశం సమానేభ్యో మిత్రేభ్యః సంప్రయచ్ఛసి।। 76
భావం:- భరతా! రుచికరములైన భోజనపదార్ధములను, సంపదలను నీవు ఒక్కడవు మాత్రమే అనుభవించుటలేదుగదా? వాటిని కోరుకొనెడి బంధుమిత్రులకును నీవుపంచియిచ్చుచున్నావుగదా?
రాజా తు ధర్మేణ హి పాలయిత్వా
మహామతిర్దండధరః ప్రజానామ్।
అవాప్య కృత్స్నాం వసుధాం యాధావత్
ఇతశ్చ్యుతః స్వర్గముపైతి విద్వాన్।। 77
భావం:- రాజనీతిధర్మజ్ఞుడైన మహరాజు ఆత్మజ్ఞానియై న్యాయదండమును చేబూని ప్రజలను ధర్మబద్ధముగా పరిపాలించినచో పూర్వరాజులకువలె సమస్తభూమండలముూ అతనికి వశమగును. తత్ఫలితముగా అతడు తనువును వీడిన పిమ్మట స్వర్గమును చేరును.
No comments:
Post a Comment