Breaking

Saturday, December 25, 2021

VIBHESANOPADESAHA


1.  विभीषणोपदेषऋ इति पाठ्यभागसारांशं लिखत।

कविपरिचयः ः- विभीषणोपदेषः इति पाठ्याभागः वाल्मीकि महर्षिणा विरचित श्रीमद्रामायणे युद्धकाण्डात् स्वीकृतः।

पूर्वकथा:-  अस्मिन् पाठ्यभागे सीतीपहरणं कृतवते रावणाय विभीषणेन प्रदीयतां दशरथाय मैथिलीति सदुपदेशः कृतः।

                                   లేదా

कविपरिचयः :- "विभीषणोपदेशः" అను పాఠ్యభాగము ఆదికవి వాల్మీకి మహర్షిచే రచించబడిన శ్రీమద్రామాయణములోని యుద్ధకాండ నుండి స్వీకరింపబడినది.

प्रस्तुतकथा :-  సీతను అపహరించిన రావణునికి విభీషణుడు సీతాదేవి పవిత్రతను, సీతాదేవీ వచ్చినప్పటి నుండి లంకలో జరుగుతున్న అశుభకార్యాల గురించి తెలియచేసి సీతను రామునికి ఇచ్చివేయమని చేసిన ఉపదేశము ఈ పాఠ్యాంశములో వర్ణింపబడినది.

राक्षसान् वारयित्वा विभीषण वचनानि : లంకా నగరమునందు యుద్ధము చేయుటకు ఉత్సాహము చూపుతున్న, వివిధ ఆయుధములను చేతదరించిన రాక్షస ప్రముఖులతో విభీషణుడు ఇట్లు పలికెను. ఓ నిశాచరులారా! కార్య సాఫల్యమునకు మొదటగా సామ - దాన - భేదోపాయములు ఉపయోగించి కార్యము సాధించాలి. అలా కుదరనప్పుడు మాత్రమే దండోపాయమును ప్రయోగించవలేనని పండితులు చెప్పి ఉన్నారు. శత్రువులను ఓడించవలెనన్న వారు ఏమరుపాటుతో ఉన్న సమయమున గాని , వారికి దైవము అనుకూలించని సమయమున గానీ వారి పై దండోపాయమును ప్రయోగించవలెను. శత్రువుల శక్తిసామర్థ్యాలు లెక్కించకవారిని తక్కువగా అంచనా వేయరాదు. परेषां सहसावज्ञा न कर्तव्या कथञ्चन పూర్వము రామచంద్రుడు ఖరుడను రాక్షసున్ని వధించుట మీరు తప్పుగా భావించవద్దు. ఏందుకంటే ప్రాణాపాయ స్థితిలో ప్రతిప్రాణి తనను తాను రక్షించుకొనును కదా!

खरो यद्यतिवृत्तस्तु स रामेण हतो रणे।

अवश्यं प्राणिना प्राणा रक्षितव्या यथाबलम्।।

विभीषणेन रामस्य महौन्नत्यम् :- శ్రీరాముడు మహావీరుడు, ధర్మనిరతుడు, అటువంటి మహనీయునితో శత్రుత్వము మంచిదికాదు. అందుచే అపహరింపబడిన సీతను అతనికి అప్పగించుట మంచిది. दीयतामस्य मैथिली

रावणाय हितवचनानि :- సోదరా రావణా! ధర్మమును ఆచరించవలెనన్నా, కీర్తిప్రతిష్ఠలను కాపాడుకోవలెనన్నా కోపమును విడిచిపెట్టుము. మనమందరము సుఖముగా జీవించవలెన్న శ్రీరామునకు సీతను అప్పగించుట ధర్మయుక్తము.   प्रदीयताम् दशरथाय मैथिली

लङ्कानगर्याम् निमित्तान्यशुभानि :- సోదరా రావణా! సీతాదేవిని అపహరించి తెచ్చినప్పటి నుండి ఆవులు పాలుఇవ్వకపోవటం, గజములు మదజలమును స్రవింపకపోవుట, గుఱ్ఱములు దీనముగా సకలించుట, జంతువులు తెలియని రోగములతో బాధపడట, కాకులు గుంపులుగా చేరి కటువుగా అరచుట, నక్కల అరుపుల వంటి అపశకునములు కనిపించుచున్నవి. మహాసాధ్వి అయిన సీత ఐదు తలల పామువంటిది. सीता महाहिः पञ्चाङ्गुली पञ्चशिरः सर्प इव सदृशी నీవు సూర్యునివద్దగాని, యసునివద్దగాని రక్షణ పొంది ఉన్ననూ రామబాణము నుండి తప్పించుకొనుట అసాధ్యము.

ఓ రాజా!శత్రువులవంటి మిత్రులైనవారందరు నీ చుట్టు చేరి నీవు చేయు పనులకు తలలూపుచున్నారు. ఓ రాక్షసప్రముఖులారా! ఎవరైతే తన బలమును, శత్రుపక్ష బలమును సరిగ్గా అంచనా వేసి కష్టనష్టములను ప్రభువునకు హితమును ఉపదేశించువాడే మంత్రి.वदेत् क्षमं स्वामिहितं च मन्त्री మీ మాటలు విని మహారాజు లంకా నాశనమునకు యత్నించుచున్నాడు.  కానీ రామబాణములు యమదండమువలె మృత్యుదేవతతో సమానమానవి. రాముని ఎదుట ఎవరు నిలబడగలడు. కావున సీతాదేవిని రామునకు సమర్పించుటయే మనకు క్షేమకరము.

रावणस्याग्रहः  విభీషణుని మాటలు విని రావణుడు కోపగించి అతన్ని నిందించెను. అప్పుడు  విభీషణుడు ఆకాశమున నిలిచి ఇట్లు పలికెను.

विभीषणोपदेशः ఓ మహారాజా! నిన్ను పొగుడుచూ హితకరమగు మాటలు పలుకువారు ఎంతోమంది  ఉన్నారు. కానీ వినుటకు కష్టమనిపించినప్పటికినీ  మేలుకలిగించు మాటలు చెప్పువారు మరియు వినవారు  ఉండుట అరుదు. अप्रियस्य च पथ्यस्य वक्ता श्रोता च दुर्लभः మహాపరాక్రమవంతుడైనను మరణము సంభవించునప్పుడు ఇసుకతో కట్టిన  ఆనకట్ట వలె నశించెదరు. नराः वालुकसेतवः इव रणे सीदन्ति నిన్ను, రాక్షసులను, ఇ నగరమును అన్ని విధముల రక్షించుకొనుము. నీకు క్షేమమగుగాక! రావణా! నా మాటలు నీకు నచ్చుట లేదు. విపరీతకాలమునందు ఆయువు మూడిన నరులు మిత్రులు చెప్పిన హితవును వినరు. परीतकाले हि गतायुषो नरा हितं न गृह्णन्ति सुहृद्भिरीरितम्।


   ap senior inter sanskrit: DR.PUSAPATI RAVIKANTHA REDDY


 

7 comments:

Anonymous said...

please upload Dharmanishta,vikramasya audaryam essays

Unknown said...

Please upload Dharmanishta, vikramasya audaryam essays sir

vishnu sharma said...

sir class 10 sanskrit, save us

Anjani Jonnalagadda said...

❤Tq sir.....It is useful

Malakondaiah said...

good service.

Ishwarya said...

Send me in english Sir

Anonymous said...

Thank you for helping us sir