1. विष्णुभक्तः अम्बरीषः इति पाठ्यभागस्य सारांशं सङ्ग्रहेण लिखत।
(अथवा)
2. अम्बरीषस्य भक्त्या दुर्वासः शुदर्शनचक्रात् कथं त्रात?
कविपरिचयः - विष्णुभक्तः अम्बरीषः इति प्रस्तुत पाठ्यभागः वेदव्यास महर्षिणा विरचित श्रीमद्भागवते नवमस्कन्धात् स्वीकृतम्।
కవిపరిచయము - విష్ణుభక్తః అంబరీషః అను ప్రస్తుత పాఠ్యభాగం వేదవ్యాస మహర్షిచేత రచింపబడిన శ్రీమద్భాగవతంలోని నవమ స్కందంనుండి స్వీకరించబడినది.
पाठ्यभागविषयः - ఈ పాఠమునందు అంబరీషుని విష్ణుభక్తి, దుర్వాసుని కోపము, సుదర్శన చక్రం దుర్వాసున మహర్షిని వెంబడించుట, శ్రీ మహావిష్ణువుని దుర్వాసమహర్షి క్షమాపణ కోరుట వంటి అంశాలు వర్ణింపబడినవి.
अम्बरीषस्य विष्णुभक्तः -
అంబరీషుడు అను విష్ణుభక్తుడు ఐశ్వర్యమును, అసమానమైన సంపదను పొంది సప్తద్వీపములతో కూడిన భూమండలమంతటిని పరిపాలిస్తూ ఉండెను. అంబరీషుడు విష్ణువు, విష్ణుభక్తులు, సజ్జనులయందు భక్తిభావాలను కలిగి ఉండుటయే నిజమైన భక్తి అని నమ్మి మిగిలిన ప్రపంచం మట్టితోసమానమని భావించెను. विश्वं येनेदं लोष्ठवत् स्मृतम्। సమస్త కార్యములను భగవంతునికి అర్పిస్తూ, ప్రతి పనిలోనూ, ప్రతి వస్తువులోనూ భగవంతుడిని దర్శిస్తూ, బ్రాహ్మణుల ఉపదేశానుసారం భర్మబద్దంగా పరిపాలించుచుండెను. అంబరీషుని భక్తికి సంతోషించిన శ్రీహరి అతనికి సుదర్శన చక్రమును అందించెను. तस्मा अदाद्धरिश्चक्रं प्रत्यनीकभयावहम्।
दुर्वासस्यआगमनम् -
తనతో సమానంగా గుణగణములు కల్గిన భార్యతో ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తూ శ్రీకృష్ణున్ని ఆరాధించెను. వ్రతము పూర్తయ్యె సమయానికి కార్తీకమాసంలో మూడు రోజులు ఉపవాసం చేసి యమునా నదిలో స్నానమాచరించి మధువనంలో శ్రీహరిని పూజించెను. स्नातः कदाचित् कालिन्द्यां हरिं मदुवनेऽर्चयत् ఉపవాసం ముగించడానికి సిద్దపడగా దుర్వాస మహర్షి అతిథిగా వచ్చెను. రాజు దుర్వాస మహర్షికి సగౌరవముగా స్వాగతంపలికి భోజనం చేయమని కోరెను. దానికి అంగీకరించిన మహర్షి యమునా నదికి స్నానానికి వెళ్ళెను. निममज्ज बुहद्ध्यायन् कालिन्दीसलिले शुभे।
యమునా నదికి స్నానానికి వెళ్ళిన దుర్వాస మహర్షి రావడము ఆలస్యమవడం, ద్వాదశీ ఘడియలు ముగుస్తూ ఉండడంతో సందేహంతో బ్రాహ్మణులతో చర్చించి అతిథి అయిన బ్రాహ్మణుని కంటే ముందుగా భోజనం చేయడం తప్పు కానీ ద్వాదశీ లో ఉపవాసం విరమించకపోవడం కూడా తప్పే కనుక బ్రాహ్మణులు ధర్మబద్ధంగా ఏమి చేయాలో ఆలోచించి రాజుతో నీరు త్రాగి ఉపవాసం విరమించండి. నీరు త్రాగడం తినడం కాదు కదా! తినకపోవడం కూడా కాదు అని చెప్పటంతో రాజు నీరు త్రాగి దుర్వాసమహర్షి కోసము ఎదురుచూస్తుండెను. आहुरब्भक्षणं विप्रा ह्यशितं नाशितं च तत्।
कृद्धः दुर्वासः -
యమునా నదిలో స్నానమాచరించి వచ్చిన దుర్వాసుని రాజు ఆహ్వానించెను. మహర్షి రాజు నీరు త్రాగి ఉండడాన్ని గమనించి నన్ను అతిథిగా ఆహ్వనించి నాకు ఇవ్వకుండా నీవు తిన్నావు ఇప్పుడు నీవు దీని ఫలితం చూస్తావు అని కోపముతో తన వెంట్రుక పీకి కాలాగ్ని వంటి భయంకరమైన రాక్షసున్ని సృష్టించెను. तया स निर्ममे तस्मै कृत्यां कालानलोपमाम् ఆ భయంకరమైన రాక్షసుడు అంబరీషుని మీదకి దూసుకు వస్తున్నప్పటికి భయపడక నిలబడెను. భక్తుని రక్షణ కోసం నియమింపబడిన సుదర్శన చక్రం రాక్షసున్ని నాశనం చేసెను. ఆ తర్వాత సుదర్శనచక్రం దుర్వాసున్ని వెంటాడటంతో ప్రాణరక్షణ కొరకు మేరుపర్వత గృహలోకి పారిపోయెను. తన ప్రాణాలను రక్షించుకోవటానికి ముల్లోకాలు తిరిగెను. गुहां विविक्षुः प्रससार मेरोः।
दुर्वासः श्रीहरिं शरणम् -
దుర్వాసుడు భయముతో బ్రహ్మాది దేవతలను ఆశ్రయించగా వారు అనంతమైన శ్రీహరి యొక్క సుదర్శన చక్రం నుండి మేము రక్షించలేము అని పలుకగా చివరికి శ్రీహరిని ప్రార్థించెను. ఓ హరి నీ మహిమ తెలియక నీ భక్తుడి పై కోపగించుకున్నాను. దయచేసి పరిహారం చూపండి. "నీ నామము విన్నంతనే నరకవాసి కూడా రక్షణ పొందుతాడు" అని పలికెను. विधेहि तस्यापचितिं विधातर्मुच्यते यन्नाम्नयुदिते नारकोऽपि।
శ్రీహరి దుర్వాసునితో "ఓ బ్రాహ్మణా! నా హృదయం సద్భక్తులతో నిండి ఉంటుంది. నేను పూర్తిగా నా భక్తులకు ఆధీనుడిని. నా భక్తులే నా హృదయం. వారికి నేను తప్ప ఇంకేమి తెలియదు. నేను కూడా వారిని విడిచిపెట్టను. భక్తుల పై చేసిన దాడి నీకు కీడు చేయును. నీవు అంబరీషుడుని క్షమాపణ కోరుకొనుము. साधवो हृदयं मह्यं साधूनां हृदयं त्वहम्।
दुर्वासस्य क्षमापणा -
శ్రీహరి ఆజ్ఞ మేరకు దుర్వాసుడు అంబరీషుని శరణుకోరెను. దుర్వాసున్ని వెంబడిస్తున్న సుదర్శన చక్రముతో అంబరీషుడు "నీవే ధర్మము, నీవే సత్యము, నీవే యజ్ఞము, నీవే సకల లోకములకు రక్షకుడవు" అని స్తుతించెను. అంతటితో సుదర్శన చక్రం శాంతించి దుర్వాసున్ని విడిచిపెట్టెను. स मुक्तोऽस्त्राग्नितापेन दुर्वासः स्वस्तिमांस्ततः।
దుర్వాసుడు అంబరీషుడిని ప్రశంసించి ఓ రాజా! నేను ఈ రోజు విష్ణుభక్తుల గొప్పతనం చూసాను. నేను తప్పు చేసినప్పటికి నన్ను రక్షించావు. ఆ శ్రీహరి నీవంటి నిజమైన భక్తుల యందు తప్పక ఉంటాడు. అంబరీషుని ఆతిథ్యము స్వీకరించి ఓ రాజా! నీ పవిత్రమైన భక్తిని దేవతలు కూడా కీర్తించెదరు. అని పలికెను. कीर्तिं परमपुण्यां च कीर्तियिष्यति भूरियम्।
उपसंहारः -
ఈ విధంగా అంబరీషుడు అన్ని కార్యాలను భక్తితో చేస్తూ నరకముని కూడా జయించెను. ययाऽऽविरिञ्च्यान्निरयांश्चकार।
No comments:
Post a Comment