धर्मपरीक्षा इति पाठ्यभागस्य सारांशं लिखत।
(अथवा)
महेन्द्रविहितां युधिष्ठिर धर्मपराक्षां विवृणुत।
कविपरिचयः - धर्मपरीक्षा इति प्रस्तुत पाठ्यभागः लक्ष्मणसूरिणा विरचित भारतसङ्ग्रहस्य महाप्रस्थान, स्वर्गारोहण पर्वयोः स्वीकृतः। अनेन महोदयोन रामायणसङ्ग्रहः, नलोपाख्यानसङ्ग्रहः, भीष्मविजयः इत्यादि गद्यकाव्यानि प्रसिद्धानि रचितानि।
कविपरिचयः - ధర్మపరీక్ష అను ప్రస్తుత పాఠ్యభాగం లక్ష్ణణసూరి గారిచేత రచింపబడిన భారతసంగ్రహంలోని మహాప్రస్థాన పర్వం, స్వర్గారోహణ పర్వముల నుండి స్వీకరింపబడినది. ఈ కవి చేత రామాయణసంగ్రహం, నలోపాఖ్యసంగ్రహం, భీష్మవిజయం వంటి గద్యకావ్యాలను రచించాడు.
पाठ्यभागपरिचयः - కోరికల కోసం కానీ, లోభం కోసం కానీ, చివరకి ప్రాణాలు రక్షించుకోవడానికైనా ధర్మాన్ని విడిచిపెట్టకూడదనే నియమాన్ని అనుసరిస్తున్న ధర్మరాజును ఇంద్రుడు పరీక్షించి స్వర్గంనకు వెళ్ళాలని చేసిన పరీక్షయే ఈ ధర్మపరీక్ష.
महाप्रस्थान प्रयाणम् - ధర్మరాజు శ్రీకృష్ణునితో వియోగం తర్వాత సోదరుల ప్రవర్తన కూడా ఆలోచించి మనువడైన పరీక్షిత్ కి రాజ్యాభిషేకం చేసి యుయుత్సుడును, కృపాచార్యుడిని రక్షణకు నియమించి, సోదరులు, భార్య అయిన ద్రౌపదితో కలిసి ఉత్తరదిక్కుగా ప్రయాణం కొనసాగించారు.
भीमादिभिरनुजैः भर्यया धर्मराजः उदीचीं दिशं प्रति प्रवव्राज।
ఈ ప్రయాణంలో మొదట అగ్నిదేవుడు అర్జునుని గాంఢీవం తిరిగి తీసుకున్నాడు.
पथि पावकेनार्जुनाद्गाण्डीवे प्रतिगृहीते।
भीमस्य प्रश्नाः - మేరు పర్వతం దగ్గర ద్రౌపది క్రింద పడడం చూసి భీముడు ధర్మరాజుని ద్రౌపది క్రింద పడటానికి గల కారణాన్ని అడుగగా "ఈమె భర్తలందరిలో అర్జునుని మీద ఎక్కువ ప్రేమని కలిగినది" भद्र! पञ्चस्वस्मासु पतिषु धनञ्जयेस्या अभिमानः అందువలన పడిపోయింది అని చెప్పాడు. తర్వాత "సహదేవుడు తనకు తనే పండితుడినని భావించడం వలన, నకులుడు తానే అందగాడినని అనుకోవడం వలన, అర్జునుడు వ్యర్థమైన ప్రతిజ్ఞ చేయడం వలన" అని ఇలా పడిపోతున్న ప్రతి ఒక్కరి పతనానికి కారణాలను ధర్మరాజు భీమునికి చెప్పుకంటూ వెళుతున్నారు.
वृथाप्रतिज्ञाकरणमर्जुनस्य च क्रमेण दोषं व्याचचक्षे
भीमस्य पतनम् - ఆ తర్వాత భీముడు కూడా పడిపోతాడు. దానికి కారణం గట్టిగా అడగగా భీమా! నీవు అమితంగా తింటావు, నీ బలం గురించి నీవే పొగుడుకుంటావు ఇదే నీ పతనానికి కారణము అని చెప్పాడు. पबलमविज्ञायैव स्वबलश्लाघी ధర్మరాజు ఒంటరిగా వెళ్తుండగా ఒక కుక్క అతనిని వెంట వెళ్తుంది.
धर्मजेन स्वर्गलोक प्रवेशः - ఇంద్రుడు దివ్యమైన విమానంలో వచ్చి ధర్మరాజుతో నీ పుణ్యకర్మల చేత సంతోషించాను. నేను నిన్నునాతోపాటు స్వర్గలోకానికి తీసుకువెళ్ళాలని వచ్చాను. ఈ రథాన్ని ఎక్కు అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇంద్రా! ఈ కుక్క నా కష్టాలలో కూడా నన్ను వదిలి వెళ్ళలేదు. ఆశ్రితులను వదిలినవాడు నరకానికి పోతారు అది మీకు తెలుసు కదా! కావున ఈ కుక్కను కూడా స్వర్గానికి అనుమతినిచ్చినట్లయితే నేను నీతో వస్తానని చెప్పాడు. आश्रितत्यागी नारकी स्यादिति न खलु అప్పుడు ఇంద్రుడు ఓ ధర్మరాజా! కుక్క వెంట వస్తే స్వర్గ ద్వారాలు మూసుకుపోతాయని నీకు తెలియదా అని పలుకుతాడు.
धर्मपरीक्षा - కుక్కపై ఉన్న అభిమానాన్ని వదిలి స్వర్గం చేరుకోమని ఇంద్రుని మాటని తిరస్కరించిన ధర్మరాజుని చూచి ఆ కుక్క ధర్మదేవతగా మారి ఓ ధర్మరాజా! నేను నీ తండ్రిని. నిన్ను పరీక్షించడానికే కుక్క రూపంలో నీ వెంట వచ్చాను. वत्स! युधिष्ठिर! अहं नाम तव पिता, त्वत्परीक्षार्थं श्वरूपेण त्वामन्वसरम् కుక్కను కూడా వదలక నీ ధర్మాన్ని నిరూపించుకున్నావు. ఇదివరకు అరణ్యవాసంలో కూడా పరీక్షించగా సమానభావం చూపించి నా అంశతో జన్మించిన వాడివని నిరూపించుకున్నావు. భీమార్జునులు అంటే ఇష్టమైనప్పటికీ సవతి తల్లికి తర్పణాలు చేసేవారు ఉండరు కనుక నకులుడిని బ్రతికించమని కోరుకున్నావు అని చెప్పి ధర్మరాజుని స్వర్గానికి పంపెను.
स्वर्गलोके दुर्योधनः - స్వర్గం చేరిన ధర్మరాజు ఇంద్రునితో సమానంగా సేవించబడుతున్న దుర్యోధనుని చూసి అసహనానికి గురై వెళ్తున్న దారిలో నారదుడు ధర్మరాజుతో ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించగా ఓమహర్షీ! అధర్మాన్ని అనుసరించిన దుర్యోధనుడే ఇంత వైభవంగా ఉంటే ధర్మపరాయణులైననా సోదరులు ఎక్కడ ఉన్నారని వెతుకుతున్నానని చెప్పాడు. तदा क्व मे धर्मनित्या भ्रातारः । तेषु न कोपीह दृश्यते। क्व ते श्थिताः तान्दिदृक्षे इति।
धर्मजेन नरकलोक दर्शनम् - అప్పుడు ఇంద్రుడు ఒక దేవదూతను నియమించగా ధర్మరాజుతో కలిసి వారిద్దరూ దుర్వాసన వస్తున్న రాళ్ళు, ముళ్ళు, విషసర్పాలతో ఉన్న రక్తమాంసాలతో నిండిన అసహ్యంగా ఉన్న లోకంలోకి ప్రవేశించారు. అక్కడ ఉండడానికి ఇష్టపడక వెనక్కి వెళ్తుంటే ధర్మరాజా నీవు ఒక్క క్షణం ఇక్కడే ఉండు. నీ రాక వలన సువాసన వస్తుంది. राजन् युधिष्ठिर! मुहूर्तमत्रैव तिष्ठ। त्वदागमनेन सुरभिगन्धिर्गन्धवहो वहति। మేము మా బాధలు మరిచిపోగలుగుతున్నాము. బాధపడే వారి మీద దయచూపడం మహాత్ముల లక్షణం కదా! అని పలికెను.
दुःखिषु करुणा हि महतां शैली
అప్పుడు ధర్మరాజు అయ్యా! మీరు ఎవరు? మీకు ఇటువంటి దుఃస్థితి ఎందుకు?అని అడుగగా అప్పుడు మేము మీ సోదరులమని, భార్య అని సమాధానము ఇచ్చారు. అది విన్న ధర్మరాజు ఈ కష్టంలో ఉన్న తమ్ముళ్ళను, భార్యను వదిలి నేను సుఖపడలేను. కనుక నీవు వెళ్ళమని దేవదూతని పంపించాడు.
नरकलोके इन्दागमनम् - అంతలో ఇంద్రుడు అక్కడికి వచ్చి ఓ ధర్మరాజా! రాజులందరూ నరకం చూడవల్సిందే. కనుక నీకు చూపించవలసి వచ్చింది. అంతేకాక ద్రోణాచార్యుని మరణ సమయంలో నీవు చేసిన మోసం వలన నీకు నరకం చూపించడం తప్పనిసరి అయినది.
सर्वैरपि राजभिरवश्यं नरको द्रष्टव्यः
ఈ ఆకాశగంగలో స్నానం చేసి మనుష్య భావాన్ని పోగొట్టుకొని నీ భార్య, సోదరులతో సుఖంగా స్వర్గానికి చేరమని ఇంద్రుడు చెప్పాడు.
उपसंहारः - అప్పుడు ధర్మదేవత కుమారా! ఇది నీకు మూడవ పరీక్ష. ఈ పరీక్షలో కూడా నీవు నెగ్గావు. నీ వంటి కుమారుడు నా అంశతో జన్మించడం వలన నేను ధన్యుడనయ్యాను. అని కౌగిలించుకొని ధర్మరాజుని ప్రశంసించాడు. ఈ విధంగా వారందరూ దేవతల అనుమతిని పొందిన తన భార్య, తమ్ముళ్ళతో కలసి దేవలోకంలో తరిగిపోని భోగాలను అనుభవిస్తూ సుఖంగా ఉన్నారు.
No comments:
Post a Comment