Breaking

Sunday, September 27, 2026

దయావీరో విక్రమః

 दयावीरो विक्रमः इति पाठ्यभाग सारांशं लिखत।

                            (अथवा)

विक्रमस्य दयावीरत्वं विवृणुत।

कविपरिचयः - दयावीरो विक्रमः इति प्रस्तुत पाठ्यभागः वररुचिना विरचित सिंहासनद्वात्रिंशिका नामक कथासङ्रगहस्य रक्षोभीतिवारणम् नाम एकादशोध्यायात् स्वीकृतः। अस्मिन् कथासङ्ग्रहे द्वात्रिंशिका कथाः वर्तन्ते। वररुचिः विक्रमादित्यस्य आस्थाने नवरत्नेषु अन्यतमः।

कविपरिचयः - दयावीरो विक्रमः అను ప్రస్తుత పాఠ్యభాగం వరరుచిచేత రచింపబడిన సింహాసన ద్వాత్రింశికా అను కథాసంగ్రహములోని రక్షోభీతివారణమ్ అను పదకండవ అధ్యాయం నుండి స్వీకరింపబడినది. ఈ కథాసంగ్రహంలో ముప్పైరెండు కథలు ఉన్నాయి. వరరుచి విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉన్న తొమ్మిదిమంది కవులలో ఒకడు.

पूर्वकथा - విక్రమార్కుని తర్వాత ధారానగరాన్ని భోజుడు పరిపాలిస్తున్నాడు. విక్రమార్కుడి సింహాసనాన్ని భోజుడు అధిష్టించడానికి ప్రయత్నించగా సాలభంజికలు ఓ రాజా! నీకు విక్రమార్కుడికి ఉన్న దయాగుణములు నీకు ఉన్నట్లయితే అధిష్టించగలవు అని పలికెను. దానికి రాజు విక్రమార్కుడి దయా గుణం గురించి వివరించమని కోరెను. అప్పుడు సాలభంజిక విక్రమార్కుని దయా గుణం గురించి ఈ కథను వివరించెను.

प्रस्तुतकथा - ఒకసారి విక్రముడు రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి యోగి  మరొక దేశానికి బయలుదేరాడు. అడవిలో సగం దూరం వెళ్ళేసరికి రాత్రి కావడంతో ఒక చెట్టు కింద శయనించెను. ఆ చెట్టు పైన చిరంజీవి అను ఒక పక్షి రాజు తన బంధువులతో పాటుగా నివశిస్తూ ఉండెను. तस्य वृक्षस्योपरि वृद्धः चिरञ्जीवि नाम कश्चित् पक्षिराज आसीत्।

                ఆ రాత్రి సమయంలో పక్షిరాజు తన పుత్రులతో మనం చాలా దేశాలు తిరిగాము కదా! మీరు ఏమైనా విచిత్రాన్ని చూసారా? అని ప్రశ్నించగా రాజు ఆ మాటలు వింటూ ఉన్నాడు. ఒక పక్షి నేను ఎటువంటి విచిత్రాన్ని చూడలేదు. కానీ నా మనస్సు చాలా బాధతో నిండిపోయింది అని పలికెను. పక్షిరాజు ఓ పుత్ర! ఎవరైతే దుఃఖాన్నిమంచి మిత్రులతో పంచుకుంటారో అప్పుడు సుఖంగా ఉంటారు అని పలికెను.

                                    भोः पुत्र! यो दुःखी स सुहृद्भिः दुःखं निवेद्य सुखी भवति।  

शैवालघोषे राक्षसः - ఆ మాటలకు చిన్న పక్షి ఉత్తర దేశంలో శైవాలఘోష అను పేరు గల పర్వతం ఉన్నది. ఆ పర్వతం దగ్గర పలాశ అనే నగరం ఉంది. ఆ కొండ మీద ఉన్న ఒక రాక్షసుడు ప్రతి రోజు నగరానికి వచ్చి మనుషులను ఎవరో ఒకరిని కొండపైకి తీసుకొని వెళ్ళి తింటున్నాడు. प्रतिदिनं नगरमागत्य समुखागतं यं कश्चन मानुषं स्त्रियं बालकादिकं वा पर्वते नात्वा भक्षयति। దానికి భయపడిన ప్రజలు రాక్షసునితో ఓ రాక్షసుడా! నీవు నీ ఇష్టం వచ్చినట్లు ఊళ్ళోకి వచ్చి ఎదురుగా కనిపించిన వారిని తినవద్దు. మేము ప్రతిరోజూ ఆహారంగా ఒక మనిషిని ఇవ్వగలము అని చెప్పడంతో రాక్షసుడు కూడా అంగీకరించాడు. అప్పటినుండి వధ్యశిల పై కూర్చోని ఉండే మనిషిని మాత్రమే ఆహారంగా స్వీకరించేవాడు. అయితే ఈ రోజు నా మిత్రుడైన బ్రాహ్మణుని వంతు వచ్చింది. అతనికి ఒక్కడే కుమారుడు. ఇప్పుడు వారి గురించి ఆలోచిస్తే ఆ దుఃఖాన్ని భరించలేక ఉన్నాను అని పలికెను. మిగతా పక్షులు ఆ చిన్న పక్షిని నిజమైన మిత్రుడవంటే నీవు అని అన్నాయి.

                                    अहो! अयमेव सुहृत् यः सुहृदो दुःखेन स्वयं दुःखी भवति।

वध्यशिलायां विक्रमः  -  ఆ పక్షుల మాటలు విన్న రాజు వధ్యశిల దగ్గరకు వెళ్ళి బ్రాహ్మణునికి అభయమిచ్చి, అతనికి బదులుగా వెళ్ళి వధ్యశిల పై కూర్చున్నాడు. రాక్షసుడు వధ్యశిల పై చిరునవ్వుతో ఉన్న ఆ వ్యక్తిని చూచి ఆశ్చర్యపడి ఓ ధైర్యవంతుడా! ఇప్పటివరకు ఎవరైనా నేను రావడానికి ముందే చనిపోయి ఉండేవారు. కానీ నీ వు నవ్వుతూ ఉన్నావు. నీవు ఎవరు? అని పలికెను. విక్రముడు నేను ఇతరుల కోసం నా శరీరాన్ని ఇస్తున్నాను. అయినా చర్చ అవసరం లేదు. నీకు కావల్సిన శరీరాన్ని ఆహారంగా స్వీకరించుము అని పలికెను.

                                        मया परार्थमेतच्छरीरं दीयते स्वेच्छया।

 विक्रमराक्षसयोः सम्भाषणा -  ఆ మాటలకు రాక్షసుడు ఓ మహాపురుషా! ఇతరుల కోసం సమర్పించే నీ శరీరం మెచ్చుకోదగినది. ఎందుకంటే ఎవడు ఇతరుల కోసం బ్రతుకునో వారి బ్రతుకు ప్రశంసనీయమైనది. నీవంటి వారికి ఇది ఆశ్చర్యమేమి కాదు కదా! ఎందుకంటే చందనపు చెట్లు తమ శరీరాన్ని చల్లబరచుకోవడానికి పుట్టవు. అవి కేవలం పరుల కోసమే పుట్టును కదా! అని పలికెను. 

                                            न हि स्वदेहशैत्याय जायन्ते चन्दनद्रुमाः।

                             రాక్షసుడు విక్రమున్ని ప్రశంసించి నీకు ఏమి వరం కావలెనో కోరుకొనును అని పలికెను. అప్పుడు విక్రముడు రాక్షసునితో మనుషులను తినడం మానుకోమని కేరెను. నిన్ను నీవు రక్షించుకున్నట్లు ఇతరుల ప్రాణాలు కూడా రక్షింపదగినవే కదా! అని పలుకెను. तथा परेषामपि रक्ष जीवितम् ఆ రోజు నుండి రాక్షసుడు ప్రాణులను చంపడం మానివేసెను.

                                    तथा प्रभृति जीवमरणं तत्याज।

उपसंहारः - ఈ కథను సాలభంజిక భోజునితో చెప్పి ఈ విధమైన పరోపకార గుణాలు నీలో ఉంటే సింహాసనం మీద కూర్చోమని పలుకగా భోజుడు మౌనంగా ఉండిపోయెను.   

No comments: