Breaking

Thursday, September 10, 2020

కోరికల వల్ల వచ్చే నష్టాలు ఏమిటి?

 

                  కోరిక లేకపోతే ఈ సృష్టిలో ఏ జీవి జీవించలేదు. ప్రతి జీవికి తన స్థాయికి మించి నటువంటి కోరిక ఉంటుంది ఆ కోరికను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఏ క్షణంలో పొందవలసిన ఆనందాలను ఆ క్షణంలో పొందలేక ఆనందాన్ని కోల్పోతున్నారు. దానికి ఒక చిన్న ఉదాహరణగా ఒక కథ చెప్పాలనుకుంటున్నాను.

                    శ్రీనివాస్ అనే ఉద్యోగి (35)కి లక్ష్మీ అనే పేరు కలిగిన భార్య(30) గృహిణి. వారికి జ్యోతి అనే ఒక పాప (8సం).
                     జ్యోతి చిన్నప్పటినుడి చదువులో బాగా రాణిస్తుంది. ప్రతి సంవత్సరం తన పాఠశాలలో జరుగుతున్న తల్లిదండ్రుల సమావేశానికి తండ్రి ఎప్పుడు రాలేదని బాధపడుతూ ఉండేది. కానీ ఈ సంవత్సరం ఇక ఎలాగైనా తన తండ్రిని పాఠశాలలోని తల్లిదండ్రుల సమావేశానికి తీసుకొని వెళ్ళాలనేది తన కోరిక. ఈసారి కూడా పాఠశాలలో జరుగుతున్న తల్లిదండ్రుల సమావేశానికి తన తండ్రి రాకపోవడంతో మిత్రుల తల్లిదండ్రులు వస్తున్నారని తన తండ్రి మీద మనసులో ద్వేషాన్ని పెంచుకుంటుంది. 

ఒకరోజు శ్రీనివాసు ఆరోగ్యం సరిగా లేని కారణంగా సెలవు పెట్టి ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చిన జ్యోతి తండ్రిని చూసి కూడా మాట్లాడకపోవటంతో, తన భార్య ద్వారా ఆ ద్వేషానికి కారణం తెలుసుకుంటాడు. రాత్రిపూట తన కుమార్తెకు మంచి మాటలు చెబుతూ ఆడించి పాడించి లాలించి ఎలాగైతేనేమి మాట్లాడించుకున్నాడు. మిద్దె పైన తన కుమార్తెకు వెన్నెల చూపిస్తూ గోరుముద్దలు తినిపించి, నిద్ర పుచ్చి తను ఒకసారి అలా కళ్లు మూసుకుని పడుకున్నాడు.
 
                      బాల్యమంతా ఆడుతూ పాడుతూ సుఖసంతోషాలతో సాగిపోగా తన 18వ సంవత్సరంలో ఇంటర్ చదువుతుండగా తన తండ్రి ఒక లారీ ప్రమాదంలో మరణించడంతో తన జీవితం అస్తవ్యస్తం కావడంతో  తన తల్లి కోరిక మేరకు చదువుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే తల్లి కష్టపడిిి పనిచేస్తూ కొడుకుని చదివించింది. డిగ్రీ చదివే రోజుల్లో శ్రీవల్లి అనే అమ్మాయి ఇష్టపడుతున్నాను అని చెప్పినా కూడా మరే ఆలోచన లేకుండా డిగ్రీ, ఎం.బీ.ఏ. పూర్తిచేసి ఒక చిన్న ఉద్యోగం తో ప్రారంభమై కేవలం ధనార్జనే కోరికగా పెట్టుకున్నాను.
                          పదేపదే ఉద్యోగాలు మారుతూ నా చదువు పైన చేసిన అప్పు తీర్చి తన మేనమామ కూతురు లక్ష్మి ని    వివాహం చేసుకొని పట్టణంలోని ఒక కార్ల షోరూమ్ లో మేనేజర్ స్థాయికి ఎదిగాను. అయితేేే నాతో చదివిన శ్రీవల్లి కూడా అదేే కార్ల కంపెనీలో తన కింద పని చేస్తుంది. ఇప్పటికీ శ్రీవల్లి తనని ప్రేమిస్తుందని తెలుసు. నేనే స్వయంగా శ్రీవల్లి కి నాకు పెళ్లయింది, ఒక పాప కూడా ఉంది, ఇప్పటి వరకు నా ఆలోచనంతా నా తల్లి, నా భార్య నా కూతురు మాత్రమే.  కాబట్టి మనము మంచి మిత్రులు గా ఉందాము అని చెప్పి తన మనసు మార్చే ప్రయత్నం చేసినా శ్రీవల్లి చేసుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను లేదంటే జీవితంలో ఇలాగే ఉండిపోతాను అని చెప్పడంతో షాక్ అవుతాడు. 

                                     పెళ్లయి 10 సంవత్సరాలు అయినా ఏ రోజు ఇంటి విషయాలు పట్టించుకోలేదు. నా భార్య లక్ష్మియే అన్నీ చూసుకుంటుంది అని మనసులో  అనుకుంటూ ఉండగానే తన భార్య పిలవగానే నిద్రనుంచి లేచినట్లుగా జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి, ఇప్పటివరకు  కోరికలు నెరవేర్చుకోవడం కోసం కష్టపడ్డాను. నా కుటుంబంతో సంతోషంగా గడపడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు అని తెలుసుకుని ఇక కోరికలు, ధనము ముఖ్యమే దానితోపాటు బంధాలకు కూడా విలువ ఇవ్వాలని నిర్ణయించుకొని రెండో రోజు నుంచి పాపని స్కూల్ లో తనే వదిలిపెడుతూ తీసుకువస్తూ ప్రతి ఆదివారం భార్య పిల్లలను తీసుకొని సినిమాలకు షికార్లకు వెళుతూ సంతోషంగా గడపసాగాడు.
                     అయితే ఒకసారి తన భార్య  వాళ్ల నాన్నకి  ఆరోగ్యం సరిలేని కారణంగా ఊరికి వెళ్తూతూ ఉంటే ప్రమాదంలో మరణిస్తుంది. తను మారే సమయానికి భార్యకు అలా జరగడంతో తీవ్రమైన మనోవేదనకు గురవడంతో శ్రీవల్లి మూడు నెెలల పాటు ఉద్యోగం మానేసి బాలుని మనీషిగా మారుస్తుంది. అందువల్ల బాలు తల్లి కూడా పాప గురించి ఆలోచించి బాలు కి శ్రీవల్లి ని వివాహం చేసుకోమని సలహా ఇస్తుంది. బాలు మొదట అంగీకరించకపోయినా పాపను చూసుకోవడానికి తన తల్లి తరువాత ఎవరో ఒకరు ఉండాలని తల్లి హెచ్చరిస్తూ ఉండడంతో, కూతురు కూడా ఒప్పుకోవడంతో శ్రీవల్లి ని వివాహం చేసుకుంటాడు. 
                    శ్రీవల్లి కూడా ఇప్పటివరకు బాలుని ప్రేమించింది కాబట్టి బాలు కూతురు జ్యోతిని కూడా తన కూతురు గా భావిస్తూ ఇక తనకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది. ఈ విషయం తెలిసి ఇప్పటివరకు భగవంతుడు తను అనుకున్నవన్నీ నెరవేర్చినా, ఒక భార్య విషయంలో మాత్రం  తప్పు చేశాడని బాధపడినా మళ్లీ శ్రీవల్లి వచ్చినందుకు తన తల్లిని, కూతురుని సంతోషంగా చూసుకుంటున్నందుకు ఈ జీవితానికి ఈ కోరిక చాలు అనుకున్నాడు. వారందరూ సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి భగవంతుడు మళ్ళీ తన కూతురికి శ్రీవల్లి రూపంలో కరుణించాడు అని నిర్ణయించుకున్నాడు.
    కోరికలు అవధులు లేని ప్రయాణాలతో ఈ జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించకుండానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఈ కాలంలో......... కోరికలు అదుపులో ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేది ఈ కథ యొక్క సారాంశం.

1. మిత్రులకి ఒక విన్నపం. క్రింద ఉన్న గంట గుర్తు నొక్కండి దాని వలన నా బ్లాగు నుండి వచ్చే కథను లేదా ఆర్టికల్ ను నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

2. ఈ కథ లేదా ఆర్టికల్ ను క్రింద ఉన్న వాట్సప్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు పంపవచ్చు.

3. ఈ బ్లాగులోని మీ అనుభవాలను, కథ లేదా ఆర్టికల్ గురించిన విషయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.