Breaking

Wednesday, November 18, 2020

నాయకుడు - ప్రతినాయకుడు వీరు ఎలా ఉంటారు?

                              ఎవరి జీవితానికి వారే దర్శకుడు, వారే నాయకుడు, వారే ప్రతినాయకుడు కూడా. ఈ వాక్యాలు నేను చెప్పినవి కాదు ఇప్పటి వరకు ఎంతోమంది ప్రస్తావించి ఉన్నారు. ఈ వాక్యాలలో ఎన్నో అర్థాలు.

దర్శకుడు: మనసు

నాయకుడు: ఆలోచనలు

ప్రతినాయకుడు: మన చేతలు (మనం చేసే పనులు).

                             మనసులోని లక్ష్యానికి అనుగుణంగా ఆలోచనలు చేస్తూ మన చేతలు దారి తప్పకుండా ఉంటే మనమే నాయకులం. అందరి మనసుల్లో లక్ష్యం ఉంటుంది కానీ ఆలోచనలు చేతల్లో మాత్రం ఉండవు అందుకే ఎవరి జీవితానికి వారే ప్రతినాయకుడిగా ఉండిపోతున్నారు. ఇది ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలి ఈ కాలంలో చాలామందికి ధైర్యం ఉండదు.

        నాయకుడు మంచివాడైతే ప్రజలు సంతోషంగా ఉంటారు. అదే నాయకుడు ప్రతినాయకుడు అయితే  ప్రజల పరిస్థితి ఏమిటి? నాయకుడు అంటే ప్రజలను పరిపాలించే వాడే కాదు. ఇంటిని పోషించేవాడు కూడా ఇంటికి నాయకుడే. అలాగని నాయకుడు ప్రతిసారి గెలవాలని లేదు. కానీ నాయకుడి గెలుపు ఎంతో మంది ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తుంది.  అదే ప్రతినాయకుడు గెలిస్తే ప్రజలకు కష్టాలే బంధువులవుతాయి. కానీ "ప్రజల సుఖాలను తన సుఖం గా భావించే వాడే నిజమైన రాజు (నాయకుడు)" అని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు.

                           రామాయణం

            ఇప్పుటివరకు ఎంతో మంది రాజులు ఎన్నో రాజ్యాలను జయించి పరిపాలించారు. కానీ మానవ జీవితానికి భూత, భవిష్యత్ వర్తమానకాలాలను దృష్టిలో పెట్టుకొని వారి పాపపుణ్యాలను గురించి వివరిస్తూ, వాటి ద్వారా వారి జీవిత గమ్యాన్ని తెలియజేసినటువంటి కావ్యాలు ఇతిహాసాలుగా కీర్తించబడినవి. అందులోనూ మనదేశంలోనే రచింపబడి మానవ జీవితానికి అద్దం పట్టేలా ఉన్నాయి అవే రామాయణం, మహాభారతం. ఇతిహాసాల గురించి ఎంత చెప్పినా, వాటిల్లోని ఏ విషయం గురించైనా చెప్పినా అది చాలా తక్కువే అవుతుంది.

    ఒకటే మాట ఒకటే బాణం ఒక్కతే భార్య అని చెప్పిన మాటలను చేతలలో చూపించిన రాజుగా ఎవరూ పరిపాలించ లేదేమో అందుకే ఈనాటికీ నేటికీ ఎన్నటికీ గొప్ప ధర్మపాలకుడిగా, ప్రజలకు నాయకుడిగా, భగవత్ స్వరూపునిగా ఒక్క రాముడు మాత్రమే ఉండగలడు అందులో ఎటువంటి సందేహం లేదు.  

      అదేవిధంగా లంకా నగరానికి రావణాసురుడు కూడా గొప్ప నాయకుడు. బ్రాహ్మణోత్తమడు, గొప్ప రాజనీతి కలిగిన వాడు లంకా దేశంలో నేటికీ అతని పూజిస్తున్నారు అంటే అతని మేధస్సుకి, అతని రాజనీతి నేటికి అక్కడి ప్రజలకు ఆదర్శప్రాయం. రామాయణంలో రావణాసురున్ని ప్రతినాయకుడిగా సృష్టించారు. దానికి కారణం అతడు ధర్మాన్ని ఆచరించక పోవడమే. అతనిలోని ఒకే ఒక లోపం అదే కామం. దాని వలన ఎన్నో రకాల శాపలను కూడా పొందాడు. 

 1. శూర్పణఖ తన కోరికను దాచి, అవమానాన్ని మాత్రమే రావణాసురుడికి వివరించడం.తనకి జరిగిన అవమానాన్ని, మిగతా సోదరులైన ఖరుడు, దూషణుడు, మొదలైన 14వేల రాక్షస సైన్యాన్ని రాముడు హతమార్చిన విషయాన్ని శూర్పణఖ రావణాసురునికి తెలియజేయడం వలన కోపాన్ని పెంచుకుంటాడు.

2. శూర్పణఖ సీతను గురించి  నీకు తగినటువంటి పట్టపురాణి అని చెప్పడంతో అప్పటినుండి అతనిలో       మొదలైనటువంటి కోరిక.  దానితో సీతాపహరణ. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా, ఒక చిన్న చెడు ఆలోచన మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది అనడానికి రావణాసురుడు ఉదాహరణ.

3. కూతురుతో సమానమైన రంభను వశం చేసుకునే క్రమంలో కుబేరుని కుమారుడు అయిన నలకూబరుడు పెట్టినటువంటి శాపం వలన రావణాసురుని మరణానికి కారణం అయి ఉండొచ్చు.

4. విభీషణుడు రావణాసురునికి సీతను అపహరించిన అప్పటినుండి రాజ్యం లో జరుగుతున్న అపశకునాలు చెడుకి సంకేతాలు అని ఉపదేశించినా  వినలేదు. ఆయుష్షు మూడిన వ్యక్తికి బంధువులు చెప్పినా, భగవంతుడు చెప్పినా వినడు అని తెలియచేసి విభీషణుడు రాముడి వద్దకు చేరుతాడు.

     సాధారణంగా అందరూ రావణాసురున్ని ప్రతినాయకుడు అనుకుంటారు కానీ రామాయణం మొత్తం మీద  రావణాసురున్ని ప్రతినాయకుడిగా నిర్ణయించినది అతని ఆలోచన (కామం) ఒకటి అయితే రెండవది శూర్పణఖ.  ఏదేమైనా అప్పటి లోనే ఇప్పటికీ లేని టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో గొప్ప ప్రయోగాలు చేసినటువంటి నాయకునిగా పేరు పొందినా, కామంతో పొందిన శాపాల వలన ప్రతినాయకునిగా కీర్తిని గడించిన ఏకైక వ్యక్తి ఒక్క రావణాసురుడేనేమో. ప్రతినాయకుడు ఎంత గొప్పగా ఉంటే నాయకుడు అంతకన్నా గొప్పగా ఎదుగుతాడు అంటానికి నిదర్శనం ఈ రామాయణం. 

          జీవితంలో గెలిచిన వారందరూ నాయకులు కాలేరు. నాయకుడు అవ్వాలంటే తన గెలుపును ప్రజల గెలుపుగా భావించాలి. అది తన గెలుపు ప్రజలకు  సంతోషాన్ని, అభివృద్ధిని ఇచ్చేదిగా ఉండాలి. కానీ ఈ  అందరూ ప్రతినాయకుడిగానే ఉంటున్నారు. వారి ఆలోచనలుు మారాలి అనే అభిప్రాయంతో నేను ప్రతినాయకుడిగా  ఉన్న రావణాసురుడు గురించి వివరిస్తూ ప్రతినాయకుడిగా ఉంటే మరణం తప్ప మరి ఏమీ సాధించలేరు అని తెలియచేయడమే నా ఉద్దేశం. 

              నాయకుడు ధర్మసాధనలో మొదట ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఓటములు ఎదురుచూసినా చివరికి ధర్మమే గెలవడం కోసం ప్రకృతి సహకరించడంతో చివరగా అయినా విజయం సాధిస్తాడు ఈ వాక్యానికి ఉదాహరణలు మీరు చదివే ఇతిహాసాలు, గ్రంథాలు, మీరు చూసే సినిమాలు, నాటికలు కూడా.

                  జై శ్రీరామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

1. మిత్రులకు ఒక విన్నపం. క్రింద వచ్చిన గంట గుర్తును నొక్కితే నా బ్లాగ్ నుండి వచ్చే ప్రతి కదా మీకు ముందుగా నోటిఫికేషన్ల రూపంలో అందుతుంది.

2. ఈ కథను క్రింద ఉన్న సోషల్ మీడియా ద్వారా మిత్రులకు పంపవచ్చు.

6 comments:

SCI GHANA said...

Super sir .Me kathalu yentho melkolupuga vuntayi .Meeru ma instagram group lo share cheyadam maku marintha anandhkaram

Poorna said...

చాలా బాగా మీదనే శైలిలో ఆలోచింపజేశారు.

Unknown said...

నేటి కాలం పిల్లలు ఉపయోగకరమైన పుస్తకాలు చదవడం మానేశారు ,వారికి అర్థం అయ్యే రీతిలో తగు సమాచారాన్ని సారాంశం ను కుదించి ఇలా వారికి అధిస్తున్నందుకు చాలా అభినందిస్తున్నాము.

Anonymous said...

మంచి విషయాలను తక్కువ పదాలతో బాగా ఈ కాలపు పిల్లలకి వివరిస్తున్నారు.

Anonymous said...

Good రవి👌👍అల్ప అక్షరాలతో అనల్పమైన సందేశాన్ని అందించారు.ఇంకా ఇటువంటివి మంచి విషయాలు తెలియజేయగలరు.

RK (RAVIKANTHA REDDY) said...

మీ అందరికి ధన్యవాదాలు