Breaking

Tuesday, December 1, 2020

భగవంతుని లీల

         


 

   భగవంతుడు ఉన్నాడు అని ప్రజలందరి నమ్మకం. కానీ ఎక్కడో కొంత మంది భగవంతున్ని నమ్మని వారు కూడా ఉన్నారు వారికి కూడా భగవంతుడు ఉన్నాడు అని తెలియజేయడానికి నా ఈ చిన్న ప్రయత్నం.

   నేను నా మిత్రుడు ఆదివారం కావడంతో సాయంత్రం 4:00 గంటల సమయంలో అలా సిటీకి వెళ్లి షాపింగ్ చేసి ఇద్దరమూ ఫస్ట్ షో సినిమా టికెట్లు దొరకకపోవడంతో,  ఒక మంచి హోటల్ కి వెళ్లి భోజనం చేసి, సెకండ్ షో సినిమాకి వెళ్లి బైక్ మీద తిరిగి వస్తూ ఉన్నాము. ఉన్నట్టుండి వాతావరణం మారింది అతి భయంకరమైన గాలికి మా బండి ముందుకు కదలలేని స్థితి. ఎంత  వేగం పెంచినా బండి 20 kmph కన్నా ముందుకు కదలలేని స్థితిలో ఉంది. 

                   ఎక్కడో దూరంగా నక్కలు అరుస్తూ ఉన్నాయి. ఆ నక్కల అరుపులకి ఎప్పుడో చిన్నప్పుడు హైదరాబాదులో ఐ మాక్స్ థియేటర్ లో హర్రర్ మూవీలో ఆ శబ్ధం విన్నట్లుగా ఉంది. ఒక్కసారిగా నా బండి ఆగిపోవడంతో నా గుండె శబ్దం నాకే వినబడుతోంది, ఒక పక్క గాలి, మరో పక్క ఉరుములు, మెరుపులు,  నక్కల అరుపులు ఇవన్నీ వింటుంటే జీవితంలో ఇంకెప్పుడు రాత్రిపూట ప్రయాణం చేయకూడదు భగవంతుడా! అనే ఆలోచన. ఏది ఏమైనా ఇప్పుడు ఇంటికి చేరితే చాలు అని మనసులో దేవుణ్ణి  తలుచుకుంటూ బండిని ముందుకు తోసుకుంటూ నేను నా మిత్రుడు ఇద్దరం బయలుదేరాము.  

             అక్కడి నుండి మా ఊరికి 5 కిలోమీటర్ల దూరమే కానీ మాకు ఆ క్షణంలో 500 కిలోమీటర్లు నడుస్తున్నట్లుగా ఉంది.  గాలివానకి, చెట్ల యొక్క కదలికలకి భయంతో  వణుకొస్తుంటే, మరోపక్క చలికి వణుకుతూ ఎంత వేగంగా నడవాలని ప్రయత్నించినా నడవలేని  పరిస్థితి. అదే సమయానికి మా కోసమే వస్తుంది అన్నట్లుగా ఒక కారు ఓకే ఒక్క లైట్ తో ముందుకు వెళ్లాలా? వద్దా? అన్నట్లుగా వస్తూ ఉంది.    

                               వారు గనుక కారు ఆపి మాకు సహాయం (లిఫ్ట్) చేస్తే ఈరోజుకు మేము అదృష్టవంతులము. బండి ఇక్కడే పెట్టేసి కావాలంటే రేపు ఉదయం  వచ్చి తీసుకువెళ్ళవచ్చు అని నా మిత్రుడికి కారు ఆపమని చెప్పాను. వాడు ఆ ప్రయత్నం చేశాడు కానీ ఆ కారులో వారు మాత్రం సహాయం చేయటానికి నిరాకరించినట్లుగా, మమ్మలను దొంగలలాగా చూస్తూ  ఆపకుండా కొంచెం వేగంగా ముందుకు వెళ్లిపోయారు. ఆ దేవుడికి మా మీద కొంచెం కూడా జాలి లేదు అనిపించింది. ఈ భూమ్మీద సహాయం చేయడానికి ఏ మానవుడు లేడా? అసలు మంచితనం అనేది లేదా? అవును నిజమేలే ఎప్పుడైనా నేను ఎవరికైనా సహాయం చేస్తే కదా! నాకు సహాయం చేయడానికి ఎవరైనా వచ్చేది. ఎవరు సహాయం (లిఫ్ట్) అడిగినా చూసి చూడనట్లుగా వెళ్లిపోవడమో, ఇంకా తెలిసిన వాళ్ళు అయితే ఇక్కడి వరకే అని చెప్పడమో చేశాను. ఇక నాకు ఎవరు సహాయం చేస్తారు? 

                    అంతలో ఒక పెద్ద శబ్దం గుండె ఆగినంత పనైంది. అప్పుడే తెలిసింది మాకు దగ్గరలో పిడుగు పడిందని మా పైన పడకపోయినా ఆ శబ్దానికి మరెవరైనా అయితే హార్ట్ ఎటాక్ తో చనిపోయే వారేమో అనుకుంటూ  కొంచెం ముందుకు వెళ్లేసరకి మేము సహాయం అడిగితే ఆపకుండా వెళ్లిపోయిన కారు కనిపించింది. అక్కడికి వెళ్లి చూసేసరికి కారు అద్దాలు పగిలిపోయి బ్యానెట్ లో నుంచి పొగలు వస్తూ ఉన్నాయి. కారు నడిపే వ్యక్తి రక్తసిక్తమైన  శరీరంతో బయటికి రావాలని ప్రయత్నించినా విఫలుడై ఇక కదలడానికి శక్తి లేక అలా సహాయం కోసం చూస్తూ, మాట్లాడడానికి కూడా శక్తి లేక ఉండిపోయాడు. 

         కారులో ఆ వ్యక్తిని చూసి నాకు సహాయం చేయనందుకు మంచే జరిగిందని అనుకున్నా, సహాయం చేసి ఉంటే నేను కూడా ఇదే రకమైనబాధతో ఉండే వాడినేమో దేవుడా నువ్వు ఉన్నావయ్యా. ఏది ఏమైనా ఇతని రక్షించడం కోసం పదే పదే ఆ వ్యక్తి శరీరాన్ని కదిలిస్తూ కోమా లోకి వెళ్ళకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా అతని అదృష్టం కొద్దీ ఒక లారీ రావడం పరిస్థితిని గమనించి ఆ లారీ డ్రైవర్ కూడా ఆపడంతో ఆ సమయంలో అతనే నాకు దేవుడిలా కనిపించాడు. డ్రైవర్  సహాయంతో  నేను నా మిత్రుడు గాయాలతో ఉన్న వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాము. 

          మరుసటి ఉదయం అతను కొంచెం మాట్లాడటం ప్రారంభించాడని నేను అతనిని కలిశాను. అప్పుడు అతను చెప్పాడు నేను మీకు సహాయం చేసి ఉండి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని, అతను చెప్పిన మాటలు విన్నాక నా మనసులో నాకు ఒక భావన అతని సహాయం పొంది ఉంటే నేను ఏ స్థితిలో ఉండే వాడినో నాకు తెలియదు. కానీ అతనికి సహాయం చేయడం కోసమే ఆ దేవుడు ఆక్షణంలో నా కోసం కారు ఆపలేదేమో అనిపించింది. ఏది ఏమైనా భగవంతుడు ఉన్నాడు అని అర్థమైంది ఎందుకంటే ఎప్పుడూ సహాయం చేయని నాకు మొదట తన సహకారం అందలేదు కానీ నా తప్పు నేను తెలుసుకునే లోపే భగవంతుడు మరొక వ్యక్తికి సహాయం చేయమని తెలియచేశాడు. 

      భగవంతుడు అంటూ ప్రత్యేకంగా ఎక్కడో ఉంటాడు అని అనుకోకూడదు. ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెట్టిన వాడు దేవుడు. ప్రాణం పోయే స్థితిలో ఉన్నవారికి ప్రాణం కాపాడిన వాడు కూడా దేవుడే ఇలా అందరిలో ఉంటాడు. నీవు కష్టంలో ఉన్నప్పుడు నీకు సహాయం చేసేవాడు మిత్రుడు. ఆ మిత్రుడికి సహాయం చేయాలనే మంచి ఆలోచనే కనిపించని ఆ భగవంతుని స్వరూపం.




5 comments:

Anonymous said...

భగవంతుడు ఉన్నాడు అందులో ఎటువంటి సందేహం లేదు

Anonymous said...

Good Ravi చాలా బాగుంది కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని సహాయం చేసే వాడే దేవుడు👌👌👌💐👍


govindu said...

100% ఉన్నాడు 🙏 ఎంత మాత్రము సందేహము లేదు

RK (RAVIKANTHA REDDY) said...

దేవుడు లేడు అంటే అది వాడి మూర్ఖత్వము అని అర్థం ఎందుకంటే కనిపించని గాలి, రేయింబవళ్ళు మానవుని జనన మరణాలు ఇవన్నీ ఎలా సాధ్యం? కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మి తీరాలి.

Anonymous said...

Bhagavantudu sarvantaryaami